Pages

Tuesday, March 27, 2012

తిండి గొడవలు (Part 1 of 4) - వెజిటేరియన్స్ నిజంగా జంతు ప్రేమికులా?

*** శ్రీ రామ ***

లాస్ట్ సమ్మర్ లో ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరో పిలిస్తే ఒక బార్బెక్యూ పార్టీకి వెళ్ళాల్సొచ్చింది. అక్కడ కొందరు నేను నాన్‌వెజిటేరియన్ నా లేక ఉత్తి వెజిటేరియన్ నా అని అడగగానే యథావిధిగా కొంచెంసేపు అదోరకమయిన సందిగ్ధావస్థలో పడి తేరుకుని వెజిటేరియన్ అని చెప్పాను. ఇలా అబద్ధం చెప్పడం నాకు కొత్తేమీ కాదనుకోండి. ఓ నాలుగైదు రకాలు తినే కుటుంబ నేపథ్యంలో పుట్టి పెరిగినా ఇప్పుడు క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, జల పుష్పాలు, ఉభయచరజీవులు ఇలా నడిచేవి, ఎగిరేవి, పాకేవి, ఈదేవి ఏదయినా పెద్ద అభ్యంతరం లేదు. ఇలా ఏది పడితే అది తినగలిగినా అసలు నేను నాన్‌వెజిటేరియన్ అని పైకి చెప్పడానికి ఎప్పుడూ ఎందుకు ఇలా మోహమాటపడతానో నాకు అర్థం కాదు. ఇలా అనవసరంగా కమిట్ అయిపోయి బోల్డు సార్లు మంచి మంచి డిషెస్ కూడా మిస్ అయిపోతుంటాను. ఒకప్పుడు ఏవో కొన్ని కారణాల వల్ల ఒక నాలుగు సంవత్సరాలు వెజిటేరియన్ గా ఉన్నా ఆ తరువాత నా వల్ల భూమి మీద జీవరాశుల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది అని మళ్ళీ నాన్‌వెజిటేరియన్ గా మారిపోయాను. :-) 

అసలయినా పులులు సింహాల్లా మనుషుల్లో అసలు సిసలు నాన్‌వెజిటేరియన్ అంటూ ఎవరూ ఉండరు. నాన్ వెజిటేరియన్ అని పిలిచేవారంతా Omnivores అన్నమాట. అంటే అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి శాకాహారం లేక మాంసాహారం ఏదయినా తిని బ్రతికే వాళ్ళు.

ఈ వెజిటేరియనిజం అన్నది భలే చిత్రమయిన కాన్సెప్ట్. అంటే వెజిటేరియన్స్ లోనే బోల్డు రకాల వెజిటేరియన్స్ ఉంటారన్నమాట. ఇందులో వేగన్స్ (vegans) అనేవారు నిక్కచ్చైన అసలు సిసలయిన శాకాహారులు. అంటే వీరు కేవలం జంతుమాంసం అనే కాకుండా అసలు జంతువులకి సంబంధించిన ఏ ఆహారాన్నీ తీసుకోరు. పాలు, గుడ్లు, తేనె లాంటి జంతు సంబంధిత ఉత్పత్తులు కూడా వీరికి నిషిద్ధం. అందువల్ల వీరికి వీరు తామే అసలు సిసలయిన వెజిటేరియన్ అని అభివర్ణించుకోవడం పెద్ద అతిశయోక్తి అనిపించదు. వీరి ఫిలాసఫీ ప్రకారం జంతువులకి సంబంధించినవి ఏదయినా కేవలం ఆ జంతువులకే చెందాలి, అవే ఉపయోగించుకోవాలి కానీ అది మనిషి బలవంతంగా తీసుకోవడం వాటి హక్కులని హరించడమే అని వీరి అభిప్రాయం. వీరి దృష్టిలో మన ఆహ్లాదం కోసం జంతువులను పెంచుకోవడం, మన పనులకి వాడుకోవడం ద్వారా వాటి శ్రమ దోపిడీ చెయ్యడం, వాటి చర్మం, ఉన్ని లాంటి వాటితో చేసిన వస్తువులు వాడటం, వైద్య సంబంధమయిన ప్రయోగాలకి వాడటం ఇవన్నీ తప్పే. ఒక్క మాటలో చెప్పాలంటే.. "జంతువుల జోలికి వెళ్ళకుండా వాటి మానాన వాటినలా బ్రతకనివ్వడం" అన్నది వాళ్ళ కాన్సెప్ట్.

ఇక వెజిటేరియన్స్ లో లాక్టో వెజిటేరియన్స్ అనే ఇంకో రకం ఉంటారు. వారు జంతువుల మాంసం అయితే తినరు కానీ పాలు మరియు పాల ఉత్పత్తులు అయిన పెరుగు, వెన్న, నెయ్యి లాంటివి తింటారు. వీరి అభిప్రాయంలో ఒక జంతువు ప్రాణం తియ్యనంత వరకు జంతువులకి సంబంధించినది ఏదయినా తినొచ్చు, వాడుకోవచ్చు. అలాగే ఓవోవెజిటేరియన్స్ అనబడే మరో రకం వెజిటేరియన్స్. వీరు జంతు మాంసం తినరు, పాల ఉత్పత్తులు కూడా తినరు కానీ గుడ్లు మాత్రం తింటారు. ఇంకా చాలా రకాల వెజిటేరియన్స్ ఉంటారు. మళ్ళీ వీటిల్లోనే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి కొందరు ఓవో-లాక్టో వెజిటేరియన్స్ ఉన్నట్టన్నమాట. మన దేశంలో ఉండే వెజిటేరియన్స్ లో మెజారిటీ లాక్టో వెజిటేరియన్స్ ఉంటారు. ఈ ప్రకారంగా మాంసం మాత్రం త్యజించి మిగతా జంతు ఉత్పత్తులను తినేవాళ్ళని మనం అసంపూర్ణ శాకాహారులు అనవచ్చేమో.

మనుషులందరినీ జంతువులను హింసించే స్థాయిని బట్టి వర్గాలుగా విడగొడితే అప్పుడు జంతువుల దృష్టిలో అత్యంత దుర్మార్గులుగా మొదట నాలాంటి నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. తరువాత పైన చెప్పుకున్న ఓవో-లాక్టో వెజిటేరియన్స్ ఉంటారు. ఇక జంతువుల దృష్టిలో మంచివాళ్ళు అంటే కేవలం వేగన్స్ మాత్రమే.


ఒక రెండు వందల సంవత్సరాల క్రితం ఉన్న సామాజిక పరిస్థితులను ఒకసారి చూస్తే అప్పుడు కొన్ని జాతులకి చెందిన మనుషుల్ని బానిసలుగా ఉంచుకోవడం సాంఘికంగా ఆమోదయోగ్యంగా ఉండేది. అలాగే అప్పట్లో ఉన్నత వర్గాల్లో ఉన్న స్త్రీలకి పురుషులతో సమానంగా హక్కులు లేకపోవడం కూడా చాలా సామాన్యమైన విషయం. తరతరాలుగా అనుసరిస్తున్న కొన్ని ఆచారాలనీ, సాంప్రదాయాలనీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ దాంట్లో ఏదన్నా తప్పుగా కనిపిస్తే అది మార్చుకుంటూ కాలంతో పాటు మారుతున్న సామాజిక పరిస్థితులకి అనుగుణంగా మార్పు చెందడం అన్నది నిరంతరంగా, ప్రకృతి సహజంగా జరిగే ప్రక్రియ. ఒకప్పుడు సంస్థాగతంగా అమోదం పొందిన "బానిసత్వం" ఇప్పుడు చట్టవిరుద్ధం అయింది. జాతి, రంగు, లింగ బేధం లేకుండా మనుషులందరికీ సమాన హక్కులు ఉండాలన్నది ఇప్పటి ప్రజల ఆకాంక్ష. ఇదే ప్రక్రియలో ఇంకొన్నాళ్ళకి ప్రాణకోటి అంతటికీ అంటే మిగతా జంతువులన్నిటినీ కూడా మనుషులతో సమానంగా చూసే పరిస్థితులు వస్తాయనీ, రావాలనీ వాటి హక్కుల కోసం పోరాడే వాళ్ళే వేగన్స్. ఇప్పుడు 'మనుషులతో జంతువులకి సమాన హక్కులా!' అని ఒకింత ఆశ్చర్యంతో చూసేవాళ్ళు చాలామందే ఉంటారు. ఒక రెండు వందల సంవత్సరాల క్రితం తెల్లవాళ్ళతో సమానంగా నల్లవాళ్ళకి హక్కులు లేక పురుషులతో సమానం గా స్త్రీలకి అవకాశాలు ఉండాలి అని మాట్లాడిన వాళ్ళని కూడా అప్పటి వాళ్ళు వీళ్ళకేమన్నా పిచ్చా అన్నట్టు చూసేవారు. నా అభిప్రాయంలో హక్కులు, సమానత్వం అన్నవి ఒకరు ఇంకొకరికి జాలిపడి ఇవ్వడం అంటూ ఏమీ ఉండదు. ఆయా అణగారిన వర్గాలవారు సామాజికంగా బలపడే కొద్దీ పోరాడి సమానహక్కులు సాధించుకోవడం మాత్రమే జరుగుతుంది. అలా మనుషుల మాదిరి జంతువులు సమానత్వం సాధించుకోడం జరగని పని కాబట్టి వేగన్స్ ప్రస్తావించే ఈ సమానత్వం పాయింట్ తో నేను ఏకీభవించను. ఇక వేగన్స్ ని పక్కన పెడితే మిగతా వెజిటేరియన్స్ అంటే ముఖ్యంగా మన దేశంలో ఉండే లాక్టోవెజిటేరియన్స్ సంగతి చూద్దాం.

లాక్టో వెజిటేరియన్స్ మీట్ తినకపోవడం వల్ల కోల్పోతున్న ప్రొటీన్ మరియు మిగతా పోషక విలువల కొరత తీర్చుకోవడం కోసం మిగతావారితో పోల్చుకుంటే పాలు మరియు పాల ఉత్పత్తులు ఎక్కువే వాడుతూ ఉంటారు. అయితే ఈ పాల ఉత్పత్తిదారులు వారి లాభం కోసం, అధిక డిమాండ్ ని అందుకోవడం కోసం పాలు ఉత్పత్తి చేసే ఆవులు గేదెల లాంటి జంతువులను అవి బ్రతికినంత కాలం ఎప్పుడూ ప్రెగ్నెంట్ గా ఉండేలా చూస్తారు. అవి ప్రెగ్నెంట్ అవడం కోసం ఉపయోగించే పద్ధతులు కూడా దారుణంగా ఉంటాయి. వాటిని ఇంప్రెగ్నేట్ చెయ్యడానికి ఉంచే బ్రీడిండ్ స్టాండ్ లను వేగన్స్ రేప్ ర్యాక్ లు అని పిలుస్తారు. ఎందుకంటే వాటి ఇష్టాయిష్టాలకి వ్యతిరేకంగా మనుషుల ఆధ్వర్యంలో బలవంతంగా జరిగే ప్రక్రియ కాబట్టి. అలానే ప్రకృతిసిద్ధంగా పుట్టిన దూడకి దక్కాల్సిన పాలలో మనుషులు తీసుకునేవే ఎక్కువ. స్వేచ్ఛగా బయట తిరగాల్సిన జంతువులను రోజులో ఎక్కువ భాగం అపరిశుభ్రమయిన ప్రదేశాల్లో కట్టేసి బంధించి ఉంచడం, ఆ జంతువులు ఇక పాల ఉత్పత్తికి పనికిరావు అనుకున్న వెంటనే వాటిని మాంసం కోసం అమ్మేయ్యడం.. ఇవన్నీ జంతువులని హింసించడమే. అధిక పాల ఉత్పత్తి కోసం జన్యు మార్పిడి చెయ్యడం, కొంచెం పాల దిగుబడి తగ్గగానే హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం.. ఇవన్నీ అందరి ఆమోదం పొందిన ప్రకృతి విరుద్ధమయిన క్రూరమైన పద్ధతులు అన్నమాట. 

కొంతమంది "అవి కష్టపడకుండా మనమే బోల్డు ఆహారం పెడుతున్నాం, శుభ్రం చేస్తున్నాం, ఎంతో ప్రేమతో చూస్తున్నాం... ఇక సమస్య ఏమిటి" అని వాదిస్తూ ఉంటారు. సరే ఇప్పుడు "నేను ఆహారం పెడతాను, పరిశుభ్రంగా ఉంచుతాను, ప్రేమగా పెంచుతాను" అని ఒక మనిషిని బానిసగా ఉంచుకోవడానికి ఈ సమాజం ఒప్పుకుంటుందా? మనుషుల విషయంలో బానిసత్వం అనేది అంత ఘోరమయిన తప్పు అయినప్పుడు జంతువుల విషయంలో ఎందుకు సరైనది అవుతుంది అన్నది వేగన్స్ ప్రశ్న. ఇక సాధారణ ప్రోబబిలిటీ ప్రకారం చూసుకుంటే పాల ఉత్పత్తి కోసం పెంచే ఆవులు, గేదె దూడల్లో ఆడ మగ శాతం 50-50 ఉండాలి. మరి మనం రోజు చూసే వాటిలో పాడి ఇచ్చే ఆడ జంతువులే ఎక్కువుంటే మగవి ఏమవుతున్నాయ్ అన్నది ఇంకో ప్రశ్న.

ఇలా ప్రత్యక్షంగానే కాకుండా కూడా జంతువుల చావుకి పరోక్షంగా కారణం అయ్యే ఉత్పత్తులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి బజార్లో దొరికే అనేక రకాల చీజ్‌ల తయారికి  రెన్నేట్ అనే ఎంజైమ్ అవసరం. ఈ ఎంజైమ్ ని చిన్న వయస్సు ఉన్న ఆవుదూడలను చంపి వాటి పొట్టలోని కొన్ని పొరల్లో నుండి సేకరిస్తారు. మన ఇండియాలో ఉండే అమూల్ ఉత్పత్తుల్లో అయితే కొన్ని రకాల నాచు నుండి డెవెలప్ చేసిన Microbial rennet వాడతారు కానీ ప్రపంచ వ్యాప్తంగా అయితే చాలా వరకు ఆవు దూడల నుండి తీసిన రెన్నేట్ ఎక్కువ వాడతారు. మీరు స్ట్రిక్ట్ వెజ్ అనుకుంటే ఏ చీజ్ అయినా కొనే ముందు ఒకసారి చూసుకోవడం బెటర్. :-) అలాగే మన ఇండియన్ స్వీట్ల మీద వాడే వెండి పూతలు (వర్క్ అంటారు) ఉంటాయి కదా.. అవి కూడా అంత పలుచని పొరగా రావడానికి కొన్ని జంతువుల పొట్ట చర్మం మీద కొట్టి తయారు చేస్తారు. ఈ రెండు ఉదాహరణల్లో శాకాహారులు జంతు అనుబంధ ఉత్పత్తులను ప్రత్యక్షంగా తినకపోయినా, తినేవి ప్యూర్ వెజ్ అయినా... ఇవి కొనడం, తినడం వల్ల ఆ జంతువుల చావుకు పరోక్షంగా కారణం అవుతున్నవారే!

ఇలా జంతువులను, ప్రకృతిలో సహజసిద్ధంగా వాటికి చెందిన హక్కులను హరించడం, వాటిని పరోక్షంగా హింసించడంలో నాన్వెజిటేరియన్స్ తో పోలిస్తే ఈ లాక్టోవెజిటేరియన్స్ ఏమీ తీసిపోరు అన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం. అహింస, తోటి ప్రాణుల మీద ప్రేమ ముఖ్యోద్దేశ్యాలుగా ఆవిర్భవించిన ఈ వెజిటేరియన్ మూవ్మెంట్ ఈ రోజుల్లో నిజంగా దానికే కట్టుబడి ఉందా? "Dairy industry is as nasty as meat industry" అని అందరూ అంగీకరించాల్సిన పరిస్తితి ఉన్నప్పుడు ఆ ఇండస్ట్రీని పెంచి పొషించే లాక్టోవెజిటేరియన్స్ నిజంగా జంతు ప్రేమికులేనా?


- మంచు

37 comments:

Jagadeesh Reddy said...

మీ విశ్లేషణ నిజంగా ఆలోచింపచేసేదిగా వుంది... ఈ విషయం గురించి ఆలోచించాను గాని, ఇప్పుడు ఒక క్లారిటి దొరికింది..

Sravya V said...

హ హ ఏంటి మాస్టారు ఈ యుద్ధం ? వేజిటేరియన్స్ జంతు ప్రేమికులా ఇంకా ఇలా అనే జనాలు ఉన్నారా ?
నాచురల్ గా కొంత మంది కొన్ని రకాల ఫుడ్ అంటే ఎవర్ష్యన్స్ డెవలప్ అవుతాయేమో నండి? అంటే దానిలో కుటుంబనేపధ్యం కూడా ఒక బాగం కావొచ్చు అంటే కానీ ఈ రోజుల్లో ఏదో వెజిటేరినిజం అంటే గొప్ప గా ఫీల్ అవటం ఉందా ?
in fact వెజిటేరియన్ అంటే కొంచెం social gathering లో కష్టం కూడా మీరు ఏమో రివెర్స్ చెబుతున్నారు ? మీరు అబద్దం ఎందుకు చెప్పారో నాకు బుర్ర చించుకున్నా అర్ధం కాలేదు , What might be the reason thinking thinking ....

Anuradha said...

Good Information...ThanQ manchu garu.

Sri Kanth said...

మంచు గారూ,

జంతువులన్నింటిలోకి అతి కౄరమైన జంతువు మానవుడే అంటారు. కానీ సహజంగా జరిగేది ఏమిటంటే, కౄరత్వం లేదా మంచితనం అనేది మనిషి POVలో మాత్రమే ఆలోచించడం జరుగుతుంది, అన్ని జీవులనూ లెక్కలోకి తీసుకోవడం సహజంగా జరగదు. శాఖాహారులనే తీసుకోండి (అంటే పూర్తిగా కేవలం మొక్కల మీదనే ఆధారపడి జీవించే వారన్న మాట) మనిషికి ఎంత అవసరమో అంతే తీసుకునే లక్షణం లేదు. అది నీరైనా సరే, ప్రకృతిలో దొరికే ఆహారమైనా సరే (పండ్లు, కాయగూరలు వగైరా). దోచుకోవడం అనేది మానవుడు ఎప్పటినుండో చేస్తున్న పనే.

ఇదే కాక, శాఖాహారే అయినా, సౌందర్య సాధణాలను వాడేవారిని కూడా భూత దయగల వారని అనుకోలేం. కొన్ని సౌందర్య సాధణాలను ఎలా తయారు చేస్తారో, వాటిని తయారు చేసే పద్దతులలో జంతువులని ఎంత దారుణంగా హింసించడం జరుగుతుందో చాలా మందికి తెలిసే ఉంటుంది.

ఇక శాఖాహారులలో కూడా కొంతమంది చాపలు తినేవాల్లుంటారట. బెంగాలులో కొంత మంది శాఖాహారులు వీటిని జలపుష్పాలని పిలుచుకుటారంట.

శ్రీనివాస్ పప్పు said...

ఎలాంటి మంచు గారు ఎలా అయిపోయారు వాఆఆఆఆ (నేను మాత్రం శాఖాహారినేనండోయ్ అంటే ఉత్తి ఆకులూ అలములూ మాత్రమే తింటాను)

శేఖర్ (Sekhar) said...

ఖచ్చితం గా కాదు ...
చాల వివరం గా సమాచారం ఇచ్చారు,బాగుంది ఆర్టికల్ ......వేగన్లు అవ్వటం కష్టమేమో...ఇప్పటికి లాక్టో అయ్యాను చాలు :))

మధురవాణి said...

Interesting analysis! Will wait for the sequels now.. :)

నిషిగంధ said...

"ఉదాహరణకి బజార్లో దొరికే అనేక రకాల చీజ్‌ల తయారికి రెన్నేట్ అనే ఎంజైమ్ అవసరం. ఈ ఎంజైమ్ ని చిన్న వయస్సు ఉన్న ఆవుదూడలను చంపి వాటి పొట్టలోని కొన్ని పొరల్లో నుండి సేకరిస్తారు"

I am a big fan of cheese.. ఇలాంటి కఠోర వాస్తవాలు మాముందుంచడం అవసరమా చెప్పండీ :((((((

Very interesting facts though!

మిరీది తప్పక చదివి చూడాలి ;-)

http://www.peta.org/features/down-investigation.aspx

నా ఫ్రెండ్ ఒకావిడ వీర వేగన్.. తనలాంటి వేగన్స్ చెప్పే కారణాలన్నీ సబబుగానే అనిపించినా, చాలాసార్లు మరీ ఎక్కువగా అనుసరించేసి/ఆలోచించేసి, పక్కన ఉన్న నాలాంటి అమాయక నాన్‌వెజిటేరియన్స్ ని నరరూపరాక్షసులన్న భావనతో చూస్తుంటారు.. బాబోయ్, వాళ్ళతో ఎప్పుడైనా రెస్టారెంట్ కి వెల్తే ఉండే కష్టాలు చెప్పలేము! :(

పైన శ్రావ్య అన్నట్టు కుటుంబ నేపధ్యంవల్లనో లేక స్వతహాగానే రుచి, వాసనలు నచ్చక వెజిటేరియన్స్ గా ఉండేవాళ్ళు చాలా బెటర్!!

Anonymous said...

"ఇలా జంతువులను, ప్రకృతిలో సహజసిద్ధంగా వాటికి చెందిన హక్కులను హరించడం, వాటిని పరోక్షంగా హింసించడంలో నాన్వెజిటేరియన్స్ తో పోలిస్తే ఈ లాక్టోవెజిటేరియన్స్ ఏమీ తీసిపోరు అన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం. అహింస, తోటి ప్రాణుల మీద ప్రేమ ముఖ్యోద్దేశ్యాలుగా ఆవిర్భవించిన ఈ వెజిటేరియన్ మూవ్మెంట్ ఈ రోజుల్లో నిజంగా దానికే కట్టుబడి ఉందా?"
మరి మొక్కలు తోటి ప్రాణులు కాదా? వాటికి చెందిన హక్కులు (ఇవేమిటో నిర్ణయించేది ఎవరు?) హరించడం, వాటిని హింసించడం (పీకి, కోసి, తరిగి) చెయ్యొచ్చా?

Rao S Lakkaraju said...

మా ఇంట్లో అయితే ఆహారం గ ఏవి తినాలి అనేవి వాళ్ళ ఇష్టా ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని నిజంగా వాళ్ళ శరీర తత్వానికి పడవు. వెజిటేరియన్స్, నాన్‌వెజిటేరియన్స్ అని చెప్పవలసి వచ్చేది బయట తినవలసి వచ్చినప్పుడే. అందరు వెజిటేరియన్స్ అన్ని శాఖాహారాలూ తినరు, అల్లాగే అందరు నాన్‌వెజిటేరియన్స్ అన్ని జంతువులూ తినరు.అందుకని ఆ క్లాసిఫికేషన్ బయటివాళ్ళ కోసమనే నేను అనుకుంటాను.

ఇంకా నయం ఆ ఎంజైము గురుంచి మీరు సుతారంగా చెప్పారు. నాకు చెప్పిన వాళ్ళు పేగుల నుండి తీస్తారని చెప్పారు.

మీరు ఈ పోస్ట్ వ్రాసింది, వెజిటేరియన్స్ "చీజ్" లు తినరాదని చెప్పటానికా? అల్లా అనుకుంటే అటువంటిది జరగదు అని నా అభిప్రాయము.

శశి కళ said...

మంచి సేకరణ ....ఏదో లెండి ఎవరి అభిరుచికి వాళ్ళను వదిలెయ్యటం మేలు

మధురవాణి said...

I agree with the above anonymous question.

Even plants are living creatures just like us and they produce flowers and seeds for their own reproduction/propagation and not for our consumption. In principle, just like a chicken egg, each and every seed is capable of growing into a new plant. And we don't really care about it. We love to eat sprouts where you induce the seeds to germinate and then just eat them off before they grow into a complete plant.. How ruthless! :))

We do all sorts of plant breeding stuff to improve the plant parts which are beneficial to humans. For example, we prefer to develop a rice variety to get the enhanced ratio between grains production and vegetative growth of the plants. We don't care if the plants grow dwarf or tall, only thing matters to us is the grain yield.
Like wise, just for having the luxury of eating seed less fruits we forcefully modify the plants to make sterile seeds. All this is not ethical if you feel "All creatures deserve same treatment in nature".

Most of the biological metabolisms are quite similar between plants animals. Plants do have an immune system and they do fight against the invaders just like us. The only difference between the plants and animals is that we can't hear them crying. That's the reason we don't bother much about plants. :)

Having said that, since plants are the primary and ONLY producers on this planet, all other animals should depend on plants for their survival and there is no other go. All this is a natural food chain. Plants and animals being not that smart and intelligent like human beings, they are being exploited. Again, the same basic rule.. survival of the fittest.

But, As Srikanth garu said it above, man being the most intelligent, selfish and greedy animal, he is exploiting the nature and the rest of the organisms beyond the limits for his own benefits. And he almost reached a stage where he's not even bothering much about the well being of future human generations! :(

Besides being a vegan, or semi vegetarian or non-vegetarian, we should also think in the lines of world food situation. For a moment, just forget about the animals, and just think.. How many of us consciously follow our food habits by keeping the world food situation in mind? This means, starting from the farmers status in a country, agriculture situation, agricultural marketing and trading, organic farming, usage of pesticide free organic food, the consciousness of consuming the minimal amount of food for living, minimal wastage of food, etc.

@ Manchu garu,
Thanks very much for this thoughtful post. i really appreciate you for coming up with such an essential topic. I'm looking forward for an interesting discussion here. :)

..nagarjuna.. said...

నన్ను అడిగేతే మహా ఇబ్బంది పడే ప్రశ్న "నువ్వు వెజీవా నాన్-వెజివా ?" కూరగాయలు మాత్రమే తింటే వెజి మరి నాన్-వెజి అంటే మాంసాహారం మాత్రమే తినాలా!! అందుకని ’రెండూ’ అని చెప్పేస్తుంటా :)

పోస్ట్ విషయానికి వస్తే ఇతరులను పోర్స్ చేయనంత వరకు ఏం చేసినా ఏం తిన్నా అస్సలు ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన టైం కాబట్టి మనుషులు జంతువులను తింటున్నారు, రేప్పొద్దున్న అవి ఎవాల్వ్ అయ్యి మనుషులను ’తింటాయేమో’ !

రాజ్ కుమార్ said...

ఎప్పటిలాగే.. రొటీన్ గా.. "చాలాబాగుంది"

ఈ కార్తీక్ ఇంకా కమెంట్ పెట్టలేదేటి చెప్మా.. ః)

Vasu said...

ఆహరం సోర్స్ తెలియకపోతే మనం వెజిటేరియన్ ఔనా కాదా చెప్పడం చాల కష్టం . ఇప్పుడొచ్చిన పెద్ద చిక్కు ఇదే (ఇండియా లో అయితే కొంత వరకూ అయినా ఆహరం ఎక్కడించీ వచ్చేది తెలుస్తుంది )..

కావాలని తిన్నంత వరకు ఫర్వా లేదు అనుకోవడం అంతే ..

ఇంక శాకాహారులు (ఇండియా లో ) భూత దయ (జంతు ప్రేమ ) వల్ల కాదు అనుకుంటా ..

ఎందుకంటే పులి చర్మం , లేడి చర్మం ఆశనాల గా వాడతారు .. జోళ్ళకి ఆవు తోలు , చాలా సంగీత వాయిద్యాలకి కూడా తోలు వాడతారు ..

అందుకని భూత దయ కంటే అది సత్వాహారం కాదని (తామస ఆహరమని ) తినరని నా అభిప్రాయం ..

కొత్తావకాయ said...

మధురవాణి గారూ! మంచు గారిని అభినందిద్దామని వచ్చి మీ మాటలకి ముగ్ధురాలినైపోయాను. వాహ్! :)

మంచు గారూ, మంచి విషయం! మంచి సమాచారం! ఇబ్బంది కలిగించే వాస్తవాలని ఇలా మా ముందు పెట్టినందుకు కుడోస్! మీరీ చర్చని ఎటు తీసుకెళ్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. :)

మార్ష్ మెల్లోస్, ఐస్క్రీం, జెల్లో.. ఇలా గుడ్డు తినని వెజిటేరియన్స్ తెలియక తినేసే పదార్ధాల గురించో! :)

నిషిగంధ said...

మధురా, మాటల్లేవంతే!!!!

"Most of the biological metabolisms are quite similar between plants animals. Plants do have an immune system and they do fight against the invaders just like us. The only difference between the plants and animals is that we can't hear them crying."

అవసరాలన్నీ సేమ్ కానీ మొక్కలకి ఫీలింగ్స్ ఉండవంతే కదా! :-)

సీరియస్లీ, నీ బ్లాగులో ఇలాంటి పోస్ట్స్ రాస్తే చదవాలనుంది!

పద్మవల్లి said...

నేను మాంసాహారినే, కానీ అప్పుడపుడూ శాకాహారిగా మారుతూ ఉంటాను. అయినా అన్ని రకాలూ తినను, తినలేను. అలా అని తినని వాటి మీద నాకు ప్రేమ ఉన్నట్టు కాదు. తినే వాటి మీద ప్రేమ లేనట్టూ కాదు. నేను పెరిగిన పరిస్థితులూ, కుటుంబ వాతావరణం చాల వరకు కారణం నా తిండి అలవాట్లకి. అలాగే పూర్తి శాఖాహరిగా మారడానికి, తగలాల్సిన దెబ్బ మనసు మీద ఇంకా తగలకపోవడం కూడా ఒక కారణం. అలాగే జంతువుల నుండి చేసే అలంకరణ సామాగ్రి,, బేగ్స్ లాంటివి కూడా మానేయ్యల్సిన లిస్టులో ఉంటాయి మరి.

మంచు గారు లేవనెత్తిన విషయాలు చాల ఆసక్తికరంగా ఉన్నాయి. ఆలోచింపచేసే పోస్టు. మిగతా పార్టుల కోసం ఎదురు చూస్తున్నాను నేను కూడా.

పద్మవల్లి said...

మధురా, క్లాప్స్. క్లాప్స్..
మంచి విషయాలు, అందరం చాలా సులభంగా దాటేయ్యగల విషయాలు చెప్పావు. I am impressed.

జలతారు వెన్నెల said...

Very informative post!

Vasu said...

"Even plants are living creatures just like us and they produce flowers and seeds for their own reproduction/propagation and not for our consumption. In principle, just like a chicken egg, each and every seed is capable of growing into a new plant. And we don't really care about it. We love to eat sprouts where you induce the seeds to germinate and then just eat them off before they grow into a complete plant.. How ruthless! :))
"

Mind boggling :)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

Interesting :-)
ఇదివరకు ఫ్యాక్ట్‌స్ యే రాశారు. బాగుంది. ఇకపైనా అలాగే రాయండి. ఒకవేళ మీ ఒపీనియన్ రాయాలనుకుంటే మాత్రం ఎవరి ఆహారపు అలవాట్లు వారివి, వాటిని గౌరవించే రీతిలోనే రాయండి. చిన్న చూపు చూడటంలాంటి కోణంలో లేకుండ జాగ్రత్త పడండి. తరువాయి భాగాల్లోనూ ఇది దృష్టిలో పెట్టుకుని రాస్తారని భావిస్తున్నాను.

Rao S Lakkaraju said...

@Vasu garu how we have to live without eating sprouts, plants, fish, milk or meat from animals ? Is there a solution ?

Anonymous said...

కేవలం శుద్ధ నరమాంసం తినేవాళ్ళనేమంటారో చెప్పడం మరిచారు.

చెట్లకు ప్రాణముంది, గాలి, మట్టి, నీటిలో సూక్ష్మజీవులుంటాయి. ఇంకేమిటి తినేది!?!

మంచు said...

జగదీష్ గారు : ధన్యవాదములు. మొత్తం నాలుగు భాగాలు చదివి అన్నిటి మీద మీ అభిప్రాయం చెప్పగలరని ఆశిస్తాను.

శ్రావ్య: యుద్దం ఒకరి మీదని కాదు :-))) ఒకేవైపు విని విని విసిగిపొయిన స్నేహితులకి రెండొ వైపు అలొచించేలా చెయ్యాలని చిన్న ప్రయత్నం. ఇక నా మొదటి పేరా గురించి అయితే ది జస్ట్ ఏ ఐస్ బ్రేకర్. అంటే దానికి మీనింగ్ లేదని కాదు. తర్వాత చెప్తాను.

అనూరాధ గారు: థాంక్యూ ... చాలా రొజులకి కనిపించారు :-)

మంచు said...

శ్రీకాంత్ గారు : 100% నిజం. ఒకరకం గా ఇలాంటి స్పందన కొసమే నేను ప్రయత్నిస్తున్నది :-)
పప్పు గారు: అర్ధం కాలే :-) మీరు శాఖాహారి అని రాసారు. మా బ్లాగ్ తెలుగు మాస్టారు శాకాహారి అని రాయమన్నారు ఏది కరెక్టూ ? :-)
శేఖర్ గారు: వేగన్ అవ్వడం చాలా చాలా కస్టం అండి :-) ఎందుకంటే వాళ్ళ రూల్స్ రోజు రోజు కి కస్టం అయిపొతూ ఉంటాయి. ఒవరాల్ గా మనసు లొ ఆ తపన ఎంతొ బలం గా ఉంటే తప్ప చాలా కస్టం.
నిషి గారు : :-)))) అమెరికాలొ వెజిటేరియన్ రెన్నెట్ తొ చేసిన చీజ్ లు బొల్డు దొరుకుతున్నాయి... :-) ఇక మీరు రాసిన వేగన్ పేరా గురించి తరువాతి భాగం లొ ప్రస్తావించాను.
అనానిమస్ గారు: మీరు రాసిన ప్రశ్న నాకు చాలా నచ్చింది. నేను సరి అయిన సమాధానం ఫ్రేం చేసేలోపు మధుర గారు సమాధానం ఇచ్చారు. ఆవిడ కామెంట్ చూసాక ఇక నా కామెంట్ చాలా అసంపూర్ణం గా అనిపించింది.

మంచు said...

మధుర గారు: ఇక చెప్పేదేముంది :-)) అందరూ చెప్పేసారు. అంత బ్రహ్మాండం గా ఉంది. మీరు వీలయినంత త్వరగా ఒక పొస్ట్ రాయాలని నేను డిమాండ్ చేస్తున్నా :-)

నాగార్జున : పూర్తి నాన్ వెజిటేరియన్ ని carnivore అని .. పూర్తి శాకాహారిని herbivore అని .. సగం సగం తినేవాళ్ళని omnivore అని
అంటారు... అందుకే రాసా.. మనుషులు omnivore కిందకి వస్తారు అని :-))

లక్కరాజు గారు:
ఎంజైం గురించి నేను కొంచెం సున్నితం గా చెప్పిన మాట నిజమే. ఇక్కడ తినేవాళ్ళు ఎక్కువ ఉంటారని రాయలేదు. అసలు చెప్పాలంటే ఆ ప్రేవులు గ్రైండ్ చేసి తీస్తారు. ఇంటెరెస్ట్ ఉంటే వికి లొ చూడండి ..కొంచెం ఇంఫర్మేషన్ ఉంది.
చీజ్ తినొద్దు అని చెప్పడం ఈ పొస్ట్ ఉద్దేశ్యం కానే కాదండి. వెజిటేరియన్ ఫుడ్ తయారి లొ జరుగుతున్న కొన్ని చీకటి కొణాలు చూపించడానికే

మంచు said...

రాజ్ : థాంక్యూ .. కార్తీక్ ఎవొ ప్రెజెంటేషన్స్ అవీ అంటూ బిజీ ఉన్నాడు లే... తరువాత పార్ట్ లలొ తప్పని సరిగా వస్తాడు :-))

శశికళ గారు: థాంక్యూ. నాది ఇంచుమించు అదే ఉద్దేశ్యం :-)

వాసు గారు: మీరు చెప్పింది అర్ధం అయ్యింది. బూత దయ అన్నది ఇప్పుడు వెజిటేరియన్స్ చెప్పే మాట. ఇక మీరు ప్రస్తావించిన "తామస ఆహరం" కి వేరే ఎదయినా సొషల్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఉంటుందంటారా.. నా తరువాతి పొస్ట్ లొ దీనికి సంబంధించి ఒక చిన్న పేరా ఉంది. అక్కడ కొంచెం విపులం గా చెప్పగలరు.

కొత్తావకాయ్ గారు: థాంక్యూ అండి. జెల్లొ గురించి రాద్దామనే అనుకున్నా :-))) మొత్తం చదివి మీ అభిప్రాయం చెప్పగలరు

మంచు said...

పద్మ గారు : థాంక్యూ .. "పూర్తి శాఖాహరిగా మారడానికి, తగలాల్సిన దెబ్బ మనసు మీద ఇంకా తగలకపోవడం కూడా ఒక కారణం" ఇదే నేను పైన శేఖర్ కి చెప్పడానికి ప్రయత్నించాను. మీరు ఇంకాస్త అందంగా చెప్పారు :-)

జలతారు వెన్నెల గారు : థాంక్యూ అండి.

అవినేని భాస్కర్ గారు: థాంక్యూ. ఈ సీరీస్ లొ మిగతా మూడు పార్ట్లు అయితే నేను అల్రేడి రాసేసి పెట్టుకున్నాను. మొదటి పొస్టలలొ వచ్చిన కామెంట్స్ నా అభిప్రాయాలని ప్రభావితం చెయ్యకుండా ఉండటానికి ఏ సీరీస్ అయినా అంతా ముందే రాసి పెట్టుకుంటాను .. మీరు సూచించిన పాయింట్లు తరువాతి టాపిక్ రాసేపుడు మనసులొ ఉంచుకుంటాను. థాంక్యూ :-)

Anonymous @ March 27, 2012 11:04 PM: మీరు రాసిన మొదటి వ్యాక్యం నాకైతే అర్ధం కాలేదు. అదేదొ మీరే చెప్పేయండి.

మధురవాణి said...

@ Kotthavakaya garu, Nishi, Padma garu, Vasu garu, Manchu garu..

I'm happy that you got connected to my points. Thanks everyone! :)
Now, You are tempting me to write a scientific post on my blog.. :)))

@ Manchu gaaru,
హమ్మా.. ఈ కుట్ర మీదే కదూ! నా బ్లాగులో కూడా సైన్స్ పాఠాలు చెప్పాల్సిందేనంటారా అయితే! :D
I sincerely thank you and above anonymous for motivating me to write such a big comment.. :))

Anonymous said...

I have not come across any of my friends/relatives who are vegetarians or turned vegetarians because of their love towards animals. Most of my vegetarian friends are vegetarians because of tradition/religious reasons or because of health reasons(they believe vegetarianism will keep them healthy).

But I have come across friends/ people oposing cock fights, bull fights, horse races, using animals in circus and killing of street dogs.......and I never understood why?

WitReal said...

the following points that you raised, are of recent phenomenon - say for the last couple of decades.
These are irrelevant, wrt, the age old వెజిటేరియన్స్ అంటే ముఖ్యంగా మన దేశంలో ఉండే లాక్టోవెజిటేరియన్స్

1. ఆవులు గేదెల లాంటి జంతువులను అవి బ్రతికినంత కాలం ఎప్పుడూ ప్రెగ్నెంట్ గా ఉండేలా చూస్తారు.

2. ప్రకృతిసిద్ధంగా పుట్టిన దూడకి దక్కాల్సిన పాలలో మనుషులు తీసుకునేవే ఎక్కువ.

3. స్వేచ్ఛగా బయట తిరగాల్సిన జంతువులను రోజులో ఎక్కువ భాగం అపరిశుభ్రమయిన ప్రదేశాల్లో కట్టేసి బంధించి ఉంచడం,

4. అధిక పాల ఉత్పత్తి కోసం జన్యు మార్పిడి చెయ్యడం,

5. కొంచెం పాల దిగుబడి తగ్గగానే హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం..

6. ఇవన్నీ అందరి ఆమోదం పొందిన ప్రకృతి విరుద్ధమయిన క్రూరమైన పద్ధతులు అన్నమాట.

7. ఆవు దూడల నుండి తీసిన రెన్నేట్ ఎక్కువ వాడతారు.


Next, what is వెజిటేరియన్ మూవ్మెంట్???

Finally, ఈ రోజుల్లో నిజంగా దానికే కట్టుబడి ఉందా? - This is a relevant question wrt. lacto-veg concept.

Anonymous said...

Very interesting.
వ్యక్తిగతంగా చుస్తే ఆహారపుటలవాట్లు కుటుంబ నేపథ్యం, చిన్నప్పట్నించీ అయిన అలవాట్లననుసరించి వుంటాయేమో.

మధురవాణి గారు చెప్పినట్టు we are all part of a big food chain and there is no escape from it. అందరి అవసరాలకూ సరిపడా అహారాన్ని (మాంసాహారమైనా శాకాహారమైనా) ప్రకృతి ప్రసాదిస్తుంది. సమస్య ఎక్కడొస్తుందంటే ఈ అవసరం ఆశగా మారి "ఆహార ఉత్పత్తీ వాడుకా (production and consumption)" మిలియన్ డాలర్ల/పౌన్ల/రూపాయల ఇండస్ట్రీ అయినప్పుడు. అప్పుడే మీరు చెప్పిన ఈ క్రూరమైన పధ్ధతులు అమలులోకొస్తాయి.

There is enough food for our need, not enough for our greed.
My 2c worth-

శారద

మంచు said...

అనానిమస్ గారు, విట్ రియల్ గారు.. మీ పాయింట్లకు సమాధానం తరువాతి భాగాల్లొ ఉండొచ్చెమో చూడండి.

శారద గారు: మీ పేరు బ్లాగ్ బాగా చూసిన గుర్తు .. అయితే మీ బ్లాగు నాకు ఎవరు రిఫర్ చేసారొ గుర్తురావడం లేదు. మనకెవరో కామన్ ఫ్రెండ్ ఉండి ఉండొచ్చు.

మీ సెకండ్ పేరా పర్ఫెక్ట్. మిగతా భాగాలు చదివి మీ అభిప్రాయం చెప్తారని ఆశిస్తున్నాను.

శివరంజని said...

బాబోయ్ .......బాబోయ్.......... ఏంటి ఇది ..... మొన్ననే ఉగాది రోజు మెట్లమీద డాం అని పడిపోయా ...తగ్గింది కదా అని గంతులేస్తూ మీ బ్లాగ్ లో కొచ్చి చూసే సరికి ............నేను మళ్ళీ డాం అని పడిపోయా కళ్ళు తిరిగి ... కొంచెం వాటర్.......... కాదు కాదు కొన్ని ఐస్ క్రీమ్స్ plzzzzzzzzzzzzz


.ఈ పోస్ట్ ఏమిటీ ?????ఈ ఎనాలసిస్ ఏమిటి ???????? మీరు ఇంజనీర్ ????? సైంటిస్ట్ ??????? ఇంజనీర్ కమ్ సైంటిస్ట్ ??? లేక ప్రోఫెషర్ కమ్ ఇంజనీర్ కమ్ సైంటిస్ట్ ???????

భలే భలే చప్పట్లు ....... చాలా బాగా రాసారు .....నాకు ఇలాంటివి తెలియవండి ....సో నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి .....మీరు ఇలాంటివి ఎక్కువ రాస్తూ ఉండండి మాష్టారు ... ..........

ఇప్పుడే కాదు ఎప్పుడూ చెబుతాను చదివే మాకు ఎక్కడ బోర్ కొట్టకుండా మైండ్లోకి భలే ఇంజెక్ట్ చేసేస్తారు ..

. అసలు సైన్స్ పిక్షన్ బుక్స్ లో నాకు కొన్ని అర్ధం కావు....... ఒకవేళ అర్ధం అయిన బోలెడు డౌట్స్ వచ్చేస్తుంటాయి... ...

కాని మీ పోస్ట్ లు అలా కాదు K.G నుండి P.G. చదివిన అందరికి కూడా అరటిపండు వలిచి నోటిలో పెట్టినంత ఈజీగా అర్ధమవుతాయి ..... *సబ్జెక్ట్ తెలియడం వేరు అది అందరికి అర్ధమయ్యేంత సరళంగా చెప్పడం వేరు .. అందులో మీది అందెవేసిన చెయ్యి*

ఇప్పటి వరకు కేవలం మీ శైలి గురించి మాత్రమె చెప్పాను ...

ఇంకా నేను ఈ పోస్ట్ లో అన్ని పార్ట్ లు చదవలేదు ,,చదివి నా అభిప్రాయలు తెలియ చేస్తా ....ఇంకా కామెంట్స్ కూడా చదవాలి చాలా ఇంటరెస్టింగ్ డిస్కష జరిగింది అనుకుంటా ....సో మళ్ళీ వస్తా

శివరంజని said...

నేను తినేది చికెన్ ఒక్కటే .........అదికూడా తినను అని అబద్దం చెప్పి ఆ చికెన్ మిస్ అయ్యి నాకు నేనే ద్రోహం చేసుకోలేక నిర్మొహమాటం గా చెప్పేస్తా కాని అబద్దం చెప్పను .... ఆలోచిస్తూ కూర్చుంటే నా ప్లేట్ ఖాళీ అయిపోతుందేమో అనే ఆలోచనే కాని ఇంత ఎనాలసిస్ చేయాలనే ఆలోచనే రాలేదు ........... అయినా ఎనాలిసిస్ చేద్దాము అనుకున్నా నాకు అంత సీన్ లేదనుకోండి ... కాని తెలుసుకోవాలనే విషయం కూడా తెలియలేదు ...ముందుగా మీకు ధన్యవాదములు

శివరంజని said...

ఈ పోస్ట్ లో రాసినా అన్ని విషయాలు కొత్తగానే ఉన్నాయి ఏ విషయం నాకు తెలియదు మీ ఆహారపు అలావాట్లతో సహా

అస్సలు చెప్పాలంటే వేగాన్స్ అనేవారు ఉంటారని నాకు తెలియనే తెలియదు ..ఎప్పుడూ వినలేదు ...అబ్బా వింటుంటే వేగాన్స్ అనే వారు ని చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది కనీసం పాలు తేనే లాంటివే కాదు కనీసం ఉన్ని కూడా వాడకపోవడం అనేది చాలా చిత్రమైనదే..............

మీ పోస్ట్ ద్వారా తెలుసుకున్న కొత్త పాయింట్స్ ఇక్కడ కోట్ చేస్తున్నా

1ఈ వెజిటేరియనిజం అన్నది భలే చిత్రమయిన కాన్సెప్ట్. అంటే వెజిటేరియన్స్ లోనే బోల్డు రకాల వెజిటేరియన్స్ ఉంటారన్నమాట. ఇందులో వేగన్స్ (vegans) అనేవారు నిక్కచ్చైన అసలు సిసలయిన శాకాహారులు.
2.ఇక వెజిటేరియన్స్ లో లాక్టో వెజిటేరియన్స్ అనే ఇంకో రకం ఉంటారు అలాగే ఓవోవెజిటేరియన్స్ అనబడే మరో రకం వెజిటేరియన్స్ ఇంకా చాలా రకాల వెజిటేరియన్స్ ఉంటారు. మళ్ళీ వీటిల్లోనే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి కొందరు ఓవో-లాక్టో వెజిటేరియన్స్ ఉన్నట్టన్నమాట. మన దేశంలో ఉండే వెజిటేరియన్స్ లో మెజారిటీ లాక్టో వెజిటేరియన్స్ ఉంటారు.
3.అయితే ఈ పాల ఉత్పత్తిదారులు వారి లాభం కోసం, అధిక డిమాండ్ ని అందుకోవడం కోసం పాలు ఉత్పత్తి చేసే ఆవులు గేదెల లాంటి జంతువులను అవి బ్రతికినంత కాలం ఎప్పుడూ ప్రెగ్నెంట్ గా ఉండేలా చూస్తారు. అవి ప్రెగ్నెంట్ అవడం కోసం ఉపయోగించే పద్ధతులు కూడా దారుణంగా ఉంటాయి. వాటిని ఇంప్రెగ్నేట్ చెయ్యడానికి ఉంచే బ్రీడిండ్ స్టాండ్ లను వేగన్స్ రేప్ ర్యాక్ లు అని పిలుస్తారు. ఎందుకంటే వాటి ఇష్టాయిష్టాలకి వ్యతిరేకంగా మనుషుల ఆధ్వర్యంలో బలవంతంగా జరిగే ప్రక్రియ కాబట్టి. ఉదాహరణకి బజార్లో దొరికే అనేక రకాల చీజ్‌ల తయారికి రెన్నేట్ అనే ఎంజైమ్ అవసరం. ఈ ఎంజైమ్ ని చిన్న వయస్సు ఉన్న ఆవుదూడలను చంపి వాటి పొట్టలోనికొన్ని పొరల్లో నుండి సేకరిస్తారు. మన ఇండియాలో ఉండే అమూల్ ఉత్పత్తుల్లో అయితే కొన్ని రకాల నాచు నుండి డెవెలప్ చేసిన Microbial rennet వాడతారు కానీ ప్రపంచ వ్యాప్తంగా అయితే చాలా వరకు ఆవు దూడల నుండి తీసిన రెన్నేట్ ఎక్కువ వాడతారు

4..అలాగే మన ఇండియన్ స్వీట్ల మీద వాడే వెండి పూతలు (వర్క్ అంటారు) ఉంటాయి కదా.. అవి కూడా అంత పలుచని పొరగా రావడానికి కొన్ని జంతువుల పొట్ట చర్మం మీద కొట్టి తయారు చేస్తారు. >>>>>> వాటిని సిల్వర్ పాయల్ అని అంటారనుకుంటాను అండి అవి ఇలా చేస్తారా నేనింకా పేపరేమో అనుకున్నా