Pages

Monday, May 17, 2010

సూరిబాబు కరెంటు...ఇంకేంటి లేటు

*** శ్రీ రామ ***


అదేనండి.. సూరిబాబు ఆంటే మన సూర్యభగవానుడు.. రోజూ చూస్తాం కదా అని కాస్త చనువు కొద్ది ఆ పేరు అన్నమాట.. 'ఆ ఒక్కటి అడక్కు'లో రాజేంద్రప్రసాద్ "సూర్యారావు గారు" అన్నట్టు..

సూర్యుడు లేకపోతే భూమిమీద జీవరాశికి అసలు మనుగడే లేదన్న విషయం మనకు అందరికి తెలిసిందే కదా.. అందుకే ఆయన్ని దేవుణ్ణి  కూడా చేసేసాం .. సూర్యరశ్మి వల్ల కిరణజన్య సంయోగక్రియ జరిగి, మొక్కలలో పిండిపదార్దం తయారవుతుందని.. అదే మనకి ఆహారం తయారు చేస్తుందని అని.. గట్రా గట్రా చిన్నప్పుడు చదువుకున్నాం. అయితే ఆయన మనకి అందిస్తున్న వనరులన్నీ మనం పూర్తిగా ఉపయొగించుకుంటున్నామా ఆంటే లేదనే చెప్పాలి. సూర్యుడు అందించే అపారమయిన శక్తి లో ఈరోజు మనం చాలా కొద్దిశాతంమే మనం ఉపయోగించకోగలుగుతున్నాం. ఉచితంగా వచ్చే ఈ శక్తిని వాడుకోవడానికి ఏంటి సమస్య అన్నది చాలామంది కొచ్చే ప్రశ్న.. సో నాకు తెలుసున్నది వీలయినంత సరళం గా చెప్పడానికి ప్రయత్నిస్తా..

సూర్యుడి నుండి భూమికే చేరే శక్తి ముఖ్యంగా రెండు రూపాల్లో వుంటుంది..

1 . కాంతి
2 . ఉష్ణం

మన ఇండియా లాంటి భూమద్య రేఖకి దగ్గరగా వుండే ఉష్ణప్రదేశాల్లో సూర్యుడి శక్తి ఉష్ణం మరియూ కాంతి రూపం లో లభ్యం అవుతుంది .. అంటార్కిటికా లాంటి ద్రువాల దగ్గర వుండే ప్రదేశాల్లో మరియూ అంతరిక్షంలోనూ  సూర్యుడి శక్తి ఎక్కువ శాతం కాంతి రూపం లో వుంటుంది..

ఉష్ణం: సూర్యుడు ద్వారా వచ్చే ఉష్ణశక్తిని గ్రహించి, మన వాడకానికి అనువుగా మార్చడానికి మనం సోలార్ వాటర్ హీటర్ ని ఉపయోగిస్తాం.. బెంగళూరులో ఎక్కువ ఇళ్ళలో ఈ వాటర్ హీటర్లు మనకి దర్శనమిస్తూ వుంటాయ్.. టూకీగా చెప్పాలంటే.. ఎండ వేడితో నీళ్ళు కాచి అది ఫ్లాస్కు లో దాచి , మనకి కావలసినప్పుడు వాడుకోవడం అంతే. ఇళ్లలోనే కాకుండా, హోటల్స్ లో, లాండ్రిలలో, ఎయిర్ పోర్ట్ లలో వేడి నీరు కావాల్సిన ప్రతిచోట ఇవి ఉపయోగించవచ్చు.. అయితే మబ్బు పట్టినప్పుడు, వర్షం పడుతున్నప్పుడు వాతావరణంలో ఎక్కువ వేడి వుండదు కనుక అప్పుడు ఇవి ఎక్కువ వేడి నీటిని ఇవ్వలేవు.. అందుకే కమర్షియల్ ప్రొడక్ట్స్ లో సోలార్ హీటర్ లో కరెంట్ హీటర్ కూడా అమరుస్తారు.. ఒకవేళ సూర్యుడి వేడి లభించనప్పుడు కరెంట్ తో నీటిని వేడి చేసుకోవచ్చు.. టాటా బి పి సోలార్  మరియూ వోల్టాస్ కంపెనీలు ఇండియాలో తయారు చేస్తున్నాయని నాకు తెలుసు.. ఇంకా చాలా కంపెనీలు ఉండివుంటాయ్ .. వీటి ధర తక్కువే , నిర్వహణ ఖర్చు కూడా తక్కువే.. ఇక్కడ గమనించల్సినది ఏమిటంటే ఇవి హీటర్లు మాత్రమే.. దీనితో కరెంట్ ఉత్పత్తి చెయ్యలేం.. మీకు వేడినీళ్ళు ఎక్కువ అవసరం అనిపిస్తే కళ్ళుమూసుకుని కోనేయచ్చు :-)

కాంతి: సూర్యుడి అందించే ఇంకో శక్తి కాంతి రూపం లో వుంటుంది. సూర్యరశ్మి లోని ఈ శక్తిని వెలికి తీసి మనకి వాడకానికి అనువయిన రూపం లోకి మార్చడానికి మనం సోలార్ పేనల్స్ వాడతాం. ఒక్కో సోలార్ పేనల్ లో కొన్ని పదుల లేక వందల ఫోటోవోల్టాయిక్ సెల్ల్స్ వుంటాయి. మనకి కావాల్సిన పవర్ ని బట్టి సోలార్ పెనల్స్ వుండే ఫోటోవోల్టాయిక్ సెల్ల్స్ సంఖ్య  ఆధారపడి వుంటుంది. టూకీగా చెప్పాలంటే సూర్యరశ్మిలో వుండే ఫోటాన్లు ఈ ఫోటోవోల్టాయిక్ సెల్ లో వుండే electrons ని ఉత్తేజపరచడం ద్వారా కరెంట్ పుట్టిస్తుంది... DC రూపం లోవున్న ఈ కరెంట్ ని AC లోకి మార్చి మనం వాడుకుంటాం అన్నమాట.. అంతే కాకుండా దీంట్లో కొన్ని బాటరీలు అమర్చుకుంటే ..పగలు ఉత్పత్తి చేసిన విద్యుత్ దాంట్లో నిలువ ఉంచుకొని ..రాత్రి వాడుకోవచ్చు..
మనింటికి ఎవరయినా సేల్స్మెన్ వస్తే ..వాడు చెప్పిందంతా విని/వింటూనే ..మనం అడిగే మొదటి ప్రశ్న .. " అది సరే గాని ..దీని ఖరీదు ఎంత అని" .. అక్కడికే వస్తున్నా..

పైన బొమ్మలో చూపించినట్టు , సోలార్ పేనల్ 'సూర్యరశ్మి లోని శక్తి ని గ్రహించి  DC విద్యుత్చక్తి గా మార్చి' ఇన్వెర్టర్ కి అందిస్తుంది. అలాగే దానికి పక్కన తగిలించివున్న బాటరీ ని కూడా ఛార్జ్ చేస్తుంది.. ఆ ఇన్వెర్టర్ ఆ DC రూపం లో వున్న విద్యుత్ ని మనం వాడుకునే  AC విద్యుత్తు లోకి మారుస్తుంది. అలాగే సూర్యుడు నుండి శక్తి లభించనప్పుడు , ఈ ఇన్వెర్టర్ బ్యాటరి లో నిల్వ చేసి వున్న విద్యుత్చక్తిని మనకి అందిస్తుంది. ఆ బొమ్మలో చూపించిన వాటిలో సోలార్ పానెల్ తప్ప మిగతావన్నీ మనకి అందుబాటులో వున్న ధరలలోనే వుంటాయ్.. ఆ సోలార్ పేనల్ ఒక్కటే ధర తప్ప .. నిర్వహణ ఖర్చు ఇంచుమించు సున్నా ఆయినా ఆ సోలార్ పేనల్ కి మొదట్లో పెట్టాల్సిన పెట్టుబడి ఎక్కువ కాబట్టి ఇవి కొనడానికి ప్రజలు అంత ఉత్సాహం చూపించడం లేదు. అందులోనూ వడ్డీ రెట్లు ఎక్కువగా వుండే మన దేశం లో దానిమీద వచ్చే వడ్డీతో పోలిస్తే ఈ సోలార్ పేనల్స్ మీద పెట్టుబడి అంత ఆకర్షణీయం గా కనిపించదు. (మన దేశం లో బాంక్ వడ్డీ కన్నా తక్కువ  ఆదాయం వస్తూన్నా ఇంకా అలాగే కంటిన్యూ అవుతున్నది వ్యవసాయం మాత్రమే ).. 

ప్రపంచంలో ఎక్కువ సోలార్ పెనల్స్ కలిగివున్న దేశం జర్మని.. ఆ పవర్ అంతా ఇక్కడ ప్రభుత్వమో లేక పవర్ కంపెనీలో  ఉత్పత్తి చేసేది కాదు... అవన్నీ సామాన్యప్రజలు వాళ్ళ వాళ్ళ ఇళ్ళలోనో , పోలాల్లోనో  పెట్టుకున్నవే.. అంత ఖరీదయివుండి అంత మంది ఎలా సోలార్ పెనల్స్ అమర్చుకున్నారు ఆంటే ..  దానికి కారణం అక్కడి ప్రబుత్వ ప్రోత్సాహం.


ఇప్పుడో చిన్న లెక్క చూద్దాం.. 

జర్మనీ లో వినియోగదారుడు తను వాడుకున్న యూనిట్ కి చెల్లించే రేటు ఇంచుమించు 13 రూపాయలు.. అదే వినియోగదారుడు ఉత్పత్తి చేసి గ్రిడ్ కి సప్ప్లై  చేసే యూనిట్ కి ప్రబుత్వం ఇంచుమించు 26 రూపాయలు చెల్లిస్తుంది ..  జర్మనీలో ... మనకి నెలకి 300 యూనిట్ల విద్యుత్ వాడకం ఉందనుకోండి .. అప్పుడు మీరు నెలకి 600 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ పేనల్ కోంటే దాంట్లో 300 వాడుకుని మిగతా 300 యూనిట్లు ప్రబుత్వానికి అమ్మితే మనకి నెలకి 7,800 ప్రబుత్వం దగ్గర నుండి ఆదాయం వస్తుంది.. 3900 కరెంట్ ఖర్చు మిగులుతుంది.. ఇలాంటి సైజ్ వున్న సోలార్ యూనిట్ కొనటానికి ఇంచుమించు 15 లక్షలు అవుతుంది ..  ఈ లెక్కన మన పెట్టుబడి, వడ్డీ కలుపుకున్నా ఇంచుమించు పదమూడు, పద్నాలుగు సంవత్సరాలలో అంతా తిరిగి వచ్చేస్తుంది..  ఆకర్షణీయమయిన  ఇంకో విషయం ఎమిటంటే.. ఈ సొలార్ పవర్ పొడక్త్స్ కి 15 నుండి 20 సంవత్సరాల వారెంటీ వుంటుంది..


మన దేశం లో ఈ సోలార్ పానెల్ అదే ధర వుంటుంది.. మనం ఉత్పత్తి చేసి  తిరిగి గ్రిడ్ కి సప్లై చేసినా ప్రబుత్వం పైసా తిరిగి ఇవ్వదు. పోనీ మనకి కావాల్సింది మనం ఉత్పత్తి చేసుకుందామనుకున్నా.. ఇండియాలో కరెంట్ యూనిట్ ధర తక్కువ కాబట్టి ఇంత పెట్టుబడి గిట్టుబడి కాదు..


దీనికోసం కరెంట్ రెట్లు పెంచమని అడగలేం కదా :-) సరే చెయ్యాల్సింది.. సోలార్ పేనల్ ఖర్చు తగ్గించాలి..  మిగతా electronics (ఆంటే ఇన్వేర్టర్, బాటరీ, బాటరీ చార్జర్ .. గట్రా )  మన ఇండియా చైనాల్లో చాలా చీప్.. (కానీ మీకు 15 - 20 సంవత్సరాలు వారెంటీ కావాలంటే మాత్రం ఈ అమెరికన్ కంపనీదో జపాన్ కంపనీదో ఎంచుకోవాలి.. :-))..  సోలార్ పానెల్ ధర తగ్గించాలంటే దానిలో వాడే మెటీరియల్ ధర  తగ్గాలి, లేక అదే సోలార్ పేనల్ నుండి ఎక్కువ  పవర్ రాబట్టగలగాలి.. ప్రస్తుతం ఈ రెండు విషయాల మీద ప్రపంచవ్యాప్తం గా పరిశోధన జరుగుతుంది.. ఈ రిసెర్చ్ లో .. యూరోప్ , చైనాలు మాత్రం దూసుకుపోతున్నాయ్. అమెరికా కాస్త లేట్ గా కళ్ళు తెరిచి వెనుక పరిగెడుతుంది.. మన దేశం ఎక్కడుందో తెలీదు మరి..


మన దేశం లో ప్రబుత్వమే విద్యుత్ ఉత్పత్తి చేయిచ్చు కదా అనుకుంటే.. సోలార్ తో పోల్చిచూస్తే మిగతా మార్గాల్లో అత్యంత తక్కువ  ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేయగలిగినప్పుడు .. సోలార్ కి ప్రబుత్వం మాత్రం ఎలా ఖర్చుపెడుతుంది .. 

నాకయితే ఏదో అద్బుతం జరిగితే తప్ప వచ్చే 5 సంవత్సరాలలో మన దేశం లో  ప్రతి ఇంట్లో పెట్టుకోగల సోలార్ పేనల్స్ వచ్చే సూచనలు కనిపించడం లేదు.... ఏ  చైనా వాడో మాంచి చీప్ గా డెవలప్ చెయ్యగలిగితే తప్ప.. సో అదీ లేటు..


మంచు

గమనిక : ఎక్కువమంది కి అర్ధం కావడం కోసం , టెక్నికల్ కంటెంట్ వీలయినంత తగ్గించాను.. ఎవరికయినా ఆసక్తి వుంటే (నూతక్కి గారు లాంటి వారు ) నన్ను మెయిల్ ద్వారా  సంప్రదించగలరు.33 comments:

నేను said...

intresting statistics, మా స్కూల్ లో solar bulb ఉండేది, ఇక solar cooker కుడా ఉంటుంది, ఉడికేవాటికి బవుంటుంది, అన్నం, పప్పు గట్ర.

నీహారిక said...

ఇక్కడ కరెంట్ చౌకే కానీ కరెంట్ ఇవ్వాలి కదా!!
గ్రామాల్లో కరెంట్ కోత ఎక్కువ.ఓ పది పదిహేను సంవత్సరాల తర్వాత గ్రామానికి వెళ్ళి స్థిరపడాలంటే సొంతంగా పానెల్ కొనుక్కుందామనుకున్నాం. మంచి information ఇచ్చారు.

'Padmarpita' said...

Interesting and useful post...

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Nice post.
Two stupid questions:
If we want to generate power using Solar energy,
a) Do we need to get any permission from Govt.(India)?
b) What is the ROI when compared to Solar energy & the power we get from EB?

రమణారెడ్డి said...

చాలా మంచి ఇంఫర్మేషన్ ఇచ్హారు.నేను కూడా కొన్ని సంవత్సరాలు హైదరాబాదులో సోలార్ ఇండస్ట్రీ లో పని చేసాను.

Anonymous said...

even as per the stats provided by you its not feasible even in Germany.

Power cost per year with out solar power - 300*13*12= 46,800

Cost for solar power
A. Interest on 15 lacs @ modest 12% = 1,80,000

B. revenue from selling power = 7,800* 12 = 93,600

Net Cost = A-B = 86,400

so we end up paying 40,000 more

వేణూ శ్రీకాంత్ said...

మంచి వివరాలు అందించారు :-)

నేస్తం said...

సోలార్ కరెంట్ మాత్రమే వాడాలని నాకెప్పటి నుండో ఆశ.కాని అపార్ట్మెంట్స్ లో ఇది కుదరని పని..ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుందని విన్నాను..ఇక మీ మాట విన్నాకా కాస్త దైర్యం వచ్చింది.. ఇండియా వెళ్ళాకా ఎలాగన్నా మావారిని ఒప్పించాలి ...మంచి ఇంఫర్మేషన్ .. ధన్యవాదాలు

మంచు - పల్లకీ said...

అనానిమస్ గారు: జర్మనీ లొ ఇంటెరెస్ట్ రేట్ గరిస్టం 2%. మీరు చెప్పిన 12% జర్మనీ లొ 1965 కి ముందు వుండేది ఇప్పుడు కాదు .. ఇప్పుడు నాకు తెలిసి ఫిక్సెడ్ డిపాసిట్ కి ప్రపంచం లొ ఏ దేశం లొనూ (ఇండియా తొ సహా ) అంత ఇంటరెస్ట్ రేట్స్ లేవు..
-----------
మీరు బాంక్ నుండి అప్పు తెస్తే అది వెరే విషయం.. అప్పుడు ఈ వడ్డి రేట్స్ వర్తిస్తాయి.. కాకపొతే సొలర్ పేనల్ ఇన్శ్టలెషన్స్ కి స్పెషల్ APR వుంది. I am not sure how much it is, need to check.
--
జర్మనీలొ ఈ మద్యే వినియొగదారుడు సప్ల్లై చెసే యునిట్ కి 39 నుండి 26 కి తగ్గించారు ..

Thank you.

కొత్త పాళీ said...

టెక్నికల్ విషయాన్నీ, ఎకనామిక్సునీ చక్కగా చెప్పారు అర్ధమయ్యేలా. అభినందనలు.
ఇండియాలో జరగాల్సిన మహాద్భుతం ఏంటంటే, సోలార్ సెల్స్‌కి మూలపదార్ధమయిన సిలికాన్ బ్లాక్‌ని మనదేశంలో తయారు చెయ్యగలగాలి. ప్రస్తుతానికి భారత్లో సోలార్ పేనెల్స్ చేసేవాళ్ళు దీన్ని ఏదో ఒక రూపంలో బయటినించి కొని తెచ్చి, పేనెళ్ళని ఎసెంబుల్ మాత్రం చేస్తున్నారు. సిలికాన్ బ్లాక్‌ని తయారు చెయ్యడానికి సూపర్ క్లీన్ రూం కావాలి. అదీ మన దేశంలో చెయ్యడానికి అడ్డంకి.

Rao S Lakkaraju said...

మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

మంచు - పల్లకీ said...

@ నేను :-))
@ నీహారిక : అవును.. " పది పదిహేను సంవత్సరాల తర్వాత గ్రామానికి వెళ్ళి స్థిరపడాలంటే సొంతంగా పానెల్ కొనుక్కుందామనుకున్నాం " - నేను ఇదే అనుకుంటున్నా :-) ..
@ పద్మార్పిత : థాంక్యూ
@ రమణా రెడ్డి గారు :-) థాంక్యూ .. మీరు ఎలెక్ట్రికల్ ఇంజనీరా ?
@ వేణు గారు : థాంక్యూ :-))

మంచు - పల్లకీ said...

@ నేస్తం.. అపార్ట్మెంట్ లొ వుంటున్నా పర్లేదు.. మీరు బట్టలు అరేసే కర్రకే ఇదీ తగిలించండి..

http://jaajipoolu.blogspot.com/2010/05/blog-post.html

అప్పుడప్పుడు మీరు పట్టుకు నుంచున్నా పర్లేదు :-))
ఇండియాలొ ఈ సొలార్ పేనల్స్ బిజినెస్ పెట్టుకుంటే బెస్టెమో .. ఇక్కడే బొల్డు కస్టమర్లు వున్నారు :-)

మంచు - పల్లకీ said...

@ కొత్త పాళీ గారు .. ధన్యవాదాలు. టెక్నికల్ విషయాలు అందరికీ సరళం గా చెప్పడం చాలా కస్టం.. ప్రస్తుతం నేర్చుకుంటున్నా :-)

@ రావ్ గారు: ధన్యవాదాలు :-)

మంచు - పల్లకీ said...

Ganesh: Thank You.

1. I don't know the answer for this question in India. In USA, you must take permission from local utility (EB).
There is a difference between normal diesel generator and this solar based generation. Normal diesel generators would cut off grid and supply the house load so you don't need any permission, Where as solar would work mostly connected to grid. (to work without grid it must have batteries)

When you connect your system to grid, just imagine this scenario. When electrical lineman switches off the utility circuit breaker to perform some repairs on the distribution line and that time our solar panel supplies energy to the same line, then it is a severe safety hazard to that lineman. So we should use proper protective equipment approved by EB (local utility) to prevent this situation.

2. Since EB doesn't pay you back for your feed-in electricity in India, it is loss to have solar at this point of time.

-- having said this, if you are thinking of buying a solar heater.. just go ahead and buy.

మంచు - పల్లకీ said...

@ Anonymous: The avg interest rate for solar panels is around 6% in USA.

So for 15 lacks loan

monthly payment with 5% APR with 15 years loan term = Rs. 11862
Monthly payment with 6% APR with 17 years loan term = Rs. 11746
Money saved per month = Rs. 11700

So you can pay the loan within 17 years max and thereafter its all free :-))

you may want to add up to 1% for maintenance, which may increase your loan term by few years more.

Thanks
manchu

AMMA ODI said...

మంచి టపా అందించారు. సోలార్ ఎనర్జీ వినియోగం పెరిగితేనే మన దేశంలో కరెంట్ కష్టాలు తగ్గుతాయి. కాని సోలార్ పేనల్స్ ఖరీదూ!

రమణారెడ్డి said...

electronics & communication engineer

3g said...

మంచి పోస్ట్.......... మీరు చెప్పినట్టే ఇండియాలో పూర్తిస్థాయి సౌర విద్యుత్ వినియోగం ఇప్పట్లో సాద్యం కాకపోవచ్చు. కాని హీటర్ లాంటి వాటిని మాత్రం మనకున్న వనరుల్లోనే తయారుచేసుకోవచ్చు.

కొత్త పాళీ said...

@ వీరుభొట్ల వెంకట గణేష్
మీరు మీ యింట్లో సౌరవిద్యుత్తు వాడుకోవడానికి ఎవరినించీ అనుమతులు అవసరం లేదు. కానీ మీ ఇంటి పేనెల్స్ పుట్టించే విద్యుత్తుని గ్రిడ్‌కి అమ్మాలి అంటే అనుమతులు కావాలి. అనుమతే కాదు, అసలు ముందు మీ స్థానిక విద్యుత్ విపణి (Market)లో అలాంటి వెసులుబాటు ఉండాలి. నాకు తెలిసి అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఉంది - ఆంధ్రలో లేదనే నా అనుమానం. APTRANSCO వాళ్ళెవరైనా తెలిస్తే అడగండి.
ఇంకో ముఖ్యమైన సమాచారం.
The Non-Conventional Energy Development Corporation of Andhra Pradesh Ltd - వీళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే రాయితీ కార్యక్రమాలకి సంచాలకులు. హైదరాబాదులో ముఖ్య కార్యాలయం, జిల్లా కేంద్రాలన్నిటిలోనూ, పెద్ద నగరాల్లోనూ బ్రాంచిలున్నాయి. వీళ్ళ దగ్గర మంచి సమాచారం దొరుకుతుంది.

Kishen Reddy said...

Nice and informative post..Good :-)

Anonymous said...

@ manchu pallaki

even @ 6% interest rate the consumer is at benefit only if he can sell 50% of the produced power to the grid.

and i also opose govt. paying tax payers (others) money and that too double the prevailing rates to the solar power suppliers.

firstly y r ppl after solar power when it is so expensive & when cheaper power is available.

మంచు - పల్లకీ said...

Hi Last anon:

1. Yes it is true that you need size the unit to get the proper benifits. Its always with any other business not just solar.

2. There are several factors to pay double the money.
2.1 first of all, it is distributed generation. No transmission losses.
2.2 Its pollution free. No need to spend on different infrastructure to prevent the pollution including public health
2.3 We are running out of fuel sources (coal and other hydrocarbons). Need to start some process today before they are completely exhausted.
2.4 Any technology is costly during initial stages. Governments need to spend TAXPAYERS money to improve the technologies and reduce the cost. This is also similar to any other from satellite to water refineries
2.5 Not in all the countries , govt is paying extra, most countries utility is provided by private companies.

Hope this answers this questions.
Thank you

మంచు - పల్లకీ said...

@ అమ్మవొడి గారు : ధన్యవాదాలు.

@ గ గ గొ : మన జార్జిబుష్ కి చెబితే ఎంతసేపండి .. క్షణం లొ ఎదొ ఒక కొత్త సొలార్ పేనల్ కనిపెట్టెస్తాడు :-)

@ కొత్తపాళీ గారు ధన్యవాదాలు . మన ఆంధ్రాలొ ప్రభుత్వాలిచ్చే రాయితీ గురించి తెలుసుకొవాలని వుంది. googling చెస్తా

@ కిషన్ : థాంక్యూ

Rajendra Prasad(రాజు) said...

బాగుందండి ఫొస్ట్...మేము ఆల్రేడి సోలార్ హీటర్స్ వాడుతున్నాము....!!!!

హారం ప్రచారకులు said...

మంచు - పల్లకీ గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

Ram said...

excellent artcle and useful info.
Singer Chinmayi is also trying to get Solar power for her house. According to her, the guidelines for residential purpose are a bit ambiguous and not clearly defined.....
IF you follow her on Twitter, you can see her comments abt the same...1) Finally spoke to a Solar energy consultant. Running an AC alone on Solar power is not currently workable apparently and
2) even if we decide to go Solar for our home, the Government is very "ambiguous and unclear" abt offering subsidies for residential use
3)And my question is why? How come with all the power crisis and everything else are those who can afford to go Solar for their residences not
4)offered incentives to implement it? We desperately need alternate energy and how come there is no encouragement to take that path?
5)Not that I need any encouragement from the Govt to be environment conscious, but still, wish our country was more progressive.

madhuri said...

Very well expained in 'thete telugu' for lay persons, though interested in solar, like me.

interest bank ratu kanna thakkuva vachhinaa aaganidi vyavasayam....heartening statement.

madhuri said...

kotthapali garu has tapped the base of the problem.

మంచు.పల్లకీ said...

@ రాం గారు: ధన్యవాదాలు , అవును చిన్మయి గారు చెప్పెది కరెక్టే అనుకుంటా ..
@ మాధురి గారు: మీకు ధన్యవాదాలు.. అందుకేనండి.. నేను చెయ్యత్తి సెల్యూట్ చేసేది .. రైతుకి , సైనికుడికి .. మాత్రమే

tara said...

solar power initial investment teeseste unit 13rs ki vastundi manaki India lo, taruvata install and forget kaadu maintainance vuntundi, . eqiuipment mottam china nunhchi import chesukovali, ee madhya chinna chinna parts manake produce chestu avutunnai kaani mottam kaadu, govt. tax, investment credits ivvatam ledu ivi main problems, 10cr. investment vunte chala mandi dadapuga in mottam tayaru chese units india lo pettochu kaani aa matram interest kuda janalu chupinchamta ledu, govt. pattinchukokpovatame main reason.

seenu said...

మంచు మీ ఇంటి పేరా ? ఒక వేళ ఇంటి పేరైతే పర్లేదు ... కాకపోతే మధ్యలో DOT (మంచు. పల్లకీ ) తీసేయండి ... బాలేదు. మంచు పల్లకీ అని కంటిన్యూ గా చదివితే బావుంటుంది . ఇక పోతే ఈ మద్య నేను సోలార్ పేనల్స్ గురిచి నెట్ లో సెర్చ్ చేస్తున్నాను ... ఆ సమయంలో మీరు దానికి సబంధించిన పోస్ట్ రాయాడం చాలా ఆనదంగా ఉంది ... కృతజ్ఞతలు పల్లకి గారూ.........................

Snkr said...

Good info, I missed it. :)