Pages

Friday, June 4, 2010

పోకా యోకే - తప్పు చెయ్యి చూద్దాం


*** శ్రీ రామ ***


" పోకా  యోకే " అంటే అదేదో కొరియన్ తిట్టో, మార్కెట్ లోకి వచ్చిన కొత్త  వీడియోగేమో, లేకపొతే మన "నేస్తం" గారు చేసిన కొత్త సింగపూరియన్ వంటకమో అనుకుంటున్నారా.. కాదు కాదు..


"పోకా యోకే (Poka Yoke )" ఆంటే జపాన్ బాషలో "mistake -proofing " అని అర్ధం . టయోట కంపెనీ కార్ల తయారి కర్మాగారంలో పనిచేసే Shigeo Shingo అనే ఇండస్ట్రియల్ ఇంజనీర్ ఒకాయన ఈ విధానాన్ని కనిపెట్టాడు .. ఈయన ఏమంటాడంటే  అవగాహనాలేమి వల్లనైతేనేమి, పరాకులో వుండిగాని, త్వరగా పూర్తి చెయ్యాలన్న కంగారులో కానీ.. కారణం ఏదయినా  మానవతప్పిదాలు అన్నవి సర్వసాధారణం. తప్పు చెయ్యొద్దు అని ఆ శ్రామికుడిని/వినియోగదారుని నియంత్రించడం కన్నా, ఆ తప్పు చెయ్యడానికి వీలులేకుండా ఒక పద్దతి వుండాలి అన్నది ఈయన ఐడియా.  ఆ కాన్సెప్ట్ పేరే 'పోకా యోకే '. అర్ధం కాలేదా .. సరే అయితే ఈ ఉదాహరణ చూద్దాం.

మన ఇంట్లో వాడే మైక్రోవేవ్ ఓవెన్ లో పదార్దాలు ఉడికించడానికి ఉపయోగించే మైక్రోవేవ్ తరంగాలు బయటకు లీక్ అయితే చాలా ప్రమాదం. అవి మనమీద పడితే మనమే ఉడికిపోతాం.   ఇప్పుడు మీరే ఆ మైక్రోవేవ్ ఓవెన్ డిజైనర్ అనుకోండి.. మీ ఆలోచనా విధానం వరస క్రమంలో ఇలా వుండవచ్చు ....

మీరు: సరే... ఆ తరంగాలు బయటకు రాకుండా చూడాలి అంతే కదా.. ఒక తలుపు పెడితే సరి ....
మీ డిజైనేర్ అంతరాత్మ: బాగానే వుంది కానీ మరి వినియోగదారుడు తలుపు ముయ్యడం మర్చిపోయి  ఓవెన్ ఆన్ చేస్తే.. లేకపోతే అది పనిచేస్తున్నప్పుడు ఓవెన్ స్విచాఫ్ చెయ్యకుండా పొరబాటున తలుపు తెరిస్తే ?
మీరు: సరే... డోర్ మీద పెద్ద పెద్ద ఎర్ర అక్షరాలతో  "డోర్ తెరిచేముందు ఓవెన్ స్విచ్ ఆఫ్ చెయ్యండి .. లేకపోతే చాలా ప్రమాదం "అని ఒక హెచ్చరిక పెడదాం..
మీ డిజైనేర్ అంతరాత్మ: బాగానే వుంది కానీ కొన్నాళ్ళకి ఆ హెచ్చరిక చిరిగిపోతే / చెరిగిపోతే , లేక అది ఉపయోగించే వారికి చదవడం రాకపోతే (కనీసం ఆ బాష చదవడం రాకపోతే) ??
మీరు: సరే... ఆ తలుపులోనే స్విచ్ పెడతా.. తలుపు మూస్తేనే ఓవెన్ స్విచ్ ఆన్ అవుతుంది.. అది పనిచేస్తున్నప్పుడు పొరబాటున డోర్ తీస్తే అది ఆటోమాటిక్ గా ఆఫ్ అయిపోతుంది.
 మీ డిజైనేర్ అంతరాత్మ: అది డిజైన్ ఆంటే .. ఒకే .. ఇంక మన బాసుని హైక్ అడగొచ్చు పద...

అదండీ .. చాలా సులభం కదా.. మన ఇళ్ళల్లో వున్న మైక్రోవేవ్ ఓవెన్స్ అన్ని ఇలా తయారయినవే.. ఇది ఇంత సింపుల్ గా వుంటే దీనికింత దృశ్యం ఎందుకు అంటారా.. మనకి తెలుసున్నది కాబట్టి వెంటనే ఆలోచన వచ్చింది.. 


ఈ పక్క ఫోటో చూడండి.. ఎడమవైపు వున్నది ఎప్పట్నుండో మనం వాడుతున్న ప్లగ్ సాకెట్.. కుడివైపు వున్నది ఈ మద్య మార్కెట్ లోకి వచ్చింది.. రెంటికి తేడా ఆ కన్నాలకి వున్న లాక్.. ఎడమవైపు దాంట్లో చిన్నపిల్లలు వేళ్ళు పెట్టే ప్రమాదం వుంది.. కుడివైపు దాంట్లో ఆ సమస్య లేదు.. మూడు పిన్నులున్న ప్లగ్ పెడితేనే ఆ లాక్ తెరుచుకుంటుంది. ఇంత చిన్న విషయం తట్టకే ఇన్నాళ్ళు ఆ ఎడమవైపు సాకెట్ వాడుతున్నాం.. 

పోకే యోకే కి ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం..

1.  డిష్ వాషర్, వాషింగ్ మెషిన్ గట్రా గట్రా  .. అవి పనిచేస్తున్నప్పుడు తలుపు తీస్తే ఆగిపోతాయి . తలుపు వేసివున్నప్పుడే పనిచేస్తాయి. అందువల్ల మనం తలపు వేయడం మరిచిపోవడం అన్నది జరగదు. 

2. కారు పార్క్ పొజిషన్ లో పెడితేనే కానీ దాని తాళం ఊడిరాదు. దానివల్ల తిరిగి స్టార్ట్ చేసినప్పుడు గేరు ఎప్పుడూ పార్క్ పొజిషన్ లోనే వుంటుంది.
3. సెల్ ఫోన్ లో సిం కార్డు ఒక డైరెక్షన్ లో  మాత్రమే పడుతుంది. తిరగేసి పెడదామన్నా పట్టదు. అందువల్ల ఎటువైపు పెట్టాలా అన్ని కన్ఫ్యూజన్ వుండదు. సెల్ ఫోన్ గురించి పెద్దగా తెలీనివారుకూడా సులభంగా ఉపయోగించవచ్చు. 
4. ఫ్రిజ్ లోపలి లైట్ ఫ్రిజ్ తలుపుకి కేనేక్ట్ అయివుంటుంది. తలుపు మూసుకోగానే లైట్ ఆగిపోతుంది. 
5. మెట్రో ట్రైన్ లలో తలుపులన్నీ మూస్తేనే ట్రైన్ కదులుతుంది.
6. కొన్ని లేటెస్ట్ ATMలలో కార్డు స్వైప్ చేసి బయటకు తీస్తేనే డబ్బులోస్తాయ్. అందువల్ల కార్డ్ అందులోమర్చిపోవడం జరగదు. 
7. అమెరికాలో కొన్ని రెండు పిన్నుల ప్లగ్గులు చూస్తే దాంట్లో ఒక పిన్ కొంచెం పెద్దది గా వుంటుంది. అది ఎందుకంటే ఆ ప్లగ్ రివెర్స్ లో పెట్టకుండా (ఫేసు న్యూట్రల్ లో న్యూట్రల్ ఫేసులో పెట్టకుండా )..
8. అమెరికాలో హైవే రోడ్డు పక్కన (లేను దిగగానే ) అక్కడ గతుకులుగా వుండే ఇనుప ప్లేట్ వుంటుంది.. మనం లేను నుండి పక్కకి పోయాం అని గుర్తుచెయ్యడానికి.. 
9. USB పెన్ డ్రైవ్ మరియూ పాత ఫ్లాపీ డిస్కులు తిరగేసి పెడితే వెళ్ళవు.. ఒక్క డైరెక్షన్ లో లోపలకి వెళతాయ్. 
10. కొన్ని హోటల్స్ లో  రూం కీచైన్ ఒక సాకెట్ లో పెడితేనే లైట్లు , ఫాన్స్ పనిచేస్తాయి.. బయటకు వెళ్లేముందు ఆ సాకెట్ నుండి తాళం తియ్యగానే అన్ని లైట్లు , ఫాన్స్  ఆటోమాటిక్ గా ఆగిపోతాయి.. మనం గుర్తు పెట్టుకుని ఆఫ్ చెయ్యాల్సిన పని లేదు .. 



ఇలా బోల్డు ఉదాహరణలు చెప్పుకోవచ్చు... వీటన్నిటి యొక్క ముఖ్యఉద్దేశ్యం ఏమిటంటే .. తప్పు జరగనివ్వకుండా ఏదో ఒక మెకానిజం పెట్టడం. ATM లో కార్డు మర్చిపోకుండా తిరిగి తీసుకెళ్లాలని అందరికీ తెలుసు.. కానీ బయటకు తీస్తేనే డబ్బులు వచ్చేలా పెట్టడం వల్ల .. కార్డు  మర్చిపోవడమంటూ  జరగదు .. "మర్చిపోకు మర్చిపోకు అని మనకు వెనుక నుండి మైకులో గుర్తుచెయ్యడం కాకుండా ఇలా ఆ ATM  లోనే ఆ ఫీచర్ పెడితే బెటర్ కదా".. తప్పులు చెయ్యకు అని మనిషికి చెప్పడం కాకుండా ఆ తప్పులు జరగకుండా చెయ్యడం అన్నది పోకా యోకే కాన్సెప్ట్.. ఇక్కడ మనమో  విషయం నిశితంగా గమనిస్తే ఈ ఫీచర్ అదనంగా చేర్చడానికి పెద్ద ఖర్చు పెట్టక్కర్లేదు.. కొంచెం క్రియేటివిటి వుంటే చాలు.. పోకే యోకే అన్నది తయారు చేసే వస్తువులలో పెట్టవచ్చు, ఆ తయారి విధానం లో అమలుపరచవచ్చు. టయోట కంపెని లో ఇదే ఫీచర్ కార్ల తయారి విధానం లో మొట్టమొదట ఉపయోగించారు.. కారు తయారి లో  పొరబాటున ఒక పార్ట్ బదులు ఇంకో పార్టు పెట్టకుండా ఉండటానికి, ఏదయినా నట్/బోల్ట్ బిగిన్చాల్సినది మర్చిపోయి వదిలేయకుండా ఉండటానికి.. ఇలా అన్ని స్టేజిలలోను ఈ పోకా యోకే అమలుపరచడం వల్ల అప్పటినుండి  టయోట నాణ్యత కి మారు పేరు అయ్యింది .. క్వాలిటిలో మిగతావారికి మార్గదర్శకం గా నిలిచింది. 


ఈ వీడియో చూడండి.. బాష చూసి కంగారు పడొద్దు.. కొన్ని సేకేండ్లు ఆ అమ్మాయిని చూస్తూ టైం పాస్ చేస్తే .. ఆ తరువాత మనం రోజు చూసే  కొన్ని పోకే యోకే ఉదాహరణలు వున్నాయి ...






సర్లేవోయ్.. అవన్నీ ఫ్యాక్టరీలలో డిజైన్ చేసేవారికి మనకెందుకు ఇవన్నీ అనుకుంటున్నారా.. ఉహు .. రోజువారి జీవితం లో మనకి తెలీకుండా మనం చాలా పోకా యోకే లు  ఉపయోగించేస్తుంటాం .. మరి మనకి ఆ క్రియేటివిటి ఎంత వుందో చూద్దాం..:-))


1. మనం ఇంట్లో/ఆఫీసులో వాడే పోకా యోకే లకు మన కారు/బండి తాళాలు బాగా ఉపయోగపడతాయి. బయటకు ఏదయినా ముఖ్యమయిన కాగితాలు, వస్తువులు తీసుకేళ్ళాలి అనుకుంటే , మన బండి తాళాలు తీసుకెళ్ళి దానికి తగిలిస్తే సరి.  తాళాలు లేకుండా బయటకు వెళ్ళలేము.. తాళాలు తీసుకునేటపుడు అవి  ఎలాగూ చూస్తాం.. (అవి అక్కడెందుకు వున్నాయో ఆలోచించకుండా పక్కన పెట్టి మరీ తాళాలు తీసుకెళ్ళే నాలాంటి వాళ్ళగురించి మనకిక్కడ చర్చ వద్దు). అలాగే  బయటకు వెళ్ళే ముందు ఏదయినా స్విట్చాఫ్ చెయ్యాలంటే తాళం దానికి తగిలించాలి.
  
2. సెల్ ఫోన్ మరియూ చార్జెర్ మర్చిపోకుండా తీసుకెళ్ళాలి అంటే ఇలా ఫోన్  షూ లో పెట్టి చార్జర్ తగిలించడం చూసారా.. 
 3. చిన్నప్పుడు నాకెవరో చెప్పారు. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఎవరయినా పెన్ అడిగితే కేప్ తీసి నీ దగ్గర ఉంచుకుని కేవలం పెన్ ఇవ్వు, సో వాళ్ళ పని అయిపోయాక కేప్ కోసం వెదికినప్పుడు ఆ పెన్ నీదని గుర్తువచ్చి నీకు తిరిగిచ్చి వెళతారు .. లేకపోతే మర్చిపోయి తీసుకెళ్ళిపోతారు అని ..
4. అప్పట్లో (నా చిన్నప్పుడు) చిన్నపిల్లలు అదే పనిగా నోట్లో వేళ్ళు పెట్టి చీకుతుంటే వాళ్లకి తెలీకుండా వాళ్ళ వేళ్ళకి వేపరసం రాసేవారట.
5. ఆఫీసులో కొలీగ్ కి ఏదయినా డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి వచ్చి మనం వెళ్లేసరికి అతను/ఆమె సీట్లో లేకపోతే .. తన కూర్చునే సీట్ లోనో లాప్టాప్ కీబోర్డు మీదో పెట్టి వస్తాం ..  లేకపోతే మానిటర్ కి  Post - It   అంటిస్తాం..అలా అయితే అతను/ఆమె చూడటం మిస్ అవదు అని నమ్మకం..
 6. వంటింట్లో ఫ్రిజ్ కి Post - It అంటించి, నిండుకున్న సరుకులు ఎప్పటికప్పుడు వెంటనే దానిమీద  రాసేస్తూ వుంటే , షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఆ పేపర్ తీసుకెళ్ళవచ్చు.. వెళ్లేముందు ఏమివున్నాయ్, ఏమి లేవు అని పనికట్టుకుని గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించక్కర్లేదు. (ఇది పోకే యోకే అవుతుందో లేక మామూలు చిట్కా అవుతుందో మరి .. నాకు తెలీదు:-))
7. కొంతమంది షాపింగ్ కి వెళ్ళినప్పుడు క్రెడిట్ కార్డు వదిలేసి , కొంత లిమిటెడ్ కాష్ తీసుకెళుతూ వుంటారు. అలాయితే లెక్కలేకుండా ఎక్కువ ఖర్చు చెయ్యరని .. 

ఇప్పటికి నాకు గుర్తువచ్చినవి ఇవే.. ఇలా మనం తెలీకుండా రోజు వారి జీవితం లో చాలా పోకా యోకే ఇడియాలు వాడేస్తుంటాం .. సరే మరి మీ దగ్గర వున్న పోకే యోకే  ఐడియాలు మాతో షేర్ చేసుకుంటే మేము ఫాలో అయిపోతాం మరి .. 


- మంచు 




గమనిక , హెచ్చరిక, అర్దింపు (ఛ ఛ ఏ పదం వాడాలో కూడా తెలీట్లేదు) : ఇప్పుడు బ్లాగుల్లో తెలుగు బాష మీద పెద్ద చర్చ (యుద్ధం ) జరుగుతుంది. కదా... స్పెల్లింగ్ తప్పిదాలువున్నా , ఎక్కువ అనువదించినా , తక్కువ అనువదించినా  జనాలు క్షమించకుండా కామెంట్లతో చీల్చి చెండాడుతున్నారు.. వాళ్ళు నన్ను వదిలేయండి  :-) ఇప్పటికే వాళ్ళ భయం తో ఎక్కువ తక్కువ తెలుగు పదాలు రాసి , విచిత్రమయిన వ్యాఖ్య నిర్మాణం చేసి  ఈ టపా లో కొన్ని బూతులు రాసేనేమో అని సందేహం..

21 comments:

హరే కృష్ణ said...

గ్రేట్
బావుంది ఈ ఆలోచన
good post

Sravya V said...

బాగుంది మీ పోస్ట్!
మీరు చెప్పిన 7 సూత్రాని నేను కొద్ది రోజులు గా పాటిస్తున్న ప్రాణానికి హాయి గా ఉంది :)

amma odi said...

Good Post!

Rishi said...

Intresting post :)

శ్రీవాసుకి said...

అవును రోజు మీ బ్లాగ్ చూడడం మరిచిపోకుండా ఉండటానికి పోకే యోకే ఒకటి చెప్పండి.

Ram Krish Reddy Kotla said...

Good one Boss... :-)

శరత్ కాలమ్ said...

Super

ఏక లింగం said...

Good one.
వీటి వెనకాల ఇంత కథుందని తెలియదు.

సూర్యుడు said...

బాగుందండి, దీన్నే మనమింతకుముందు ఫూల్‌ప్రూఫ్ డిజైన్ అనేవాళ్లమనుకుంటా, ఫేమస్ ఎక్జాంపులేమో ట్రైన్ బ్రేక్స్ :-)

సత్యాన్వేషి said...

బాగుంది. మేమూ ఒక LEAN ప్రాజెక్టులో పోకా యోకే ని అమలు చేశాం, కానీ మీ టపా చదివాక ఇంకాస్త అర్ధం అయ్యింది.

krishna said...

great one. very useful post. good work....

మాలా కుమార్ said...

బాగుంది . మీరు చెప్పిన మొదటి సూత్రం ఎప్పుడూ మావారి కోసం ఉపయొగిస్తూ వుంటాను . ఈ రోజే నా ఒక పోకా యాకే ని భగ్నం చేసారు మావారు . అదో పెద్ద కథ లెండి .

మంచు said...

హరే కృష్ణ, శ్రావ్య గారు, అమ్మవొడి గారు, రిషి గారు, కిషన్ , శరత్ గారు, సత్యాన్వేషిగారు, క్రిష్ణగారు : అందరికీ ధన్యవాదాలు

వాసుకిగారు : -)) అయ్యొ రొజు ఎందుకండి .. నేను పోస్ట్ వేసేదే నేలకి రెండొ మూడో :-)) .. అదీ ఎదొ ఈ మద్య కాస్త ఖాళీ దొరికింది

ఏకలింగం గారు: మీకు మత్రం నెనర్లు :-)).. ఆ "వెనుకున్న కధలని" చెప్పలనేదే ఒకరకంగా నా బ్లాగు ఆబ్జెక్టివ్.. :-))

సూర్యుడు గారు.. అవును మొదట్లొ దీన్ని అలానే బాక యొకె (baka yoke) అనేవారు అంటే ఫూల్ ప్రూఫ్ , ఇడియట్ ప్రూఫ్ అని.. తరువాత పేరు మరీ రూడ్ వుందని.. ఇలా పొక యొకె గా మర్చారు.. రెండిటి ప్రిన్సిపల్ అయితే ఒకటే..
మాలాకుమర్ గారు : ధన్యవాదాలు .. ఆ పెద్ద కథెదొ ఒక పొస్ట్ వెసెయ్యండి :-) .. మీ బ్లాగులొ నా బ్లాగు పేరు ఉదహరిస్తే నా బ్లాగుకి కాస్త మైలేజ్ అన్నా వస్తుంది :-))

నేస్తం said...

ఇది మరీ బాగుంది మద్యలో నేనేం చేసాను :O.. నావంట తో పోలుస్తారేం.. కాని చిట్కాలు బాగున్నాయండోయ్.. ఓవెన్ తలుపులకు అంత కధ ఉందా.. నేనెప్పుడూ అనుకుంటా అరె ఒవెన్ తలుపు తీయగానే బలే ఆటోమెటిక్ గా ఆగిపోతుందని.. పైగా నాకెంత బద్దకం అంటే స్విచ్ ఆఫ్ చేయకుండా తలుపు ఓపెన్ చేసేస్తా .. :)

sphurita mylavarapu said...

Good observations and suggestions

మంచు said...

@ నేస్తం గారు : నాకు మీరు తప్ప సింగపూర్ లొ తెలిసున్నవాళ్ళు ఎవరూ లేరండి.. అందుకే మీ పేరు.. అయినా మీ వంటని పొగిడాను కదండీ
@ స్పురిత : ధన్యవాదాలు అండీ

Malakpet Rowdy said...

Hey I missed this post. Good one!

Been a while since I used Poka Yoke

krishna said...
This comment has been removed by a blog administrator.
మంచు said...

Krishna - This is not the appropriate place to write your comment. I appreciate your understanding.
-Thanks

yogirk said...

Dude,

Read "he Design of everyday things" by Donald Norman, you'll find it interesting.

http://www.amazon.com/Design-Everyday-Things-Donald-Norman/dp/0385267746

Also read "Cradle to Cradle" - by William McDonough

http://www.amazon.com/Cradle-Remaking-Way-Make-Things/dp/0865475873

krishna said...

not to publish...dear manchu, where do you want to continue our discussion?