*** శ్రీ రామ ***
ఇది కేవలం సరదాగా రాసింది.... ఎవర్నయినా నొప్పించి ఉంటే వారికి ముందస్తు క్షమాపణలు... మీ ప్రస్తావన తీసేయ్యమంటే తీసేస్తాను.
ఫ్రెండ్స్ (బ్లాగ్బ్రదర్స్ & ఇన్లాస్) .......
మొన్న జ్యోతిగారి పోస్టు, బజ్‌లొ చాలెంజ్‌లు, ఆ పైన మధురవాణి గారి పోస్ట్, దాంట్లో మన కేడీస్ సారీ అదే మన లేడీస్ కామెంట్లు... చూసాక నాలోని వంటరాత్మ (వంటొచ్చిన అంతరాత్మ)కి పంతం వచ్చింది. ఎలాగయినా వీళ్ళకు మన మగజెంట్స్ టాలెంట్ చూపించాలని మరియూ మన సీనియర్ చెఫ్స్ నల,భీముల పరువు నిలబెట్టాలని సమయానికి కంకణం అందుబాటులో లేకపోవడంతో ఫ్రెండ్షిప్ బాండ్ ఒకటి కట్టుకుని రంగంలోకి దిగాను. ఈ మ్యాటర్ కొంచం కాట్రవల్లి అని అర్ధం అయింది. అందరూ చేసేది మనం చేస్తే సరిపోదు...ఏదయినా కొత్తది చేసి వీళ్ళ చేతులు కట్టించాలని ("నోళ్ళు మూయించాలని" అనే దానికి ఆన్లైన్ ఈక్వలెంట్) అనుకుని ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా ఒక ఫ్లాష్ లాంటి ఐడియా వచ్చింది. అదే చుంబరస్కా... ఇదయితే ఇప్పటివరకు ఎవరూ చెయ్యనిది(చెయ్యలేనిది) మరియు కృష్ణప్రియ గారి కన్నా ముందుగా దీనికి పేటెంట్ హక్కులు సంపాదించ్చొచ్చు. (అసలే ఈమద్య ఎడిసన్ టెస్లా పేటెంట్లు అంటూ ఎక్కువ ఆలోచించా కదా.. పక్కొళ్ళకన్నా ముందు పేటెంట్ ఎలా సంపాదించాలి అన్నదాని మీద బాగా ఐడియా వచ్చిందన్నమాట).
ఇది చెయ్యడానికి ముందు కావలసినవి జీడిపప్పు కిస్మిస్ .....................................................
ఆహా...జీడిపప్పు ...ఆ పేరు వింటేనే నా గుండెలో కోటి సితార్లు మొగుతాయ్. జీడిపప్పే కాదు , బాదం , పిస్తా, వాల్నట్, వేరుశనగ గుళ్ళు వీటి పేర్లు వింటేనే నాలో నరాలు జివ్వుమంటాయి.....కొలెస్టరాల్ కెవ్వుమంటుంది. ఏంటి అలా చూస్తున్నారు .... కావాలంటే ఈ ఫోటో చూడండి ... ఇంట్లో ఎప్పుడూ ఇలా డబ్బాల నిండుగా పప్పులుండాలి. ఇక కిస్‌మిస్ గురించి చెప్పేదేముంది ...మిస్‌కిస్ లా తియ్యగా ఉంటుంది అని మనకి తెలుసుకదా ...
సరే విషయం లోకి వస్తే ముందు రెండు గుప్పుళ్ళు జీడి పప్పు (ఒక గుప్పెడు చుంబరస్కాకి ... ఇంకో గుప్పెడు వంట అయ్యేలోపు నేను తినడానికి) , కొన్ని కిసమిస్ లు నేతిలో వేపించి పక్కన పెట్టా. ఇది గార్నిషింగ్ కోసమన్నమాట... అదేంటి ముందు గార్నిషింగ్ తయారు చెయ్యడమేంటి అని మన కేడీస్ లా ఆలోచించొద్దు...చెప్పాను కదా...దాంట్లో ఒక గుప్పెడు నేను వంట చేస్తున్నప్పుడు తినడానికి
. ఆ తరువాత నెక్స్ట్ స్టెప్ .... కావలసినవి తీసుకు పెట్టుకోవాలి.
ఇప్పుడు ఏం చెయ్యాలి... బియ్యం కావాలి... హమ్మయ్య ...బియ్యం డబ్బా వెంటనే దొరికింది.... పెసరపప్పు (మూంగ్ దాల్) ..ఇది పక్కనే దొరికింది... పాలు కావాలి... ఓకే పాలంటే ఫ్రిజ్ లో...ఫ్రిజ్ తలుపు తెరిచి వెతుకుతున్నా...హమ్మ్ ...ఇది చికెన్ ....ఇది మటన్...ఉహు ఇది రొయ్యలు...అబ్బే ఇది ఫిష్....ఇదేంటి ..కాదు ఇది క్రాబ్ మీట్ , మరి ఇది...ఓకే ఇది హాట్డాగ్ ... పాలేక్కడా అని వెతుక్కుంటుండగా ఈలొపు "పాలు డీఫ్రిజ్ లో ఎందుకుంటాయి ...కింద వెతుకు అని" ఒక వాయిస్ వినిపించింది.... వెంటనే కంగారోచ్చింది....నిన్న హోల్ చికెన్ (whole chicken) ఇమ్మంటే ఆ చైనీస్ షాపోడికి అర్ధంకాక బతికున్న కోడిచ్చేసాడా..నేను చూసుకోకుండా ఫ్రిజ్ లో పెట్టేసానా అని.... చూసాను... అదికాదు...మరి ఆ గొంతెవరిది అని తిరిగి చూస్తే పక్కనే నా వంటరాత్మ కోపంగా చూస్తూ...ఒకే ఒకే అని కింద అర నుండి పాలు తీశాను ...
ఒక గిన్నెలో ఒక కప్పు కడిగిన బియ్యం , అరకప్పు కడిగిన పెసరపప్పు, ఒక కప్పు చిక్కటి పాలు , మూడుకప్పులు నీళ్ళు వేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేవరకూ కుక్కర్ లో మెత్తగా ఉడికించా....
ఈలోపు పక్కనుండి సెల్ మోగింది .... ఆర్యా -2 సాంగ్ రింగ్ టోన్... " హే... టిప్పుటాపు దొర కదిలిండొ ..ఎవడికి వీడు దొరకడులెండొ...ముదురండొ...గడుసండొ... తొడిగను ముసుగండొ... ఉప్పుకప్పురంబు నొక్కలుక్కునుండొ....వీడి రూపుచూసి మొసపొకండొ............ కమాన్ కమాన్ మొస్ట్ కన్నింగు" ... అంటూ
ఒహొ నాగా ఫొన్ ... ఫోన్ తీశాను.... ఆ పక్క నాగా
* * *
" అన్నాయ్ కుక్కర్ తో చపాతీలు ఎలా వండాలి"
" కుక్కర్ తో చపాతీలేంటి .. బాలయ్య బాబు సినిమా ఎమన్నా చూసావా.. "
" నాదగ్గర కుక్కర్ ఒకటే ఉందన్నాయ్... నాకర్ధం కాకే నీకు ఫోన్ చేసాను"
" మరి ఎలాగా.... అస్సలు ఇంకేం పాత్రలు లేవా ..చుట్టూ చూడు ఒకసారి "
" ఉహు ఏం లేవన్నాయ్.... ఎవరో తాగి పాడేసిన కింగ్ ఫిషర్ బాటిల్ తప్ప ఇంకేం లేవు "
" నీ రూం లో నువ్వు తప్ప ఇంకేరెవరు ఉంటారు?"
"ఇంకెవరు ఉండరాన్నాయ్... నేనొక్కడినే ...ఏం ఎందుకు ?"
" ఏం లేదులే...ఎవరు తాగి పారేసారో అని .... సరే చెప్తా వినుకో... ముందు కుక్కర్ గిన్నెలో గోధుమపిండి వేసి నీళ్ళు పోసి బాగా కలుపు... ఆ తరువాత ఆ పిండి చిన్న చిన్న ముద్దలు గా చేసి... ... ఆ కుక్కర్ వెనక్కి తిప్పి దానిమీద ఈ ముద్ద పెట్టి ఆ కింగ్ ఫిషేర్ బాటిల్ తో గుండ్రంగా వత్తు...ఆ వత్తినవి ఒక న్యూస్ పేపర్ లో పెట్టుకుని ...."
" అన్నాయ్ న్యూస్ పేపర్ మీద ఆంటే... ఇలియానా బొమ్మ ఉన్న పేపర్ లో పెట్టాలా...కత్రినా కైఫ్ ఫోటో ఉన్న పేపర్ మీద పెట్టాలా ?"
" @()$*(@* "
" సారీ ...నువ్వు చెప్పన్నాయ్ "
"ఇప్పుడు కుక్కర్ మళ్ళీ మాములుగా వెనక్కి తిప్పి ....స్టవ్ మీద పెట్టి ..చేపాతీలు వేయించు...అంతే "
" నువ్వు కేకన్నాయ్....నాకు తెలుసు కుక్కర్ ఉంటే ఏదయినా వండేయొచ్చు అని .. రేపు ఫోన్ చేస్తా...కుక్కర్ తో ఐస్క్రీం ఎలా వండాలో చెప్పన్నాయ్ "
" సర్లే బై " .... అని ఫోన్ పెట్టేసా ...చెప్పడం మరిచా....మన బ్లాగర్లందరికీ ఒక్కో సాంగ్ రింగ్ టోన్ గా పెట్టా...ఈజీ గా గుర్తుపట్టడానికి....
ఫోన్ పెట్టాక ... స్టవ్ లోహీట్ లో పెట్టి ..దాని మీద ఒక గిన్నె పెట్టి...ఉడికించిన అన్నం పెసరపప్పు మిశ్రమం దాంట్లో వేసా....
పై ఫోటో చూసి ఇదేంటి బియ్యం పెసరపప్పు ఉడికించి తీస్తే నేస్తంగారి ఉలవచారులా వచ్చింది అనుకోకండి
... అప్పుడు కరెంట్ పోయింది ...వచ్చేవరకూ వెయిట్ చెయ్యాలి ...నాది కరెంట్ స్టవ్ మరి...
.
.
.
.
హమ్మయ్య కరెంటు వచ్చింది అనుకుని ..
* * *
ఈ లోపు మళ్ళీ సెల్ మోగింది.... ఈ సారి రింగ్ టోన్ " ఐయాం వెరి సారీ...అన్నాగా వందొసారి..."
* * *
" చెప్పు రంజని ..."
" ఐయాం సారీ అండీ..."
" ఎందుకు ????"
"
అంటేనండి ...మరేమోనండి ... మా అమ్మ గారు ఉన్నారు కదండీ.... మరి పొద్దున్న
ఊరెళ్ళారండీ.. మరి మా అమ్మగారు వెళితే మా నాన్నగారికి భోజనం నేనే వండాలి
కదండీ... అందుకని వంట చేద్దామని పొయ్యిమీద పప్పు పెట్టానండి... అది
ఉడికేలొపు ఒకసారి మాలిక చూసొద్దామని ఇలా వచ్చానండీ.... అంతేనండీ అసలు టైమే
తెలీలేదండి .... ఈలొపు ఎదొ మాడు వాసనొస్తుంటే చూసాను కదండీ.... పప్పు మాడి
పొయిందండి ... సమయానికి సారీ చెప్పడానికి ఇంట్లొ ఎవరూ లేరండీ... మా
పక్కింట్లోవాళ్ళు కూడా ఊరెళ్ళారండి....అందుకే "
" సరే....అయినా ఈసారి నుండి నాకు సారీ చెప్పాలంటే...ఫోన్ చేసి అక్కర్లేదు .. మిస్సిడ్ కాల్ ఇచ్చినా చాలు..."
" ఆయ్బాబొయ్...అదేటండీ...."
" నీ ఫోన్ హలో ట్యూన్ ... నా ఫోన్ లో నీ నెంబర్‌కి పెట్టినా రింగ్ టోన్ ఒకటే ....ఒకే మరి ...బై...ఉంటాను "
* * *
అబ్బ ఈ ఫోన్స్ తో
డిస్టర్బ్ అయిపోతుంది... ఇలా ఫోన్లు మాట్లాడుతూ కూర్చుంటే ఈలోపు ఆ పేటెంట్
ఆవిడ పట్టుకుపోతుంది... అని ఫోన్ ఆఫ్ చేసి....
ఇప్పుడు ఆ అన్నం, పెసరపప్పు మిశ్రమం లో పంచదార వేసా... ఎంతవేయ్యాలి అన్నదానికి పెద్ద కొలత ఉండదు... కొద్దిగా వేస్తూ రుచి చూస్తూ ...మనకి ఎంత తీపి నచ్చితే అంతవరకు వేసేయ్యడమే... నేనయితే చిన్న బెల్లం ముక్క కూడా వేసా...
ఆ తరువాత దాంట్లో ....నెయ్యి వేసా ... దీనికి పెద్ద కొలత ఏమీ ఉండదు... ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ...
పొయ్యిమీద ఉన్న మిశ్రమంలో పంచదార పూర్తిగా కరిగే వరకూ కలియపెట్టి...దాంట్లో కొంచెం యాలికుల పొడి ... అప్పటివరకూ తినగా మిగిలున్న వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ వేసి ...దింపి చల్లారే వరకూ ఉంచా.... అసలయితే దీంట్లో వేయించిన చిన్న చిన్న కొబ్బరి ముక్కలు వేద్దామనుకున్నా కానీ సమయానికి ఇంట్లో కొబ్బరికాయ లేదు ...
చల్లారాక ఒక గిన్నెలోకి తీసి మద్యలో ఒక చిన్న గుంట తీసి దాంట్లో కాస్త నెయ్య...కొంచెం బాదం పలుకులు వేస్తే ..ఇలా వచ్చింది...
అలవాటు ప్రకారం ఇంట్లోవండిన పిండివంట ముందు ఇక్కడ పెట్టి ...
ఆ తరువాత వెంటనే ఒక బాక్స్‌లొ ఈ చుంబరస్కా పెట్టుకుని మా పక్క సందులో ఉన్న పేటెంట్ ఆఫీసు కి వెళ్లాను...నన్ను చూడగానే నైట్ డ్యూటీలో బయట నుంచుని ఉన్న ఇద్దరు ఆఫీసర్లు ఎదురొచ్చి నన్ను సాదరం గా లోపలి తీసుకెళ్ళారు. సోఫాలో కూర్చోపెట్టి... డ్రింక్ ఎమన్నా తీసుకుంటారా అని అడిగారు... అబ్బే అలవాటు లేదు అని అబద్దం చెప్పా... ఓకే.. తర్వాత తాగాలనిపిస్తే అక్కడ ఉంది అని కోక్ వెండింగ్ మెషిన్ చూపించి లోపలకి వెళ్ళిపోయారు... ఓహో కొద్ది ఎక్కువ ఊహించుకున్నా అని అనుకుంటుండగా...లోపలనుండి పేటెంట్ ఆఫీసరు వచ్చి రండి రండి అని లోపలకి తీసుకెళ్ళాడు...
" చెప్పండి... దేనికి పేటెంట్ ... ఏదయినా పర్లేదు...మా దగ్గర చాలా ప్యాకేజీలు ఉన్నాయి "
ఓహ్... వీళ్ళకీ రిసెషన్ ఎఫ్ఫెక్ట్ బాగానే పడింది అనుకుంటూ ....
" దీని పేరు చుంబరస్కా .. ఈరోజే కనిపెట్టా... దీనికి పేటెంట్ కావాలి..."" ఏది చూడనివ్వండి... " అని తీసుకుని ఒక స్పూన్ తిన్నాక....
" ఏంటి ఇది చుంబరస్కా నా...ఈరోజే కనిపెట్టారా...ఏం నాటకాలుగా ఉందా "
" నిజం ... ఒట్టు....కావాలంటే ఆ బాక్స్ మీద లేబిల్ అంటించా చూడండి... ఇదిగో సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం కూడా "
" ఎరా నీకు... నేను మరీ మాలిక టీం లా కనిపిస్తున్నానా.... బాక్స్ లో చక్రపొంగలి వేసి పైన చుంబరస్కా అని రాసేస్తే నేను ఒప్పుకోవాలా .. సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం అంట...డిక్లరేషన్ అఫ్ ఇండిపెండెన్స్ అంత బిల్డప్ ఒకటి " అని మర్యాదగా చివాట్లు పెడుతుంటే ....
" అయ్యో ...ఇది ఆల్రేడి కనిపెట్టాసారా ..." అనుకుంటూ నిరాశ గా నేను వెనక్కి తిరిగా...
వెనకనుండి... ఇప్పటివరకూ నా టైం వెస్ట్ చేసినందుకు ఆ బాక్స్ వదిలేసి వెళ్ళు అంటున్నాడు ... ఏం చేస్తాం.. అక్కడే వదిలేసి వచ్చా....
వాడు దాన్ని చక్రపొంగలి అన్నా ఇంకేమన్నా...నాకు మాత్రం ఇది చుంబరస్కానే .. కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ పేటెంట్ కోసం ప్రయత్నిస్తా.... అప్పటివరకూ... patent pending
---------------------------------------------------------------------------------------------------------------
ఆ. సౌమ్య గారి సౌజన్యంతో మీకో బోనస్ రెసిపీ : చుంబరస్కా టల్లోస్
ఒక రెండు కప్పులు చుంబరస్కా , రెండు కప్పులు టల్లోస్ , ఒక లీటర్ నీళ్ళు కలిపి ఒక 2 నిముషాలు మిక్సీ పట్టి తీస్తే అదే చుంబరిస్కా టల్లోస్.... టల్లోస్ రెసిపీ ఇక్కడ
59 comments:
మొత్తానికి మీ పేటెంట్ ఆఫీసర్స్ చాల మంచివాళ్ళలాగా ఉన్నారండి , మీరు వేరే వాళ్ళ కనిపెట్టిన పేరు వాడుకున్నా వదిలేసారు అలాగే మీ నానమ్మల నానమ్మల నాటి రెసిపీ ని కొత్త బాక్స్ లో తీసికెళ్ళి మీ ఇష్టమొచ్చిన పేరు చెప్పినా వదిలేసారు . మెదటి రెండు పేరాలు చదివి మీ ఐడియా అర్ధమయ్యి పాపం మీరే జైలు నుంచి ఈ పోస్టు రాస్తున్నారో అని కంగారు పడి చివర బాగం చదివేసా ముందు .
ఎంతైనా మీ వంట మీద మీకు బాగా నమ్మకం అనుకుంటా కదా అందుకే పాపం నోరు మెదపలేని దేవుడి కి రుచి చూపించి టెస్ట్ చేస్తున్నారు :)
చదువుతున్నంత సేపు నాకు అనుమానంగానే ఉంది. మీరు ఏ పేరైనా పెట్టండి. మేము దీన్ని మాత్రం చక్ర పొంగళి అని మాత్రమే అంటాం. మీ కెప్పటికీ పేటెంట్ రాదు గాక రాదు. నాలుగు కాలాలు బతకాలి అంటే బలుసాకైనా (ఆ ఆకు ఏంటని మాత్రం అడగకండి) తింటాం కాని మీ చుంబరస్కా టల్లోస్ మాత్రం చచ్చినా తినం. పన్లో పని మీ 'కుక్కర్లో చపాతి' మాత్రం బ్రమ్హాండమైన అవిడియా.
kEka :))
గుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ అర్జెంట్ గా బయటకెళ్ళాల్సిన పని ఉంది కానీ.. వచ్చాక.. మీ పని చెప్తా..
కుక్కరుతో చపాతీ మటుకు అదిరిందండీ. మీ ఫోను నంబరిస్తే నేనుకూడా మీ అమూల్యమైన సలహాలు పుచ్చుకుంటా.
మంచు గారు కేకండి. చుంబరస్క మిద మనకు పేటెంట్ రాకుండా ఎవరో కుట్ర పన్నారు అని నా అనుమానం.
మంచు కొండా,
మీ చక్రపొంగలి భలే నోరూరిస్తోంది .ఇంత బాగా చేయటం వచ్చినందుకు మిమ్మలిని మెచ్చుకోవాలో , మీ అవిడ ( రాకపోతే , రాబోయే ) మీద జాలి పడాలో తెలీటం లేదు :)
nenu chumbaraska ani peru chudagane naku muddu gurthochindi enduko chumba ani undi kabolu ;)
idem vantakam ra babu ani chadivanu tharvatha thirigga thelisindi em vantakamo hehehe :)
ee madhya baga patent la mida mana vallaki baga concentration ekkuvayinattunde :p
>>>>>పై ఫోటో చూసి ఇదేంటి బియ్యం పెసరపప్పు ఉడికించి తీస్తే నేస్తంగారి ఉలవచారులా వచ్చింది అనుకోకండి ... అప్పుడు కరెంట్ పోయింది ...వచ్చేవరకూ వెయిట్ చెయ్యాలి ...నాది కరెంట్ స్టవ్ మరి...
దీన్నే మా ఊరులో కుళ్ళు అంటారు..
అలా గుడికి వెళ్ళి వచ్చేలోపల పోస్ట్ లో ఏదోరకంగా సెటైర్ కొట్టెసారేం ..పైగా వంటకం దాని ఫొటోస్( కొంపదీసి ఇంతకు ముందే రాసుకున్న రెసిపీయా :)పైగా ఇంత పెద్ద పోస్ట్ .. మిమ్మల్ని ఈ విషయం లో మెచ్చుకోవాలి
hahaha!baagundi. chapaati idea ku maatalu paDipoyyaayi antae!
చుంబరస్కా.......... ఓ మై గాడ్ కెవ్వు.......కేక. ఆ రింగ్ టోన్లున్నాయి చూసారూ అబ్బా సూపరన మాట.
"చుంబరస్కా" పేరే మోతమోగిపోయింది,తినగా మిగిలిన జీడిపప్పు(అసలా రుచేవేరులెండీ)కేక,ఇంక చపాతీ అవిడియా కుమ్మేహారంతే.చప్పట్లు ఈలలు,కేకలు,డప్పులు,డేన్సులు హోరుమొతెక్కిపోవాలంతే పేటేంటివ్వకపోతే హా.
అన్నాయ్!!!బాధపడాకు. నువ్విచ్చిన అవిడియాతో చపాతీలు చేశా...అద్దిరిపోయాయ్...ఈ పద్ధతిలో ఆయిల్ లేకుండా, అట్లకాడ లేకుండా సుతిమెత్తని చపాతీలు ఎలా చెయ్యొచ్చు అన్నదాని మీద నేను పేటెంట్ సంపాదించా.. :-)వివరాలు నా బ్లాగులో రాస్తా... :-)
హ హ మీ గోదారి నది జిల్లాలోకి ఎంటరవబోయేముందు ఎక్కడైనా ఆ నీళ్లలో కాస్తంత వెటకారం మరికాస్త హాస్యరసం కలిపేస్తారా ఏమిటి అని అనుమానం వచ్చేస్తుంది మంచుగారు ;-)
టపా సూపరు. చక్కెరపొంగలి అదుర్స్ నోరూ్రి పోతుంది.
ఇక సెటైర్ల మాట చెప్పనే అక్కరలేదు.
కుక్కర్ తో చపాతీ అల్టిమేట్ అంతే :-)
దేవుడు మిమ్మలని ఏమి చేసాడండి పాపం అంత కోపం ;)
అయినా మీరు కేడీస్ వంట టపాలు చూసి ఇలా మారిపోవడం బాగాలేదు. అసలు అలాంటి టపాలు అన్నింటికి నేను ఒకే కామెంటు పెడదామని అనుకుని చాలాసార్లు నన్ను నేను అతి కష్టం మీద ఆపుకున్నాను. ఈ కింద కామెంటు వంట పోస్టులు రాసేవాళ్లకి , ఆ టపాలు చదివి లొట్టలు వేసేవాళ్లందరికి :
తిండిపోతుల్లారా ;)
PS:మనకి వంట ఎలాగు రాదు , కనీసం లొట్టలు వేసే అదృష్టం కూడా లేదు లెండి, భీకరమైన డైటింగులో వున్నాను.
Hahah.. nestam gariki counter maree inta tondaraga ostundani anukoledu
మంచుగారు, కెవ్వు టపా అండి.. సూపరు! మధ్యలో ఎక్కడో ఒకచోట నా పేరు కూడా వాడింటారని అనుకున్నాను.. వాడనందుకు నెనర్లు..
అసలు మనకు పేటేంట్ రాకుండా చేయడానికి ఆ కోతిబ్యాచ్ ఏమైనా కుట్రలు చేస్తోందని నా అనుమానం, లేకపోతే అసలు మీకు పేటెంట్ ఇవ్వకపోవడమేమిటి చెప్పండి?? దీని మీధ్య తక్షణం సమ్యుక్త పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలి..
-కార్తీక్
మొత్తానికి మంచు గారు వంట విషయంలో నలభీముల సరసన నిలుస్తారన్నమాట! నేస్తం గారి పోస్ట్ చూసాకే తెలిసింది మీ tiramisu రెసిపీ గురించి. అది చూసాక కూడా మీరు వంటలో మహా ప్రావీణ్యులని అనకుండా ఎలా ఉంటామండీ! ఈ పోస్టులో మాత్రం తెగ నవ్వించేశారు! :)
హ్హహ్హహ్హా.. అదేంటోనండి. మేంకూడా మీ చుంబరస్కాని చక్రపొంగలి అనే అంటాం. :) పోస్ట్ చాలా బాగుంది. కుక్కరుతో చపాతీ భలే అయిడియా. :)
హహ..మంచు గారు కుమ్మెశారు... వంటకం సంగతి అటుంచండి.. మధ్యలో వచ్చిన ఫోన్ కాల్స్ కేవ్వ్వు....కేకా... ఇరగ దీస్తిరి..
కుక్కర్ లో చపాతి, ఐస్క్రీం... ఇవి అరాచకం..అంతే..అంతే...
ముందు కుక్కర్ గిన్నెలో గోధుమపిండి వేసి నీళ్ళు పోసి బాగా కలుపు... ఆ తరువాత ఆ పిండి చిన్న చిన్న ముద్దలు గా చేసి... ... ఆ కుక్కర్ వెనక్కి తిప్పి
----
మరప్పుడు కుక్కర్లో ఉన్న పిండి, మిగిలిన ఉండలు ఏమి చెయ్యాలి?
>>చేపాతీలు వేయించు...అంతే
వేయిస్తే అవి "చే"పాతీలో, పూరీనో అవుతాయి కదా..
>> మరీ మాలిక టీం లా కనిపిస్తున్నానా
ఏదీ పద్నాలుగుమంది మాలిక టీమేనా?
>>వాడు దాన్ని చక్రపొంగలి అన్నా ఇంకేమన్నా...నాకు మాత్రం ఇది చుంబరస్కానే
అవునవును చక్రపొంగలి అంటే దానిలో కొబ్బరి ముక్కలు ఉండాలి, దీనిలో లేవు కదా, పేటెంట్ ఇవ్వాల్సిందే,
కొద్దిగా మార్పులు అంటే జీడిపప్పు బదులు బంగాళదుంపో, కిసిమిస్ బదులు ఓ కాకరగాయ, బోనస్గా ఓ గుప్పెడు వేపకాయలు వేయింది మళ్ళీ వాడికే తినిపిద్దురు, దెబ్బకి పేషంట్ అయ్యి పేటెంట్ ఇస్తాడు.
....
Taara
నాగ సీప్‌గా కింగ్ ఫిషర్ బీరేంది, మొన్నే ఒక లీటర్ అదేలే 750మి.లీ. రెడ్ లేబుల్ విస్కీ తెప్పించా బ్యాంకాక్ నుండి, ఓ బాటిల్ మిగిలింది దాన్ని గోతిలో పూడ్చి పెట్టాను నీ కోసమే..
కుమ్మేద్దామంతే.
....
Taara
రెడ్ లేబిల్ విస్కీ బాటిల్ గుండ్రం గా ఉండదు కదా ..నాలుగు పలకలుగా ఉంటుంది. చపాతి చెయ్యడానికి పనిచెయ్యదని...నాగ తాగడు
కెవ్వు కేక!!
కుమ్మేసారంతే :)
దాందేముంది, గుండ్రటి బాటిల్లో పోసుకోని తాగడమే, వోడ్కా, విస్కీ సూపర్ కాంబినేషన్, అలానే బీరు విస్కీ కుడా
....
Taara
హ హ హ చుంబరస్కా...పేరే కెవ్వు కేక
మీదంతా ఎంత నక్కజిత్తుల వ్యవహారమండీ....చక్రపొంగలి చేసేసి చుంబరస్కా అనో తిక్క పేరు పెట్టి పేటెంటు కావాలని అడుగుతారా...హవ్వ హవ్వ ఎక్కడైనా విన్నామా ఈ చోద్యం!
కుక్కర్ లో చపాతీ అవిడియా మాత్రం రచ్చ
ఒహో నన్ను కూడా కలుపుకున్నారా...చుంబరస్కా అందులో టల్లోస్ పైగా నా సౌజన్యంతో..వాహ్ వాహ్
:)
మంచన్నా (మంచు + అన్నా!) బాంచెన్, కాల్మొక్త! ఇన్నాళ్ళు ఇంత టేలెంటుని ఏ ఎల్కెట్రోమేగ్నెటిక్ ఇండక్షన్ యెనకమాల దాచేసినావన్నా! మన మగజెంట్స్ పరువు నిలబెట్నావన్నా! ఇకనించీ ఈ వంటకాన్ని చుంబరస్కా అనే పిలవాలని పార్లమెంటులో బిల్లు తెద్దాం. అది కుదరకపోతే (ఆడలేడీస్ కి రిజర్వేషనుందేమోగా?) కనీసం ఎగ్జిక్యూటివ్ ఆర్డరన్నా ఏపించేద్దాం!
చుంబరస్కా జిందాబాద్.
@ మంచు,
:-)) మీ టపా అద్భుతం.. కానీ బాగా అయ్యింది.
పేరు కాపీ చేసి పేటెంట్ సంపాదిద్దామనుకున్నారా? మీ వంటరాత్మ మిమ్మల్ని హెచ్చరించలేదా?
కత్తి లాంటి లైన్లు..
1) ఈ చుంబరస్కా అనేది స్వీట్ గా చేద్దామని నా ప్రయత్నం . LOL10
2) కొలెస్టరాల్ కెవ్వుమంటుంది. .. LOL20
3) ఒక గుప్పెడు చుంబరస్కాకి ... ఇంకో గుప్పెడు వంట అయ్యేలోపు నేను తినడానికి LOL20
4) .. కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ పేటెంట్ కోసం ప్రయత్నిస్తా.... అప్పటివరకూ... patent pending -- ఆహా! :))
అన్నిటికన్నా అల్టిమేట్ ..
క రెండు కప్పులు చుంబరస్కా , రెండు కప్పులు టల్లోస్ , ఒక లీటర్ నీళ్ళు కలిపి ఒక 2 నిముషాలు మిక్సీ పట్టి తీస్తే అదే చుంబరిస్కా టల్లోస్....
తలచుకుంటేనే.. ఒకరకమైన ఫీలింగ్.. దాన్నే కొన్ని ప్రాంతాల్లో నాసియా అంటారనుకుంటా..
మంచు గారూ... బాగా నవ్వానని చెబితే చాలా చిన్న పదమవుతుంది.. అంతగా నవ్వాను..:) పాపం రంజని..:( అసలు మీ పోస్ట్ అంతా ఒక ఎత్తయితే, ఆ చివర్లో మెరుపుంది చూడండీ అది కేక. చెక్కెర పొంగలిని చుంబరస్కా చేసేశారా.. హహ్హహ్హా....ఇంకా మీ పోస్ట్ చూశాక, మన ఆర్.ఎం.పి. గారి పోస్ట్ కూడా చూశాను. నవ్వుకోలేక చచ్చా.. బాబోయ్.. వనభోజనాలేమో కానీ, నవ్వుల భోజనాలు అయిపోయాయి ఈరోజు.. అసలు కుక్కర్‌లో చపాతీ చెయ్యాలన్న ఆలోచన ఎలా వచ్చిందండీ బాబూ.. ఆయనకి ఆలోచన రావడమూ, మీరు దానిని సపోర్ట్ చేసి సలహాలివ్వడమూ..:D :D
నువ్వు కేకన్నాయ్....నాకు తెలుసు కుక్కర్ ఉంటే ఏదయినా వండేయొచ్చు అని .. రేపు ఫోన్ చేస్తా
కుక్కర్ తో ఐస్క్రీం ఎలా వండాలో చెప్పన్నాయ్ "హహ్హహ్హ :)))))))...
కుక్కర్లో చపాతి అవిడియా చాలా బాగుంది.దీనికి తీసుకోవాలి పేటెంట్.
>>అసలు కుక్కర్‌లో చపాతీ చెయ్యాలన్న ఆలోచన ఎలా వచ్చిందండీ బాబూ.. ఆయనకి ఆలోచన రావడమూ, మీరు దానిని సపోర్ట్ చేసి సలహాలివ్వడమూ.
..........
అదొక విషాద గాధ, దానికి బలైయ్యింది నేను, కొద్దిగా మార్చి పేరు కొట్టేసింది మంచుగారు..
అయ్యయ్యో.. తార గారూ.. అవునా..!!
మంచుగారు మీరు ఇలా మా ఇంట్లోలేని ingredients తో చేసేవి చెప్తే ఎలా?
చూడండి వేణుశ్రీకాంత్ గారు ఎంత సింపుల్ గా చెప్పారో. ఈ రోజు నా breakfast, lunch (అరగంట తేడాలో) MTR దోశలే with priya lemon pickle :-)
మీ చుంబరస్కా అనబడు చక్రపొంగలి చేయుట వచ్చేవారానికి వాయిదా వేశా.
బావుంది మంచు గారు. దీనివల్ల ఏమర్థమవుతోందంటే నలభీములు కూడా మీలాగే అన్నీ కాపీ కొట్టి, పేర్లు మార్చేసి,,ఆడలేడీస్ చేసిన వాటిని తాము చేసినట్లు ఫోజులు కొట్టి పేరు తెచ్చుకున్నారని ....డౌన్ డౌన్ చుంబరస్కా...వర్ధిల్లాలి...చక్రపొంగలి..
ఆద్యంతం నవ్వి నవ్వి అలసట వచ్చింది .కుక్కర్ లో చపాతి ,తినగ మిగిలిన జీడిపప్పు ,ప్రతి లైన్ నవ్వే నవ్వు ,చాలా బాగుంది టపా .
టల్లోస్ గురించి చదివిన తరువాత చుంబరస్కా అనే పేరు చూసి నేను ఏమనుకున్నానంటే ,ఇదేదో రస్కులతో తయారు చేసిన స్వీటెమో, తయారు చేసినాకా ఎలా ఉందో అని వేడి ,వేడిది taste చేయబోతే మూతి కాలిందేమో ,అందుకని ఈ పేరు పెట్టి ఉంటారు అనుకున్నా.తీరా చూస్తే స్వీట్ కిచిడి.స్వీట్ కిచిడి ని తీసుకువెళ్ళి పేటెంట్ అడిగితే ఎవరు ఇస్తారండి.ఈసారి రస్కులతో బిస్కెట్ లో(ఒక shape లో),లేకపోతే రస్కులనే ఒక shape లో (ఆ shape ఏమిటో మీరు ఊహించగలరు)కట్ చేసి తీసుకువెళ్ళండి.దెబ్బకు పేటెంట్ ఇచ్చేస్తాడు.
శ్రావ్యగారు: ఎవరు పేరు పెట్టారు. ఎవరు ముందు చేసారు అన్నది ముఖ్యం కాదండి... పేటెంట్ వచ్చిందా లేదా అన్నదే పాయింట్. ఇప్పుడు చుంబరస్కా (అదేలెండి మీ బాషలొ అదేదొ పొంగలి) లంచం ఇచ్చా కదా.... అలాగే నాలుగురోజుల పాటు ఎదొ ఒకటి తినిపిస్తే వాడే ఒప్పుకుంటాడు...అంతకీ లొంగకపొతే నా బ్రహ్మాస్త్రం "చుంబరస్కా టల్లొస్" ఎలాగు ఉంది
--------------------
జయగారు : అదేంటండీ "ఎప్పటికీ రాదని" అలా అనేసారు...నేను ఇంకా మార్పులు చేర్పులు చేస్తున్నా.... అయినా ఆ అఫీసర్ ని మేనేజ్ చేసాలెండి...ఈసారి పనైపొద్దని పేటెంట్ బ్రొకర్ భరొసా ఇచ్చాడు కూడానూ ...
--------------------
కేక అనానిమస్ గారు : థాంక్యూ మీ కేకకి :-)
మీ వంటకం సూపరు...అయినా మీకు పేటెంట్ బహు భేషుగ్గా ఇచ్చెయ్యొచ్చు...ఎందుకంటే ఇది మన ఆడలేడీసు అనుకునే చక్రపొంగలి కాదండీ...దాని రెసిపీ వేరే...భలే నోరూరిస్తుందండీ మీ వెండిగిన్నెల్లో వంటకం..
సూపర్ ర్ ర్ ర్ :)))
ఇంకెప్పుడు చక్రపొంగలి సారీ, చుంబరస్కా చేయబోయినా మీ టపానే గుర్తొస్తుంది..
రంజని & కుక్కర్ తో చపాతీ మాత్రం కేక :))
ha ha..
nehu kuda milaage nuts neyyi vishayam lo..
Bhale comedy ga undi andi tapaa.
ఫ్రెండ్స్ (బ్లాగ్బ్రదర్స్ & ఇన్లాస్)
:D :D
కేక అంతే :)
బ్రేక్ ఫాస్ట్ పిజ్జ్అ కూడా పెట్టేయాల్సింది పనిలో పనిగా దానికి మాత్రం పేటెంట్ మీదే:)
జేబి గారు: ధన్యవాదాలు. ఫొన్ నంబర్ ఇస్తా....:-)
బంతి: థాంక్స్ బాస్. ఎవరెన్ని కుట్రలు పన్నినా మన దారులు మనకున్నాయ్ కదా :-) అయినా మనం బాగా చెయ్యగలం అని వీళ్ళకు కుళ్ళు వచ్చేస్తుంది :-)
మాలా కుమార్ గారు: ధన్యవాదాలు :-)
స్వప్న గారు: అవునండి ...ఈ మద్య కాస్త కాన్సర్ట్రెషన్ పెరిగింది. మీ కామెంట్ కి థాంక్స్ :-)
నేస్తం గారు : ఎదొ రకంగా మెచ్చుకున్నారు కదా.... థాంక్స్ :-)
సునీత గారు: థాంక్స్ అండి.... మీ కామెంట్ కి రిప్లయ్ రాసినప్పుడల్లా నాకు "సన్ ఐటా" గుర్తొస్తుంది :-) మీ సపొర్ట్ కి ధన్యవాదాలు
3జి : థాంక్స్ బాబు. మళ్ళీ పొస్ట్ ఎప్పుడేస్తావు నువ్వు. ఇకనుండి నువ్వు ఎక్కడ కనిపించినా ఇదే అడుగుతా ...
గురువు గారు: మీకొటి చెప్పలేదు..... హి హి హి.....పేరు వేరే చొట నుండి కొట్టుకొచ్చింది (ఈ సీక్రెట్ మన మద్యే ఉండాలి :-))
నాగా.... నీ పొస్ట్ ఇరగకుమ్మావ్ కదా....అద్గదీ
వేణూ గారు: మీర్ మరీను :-) ఒకసారి ఎవరొ మా గొదావరి వాళ్ళందరూ కేవలం కబుర్లు చెప్తారు... మీలా పంచ్ తొ రాయరు అన్నట్టు గుర్తు నాకు :-)
కృష్ణ గారు: హ హ హ... దేవుడి పాపం ఎం చెయ్యలేదు లెండి... నేను బాగానే చెస్తాను. మీ ఇంటావిడ మిమ్మల్ని మంచి కంట్రొల్ ఉంచుతున్నట్టున్నారు ...అదేలెండి బరువు విషయం లొ :-)
రాకేష్ : థాంక్స్ ...మరి మన మగజెంట్స్ ని ఓడించడం అంత వీజీనా :-)
కార్తిక్ : హ హ ...నీ పేరు పెడామనుకున్నా... కానీ ఆ రింగ్ టొన్ కి నువ్వు సూట్ అవ్వవు :-)
//మళ్ళీ పొస్ట్ ఎప్పుడేస్తావు నువ్వు. ఇకనుండి నువ్వు ఎక్కడ కనిపించినా ఇదే అడుగుతా ...//
ఇదిమరీ ఘోరమండీ... ఇంకా వారంకూడా అవ్వలేదు కష్టపడి రాసి మళ్ళీవెంటనేనా. ఇలా అయితే మీక్కనపడకుండా పారిపోతాగా....:))
మధురవాణి గారు: చాలా థాంక్స్ అండి. అయితే మీరు గమనించవలసిన విషయం ఒకటి ఉంది. మగవాళ్లందరిలొ ఒక నలుడు లాంటి వంటరాత్మ ఉంటాడండి. ఎదో మీకు అవకాసం కల్పించాలని పాకశాస్త్రం లాంటి కొన్ని కొన్ని శాఖలు మీకు ఇస్తూ ఉంటాం అంతే.. (ఆర్ధిక , హొం శాఖలు ఎలాగూ బలవంతం గా మీ లేడీస్ లాక్కుంటారు ..అది వేరే విషయం :-))
శిశిర గారు : ధన్యవాదాలు... అదేంటండి నేను ఇంతకస్ట పడిరాసినా ఇంకా ఎదో పొంగలి గట్ర అంటారు... మీరు నాకే సపొర్ట్ చెయ్యాలి:-)
రాజ్ : థాంక్స్ ... కానీ ఈ పొస్ట్లొ నువ్వు తప్పించుకున్నావ్... నీ పని తరవాత చూస్తా ...
తారా: ఎదొ ఫ్లోలొ వచ్చింది ఫాలొ అయిపొవాలి కానీ లాజిక్లు అడగకూడదు. అవును ఆ మా.......లిక టీమే
సాయి ప్రవీణ్ : థాంక్స్ .. మనం తలచుకుంటే కుమ్మని రంగం ఏముంది చెప్పు ..స్కేటింగ్ అయినా... ఫ్లర్టింగ్ అయినా .. మనం మనమే :-)
సౌమ్య గారు: కుళ్ళుకుంటున్నారా.... అయినా ఇవి చెయ్యడం చాలా వీజీ అండీ...నన్ను చూసి ఫాలొ అయిపొండి. మిమ్మల్ని టీం లొ కలుపుకున్నది ఆ చుంబరస్కా టల్లొస్ టెస్ట్ చేస్తారని . మిగతావాళ్ళని రుచి చూడమంటే పారిపొతున్నారు. మీరయితే ఎలాంటివయినా తట్టుకొగల స్టామినా ఉన్నవారు..... రోజు మీ వంటలు తిని తిని ఉన్న మీకు ఈ చుంబరస్కా టాల్లొస్ లాంటివి మీకు జుజుబి. కదా
శివ బండారు : థాంక్స్ అండి
కొత్తపాళీ గారు: :-)))) థాంక్స్ అండి....మా యెంకమాల మీరు ఉంటే కుమ్మేద్దాం అంతే ..
కృష్ణ ప్రియగారు : చుంబరస్కాటల్లొస్ ఫార్ములా కరక్టే అంటారు. ఎదొలెండి మనద్దిరికి కలిసి పేటెంట్ ఒకటి వస్తుంది కదా... ఆ చెప్పడం మర్చిపొయా ... మన ఎక్స్పెరిమెంట్స్ కి తట్టుకుని, మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగే దిట్టమయిన వ్యక్తిని ఒకర్ని చూసి ఉంచా... కానీ మనం మన పేటెంట్ వారితొ షేర్ చేసుకొవాలి మరి...తప్పదు.
జొకులు పక్కన పెడితే .. మీలాంటి చెయ్యి తిరిగిన (వేరే అర్ధం కాదండీ) రచయిత్రులు మెచ్చుకొవడం మంచి ఆనందాన్ని ఇస్తుంది. మీ చుంబరస్కా పేరుని ఫ్రీగా వాడుకున్నందుకు సారీ :-)
మనసు పలికే: ఇంకొసారి చక్రపొంగలి అంటే మాటా మర్యాద ఉండదు అమ్మాయ్ .... ఇంకొసారి అంటే చుంబరస్కా అని వెయ్యి సార్లు ఇంపొసిషన్ రాయించడమే, చుంబరస్కాటల్లొస్ తాగించడమో, లేక రెండూ .. ఏ శిక్ష అయినా పడొచ్చు నీకు :-)
రాధిక(నాని ) గారు: థాంక్స్ అండి... మన గొదారొళ్ళు తలచుకుంటే చేయ్యలేనిది ఏముంది చెప్పండి :-)))))
బద్రి: అదీ అయ్యింది బాబు.... ఇప్పటివరకూ ఎవరూ పేటెంట్ తీసుకుని ఉండరు అన్న ధీమాతొ మొన్నటి నెలలొ చక్కటి ఉల్లి దొశ పట్టుకెళ్ళి పేటెంట్ అడిగా.... అప్పుడు వాడి ట్రీట్మేంట్ ఇంకా భయంకరంగా ఉంది బాసు.... అందుకే ఆ విషయం ప్రస్తావించలేదు.
కల్పనా మేడం: కుళ్ళుకొండి అలాగే.... :-) అప్పుడప్పుడు కొంచెం నేర్చుకొండి మా దగ్గర :-)
చిన్ని గారు: థాలా థాంక్స్ అండి.
అను గారు: థాంక్స్ అండి....చ మీకొచ్చిన ఐడియా నకు వచ్చి ఉంటే అదే రాసేద్దును.... "ఆ షేప్ ఏమిటో మీరు ఊహించగలరు" అర్ధం కాలేదు కానీ పరువు పోకుండా ఎదొ ఒకటి ఊహించడానికి ట్రై చేస్తున్నా
కౌటిల్య గారు: థాంక్స్ అండీ.... అలా ఉండాలి సపొర్ట్ అంటే...
నిషిగంధ గారు: అద్గదీ.... సారీ అని వెంటనే మిమ్మల్ని మీరే కరెక్ట్ చేసుకున్నారు. థాంక్స్ అండీ :-)
జాబిల్లి గారు: ధన్యవాదాలు....
హరే కృష్ణ : అవును భలే గుర్తు చేసావ్.... బ్రేక్ఫాస్ట్ పిజ్జా మీద అన్ని హక్కులు నావే.... అదీ పెడతా ఉండు....
3జి: ఒకే జిల్లా పక్క పక్క ఊర్లు...నన్ను తప్పించుకుని ఎక్కడికి పొతావ్. అందులోను మన జిల్లా వాడు సాయ్ ప్రవీణ్ కూడా నాతొ కలిసాడు.
పేటెంట్ మిస్ అయినందుకు విచారిస్తున్నా. చైనా వాడి చికెన్ కి చాకుతో కన్నాలు/రంధ్రాలు చేసేయండి హోల్ చికెనవుతుంది. ఆతరవాత మిక్సీలో రుబ్బి, నెయ్యితో కాసేపు వేయించి పైన పొంగలిలో బాగా కలిపేస్తే "చికెన్ చుంబారస్కా ", అంతే! పేటెంట్ కి రెడీ!!
మంచు గారూ
మన మగ జెంట్స్ పరువు నిలబెట్టావ్. హమ్మో హమ్మో లేకపోతె ఈ ఆడ లేడీస్ ...కుక్కర్లో చపతీస్ లు అదుర్స్...ఈ అవిడియా ఏదో బాగుంది. మొత్తానికి పోస్ట్ అదుర్సో...అదుర్స్.
I cried badly while reading the post. ( I get tears when I laugh heartily)
ammo ammo....kedees kante mee vantillu chala neet ga undi...idanta ala cooker tiragesi chapateelu cheyyadam vallenena? naa daggara unna mookuduki mee daggarunna kukkar exchage offer -aalasinchina aasha bhangamu tvara padandee.....mee chumbaraska nenu chesesaanoch......
కృష్ణప్రియ గారి వంటలు చూస్తూ ఇక్కడికి వచ్చి పడ్డాను.
సగం దాకా చదివి చాలా ఖంగారు పడిపోయా, నాకొచ్చిన ఒక్కగానొక్క వంటకానికి పేరు మార్చేసారేంటా అని!!
మొదలంటా వెళ్ళి మళ్ళీ మళ్ళీ పేరు ఈ వంటకానిదేనా అని సరి చూసుకున్నాను. చిట్టచివరికి నా మనసు కాస్త నిశ్చింతగా నిలవగల ముక్క చెప్పారు...అదే -చక్రపొంగలే అని :)
చాలా బాగా వ్రాశారు..మీ way of narration చాలా బాగుంది..
Post a Comment