Pages

Friday, February 25, 2011

అలిగితివా .. ప్రియసఖీ ... అలకమానవా...

*** శ్రీ రామ ***



అలిగితివా ప్రియసఖీ ... అలకమానవా... సారీ గీరీ అన్నా ... కాళ్ళా వేళ్ళా   పడ్డా... కుయ్యోమొర్రో అన్నా కరుణించవే చెలీ ...


ఇప్పుడు నీ అలక తీర్చేదేలా.... నా దారికి తెచ్చుకునేదేలా..  


గడ్డం పుచ్చుకుని బ్రతిమిలాడో
బుగ్గన మిఠాయి పెట్టో
ఐమాక్స్ సినిమాకి తీసుకేళ్లో
నీకు నచ్చనివాళ్ళేవారయినా వుంటే వాళ్ళని కసిదీరా తిట్టో
నీకు తెలీకుండా సెల్ ఫోన్ లో నీకు నచ్చిన సాంగ్ లు ఎక్కించో  :-)
వేడి వేడి అన్నం లో పప్పు నెయ్యి ఆవకాయ కలిపి తినిపించో
నువ్వు లేచేసరికి ఒక వందో రెండొందలు గులాబీలు నీ మంచం పక్కనే పెట్టి నిన్ను సర్ప్రైజ్ చేసో
నీకు నచ్చిన సీన్ ఏకపాత్రాభినయం చేసో
నీకు నచ్చిన పాట పాడకుండా ఆపుకునో
నీ పుట్టిన రోజుకి బుడబుక్కలోడి వేషంలో వచ్చి విషెస్ చెప్పో 
నిద్రపోయేముందు చందమామ కధలు చదివి వినిపించో
బంకమట్టి తో స్వయంగా ఒక కుండిచేసి నీకిష్టమయిన గులాబీ మొక్కలేసో
ఎగ్జిబిషన్ లో ఏనుగు ఎక్కించో

వర్షం నీటిలో ఆడుకోవడానికి కాగితం పడవలు చేసిచ్చో
నిన్ను పొగుడుతూ నాకే అర్ధంకాని కవిత రాసో
దొంగచాటుగా పక్కింట్లోంచి ఎత్తుకొచ్చిన జామకాయలకి ఉప్పు కారం అద్దిచ్చో 
ఘల్లుఘల్లుమనే పట్టీలు గిఫ్ట్ గా ఇచ్చో
ఎండలో నడుచుకోస్తుంటే  బైక్ మీద ఇంటిదగ్గర డ్రాప్ చేసో
మన ఊరి చెరువులో చేపలు పట్టడం నేర్పించో
చెరువుగట్టుమీద మామిడిచేట్టుమీద కోతికొమ్మచ్చి , గోల్కొండలో దొంగ పోలీస్ ఆడించో
బీచ్ లో బర్త్ డే కేకు కట్ చేయించో
వర్షంలో బైక్  మీద తీసుకెళ్ళి జొన్న పొత్తులు తినిపించో 
చేతులకి గోరింటాకు పెట్టో
కొత్తిమీర పచ్చడి చేసిపెట్టో


ఏంటి ఇన్ని చేస్తానన్నా కూడా మాట వినవా... అలకమాని పలకరించవా ... అయితే.....


నీ చెయ్యి వెనక్కి మడత పెట్టో
నీ జడ మంచానికి కట్టేసో

తలుపెనకాల  దాక్కుని  భయపెట్టో 
నేను పాటపాడి వినిపించో
నీకు
రాత్రంతా ఒక వెయ్యి మిస్సేడ్ కాల్స్ ఇచ్చో  


ఏదో ఒకటి చేసి మాట వినేలా చేస్తా... పెంకి పిల్లా...




నోట్: జస్ట్ ఫర్ చేంజ్, అంతే :-)


- మంచు