*** శ్రీ రామ ***
అలా ఉండగా ఒక రోజు ...
ట్యూషన్
లో కునికిపాట్లు పడుతూ మా శర్మగారు చెప్పేది వింటూనట్టు ఏక్షన్ చేస్తూ చాలా బిజీగా వున్నా .. ఎప్పుడయినా నేను ట్యూషన్ లో కునికిపాట్లు పడుతూవుంటే నన్ను గాఠిగా గిల్లరా మా బాచిగాడికి చెప్పా. ఆరోజు వాడూ నిద్రపోతున్నాడు. ఇంతలో ముందు బెంచినుండి " నీ విభాగిని ఒకసారి ఇస్తావా.. లెక్క చేసి
మళ్ళి ఇచ్చేస్తాను " అని ఒక కోకిల గొంతు వినిపించింది.. తల పైకెత్తి చూసా ... నిద్ర పూర్తిగా ఎగిరిపోయింది.. రెండు ముళ్ళు వున్నదాన్ని 'విభాగిని'
అంటారని , అసలు దాన్ని ప్రజలు వాడతారని అప్పటివరకు నాకు తెలీదు.. అవి
తెలీకపోయినా పర్లేదు.. అంత అందమయిన అమ్మాయి మా ట్యూషన్ లో వుందని , స్కూల్లో తను మా
సేక్షనే అని కూడా తెలీని దద్దమ్మని నేను.. నా దగ్గర కాంపస్ బాక్స్ లేదని సిగ్గుపడుతూ తనకి చెప్పి పక్కకి తిరిగి ...
" ఆ అమ్మాయి ఎవర్రా " మా బాచిగాడిని కుదుపుతూ అడిగా...
" ఆ అమ్మాయి నాగలక్ష్మి రా .. మీ సేక్షనే కదా నీకు తేలీదా".. "కరెంట్ అఫైర్స్ " మీద నాకున్న పరిజ్ఞానానికి జాలిగా చూస్తూ చెప్పాడు వాడు ..
" )(@$_)*;!^@ "
నాగలక్ష్మి మొదటి చూపులోనే నాకు తెగ నచ్చేసింది .. అసలు అమ్మాయిలు అంత అందంగా వుంటారా అన్నంత.. ఆ.. ఆ ఏజ్ లో.. అందులోనూ మొదటి లవ్ ఎవరికయినా అలాగే వుంటుంది బాబూ అని దీర్ఘాలు తీస్తున్నారా ..:-)) . ఏంటో ఆరోజు మా దామోదరశర్మ గారు కూడా పాఠాలు బాగా చెబుతున్నారనిపించింది (నాకేమి అర్ధం కాకపోయినా).. నా డొక్కు సైకిల్
మీద వెళ్తుంటే గాలిలో తేలుతున్నట్టుంది... జుట్టు దువ్వుకోవడానికి ఇంకో
గంట ముందు లేపలేదని మా అక్క మీద కోపమొచ్చింది. (నా జుట్టు సరిగ్గా
దువ్వాలంటే మినిమం గంట పడుతుంది.. ఏదో స్టాటిక్ ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు ఎప్పుడూ పైకి నుంచునే వుంటుంది.. మరీ ముళ్ళపందిలా కాదులెండి ) ...
మొత్తం
మీద నాగలక్ష్మి ఇల్లు కనుక్కున్నా(ము). తను వుండేది మాకు నాలుగు వీదులవతల.. వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మా వూరు కొత్తగా
వచ్చారన్నమాట..తను నాతో తెగ మాట్లాడేసినట్టు, మేమిద్దరం ఏవో పుస్తకాలు
ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నట్టు ఏవో ఊహలు.. కలలు.. (అప్పటికింకా
చిన్నపిల్లాడిని కదా. అందుకే పుస్తకాల వరకే ఆలోచించగలిగా :-)).. ఏంటో
ప్రపంచం అంతా కలర్ ఫుల్ గా వుండేది.. అంతకుముందు ఎవరయినా తిక్క పని చేస్తే
మాంచి కోపం వచ్చేది .. కానీ అప్పుడు కోపం స్తానే జాలి కలగడం మొదలయ్యింది.. ముఖానికి పౌడర్ రాసుకోవడం లాంటి విపరీత చర్యలు , పొద్దున్నే ఐదుగంటలకి లేవడం లాంటి వైపరిత్యాలు .. ఒకటేమిటి .. శంకర్ దాదా లో చిరు లైలా సాంగ్ లో చెప్పినట్టు అలవాటు లేని మంచి పనులు అన్నీ ఒకేసారి సడన్ గా మొదలు
పెట్టాను.. కానీ ఒక్కసారి కూడా మాట్లాడటానికి దైర్యం సరిపోలా.. (నా
రీఫిల్ అయిపొయింది నీ దగ్గర ఇంకో పెన్ను వుందా అని ఒకసారి అడిగా లెండి) ..
* * *
" ఒరేయ్ .. తాడిలా వున్నావ్ ఆ గేటు ఎక్కి ఊగకపోతే..దాన్నలా తిన్నగా ఉంచొచ్చు కదా .." అమ్మ ఎవర్నో తిడుతుంది....
ఏంటో అమ్మకీమద్య కోపం బాగా ఎక్కువయింది అని నవ్వుకున్నా ..మా గేటు మీద ఊగుతూ.. (నేను ఇంజినీరింగ్ మూడో సం|| వచ్చేవరకు మా గేటు మీద ఎక్కి అటూ ఇటూ వుగేవాడిని.. అదో హాబి చిన్నప్పుడు..) ..
ఇంతలో మా ఇంటి ఎదురు కిరాణా సత్యనారాయణ కొట్లో ఏవో కొనడానికి సైకిలు వేసుకుని వచ్చింది తను .. నాకు ఆశ్చర్యం వల్ల కలిగిన సిగ్గుతో కూడిన సంతోషం తన్నుకొచ్చింది.. ఆ సంతోషం లో గేటు మీద నుండి తూలి కింద డ్రైన్ లో పడబోయి ..పక్కనున్న పిట్టగోడని పట్టుకుని ఎలాగోలా ఆపుకుని మొత్తం మీద గేటు మీంచి కిందకి దిగా.. మనం చేసిన ఫీట్లు చూసి ఒక చిరునవ్వు విసిరి కొట్లోకి వెళ్ళింది.. ఆ నవ్వుకి ఫ్లాట్ అయిపోయి బయటకు ఎప్పుడొస్తుందా అని కాలు కాలిన పిల్లిలా అటూ ఇటు తిరుగుతున్నా..

ఈ లోపు ఇంట్లోంచి మా అక్క బయటకు వచ్చి అక్కడే నిలబడి చూస్తోంది.. బట్టలు పిండటంలో సహాయం చెయ్యకుండా వీదిలో ఎంచేస్తున్నావ్ అని ఆ టైంకి ఎప్పుడూ మా అక్కని తిట్టే మా అమ్మ ...ఈ రోజేందుకు ఇంకా అక్కని పిలవడం లేదని కోపం వచ్చింది.. ఆఖరుకి మా అక్క ఉండగానే తను బయటకి వచ్చింది.. రాగానే మా అక్కని చూసి నవ్వుతూ పలకరించింది .. ఆ తరువాత మీ ఇల్లు ఇదేనా అని నన్ను అడిగింది.. అవును అన్నట్టు తలకాయ్ ఊపా (సాధారణంగా నేను తలకాయ్ ఊపితే అది 'అవునో' 'కాదో' ఎవరికీ ఒక పట్టాన అర్ధం కాదు.. ఒకసారి మా యూ ఎస్ మేనేజర్ అడిగాడు .. "నిలువుగా ఊపితే 'అవునని'... అడ్డంగా ఊపితే 'కాదని'.. నాకు తెలుసు.. కానీ నువ్వేంటి గుండ్రంగా ఊపుతావ్.. దాని అర్ధం ఏమిటి అని ). ఆ తరువాత మా అక్క ఏదో అది ఇది సోది మాట్లాడి , మొత్తానికి ఇంట్లోకి పిలిచింది.. మొదటిసారి సోదరి ప్రేమ ఆంటే ఏమిటో నాకు తెలిసొచ్చింది.. అలా మా అక్క దయవల్ల మొదలైన మా పరిచయం .. అవసరం వున్నా లేకపోయినా ఒకరి నోట్సులు ఒకరు తీసుకోవడం (నా నోట్సు తీసుకుందంటేనే చెప్పొచ్చు..ఎంత కామేడినో :-) ) , హ్యాపీ న్యూ ఇయర్ శుబాకాంక్షలు కాస్ట్లీ గా మారడం.. ఎప్పడూ వాళ్ళ వీదిలో సైకులేసుకుని రౌండ్లు కొట్టడం.. నేను కొట్టిన బెల్ కి తను బయటకు రావడం.. (అదే కోడ్ మాకు)..
ఒకసారి బెల్ కొడితే వాళ్ళ పోర్షన్ కుక్క బయటకు వచ్చింది.
"లవ్ అట్ ఫస్ట్ బైట్ " అంటూ నా వెంటపడిన ఆ వెధవ కుక్కని తప్పించుకోవడానికి ఎంత స్పీడ్ గా సైకిల్ తొక్కానో.. అదే స్పీడ్ ఇంకొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసివుంటే "Tour de France" కి సెలెక్ట్ అయిపోదును... మా బాచిగాడికి , నాకు ఒకటే సైకిల్.. ఎప్పుడూ నువ్వు తొక్కు ఆంటే నువ్వు తొక్కు అని ఆఖరికి ఇద్దరం సైకిల్ కిందపాడేసి దాన్ని తోక్కేవాళ్ళం.. అలాంటిది.. నాగలక్ష్మి వాళ్ళ వీదిలోకి వెళ్ళడానికి.. 'తోడురారా బావా' అని నేనే తొక్కుతూ తీసుకెళ్ళి.. వాళ్ళ వీది చివర్లో సీట్లు మారి.. నేను వెనుక కూర్చుని , మళ్లీ వీదిలోనుండి బయటకు రాగానే మళ్లీ నేను తోక్కేవాడిని.. తనముందు నేను తోక్కికే నామోషి కదా.. :-)) పది లొనే ఇంత ముదిరిపొతే ఆ తరువాత ఇంకెంత వెలగబెట్టా అనుకుంటున్నరా.. తర్వాత చెప్తాలే...
ఇంతలో మా ఇంటి ఎదురు కిరాణా సత్యనారాయణ కొట్లో ఏవో కొనడానికి సైకిలు వేసుకుని వచ్చింది తను .. నాకు ఆశ్చర్యం వల్ల కలిగిన సిగ్గుతో కూడిన సంతోషం తన్నుకొచ్చింది.. ఆ సంతోషం లో గేటు మీద నుండి తూలి కింద డ్రైన్ లో పడబోయి ..పక్కనున్న పిట్టగోడని పట్టుకుని ఎలాగోలా ఆపుకుని మొత్తం మీద గేటు మీంచి కిందకి దిగా.. మనం చేసిన ఫీట్లు చూసి ఒక చిరునవ్వు విసిరి కొట్లోకి వెళ్ళింది.. ఆ నవ్వుకి ఫ్లాట్ అయిపోయి బయటకు ఎప్పుడొస్తుందా అని కాలు కాలిన పిల్లిలా అటూ ఇటు తిరుగుతున్నా..

ఈ లోపు ఇంట్లోంచి మా అక్క బయటకు వచ్చి అక్కడే నిలబడి చూస్తోంది.. బట్టలు పిండటంలో సహాయం చెయ్యకుండా వీదిలో ఎంచేస్తున్నావ్ అని ఆ టైంకి ఎప్పుడూ మా అక్కని తిట్టే మా అమ్మ ...ఈ రోజేందుకు ఇంకా అక్కని పిలవడం లేదని కోపం వచ్చింది.. ఆఖరుకి మా అక్క ఉండగానే తను బయటకి వచ్చింది.. రాగానే మా అక్కని చూసి నవ్వుతూ పలకరించింది .. ఆ తరువాత మీ ఇల్లు ఇదేనా అని నన్ను అడిగింది.. అవును అన్నట్టు తలకాయ్ ఊపా (సాధారణంగా నేను తలకాయ్ ఊపితే అది 'అవునో' 'కాదో' ఎవరికీ ఒక పట్టాన అర్ధం కాదు.. ఒకసారి మా యూ ఎస్ మేనేజర్ అడిగాడు .. "నిలువుగా ఊపితే 'అవునని'... అడ్డంగా ఊపితే 'కాదని'.. నాకు తెలుసు.. కానీ నువ్వేంటి గుండ్రంగా ఊపుతావ్.. దాని అర్ధం ఏమిటి అని ). ఆ తరువాత మా అక్క ఏదో అది ఇది సోది మాట్లాడి , మొత్తానికి ఇంట్లోకి పిలిచింది.. మొదటిసారి సోదరి ప్రేమ ఆంటే ఏమిటో నాకు తెలిసొచ్చింది.. అలా మా అక్క దయవల్ల మొదలైన మా పరిచయం .. అవసరం వున్నా లేకపోయినా ఒకరి నోట్సులు ఒకరు తీసుకోవడం (నా నోట్సు తీసుకుందంటేనే చెప్పొచ్చు..ఎంత కామేడినో :-) ) , హ్యాపీ న్యూ ఇయర్ శుబాకాంక్షలు కాస్ట్లీ గా మారడం.. ఎప్పడూ వాళ్ళ వీదిలో సైకులేసుకుని రౌండ్లు కొట్టడం.. నేను కొట్టిన బెల్ కి తను బయటకు రావడం.. (అదే కోడ్ మాకు)..
ఒకసారి బెల్ కొడితే వాళ్ళ పోర్షన్ కుక్క బయటకు వచ్చింది.
"లవ్ అట్ ఫస్ట్ బైట్ " అంటూ నా వెంటపడిన ఆ వెధవ కుక్కని తప్పించుకోవడానికి ఎంత స్పీడ్ గా సైకిల్ తొక్కానో.. అదే స్పీడ్ ఇంకొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసివుంటే "Tour de France" కి సెలెక్ట్ అయిపోదును... మా బాచిగాడికి , నాకు ఒకటే సైకిల్.. ఎప్పుడూ నువ్వు తొక్కు ఆంటే నువ్వు తొక్కు అని ఆఖరికి ఇద్దరం సైకిల్ కిందపాడేసి దాన్ని తోక్కేవాళ్ళం.. అలాంటిది.. నాగలక్ష్మి వాళ్ళ వీదిలోకి వెళ్ళడానికి.. 'తోడురారా బావా' అని నేనే తొక్కుతూ తీసుకెళ్ళి.. వాళ్ళ వీది చివర్లో సీట్లు మారి.. నేను వెనుక కూర్చుని , మళ్లీ వీదిలోనుండి బయటకు రాగానే మళ్లీ నేను తోక్కేవాడిని.. తనముందు నేను తోక్కికే నామోషి కదా.. :-)) పది లొనే ఇంత ముదిరిపొతే ఆ తరువాత ఇంకెంత వెలగబెట్టా అనుకుంటున్నరా.. తర్వాత చెప్తాలే...
ఏదో అలా బిజీ బిజీ గా గడిచిపోతున్న టైం లో ఒక రోజు మా బాచిగాడు వచ్చి .. ఒరేయ్ మా చేల్లి అంత అందంగా వుంటుంది కదా (చెల్లెలో, అక్కో అనాలని మా ఇద్దరిమద్య ఒప్పందం) ... మన స్కూల్ లో ఇంకెంత మంది ట్రై చేస్తున్నారో అని, నా గుండెలో పెద్ద బండరాయ్ పడేసి, వాడు తాపీగా చేరుగ్గడ తింటున్నాడు.. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే వాడే ఒక ఐడియా (జీవితాన్నే మార్చేసే) చెప్పాడు.. ఇలా ఎన్నాళ్ళెహే.. ఒక లవ్ లెటర్ రాసెయ్ అని ..
ఇదేదో బాగానే వుంది ..సరే అలాగే రాసెద్దాం అని కూర్చుంటే.. దానికన్నా నా క్లాస్ ఎగ్జాంసే ఈజీ అనిపించింది.. మొత్తం మీద నా సిని, వారపత్రికల పరిజ్ఞానం ఉపయొగించి (ఛ..ఇంటర్నెట్ అప్పుడు లేదు). ఒక లవ్ లెటర్ రాసా.. చెప్పుకోకూడదు కానీ.. అది నాకే పిచ్చపిచ్చగా నచ్చేసింది :-)) .. రాసిన లెటర్ తన డెస్క్ లో పెట్టా..
ఆరోజు సాయింత్రం క్రికెట్ గ్రౌండ్ లోకి మా క్లాస్మేట్ వెంకటేష్ (అసలు పేరు
వెంకటేశులు) గాడు , వాళ్ళ బాచ్ తో వచ్చాడు.. నా సుడి బాగోక అప్పుడు బౌండరీ
లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నా.. వస్తూనే నన్ను పట్టుకి ఒక నాలుగు పీకులు
పీకి .. వెళ్ళిపోతూ "మళ్ళి నాగలక్ష్మి వైపు చూస్తే మళ్ళీ మళ్ళీ తగులుతాయి" అని ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు.. నా లెటర్ విషయం తెలీక , విషయం ఏమీ
అర్ధం కాక వెంటనే వాడిని తన్నడానికి మా బాచ్ బయలుదేరింది.. మొత్తం మీద
ఒకరినొకరు కొట్టేసుకున్నాక తేలిందేమిటంటే.. మా క్లాస్లో ఇద్దరు
నాగలక్ష్మిలున్నారని. నేను లెటర్ ఇద్దామనుకున్నది N నాగలక్ష్మి కైతే .. అది డెస్క్ నుండి తీసుకున్నది ఆ వెంకేటేష్ గాడు లైనేసే S. నాగలక్ష్మి అని, అంతే కాక ఇంకేమి అర్ధం అయ్యిందంటే లవ్ లెటర్ లో ఇంటిపేరు తో సహా పూర్తి TO అడ్రస్ రాయాలని , FROM పేర్లు, అడ్రస్లు రాయకూడదని ..
అలా
లవ్ లెటర్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాక .. కొన్నాళ్ళు మళ్ళి ఆలోచించలేదు..
ఆ తరువాత మళ్ళీ ఇంకో లెటర్ .. ఆ తరువాత ఇంకో లెటర్ ... అలా రాసి ఆ డెస్క్
లో పెట్టడం , రిప్లై కోసం ఎదురు చూడటం.. మొత్తానికి దేనికీ రిప్లై
రాకపోవడంతో విసుగొచ్చి మానేసా.. అడగాలంటే భయం.. అలా పదో క్లాసు పూర్తి
అయ్యింది .. ఆఖరు పరీక్ష.అయిపోయాక సాయింత్రం అందరూ సినిమాకి వెళ్ళాం..
అప్పుడు కాస్త మేనేజ్ చేసి తన పక్కన కూర్చున్నా.... అప్పుడు చెప్పింది.. వాళ్ళకి
మళ్ళి ట్రాన్స్ఫర్ అయిందని, త్వరలో మావూరు వదలి వెళ్ళిపొతున్నారని .. (వాళ్ళ నాన్నగారు 'రణం' సినిమాలో ప్రకాష్ రాజ్ టైప్ అనుకుంటా.. ఎప్పుడూ ట్రాన్స్ఫర్స్ అవుతుండేవి
) .. అలాగే నేను రాసిన లెటర్స్ అన్నీ తనదగ్గరే వున్నాయని.. అవి చాలా
నచ్చాయని.. ... కానీ .... (ఆ " కానీ " కి అర్ధం మీకు తెలుసు కదా)
అంతే నా రంగుల ప్రపంచంలో సడన్‌గా కరెంటు పోయింది.. నా ఆశల పందిరి కూలిపోయింది... బాలయ్య నిప్పురవ్వ రిలీజ్ అయ్యింది.. ఇలా చాలా ఘోరాలు
ఒక్కసారే జరిగిపోయాయి .. పరీక్షలయ్యాయన్న ఆనందం, రేపట్నుండి 24 గంటలు
క్రికెట్ ఆడోచ్చన్న ఉత్సాహం అన్నీ ఆవిరయిపోయాయి .. తను వెళ్లిపోయాక
కొన్నాళ్ళు ఆ వీదిలోకే వెళ్ళడం మానేసా.. గెడ్డం పెంచేద్దమనుకున్నా కానీ
అప్పటింకా గెడ్డం రాలేదని ఆ ఆలోచన విరమించుకున్నా.. పాపం నేను :-( ... ఆ తరువాత చదువులో
పడిపోవడం ..కాలేజీ ఫ్రెండ్స్ రావడంతో కొంతకాలానికి మర్చిపోయా ...
అది జరిగిన కొన్ని సంవత్సరాలకి ,
సెమిస్టరు హాలిడేస్ లో మా ఊరు వచ్చినప్పుడు వుండే డైలీడ్యూటీకి ( డిగ్రీ కాలేజీ అమ్మాయిలకి బీట్ కొట్టడం) వెళ్ళా .. గేటు దగ్గర మా ఫ్రెండ్స్ అందరం సొల్లు కొట్టుకొంటూ వచ్చే పోయే అమ్మాయలను చూస్తున్నాం .. ఇంతలో సడన్ గా తనే నడుచుకుంటూ కాలేజ్‌లొ నుండి బయటకు వస్తోంది ... ఆశ్చర్యం .. ఆనందం.. అన్నీ కలసి ..వెంటనే వెళ్లి..
సెమిస్టరు హాలిడేస్ లో మా ఊరు వచ్చినప్పుడు వుండే డైలీడ్యూటీకి ( డిగ్రీ కాలేజీ అమ్మాయిలకి బీట్ కొట్టడం) వెళ్ళా .. గేటు దగ్గర మా ఫ్రెండ్స్ అందరం సొల్లు కొట్టుకొంటూ వచ్చే పోయే అమ్మాయలను చూస్తున్నాం .. ఇంతలో సడన్ గా తనే నడుచుకుంటూ కాలేజ్‌లొ నుండి బయటకు వస్తోంది ... ఆశ్చర్యం .. ఆనందం.. అన్నీ కలసి ..వెంటనే వెళ్లి..
వెంటనే తను నవ్వుతూ...
" నేను నాగలక్ష్మి చెల్లెల్నండి.. మీరు నాకు తెలుసు ..మా అక్క ఫ్రెండ్ కదా.. మా అక్క కోసం మా వీదిలొ ఎప్పుడూ తిరుగుతూ వుండేవారు .. ఒకసారి కుక్క వెంటబడింది కూడా.. మా అక్కకి పెళ్ళయిపొయిందండీ. పాలకొల్లు లొ వుంటుంది... ఏదో చెప్తుంది.....
" @*-@$)*$@) " అనుకుంటూ నేను వెనక్కి..
( సమాప్తం)
మంచు
30 comments:
హతవిధి!
కష్టాలు మనుషులకు రాక మార్తాండకు ఇన్నయ్యకు వస్తాయా చెప్పండి. గుండె దిటువు చేసుకోవాలి.
ఐనా స్కూల్ లోనే ఇలా ఉన్నారంటే కాలేజీలో ఎలా ఉండుంటారో నేనూహించగలను. ఏదో ఆ ఖరగ్పూర్ జెయిలుకు పోయారు కాబట్టి సరిపోయింది లేకుంటే ఏమేం జరిగేవో!!!
కొంపదీసి జల్సా మూవి లో పవన్ లా అక్క పెళ్ళయిపోయింది కదా అని చెల్లెల్ని ప్రేమించారా ఏమిటీ.. ఏమో బాబు నాకు డవుటే మీ మీద :)
:))..ఫన్నీ గా ఉంది.అంతా మన మంచికే లెండి,
10th లో మిస్స్ అయితే అయ్యారు :) .ఇంటర్,డిగ్రీ,పీజీ కధలు చెప్పెయ్యండింక.అప్పటికి ముదిరిపోయి ఉంటారు కదా, 10థ th క్లాస్ కే లెటర్ రాసే ధైర్యం వచ్చిందంటే..మీ ప్రేమ కధల ధారావాహిక మొదలెట్టండి మరి
ఆహా... మీ కధ, దానికి అనుగుణంగా తగిలించిన బొమ్మలూ రెండూ బాగున్నాయి.
ఈ అమ్మాయిలున్నారే వీళ్ళసలు మన ప్రేమని అర్ధం చేసుకోలేరు. మనం ప్రేమించాక(పోనీ ఫెయిలయ్యాక) ప్రతీ అమ్మయిలోనూ వాళ్ళనే వెతుకుతుంటామా? వీళ్ళు మాత్రం మొగుణ్ణి వెతుక్కుని వళ్ళిపోతారు :)
10th class ప్రేమ కధ లన్నీ ఇలాగే end అవుతాయేంటి?
బాగుంది మీ ప్రేమకధ.
Annimated cat blog లో ఎలా పెట్టాలో కొంచెం నేర్పిస్తారా?
hilarious....I could see a Jandhyaala early day film with allari naresh as hero. You might turn out to be a good film writer...just a guess
LOL
మీ శైలి అదిరింది.
" అప్పటికింకా చిన్నపిల్లాడిని కదా. అందుకే పుస్తకాల వరకే ఆలోచించగలిగా :-))"
మీ ఇంటర్, ఆ పై అనుభవాలు ధైర్యంగా చదవగలమా? :))
చాలా బాగా రాసారు
ఇవి సూపర్
"రెండు ముళ్ళు వున్నదాన్ని 'విభాగిని' అంటారని , అసలు దాన్ని ప్రజలు వాడతారని"
ఈవిషయం నాకూ తెలిసేది కాదండి అప్పట్లో ఆత్మరక్షణ కోసం బాక్స్ లో పెట్టారేమో అనుకొనేవాణ్ణి.
"నేను తలకాయ్ ఊపితే అది 'అవునో' 'కాదో' ఎవరికీ ఒక పట్టాన అర్ధం కాదు.." :)
"లవ్ లెటర్ లో ఇంటిపేరు తో సహా పూర్తి TO అడ్రస్ రాయాలని , FROM పేర్లు, అడ్రస్లు రాయకూడదని .." :)
"మొదటిసారి సోదరి ప్రేమ ఆంటే ఏమిటో నాకు తెలిసొచ్చింది.." :)
:)
నేస్తం గారి ప్రశ్నే నాది కూడాను!
Same Jalsa question from me three :-p
దుమ్ము లేపేస్తున్నారు మంచు గారు :-) చాలా బాగా ప్రజంట్ చేస్తున్నారు. సరదా ఐనా సీరియస్ అయినా నాకు నేనే సాటి అనేలా రాసేస్తున్నారు :-)
:-) :-).
>>"ఆ " కానీ " కి అర్ధం మీకు తెలుసు కదా"
ఆ "కానీ" కి అర్థం నాకు తెలియదు. :-((. ఆ అర్థమేదో మీరే చెప్పెయ్యండి లేదా ఎవరికైనా అర్థమైతే చెప్పండి బాబు దయచేసి. ఏపి ట్రాన్స్‌కో ను నమ్ముకోకుండా, జెనరేటర్ తెచ్చి వేసినా వెలగదు నా బల్బు ఇట్టాంటి విషయాల్లో. :-(.
రచ్చ రచ్చ
కుమ్మేసారు
ట్విస్ట్ లు భలే వున్నాయి
మీ narration కేక
చాలా బాగుంది...మీరు ఇలాంటి టపా అవలీలగా రాసేసారని నాక్కొంచెం కుళ్ళుగా కూడా ఉంది...మొదటి భాగం కంటే( అంటే మీరు యువ నెరేషన్ తీసుకున్నారు కదా..అందుకే కొంచెం కష్టపడ్డాను) ఇదే స్మూత్ ఫ్లోతో చక్కగా సాగిపోయింది. తొందరగా మీ ఆటోగ్రాఫ్ లోని ఒక్కొక్క అమ్మాయి గురించి చెప్పేస్తే పనిలో పనిగా నేను కూడా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాను.
భలే నవ్వించారండి. నా విషాద గాధ చూస్తే నవ్వోస్తోందా అని కళ్ళెర్రచెయ్యకండేం. అన్నట్టు నాకూ నేస్తం కి వచ్చిన అనుమానమే వచ్చింది...:D
మీరు పెట్టిన బొమ్మలు చాలా బవున్నాయ్. ముఖ్యం గా కాలు కాలిన పిల్లి...దాన్ని చూడ్డం ఇదే మొదటిసారి :D
చల ఫన్నీ అండి
Cool
@ కార్తీక్: ఎన్ని కస్టాలొ.. పాపం నేను :-(( అవును ఖరగ్పూర్ లొ నాకు ఆ చాన్స్ ఎవ్వలేదు అక్కడి ప్రొఫ్ లు.. ఎంత సేపు అస్సైన్మెంట్స్, టెస్ట్లు అని ప్రాణం తొడేసావారు..
@ నేస్తం : ఆ... హా.. ఎంత నమ్మకం నామీద.. మీరు అన్నదే కాకుండా కింద ఎంతమందికి హింట్ ఇచ్చారొ చూడండి.
@ థాంక్యూ రిషి.. ధారావాహికా .. :-))
@ ఇండియన్ మినర్వా : థాంక్యూ.. ఎం చేస్తాం చెప్పు.. అదంతా మనమిచ్చిన లొకువే కదా :-)
@ నీహారిక : ధన్యవాదాలు, పదొతరగతి లొ ప్రేమలు ఇంతకన్న దాటి ముందుకెళ్ళడం చాలా అరుదు.. అయినా టెంత్ లోనే దొరికిపొతే ఎలా ..
@ ఆంధ్రుడు.. మీరు మరీను :-)) .. థేంక్యూ
@ మలక్ : థాంక్యూ..
@ జీవనిగారు : నిన్నే మిమ్మల్ని వెరే బ్లాగులొ తలచుకున్నా.. థేంక్స్ అండి.. ఇంటర్ ఆ పై అనుభవాలు చదవగలరా అంటారా :-)) చదవగలరు లెండి. :-))
@ గల గల గొదావరి గారు : థాంక్యూ..
@ గణేష్ : :-))
@ వేణు : :-)) .. థాంక్యూ
@ నాగా : ఊరుకొ.. నీకు అన్ని సక్సెస్స్లు కాబట్టి ... కానీలు, అర్ధణాలు తెలీవు.. అందరికీ నీలా వెంటనే "ఓ యెస్" అన్న సమాధానం వచ్చేస్తుందెమిటి :-))
@ హరే కృష్ణ : థాంక్యూ :-))
@ శేఖర్ : ఈ యువ గొడవెంటండి బాబు.. నేను మూడు కలలు రాసి.. మొదటి కలలొనే అతని పేరు చెప్పెస్తే మిగతా రెండు కలలు వీక్ అయిపొతాయని.. అలా విడగొట్టా.. అంత కఫ్యుజింగా వుందా :-(( ఇంకా పిచ్చ కంఫ్యుజింగ్ పొస్ట్ ఒకటి రాద్దామనుకున్న.. అయితే అలొచించాలి
@ స్పురిత : -)) అప్పుడు విషాధ గాధే కానీ ఇప్పుడు తీపిగుర్తులు :-)) . కాలుకాలిన పిల్లిని చూడలేదా :-)) .. ఎదొ నేస్తం గారికి నా మీద అభిమానం కొంచెం ఎక్కువ అందుకే నా మీద అంత నమ్మకం..
@ మిరియప్పొడి : థాంక్యూ.. మీ పేరు బావుంది :-))
@ అనానిమస్ గారు : థాంక్యూ
హ హ హా బాగున్నాయి మీ పాట్లు అంతే నండీ మీ పాట్లు మాకు నవ్వు. ఏమిటీ మా వూరేమి చేసింది మధ్యలో. బతుకు బందరు బస్టాండు అయ్యింది అంటారు? మా వూరు బస్టాండూ సుబ్బరం గా వుంటూంది. :-\
మీ ఫ్లాష్ బాక్ లో నాలుగైదు సినిమాల కథలు కనపడుతున్నాయి.
వెరీ ఇంట్రస్టింగ్.
హ హ ..చాలా బాగా రాసారు..ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నేను ఓ కథ రాద్దామనుకున్నాను..చూడాలి..మొత్తానికి సూపర్ ఉంది బొమ్మలతో సహా...నాగలక్ష్మి చెల్లెలిని ట్రై చేయ్యకపోయారా, మీరు చెప్పిన దాన్నిబట్టి ఇద్దరు ఒకేలా ఉన్నారేమో కదా??..
మీ శైలి బాగుంది.
మీ టపా నవ్వించింది.
@ భావన గారు: అంధ్రాలొ బందరు బస్టాండ్.. కర్నాటక లొ కాలాసిపాల్య.. అందుకే ఫేమస్..:-)) థాంక్యూ
@ బొనగిరి గారు: ఎం సినిమాలు అండి అవి.. నా కథ ని ఫ్రీగా వాడేసుకున్నందుకు కేసేద్దాం :-))
@ కిషన్ గారు: థాంక్యూ .. ఇది జరిగింది విలేజ్ లొ కాదండి.. పట్టణం లొనే.. అవును ..బ్రహ్మ దెవుడు తన చెల్లెల్ని డెజైన్ చేసేటపుడు కాస్త బద్దకం వచ్చి.. నాగలక్ష్మి డిసైన్ నే జిరాక్స్ తీసి ఇచ్చెసి వుంటాడు.. ఇద్దరు ఒకేలా వుంటారు..
@ అమ్మవొడి గారు : ధన్యవాదాలు :-))
ఇక్కడ "యెస్" చెప్పాల్సింది నేను. :-((. అయినా, నా సంగతి ఎందుకులే గానీ, మీరు రాసిన మొదటి ప్రేమలేఖను పోస్ట్ చెయ్యండి. :-)).
>>"ఒక లవ్ లెటర్ రాసా.. చెప్పుకోకూడదు కానీ.. అది నాకే పిచ్చపిచ్చగా నచ్చేసింది."
ఆ వయసులో మీరు ఎలా రాశారో, మీకెందుకు ఆ లెటర్ పిచ్చ పిచ్చగా నచ్చేసిందో, ఆ లవ్ లెటర్ మీద అప్పట్లో ఏ చిరంజీవి/బాలకృష్ణ సినిమా ప్రభావముందో గట్రా విషయాలన్నీ పరిశోధన చేసి, థీసిస్ సబ్మిట్ చెయ్యాలనుకుంటున్నా. :-))).
మొత్తానికి మంచుపల్లకి గారిని ఊహల పల్లకి ఎక్కించేసింది నాగలక్ష్మి...ఈ పోస్ట్ చూస్తుంటే మీ ఖాతా లో ఇంకెంత మంది ప్రసన్నలక్ష్మిలు,సుబ్బలక్ష్మిలు ఉన్నారో అనిపిస్తోంది.... :) వారి గురించి కూడా త్వరగా రాసేయండి మరి ......!!!!!!
ఈ టపా నేను ఎలా మిస్ అయ్యనబ్బా??
మొత్తానికి మీ మొదటి ప్రేమకథ మీకు దుఃఖాన్ని మిగిల్చి మాకు నవ్వుల్ని పంచిందన్నమాట :)
@ నాగా.. అలాగాలాగే.. స్కాన్ చేసి పెడతా :-)) కానీ అవి కాపీరైట్ ప్రొటెక్టెడ్ మరి..
@ రాజు గారు: థాంక్యూ... ఎంటండి అందరూ నాకు చాలా చరిత్ర వున్నట్టు ఫిక్స్ అయిపొయినట్టు వున్నారు.. :-)
@ సాయి ప్రవీణ్ : థాంక్యూ.. హ్మ్ అప్పట్లొ దుఖం.. ఆ తరువాత కొన్నాళ్ళకే ఐశ్వర్య వచ్చింది కదా ( నిజం పేరు కాదు.. సినిమా పాటలొ ఉదాహరణ చెప్ప అంతే :-))
so funny :-)
Post a Comment