Pages

Saturday, August 21, 2010

అభినందనలు.... శుభాకాంక్షలు

***  శ్రీ  రామా  *** 




పవన్ కి,


క్రిందటి వారంలో జరిగిన ఎన్నికలలో అత్యధిక మెజారిటితో గెలిచి తమ గ్రామ సర్పంచ్ గా ఎన్నికయిన మా ప్రియతమ మిత్రుడు, ఆత్మీయుడు  కత పవన్ కుమార్ నాయుడికి అభినందనలు. చిన్నవయస్సులో తనకి అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ తన గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాలన్న తన ఆశయాన్ని నెరవేరేలా ఆ భగవంతుడు పవన్ కి సంపూర్ణ ఆయురారొగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. భవిషత్తులో మరిన్ని విజయాలు సాదించి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ........................




మధురవాణి గారికి 

అలరించే టపాలు, అద్భుతమయిన  ఫోటోలు, మధురమయిన భావాలు, చిలిపి జ్ఞాపకాలు, ఆటపట్టించే కామెంట్లు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరి బ్లాగర్లకు అందించే ప్రోత్సాహం .... వెరసి మధురవాణి. 

తన రిసెర్చ్ , పాటలు, సాహిత్యం, క్రీడలు, ఫోటోగ్రఫి... అసలు తనకి తెలీని సబ్జెక్ట్ , తనకి ప్రవేశం లేని కళ ఎముంటుందా అని అప్పుడప్పుడు ఆశర్యం కలుగుతుంది.


ఎవరి బ్లాగుకి ఎక్కువమంది ఫాలోవర్స్ తో రికార్డ్ వుందో తెలీదు కానీ , ఏ బ్లాగర్ కి ఎక్కువ బ్లాగులు ఫాలో అవడంలో రికార్డ్  వుందో మాత్రం తెలుసు... అది మన మేడం గారే :-))



మన మిస్ పనిమంతురాలు ఈ రోజు (ఆగస్ట్ 22) పెళ్లికూతురవుతున్న సందర్భంగా తనకి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.  భగవంతుని ఆశీస్సులతో వారి  వైవాహిక జీవితం సుఖ శాంతులతో ఆనందంగా సాగాలని మనసారా  కోరుకుంటూ .......

- మంచు