Pages

Monday, July 4, 2011

నేను లెజెండ్ కాదా ?

*** శ్రీ  రామ ***"అలా మంచు గారు బ్లాగుల్లో ఫేమస్ అయిపోయి అంతర్జాతీయ తెలుగు బ్లాగ్ legend అవార్డ్ తెచ్చేసుకుంటారు. ఇంకప్పుడు ఆయన బడాయి భరించలేక చావాలి అందరూ.. ఈ బ్లాగ్లోకం భవిష్యత్తు అంధకారం అయిపోతుంది " 

ఆ కామెంట్ ఇక్కడ వ్రాయబడింది ... ఈ కామెంట్ చూడగానే మీకో ప్రసంగం గుర్తొచ్చుండాలి. ఇంకా గుర్తురాకపోతే ఇవి చూడండి: పార్ట్ -1 ,  పార్ట్ -2 . అలాంటి చారిత్రాత్మక అవమానం ఇప్పుడు నాకూ జరిగింది.

అందుకే  నా ప్రసంగం వినండి. 
--------------------------------

మొన్న మధురవాణి గారు రాసిన బజ్ పోస్ట్ చదివి పప్పు శ్రీనివాసరావు గారడిగారు. నీ బ్లాగ్ వయసెంతా అని. ఇరవై నెలలు అన్నాను. ఆవేశం ....  బ్లాగర్లకి, బజ్జర్లకి నమస్కారం. నాలుగు సంవత్సరాల ఆన్లైన్ జీవితం. ఒక సంవత్సరంన్నర పాటు బ్లాగర్ గా, అర్ధసంవత్సరం పాటు బజ్జర్ గా.  అంటే ఎనిమిది సంవత్సరాల బ్లాగర్.కాం ప్రయాణం లో రెండు సంవత్సరాల బ్లాగు జీవితం నాది. అసలు నేను ఎవరూ, ఎక్కడ వాడిని, ఎలా వచ్చానో చెప్పాలి. ఎన్నో ఆటుపోట్లు.  బ్లాగు మూసుకునే దశ వరకూ వచ్చి వెళ్ళిన సంధర్భాలూ ఉన్నాయి. క్లుప్తంగా ఒక్కమాటలో చెప్పాలంటే సాధ్యం కాదు ఎందుకంటే this is the stage to tell who I am, what am I. 

కూడలి మరియూ జల్లెడ అగ్రిగేటర్లలో ఒక చిన్న లింక్. అక్కడ క్లిక్ చేసి వెళితే  "నా ప్రపంచం" అన్న బ్లాగు, కామెంట్ల సెక్షన్ నిండా బోల్డు కామెంట్లు... మధ్యలో చిన్న కామెంట్ నాది.  అప్పటికే నా ఫ్రెండ్ ఒకడు కూడలిలో కొన్ని బ్లాగులు రాసుకుంటూ ఉండేవారు. నేను తెలుగు బ్లాగులు చదవడం మొదలెట్టిన రోజుల్లో మా ఫ్రెండన్నాడు... రేయ్ నువ్వు కూడా ఒక బ్లాగ్ పెట్టుకోరా ఇద్దరం కలిసి రాసుకోవచ్చని.... నేను వినలేదు. సరే మిగతా కొంత మంది స్నేహితుల  ప్రోద్బలంతో బ్లాగు పెట్టడం, కొన్ని కామెంట్లు రావడంతో కూడలిలొ, జల్లెడలో చేరటం జరిగింది. అక్కడే కార్తీక్ ఇంద్రకంటి గారు పరిచయం అవ్వడం.  నాగప్రసాద్ గారు పరిచయం అవ్వడం. మన కత పవన్ గారు పరిచయం అవ్వడం జరిగింది. అక్కడే నాకు బ్లాగర్ గా జన్మను ప్రసాదించిన నేస్తం గారు పరిచయం అయ్యారు. నేను రాస్తున్న బ్లాగ్ కి శ్రావ్య గారు రెగ్యులర్ విజిటర్. మనం అనుకుంటాం.... మన బ్లాగ్ టెంప్లేట్ కి ఏ HTML కోడూ అక్కరలేదూ అననుకుంటాం. కనీసం బ్లాగర్‌కి లేఖిని సహాయం అన్నాకావాలి తప్పుల్లేకుండా రాసుకోవడానికి. కామెంట్ బాక్స్ లో వర్డ్ వెరిఫికేషన్ తీసేయ్యమన్నా, డార్క్ బ్యాక్గ్రవుండ్ మీద లైట్ అక్షరాలూ కళ్ళనొప్పి తెప్పిస్తున్నాయ్ తీసెయ్ అన్నా, కామెంట్ మోడరేషన్ పెట్టుకోమన్నా... అంతా ఈ స్నేహితులే. 

ఆరు మాసాలు రాసాక చూసుకుంటే పది పోస్ట్లకి మొత్తం కామెంట్లు 30 ఉన్నాయి...  అదేంటి మరీ ఆరునెలలకి  30 కామెంట్లేనా అన్నా..... ఏం ? రోజూ డజన్ల కొద్ది పక్కోళ్ళ బ్లాగులు చదువుతావ్ ?  వాళ్ళ బ్లాగుల్లో నువ్వెన్ని సార్లు కామెంట్లు పెట్టావు. పక్కోళ్ళ బ్లాగులో కామెంట్లు పెట్టకపోతే స్టార్ బ్లాగర్ కి కూడా అన్ని కామెంట్లు రావు అన్నారు. నువ్వేమన్నా కెలుకుడు రాతలు రాస్తున్నావా? అని అడిగారు... నా బ్లాగులో రాయడం లేదు సార్ అన్నా... కనీసం అమ్మాయి పేరుతో రాస్తున్నావా....  లేదు సార్ అన్నా.. అందుకే ముప్పై కామెంట్లే వచ్చాయ్ అన్నారు. 

అలా ప్రారంభమైంది నా బ్లాగు జీవితం. బ్లాగు తెరిచానని తెలిసి మలక్పేట్ రౌడి గారు కలవమన్నారని కబురు చేశారు. సరే అని జిటాక్ లో పింగ్ చేసాను. ఆయిన ఆన్లైన్ లో లేరు. టెస్ట్ చేసారు.. పాసయ్యాను. అక్కడ శరత్ గారు ఆ కుర్రవాడెవడో మంచి కత్తి కెలుక్ లా ఉన్నాడు .. రాత కూడా పదునుగా ఉంది  .. కామెంట్లకి పనికొస్తాడేమో అని నన్ను రికమండ్ చెయ్యటం, నన్ను మలక్పేట్ గారు వాళ్ళ క్లేబాస లోకి తీసుకోవటం జరిగిపోయింది. ఆ శరత్ నాకు తెలియదు, నేనెవరో ఆ శరత్ కి తెలియదు. ఎన్ని కామెంట్లు రాసి  తీర్చుకోవాలి ఆ శరత్ రుణం. మొదట్లో నా పేరు అనామకుడు.... తెలుగు బ్లాగుల్లో మొదటి కామెంట్ అనానిమస్ గా పెట్టానని ఆ పేరు పెట్టారు. అంతే తిన్నగా బ్లాగర్. కాం కి వెళ్లాను. ఇక నుండి నాపేరు 'మంచు' అని చెప్పి ప్రొఫైల్ మార్చి నా బ్లాగ్ జీవితం మొదలు పెట్టాను.

ఆ రోజు నుండి ఒక కామెంటర్ గా, ఒక బ్లాగర్ గా, ఒక బజ్జర్ గా, ఒక అనానిమస్ గా, ఒక అగ్రిగేటర్ టీం మెంబర్ గా ... క్లేబాసలో కామెంట్లు ఎలా రాయాలో నన్నే కెలికి మరీ రాయించాడు నా గురువు మలక్పేట్ ....ఈ రోజు ద గ్రేట్ భాస్కర్ రామరాజు గారు తరువాత బజ్లో అన్ని పోస్ట్లు  రాయగలుగుతున్నానంటే that credit goes to the great man, the greatest man, the legend, legendary, greatest man in world , బ్లాగర్ అన్న పదానికే అర్ధం తీసుకొచ్చిన మనిషి ,  ప్రపంచ బ్లాగ్ చరిత్రలో గ్రేట్ మాన్ మలక్పేట్ చలవే.... నా మంచికీ  చెడ్డకూ..... 
 

చివరిగా, మొన్న ఆలమూరు సౌమ్య గారన్నారు. ఈ మద్య మీ పోస్ట్లో కామెంట్లు ఎందుకు రావడం లేదు అని.  ఎందుకంటే you are not a  బ్లాగ్ లెజెండ్,  నువ్వు బ్లాగుల్లో  లెజెండ్ వి కాదు. నువ్వో సెలెబ్రిటివీ అన్నారు.  ఈ బ్లాగు ముఖంగా నేను అందరినీ అడగాలనుకుంది ఏంటంటే .... అసలు బ్లాగు లెజెండ్ అంటే ఏంటి ? బ్లాగు సెలెబ్రిటి అంటే ఏంటి ? అని .... ఒక పోస్ట్ వేసి 'బ్లాగ్ లెజండరీ అంటే బ్లాగ్ మొదలెట్టిన ఇన్నాళ్ళకు మీకు ఇన్ని ఫిక్సెడ్ కామెంట్లోస్తాయని, బ్లాగ్ సెలెబ్రిటి అయితే ఇన్నోస్తాయి' అని రాయండి....

నేననుకున్నాను మన తెలుగు బ్లాగుల్లో ఆక్టివ్ గా రాసేవాళ్ళలో అనానిమస్ల నుండి కూడా అప్రిషియేషన్ కామెంట్స్ వచ్చేది నాకే,  అది లెజెండ్రికాదా ?
సరదాగా రాసిన పోస్ట్ కే యాబై కామెంట్స్ వచ్చాయి అది లెజెండ్రీ కాదా? 
ప్రాంతాలకతీతం గా, సబ్జెక్ట్ ఏదయినా రోజుకి కనీసం పది కామెంట్స్ పెడతా అది లెజెండ్రీ కాదా ? 
బజ్జులో పోస్ట్ వేస్తే మినిమం పది లైకులు వస్తాయి...  అది లెజెండ్రీ కాదా ? 
బ్లాగులో పాతిక మంది, బజ్జులో నూట పాతిక  ఫాలోవర్స్ సంపాదించా అది లెజెండ్రీ కాదా ? 
సంచిలో మంచు, మంచు చెప్తే వినాలి అంటూ బజ్జులో మంచు ని  తలచుకోని రోజు ఉన్నాదండీ ?.... అది లెజెండరీ కాదా?వేణు శ్రీకాంత్ గారు, లెజెండ్రి కాదా ? చెప్పండీ ? వేణు శ్రీకాంత్  గారు లెజెండ్రి కాదా ? వేణు శ్రీకాంత్ గారి బ్లాగ్ విజిట్ చేసారు... ఓ నాలుగూ కామెంట్లు మాత్రమే రాసారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.  ఫేస్ బుక్ లో కొన్ని వందల కామెంట్లు వస్తాయి వేణు శ్రీకాంత్ గారికి. మరి ఇది న్యాయమా ? 
 

మరి కృష్ణ ప్రియ గారు....  మనందరి అభిమాన బ్లాగర్ ..... నా అక్క కృష్ణ ప్రియ గారు ... ఆవిడ బ్లాగ్ లో ఒక మంచి పోస్ట్ వేస్తే ... ఆ బ్లాగ్ పోస్ట్ కి లింక్ బజ్జ్ లో ఇవ్వడానికీ ఆలోచిస్తారటండీ ? ఆవిడ బజ్ పోస్ట్ రీషేర్ చేద్దామా వద్దా అని అలోచిస్తారటండీ....  Yes I will ask all these questions because blogger.com is not for one body. ఒక్కరిది కాదు ఈ గూగిల్ బజ్. ఎంతో మంది పోస్ట్లు వేస్తేనే మాలిక వృద్ది చెందుతుంది. 

మన ఒంగోల్ శీను గారు ఫేమస్ బ్రాహ్మీ ఫ్యాన్, బ్రాహ్మీ మీద ఒక పోస్ట్ వేస్తే మూడు వందల మంది రీషేర్ చేసారు ... ఆయనకిచ్చారండి లెజెండ్ స్టేటస్ ? మన ప్రవీణ్ శర్మ గారు... తెల్లవారుజామున మూడు గంటలకి లేచి పోస్ట్లు రాస్తారు...... తలతోక లేకుండా రోజుకి వంద కామెంట్లు రాస్తారు... ఆయనా లెజెండరీ కాదు... వాడిక్కడే ఎక్కడో ఉన్నాడు రాజ్ కుమార్ గాడు.... వాడొక ఫోటోగ్రాఫ్ బ్లాగర్  గా హిట్టూ, పంచ్ బ్లాగర్ గా హిట్టూ,  కామెడి బజ్జర్  గా హిట్టూ వాడికీ ఇవ్వలేదు కనీసం సెలబ్రిటి స్టాటస్... 

ఇలా ఎంతో మందిని చూసి నా బ్లాగ్ లో కామెంట్లు రాలేదని అడుగుతామా ? రీడర్ల ఆశీస్సులుండాలి, బ్లాగ్ కి మంచి పేరు రావాలి, పదిమందికి ఉపయోగపడాలి..  ఈ కామెంట్లు నాకు అక్కరలేదూ అనుకున్నాను. బ్లాగామ తల్లి సేవే చాలనుకున్నా....

మై డియర్  ఫ్రండ్స్, భగవంతుడు ఉన్నాడు. మళ్ళీ మాలిక నెక్స్ట్ రిలీజ్ కి ఉంటామొ లేదో తెలియదు. నిత్యం సన్నిహితో బ్లాగ్ క్రాష్ కర్తవ్యో ధర్మ సంగ్రహ:  అన్నారు పెద్దలు.  ప్రతీ క్షణం గూగిల్ సర్వర్ ఓవర్ లోడ్ అవుతూ ఉంటుంది ..  ఎప్పుడు బ్లాగర్.కాం క్రాష్ అయ్యి మన పోస్ట్లన్నీ పోతాయో తెలీదు. 

బ్లాగర్స్ నా మనసులో ఉన్నది చెప్పాను...  ఏదేమైనా ఈ రోజు నా బ్లాగ్ కి , నా బజ్జ్ కి , నా చేతికి ఇలా ఏదో ఒకటి రాయాలన్న దురద పుట్టడానికి  కారణం అయిన ప్రతి ఒక్కరికీ నమస్కారాలు తెలియచేసుకుఉంటూ సెలవు తీసుకుంటాను.


నేను బ్లాగ్ లెజెండ్ ని కాదా ? మీరే చెప్పండి...

- మంచు


ఈ పోస్ట్ కేవలం సరదాగా రాసింది. ఈ పోస్ట్ లో ఉదహరించిన బ్లాగర్లు అందరూ నాకు మంచి స్నేహితులు కాబట్టి వాళ్ళ పేర్లు డైరెక్ట్ గా రాయడం జరిగింది.

44 comments:

శివరంజని said...

1st ???????

పద్మ said...

సో, భాజీ రౌడీ దుర్యోధనుడు, మీరు కర్ణుడు అంటారు.

మధురవాణి said...

మీరు ఎప్పటికైనా లెజెండ్ అవుతారు మంచు బాబు గోరూ.. తప్పకుండా అవుతారు... (కళ్ళు తుడుచుకుంటూ నేను! ;)

క్రిష్ణ said...

మీరు లెజెండేనండి బాబూ, మాంచు "లాచిమి" సాక్షిగా!!.

ఏకంగా మలక్ నే కెలికిన మీరు కాక ఇంకెవరు లెజెండ్ చెప్పండి :)

ప్రవీణ్ అన్నాయ్ బాధేమిటో, ప్రతిరోజూ, ప్రతిబ్లాగులో, ప్రతి ఆగ్రిగ్రేటర్ లో ఆ అడుక్కొవటం ఏమిటో అనుకొంటున్న నాకు, ఆయనను లెజెండ్ చేయకపోవటమే కారణం అని నొక్కి వక్కాణించి మరీ చెప్పందుకు, ఆయన బాధ ఏమిటో చేప్పినందుకు నెనర్లు :)

హరే కృష్ణ said...

:)))

Yagna said...

:)

prabandhchowdary.pudota said...

మీరు లేజేండే అండి....
మీకు నా పూర్తి మద్ద్జతుగా ఒక కామెంట్.....

karthik said...

మీరు లెజెబ్రిటీ మాష్టారు.. లెజెండ్ మరియూ సెలబ్రిటీ కలిపితే మీరు.. :D
>>నిత్యం సన్నిహితో బ్లాగ్ క్రాష్ కర్తవ్యో ధర్మ సంగ్రహ:
ఈ వాక్యం అర్థం ఏమిటంటే నిత్య మీనన్ తో సన్నిహితంగా ఉంటే బ్లాగు క్రాష్ అవుతుంది, అప్పుడు (ఆఫీస్ లో పని చేసుకోవాలన్న)కర్తవ్యం బోధపడుతుంది.. :P
మన కుర్రోళ్ళకు ఈ వాక్యం అర్థం కావడం లేదు.. అందుకే నేను వివరించా!

శ్రీనివాస్ said...

వజ్రోత్సవాలలో మన మోహన్ బాబు గారి ప్రసంగం:D

karthik said...

b/n కార్తీక్ ఇంద్రకంటి "గారు" అనకండి మాష్టారు, వినడానికి ఎబ్బెట్టుగా ఉంది :)

Anonymous said...

ఇప్పుడు అర్ధం అయ్యింది మీరు మంచు అని ఎందుకు పేరు పెట్టుకున్నారో ...పోస్ట్ చాలా బాగుంది

nestam

సార్ మీరు ఫుల్ల్ పేజ్ కామెంట్ బాక్స్ పెట్టుకొండి ఎర్రర్ వస్తుంది ఎన్ని సార్లు కామెంట్ పొస్ట్ చేసినా...అజ్ఞాతగానే పెట్టగల్గుతున్నాం ఈ టైప్ కామెంట్ బాక్స్ కి

నేస్తం said...

ఇది బాగుంది అండి కాని ఫుల్ పేజ్ కామెంట్ బాక్స్ బాగుంటుంది...ఇదైనా కొన్ని ప్రొబ్లెంస్ ఉన్నాయి..కాని మీ ఇష్టం మీదనుకోండి :)

ఆ.సౌమ్య said...

పనిలేక, గోళ్ళు గిల్లుకు కూర్చుంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి! :P

ఆ.సౌమ్య said...

మొదట పార్ట్-1,2 ల మీద నొక్కకుండా "ఈయనకేమొచ్చిందీ" అనుకున్నా :D
అది విన్నాక మళ్ళీ చదివితే.....కేక :)

రెండు కామెంట్లు ఎందుకంటే...ఏదో పాపం లెజెండ్ కానా కానా గొంతు చించుకుంటున్నారని...నాలాంటి లెజెండ్ మీ దాన్లో రెండు కామెంట్లు పడేస్తే లెజెండ్ లో 'లె' అయినా అవుతారని....నాది నిస్వార్థ హృదయమండీ,పైగా జాలి గుండె....ఎవరైనా ఏడిస్తే ఇట్టే కరిగిపోతుంది. :D :D :P

మధురవాణి said...

<<Yes I will ask all these questions because blogger.com is not for one body.

ROFL....... :D :D :D

Weekend Politician said...

Based on this post... Malak = Dasari narayanaRao

loooooool :)))))

SHANKAR.S said...

నేనీమధ్య ఒక బ్లాగుకి వెళ్లాను. అక్కడ నన్నెవరూ పట్టించుకోలేదు. నాకు చాలా బాధేసింది. తరవాత అనిపించింది. ఛ ఛ ఇది వాళ్ళ బ్లాగు. అక్కడ ఆ బ్లాగరు, కామెంటర్ ఇద్దరికే ప్రాముఖ్యత. మనం వచ్చినట్టు కూడా వాళ్లకు తెలియదు కదా అని. ఈ రోజు మనమంతా ఇలా ఉన్నామంటే అది ఆ బ్లాగామతల్లి (ఈవిడెవరో కరెక్ట్ గా నాకూ తెలియదు) వలనే. ఈ సందర్భంగా మన బ్లాగులని, బజ్జులని వాటిలో వచ్చిన కామెంట్లని కాలనాళిక (time capsule) లో వేద్దాం. వచ్చే మాలిక రిలీజ్ కి తెలుస్తుంది ఎవరు లెజండో, ఎవరు సెలబ్రిటీయో.

కృష్ణప్రియ said...

వేణూ శ్రీకాంత్ గారు - కృష్ణంరాజు :)
నన్ను గిన్నిస్ బుక్ రికార్డ్ లోకెక్కిన విజయనిర్మల ని చేసినట్టున్నారు.

ముందర లేజీ గా మాన్యువల్ చదవకుండా ప్రయత్నించినట్టు చదివాను. పెద్దగా అర్థం కాలేదు. తర్వాత వీడియో చూసాక తెగ నవ్వొచ్చింది. :))

కొత్త పాళీ said...

మంచుభాయ్, ఎందుకొచ్చిన లెజెండ్లు, సెలెబ్రిటీలు చెప్పండి? బతికుంటే హాయిగా రోజుకి రెండేసి కిలోల చుంబరస్కా చేసుకుని ఎంజాయ్ చెయ్యొచ్చుగదా! అన్నట్టు మొన్నే NPRలో విన్నా, టెస్లా జీవిత చరిత్ర ఒక బుల్లి పుస్తకంగా విడుదలైందిట - మీ చుంబరస్కా అంత పసందుగా ఉన్నదిట.

మనలోమాట - మంచు అనే ఆ పేరే ఇలాంటి ఆవేశం కలిగిస్తుంది కాబోలు.

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీరు ఇంత సున్నితంగా కాదంటే కాసుకోండి అన్నట్టు గా అడిగితే కాదంటామా.

మీరు లెజండే. కెలబ్రిటీ కూడాను.

>>> మీరు ఎప్పటికైనా లెజెండ్ అవుతారు మంచు బాబు గోరూ..
అయినట్టు ఇప్పటికీ ఆవిడ ఒప్పుకోవటం లేదు. :))

వేణూ శ్రీకాంత్ said...

హ హ హ మంచుగారూ ఇన్నాళ్ళకి బ్లాగ్ లోకంలో మీ పేరు సార్ధకం చేసుకున్నారు సారు :-P అందరి తరఫున ఒంటి చేత్తో పోరాడుతున్న బ్లాగ్లోకపు మోహన్ బాబు కీ జై.. err..:P సారీ సారీ మంచుబాబుకీ జై..

ఏమాటకామాటే చెప్పుకోవాలీ స్పీచ్ మాత్రం అదుర్స్ ROFL :-))))

శరత్ 'కాలమ్' said...

మీరు లిజెండ్ కాదన్న వారిని ... ('నేను కవిని కాదన్న వాడిని...' ఇస్టయిల్లో చదువుకోవాలని మనవి) :)

Sravya Vattikuti said...

హ హ బావుంది !

ఇందు said...

హ్హహ్హహ్హా!! ఆ మోహన్ బాబు స్పీచ్ విని ఈ బ్లాగ్ చదివా! కెవ్వ్వ్! భలే ఫన్నీగా ఉంది :) నాది మధుర మాటే....

మీరెప్పటికైనా లెజెండ్ అవుతారు మంచుబాబు..అవుతారు ;) [కికికికికి....]

Shiva Bandaru said...

:)

ఆ.సౌమ్య said...

అన్నట్టు మంచువారి కుటుంబానికంతటికీ ఈ లెజెండ్రీ గోలేమిటో :D

రాజ్ కుమార్ said...

కేక పోస్ట్..
మొత్తం మ్యాటర్ అంతా మోహన్ బాబు స్టైల్ లో చదువుకున్నా.. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.. హిహిహిహిహిహి

విరిబోణి said...

ha ha :)) chala baga raasaru

Anonymous said...

లెడ్జరో, లెంజండరో, లెగ్రాంజో ... ఏదో ఒహటి.

ఇంతకీ నాకర్థంకానిది మంచూ ఫెర్రర్ మనకి సుట్టమేంటి?! మరి లైఫ్ టైం అచీవర్ మంచు మోహన్‌బాబో?!! :))

ఛాయ said...

చివరగా చక్కగా రాశారు సారూ...మీ భావావేశం హ హ హ...

Anuradha said...

బావుంది.
లెజెండ్ కాదు అంటే....?అవును అంటే బహుమతులు ఏమైనా పంచుతున్నారా? :)

Anuradha said...

బావుంది.లెజెండ్ కాదు అంటే....?అవును అంటే బహుమతులు ఏమైనా పంచుతున్నారా? :)

sivaprasad said...

miru legend manchu garu :(

శివరంజని said...

నా బ్లాగర్ ఐడికి లాగిన్ అవ్వగానే మీ పోస్ట్ కనిపించింది అప్పటికి ఇంకా కామెంట్స్ లేవు ...... అందుకే డౌట్ గా ఫస్ట్ కామెంటా ?? అని పెట్టాను ..... హమ్మయ్యా ..........ఒక లెజెండ్ రాసిన పోస్ట్ లో ఫస్ట్ కామెంట్ పెట్టి నేను కూడా ఒక చిన్ని సెలెబ్రెటీ ని అయిపోయాను

శ్రీనివాస్ పప్పు said...

మంచు గారూ మీరు పుట్టుకతోటే లెజెండ్, స్కూల్ కి వెళ్ళడం మొదలెట్టాక లెజెండుంపావు,కాలేజీలో లెజెండున్నర,ఇప్పుడు లెజెండ్ ముప్పాతిక, రాబోయే కాలంలో కాబోయే లెజెండ్ స్క్వేర్.అంతేనండి అంతే....

పోస్ట్ కేకోకేకశ్యకేకహ:

శివరంజని said...

మంచు గారు మీరు లెజెండేనండి బాబూ లెజెండ్ ....... లెజెండ్ అనే టాపిక్ మీద పోస్ట్ రాయాలనే ఐడియా లెజెండ్ కి కాక ఎవరికీ వస్తుంది చెప్పండి
@ మధుర , ఇందు లెజెండ్ ని పట్టుకుని ఎప్పటికైనా లెజెండ్ అవుతారు అనడంలో మీ ఉద్దేశ్యం??????? నేను దీన్ని ఖండిస్తున్నా :):):)

.నాలాంటి లెజెండ్ మీ దాన్లో రెండు కామెంట్లు పడేస్తే లెజెండ్ లో 'లె' అయినా అవుతారని>>>>>>>>>>>>>>>>>>>>>@ సౌమ్యా .......... లెజెండ్ సౌమ్యా అంటే బాగుంటుంది కాని ......... *లె* మంచు గారికి ఇచ్చేసిన తరువాతా మిగిలిన *జెండ్* నీకుఎందుకు చెప్పు .... జెండ్ సౌమ్యా అంటే బాగుండదేమో నా మాట విను

మధురవాణి said...

@ శ్రియా,
అమ్మా బుజ్జీ.. అలా అనడంలో మాకు వేరే ఉద్దేశ్యమేమీ లేదు.. సరైన ఉద్దేశ్యమే.. మీ గురువు గారు ఎప్పటికైనా లెజెండ్ అవుతార్లే అని మనస్పూర్తిగా విష్ చేస్తున్నాం అన్నమాట! చూసావా నాదీ, ఇందూది ఎంత మంచి మనసో.. మీరెన్నేసి మాటలన్నా అవన్నీ మర్చిపోయి మంచిగానే విష్ చేస్తున్నాం! ;)

అసలయినా ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చింది ఎందుకంట? తను లెజెండ్ కాదు కాబట్టి, కనీసం ఇప్పుడన్నా లెజెండ్ అయిపోదామనే కదా! :P

kallurisailabala said...

i like tis post...

Bhardwaj Velamakanni said...

Too good.

As Pappu saar said, you are a born legend. There only one other legend on Telugu blogs - our own cutie pie Martanda :)

SHANKAR.S said...

@BHARADWAJ
'There only one other legend on Telugu blogs"

Is he LEGEND or LAZY END??

..nagarjuna.. said...

లో.....ళ్

Anonymous said...

Excellent !

Anonymous said...

legend manchu baabu gaaroo
super

Anonymous said...

belated birthday wishes

kamudha