Pages

Tuesday, December 28, 2010

బ్రెడ్ హేటర్స్ కొసం..........:-)

 *** శ్రీ రామ ***

అసలు ఈ రెసిపి మన హరేకృష్ణ కోసం రాసింది... విజయనగరం కుర్మాలు తిని తినీ బోర్ కొట్టిందన్నాడు అని టిఫిన్ కోసం రాసిచ్చా... ఈ రోజు ఇందు గారు పోస్ట్ మరియు కామెంట్స్ చూసాక అందరికోసం పోస్ట్ చెయ్యాలనిపించింది. 
బ్రెడ్ తో బోల్డు రెసిపిలు ఉన్నాయి కానీ సింపిల్ గా పదినిముషాలలో అయిపోయే బ్రేక్ఫాస్ట్ కాబట్టి ముందు ఇది ....

స్టెప్  -1 
  • ఉల్లిపాయ , పచ్చిమిర్చి, కాప్సికం, టమోటా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకొండి (నా అంత పర్ఫెక్ట్ గా మీరు కోయ్యలేక పొతే మీకు చేతనయినట్టు ఎగుడుదిగుడుగానే కోసుకు పెట్టుకోండి 
  • మోజరిల్లా చీజ్ కోరుగా తీసి పెట్టుకోండి.
  • సాల్ట్ , పెప్పర్ పక్కన పెట్టుకోండి (ఉంటే కాస్త oregano కూడా)
  • కొత్తిమీర కొన్ని ఆకులు  
  • బ్రెడ్ (నేను ఇక్కడ వాడింది బ్రౌన్ బ్రెడ్.... కానీ దీనికి ఇటాలియన్ బ్రెడ్ గానీ  సౌర్(sour) బ్రెడ్ గానీ అయితే బావుంటుంది )


స్టెప్-2 

ఒక పాన్ లో బ్రెడ్ స్లైస్ బటర్ తో కానీ ఆయిల్ తో కానీ  రెండు  వైపులా  కొంచం వేపించండి.... లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక దానిపై  ముందు కోసుకుపెట్టుకున్న ఉల్లి, కాప్సికం, టమోటా, పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్ అండ్ పెప్పేర్ వేసి ఆ పైన చీజ్ తురుము వెయ్యాలి.. (ఉంటే కాస్త oregano కూడా పైన చల్లాలి)  ... ఏది  ఎంత  వెయ్యాలి  అని కొలత ఏమీ లేదు ...  మన ఇష్టం... ఆ పైన కాస్త కొత్తిమీర ఆకులు వెయ్యాలి.


అన్ని వేసాక దానిమీద మూత పెట్టి ఒక ఐదు నిముషాలు అలానే స్టవ్ మీద తక్కువ వేడి లో ఉంచాలి (ఎక్కువ వేడి పెడితే బ్రెడ్ కింద మాడిపోవచ్చు..చూస్తూ ఉండండి)....... 


 చీజ్ మొత్తం కరిగిపోతే ...తినడానికి బ్రేక్ ఫాస్ట్ రెడీ అయిపోయినట్టే....కొంచెం క్రిస్పీగా, చీజీగా భలే ఉంటుంది.


స్టెప్-3
 
ఇక టమోటో సాస్ వేసుకుని లాగించడమే..... కొద్ది కారంగా కావాలనుకుంటే రెండు స్పూన్స్ టొమాటో సాస్ మరియు ఒక స్పూన్  టొబాస్కో సాస్ కలిపితే...హాట్ అండ్ స్వీట్ సాస్ రెడీ....
- మంచు

49 comments:

నేస్తం said...

హూం .. బాగుంది సార్.. బ్రెడ్ తో బ్రేక్ఫాస్ట్ కి ఎన్ని వెరైటీలుంటే అంత మంచిది మా పిల్లల తల్లులకు..బ్రహ్మ చారులు/చారిణీలకు ..అయితే మరి ఉల్లిపాయలు వేగిపోతాయా ?అటు త్రిప్పి వేపకుండానే???

శివరంజని said...

మొదటి కామెంట్ నాదే ... మంచు గారు మీరు వంటల్లో కింగ్ అన్ నాకు తెలియదు అయినా కూడా విజయ నగరం వాళ్ళతో పెట్టుకోకండి వాళ్ళకి లా మీరు సున్నుండలు , బొబ్బట్లు చేయలేరు ...వాళ్ళకి లా మీరు తినలేరు

Bhardwaj Velamakanni said...

LOL, I know what the next post is ...

"How to burn the calories that you have accumulated from a fatty breakfast" :P

మనసు పలికే said...

>>నా అంత పర్ఫెక్ట్ గా మీరు కోయ్యలేక పొతే మీకు చేతనయినట్టు ఎగుడుదిగుడుగానే కోసుకు పెట్టుకోండి
అంత బ్రహ్మాండంగా కోస్తారా;)

krishna said...

నా అంత పర్ఫెక్ట్ గా మీరు కోయ్యలేక పొతే మీకు చేతనయినట్టు
____________________________________________________________
ఏమిటండి ? కోతలా :P
just kidding :)

నాగప్రసాద్ said...

>>"నా అంత పర్ఫెక్ట్ గా మీరు కోయ్యలేక పొతే...."

ఏమిటేమిటీ, ఆ ఉల్లిపాయలు, టమోటాలూ మీరు కోశారా?!!అక్కడున్న కత్తి మొహం చూస్తేనే తెలుస్తోంది. ఆ కత్తికి ఉల్లిపాయ ముక్క కానీ, లేదా కనీసం టమోటా రసం గానీ అంటలేదు. అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలి. లేదా అబధ్దాలు ఎలా చెప్పాలో తెలియకపోతే, నా దగ్గర కోచింగ్ తీస్కోండి. :-))

krishna said...

@ నాగ ప్రసాద్ , అర్ధం చేసుకోరు :) మంచు గారు కోసినవి కోతలు లెండి..

మంచు said...

నేస్తం గారు: థాంక్స్.... ఉల్లిపాయలు పూర్తిగా వేగవు... పిజ్జా మీద ఎలా ఉంటాయో అలానే ఉంటాయి :-)
శివ: నా బ్లాగ్ కి మొదటి కామెంట్ కొసం కొట్టుకొవడం ఎమిటి తల్లీ... :-) విజీనగరం తొ కాస్త జాగ్రత్తగా ఉండాలంటావ్... సరే ;-)
మలక్: హ హ హ.... బ్రేక్.ఫాస్ట్ రాజులా తినాలట... లంచ్ నీ స్తొమత కొద్దీ తినాలట... డిన్నర్ పేదవాడిలా తినాలట ... సొ బ్రేక్ఫాస్ట్ ఈ మాత్రం కాలరీస్ పర్లెదులే....

ఆ.సౌమ్య said...

ఇంతకన్నా easy పద్ధతి ఇంకోటుంది

sandwhichmaker ఉన్నవాళ్ళు దీన్ని అందులోనే చేసుకోవచ్చు. లేనివాళ్ళు కూడా రెండు బ్రెడ్ ముక్కలు తీసుకుని వాటికి ఒక పక్క నెయ్యి లేదా వెన్న రాయాలి. ముందు ఒక ముక్క పెనం మీద పెట్టి దానిపై cheese slice పెట్టి ఆపైన ఇంకో బ్రెడ్ ముక్క కూడా పెట్టి దాన్ని అటు ఇటూ ఎర్రగా కాల్చుకోవాలి. (నెయ్యి లేదా వెన్న రాసిన భాగాలు పైకి, కిందకి రావాలి.) అంతే బ్రహ్మాండమైన chees sandwhich రెడీ. చీజ్ కాకూండ ఇంట్లో ఉన్న వేరే కూర ఏదైనా కూడా మధ్యలో పెట్టుకోవచ్చు. చీజ్ తో పాటు టమాటా ముక్క్లౌ, దోసకాయ ముక్కలు అలా ఏవైనా కూడా కలిపి పెట్టుకోవచ్చు.

3g said...

మీ ఐటం ఫొటో చూస్తుంటే పిజ్జా కి పిన్ని కూతురిలా కనిపిస్తుందేంటి... అయినా ఏదోటి.. దీనికో మాంచి పేరెట్టి ఏ మెక్ డొనాల్డ్ వాడికో రెసిపి అమ్మెయ్యండి.

మంచు said...

అప్పు: జూం చేసి చూడమ్మా....:-)
కృష్ణా : పైన కామెంట్ చూసి నాకు అదే తట్టింది ఎవరు రాస్తారా అనుకున్నా :-)
నాగా : బాబు ఆ కత్తిని సొంత తమ్ముడి కన్నా ఎక్కువుగా చూసుకుంటా బాబు... ఆ సెట్టు 120 డాలర్లు... అది , నా చేతులు కడుకున్నాకే కెమెరా ముట్టుకునేది. చూసావా దానికి సెపెరేట్ గా టిష్యూ బెడ్డు :-)

మంచు said...

సౌమ్య : అలా చేస్తుంటే చందు గారి కి నచ్చడం లేదట... (కూర పెట్టింది నచ్చుతుంది కానీ...ప్లైన్ చీజ్ టొస్టు నచ్చడం లేదట ) :-) అందుకే ఇది

మనసు పలికే said...

హ్మ్.. జూం చేసి చూడటం రాక కాదు మంచు గారూ.. ఆ కత్తి వాలకం, ఇంకా ఆ తరిగిన ముకల్ని చూసాక, 120 డాలర్లు పెట్టి కొన్న ఆ కత్తిని మీరు కూరగాయలు తరగడానికి ఉపయోగించరనిన్నూ, ఆ కూరగాయల్ని ఏదైనా ఎలక్ట్రిక్ కట్టర్‌లో పెట్టి తరిగి ఉంటారనిన్నూ నా అనుమానం అధ్యక్షా...;)

మంచు said...

ఎలెక్ట్రిక్ కటర్స్ ఒకసారే పనిచెస్తాయి... ఆపై పేస్టే... అంత వీజీ గా అయిపొతే ఇక అంత డబ్బు తగలేసి ఈ కత్తులు కటార్లు కొనుక్కొవడం ఎందుకు :-)
ఆ కత్తి పెట్టింది....కొసింది దానితొ అని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికే

Indian Minerva said...

ఇదిచూశాక బ్రెడ్డు సంగతేమోగానీ ఆ కత్తినికొనాలనుంది :)

రూములోఎక్కడో పడివున్న sandwitch makerని కిందకి దించాల్సిన సమయమాసన్నమయ్యింది. దాంతో 'లావోరియన్ సాండ్‌విఛ్ (ప్రస్తుతానికి పేరుమాత్రమే ఖాయంచేసాను రెచీపీ అయ్యాక చూద్దాం) చెయ్యాలని మనసు వువ్విళ్ళూరితున్నది.

మనసు పలికే said...

లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్లు, వేటిని దేనితో కట్ చేసారో మీకు ఆ భగవంతుడికే తెలియాలి..;) అసలు మీరే కట్ చేసారో లేదో కూడా..:))
మొత్తానికి ఆ కత్తి మాత్రం నాకు తెగ నచ్చేసింది. ఒక కత్తి నాక్కూడా ఇలా పడేద్దురూ..;)

Sree said...

recipe bagundi manchu garu.. yum, yum, yummy gaa undi choodataaniki.. chichkoo (my daughter) chesi pettestaa oka roju..

and yes.. katti matuku chaala chaala chaala bagundi... daani cushion bed kooda adurs :).

కత్తి లాంటి కుర్రోడు said...

మంచు గారి పోస్టు చదివి జనాలు కత్తికి ఫేన్స్ అయ్యిపోయారా ? అప్పారావ్ వింటున్నావా :P

ఇందు said...

మంచుగారూ! నిన్న పోస్ట్ పెడతా అని చెప్పి ఇవాళ పెట్టేసారు! ఆహ! ఎంత మంచోరండీ మీరు!! ఈ ఐటం బాగుంది కాని చీజ్ ఏ కొంచెం డౌట్.అయినా పిజ్జాలాగా భలే కలర్ఫుల్ గా ఉంది.అర్జెంట్గా చేసుకు తినేయాలి :) నాకు తెలిసి 99.99% చందుగారికి ఇది నచ్చితీరుతుంది.ఎందుకంటే పిజ్జా బానే తింటారుగా! సో! మంచుగారు..మీ వంట సూపర్బ్!

ఇక మీ పోస్ట్ గురించి చెప్పాలంటే...టైటిల్ సూపర్!మాటీవి 'మా ఊరివంట ' లో 'కావల్సిన పదార్ధాలు ' చూపించినట్లు....భలె డిస్ప్లె పెట్టారుగా!అసలు ఆ లాస్ట్ పిక్ ఎంత యమ్మీ గా ఉందో!

>>(నా అంత పర్ఫెక్ట్ గా మీరు కోయ్యలేక పొతే మీకు చేతనయినట్టు ఎగుడుదిగుడుగానే కోసుకు పెట్టుకోండి)
----------------------------------
ఏమిటండి ? కోతలా :P
just kidding :)

Hahahaha.....ROFL

మొత్తానికి మీ గోదావరి అబ్బాయి టేస్ట్ కి తగ్గట్టుగా ఒక మాంఛి బ్రెడ్ రెసెపీ(పేటెంటెడ్)చెప్పినందుకు బోలెడు థాంకూలు మీకు :)

ఇందు said...

అడగటం మర్చిపోయా? ఇంతకీ దీని పేరేమిటి? ఇది చేసి చందుకి పెడితే...'ఈ పదార్ధం నామధేయమేమీ ' అని అడిగితే నేను చెప్పాలి కదా.... పోని... 'మంచుగారి...బ్రెడ్ పిజ్జా ' అని అనుకుందామా?ఈ టైటిల్ ఒకే ఐతే...పేటెంట్లో నాకు భాగం ఇవ్వాలి మరి :P

Kalpana Rentala said...

మంచు గారూ,

ఈ రెసెపీలన్నీ మగవాళ్ల కోసం కదండీ...ఎందుకంతే...ఇలా సులువుగా...బోలెడు కాలరీలతో..చాలా చాలా రుచికరంగా వంటలు చేసుకునే శక్తి ఆడవాళ్ళకెక్కడిదండీ? మా ఇంటాయనకు ఆ రెసెపీలు పంపిద్దూరు:-))

జయ said...

మీరు చెప్పిందంతా నేను పిజ్జా బేస్ కొనుక్కొచ్చి అవెన్ లో చేస్తాను. పోన్లెండి ఇంక బ్రెడ్ తో ఇలా పాన్ మీద చేసేసి మా అబ్బాయిని బురిడీ కొట్టించేయొచ్చు. ఈ పేటెంట్ మాత్రం తప్పకుండా మీదే:)

హరే కృష్ణ said...

ఆ చాకు భలే ఉంది inception లో mal కూడా ఇలాంటిదే use చేస్తుంది రెండు సార్లు :)

thank you once again :-)

మాలా కుమార్ said...

మంచుకొండ ,
చాలా బాగుంది బ్రెడ్ పీజ్జా . ఆ కత్తేదో నాకూ ఓటి పంపిద్దురూ :)

Anonymous said...

అన్న అభిమాన సంఘం మళ్లీ పుట్టింది


ఇక్కడ నొక్కండి ....ప్రపీసస 2.0

రాధిక(నాని ) said...

చాలా బాగుందండి.ఫోటోలైతే ఇంకా సూపర్ నోరురిస్తూ :))నా అంత పర్ఫెక్ట్ గా మీరు కోయ్యలేక పొతే మీకు చేతనయినట్టు ఎగుడుదిగుడుగానే కోసుకు పెట్టుకోండి:))

రాధిక(నాని ) said...

మర్చిపోయా కత్తి తళతళా మెరుస్తూ బాగుంది .అందరం మీ కత్తికి దిష్టి పెట్టేసాం ..దిష్టి తీసుకోండి :)) 120డాలర్లు పోసి కొన్నానన్నారు:D.

వేణూ శ్రీకాంత్ said...

మంచుగారు ఏమాటకామాటే చెప్పుకోవాలి... నిజంగానే మీరు ప్రొఫెషనల్ చెఫ్ లాగ తరిగారండీ కూరలు, సూపర్ :-)

హ్మ్ ఇక రిసిపీ అంటారా... పిజా రేంజ్ లొ చేశాక ఇంకేమంటాం ఏదోలా లోపలికి తోసేస్తాం :-)

ఇందు said...

వేణుగారూ! ఏదోలా లోపలికి తోసేయడం ఎందుకండీ? అంత బాగుంటేనూ? చక్కాగా ఆస్వాదిస్తూ తినొచ్చు! బీ పాసిటివ్ అండీ...బీ పాసిటివ్ :p

మంచు said...

అప్పు: నీ పని చెప్తా... ఇక్కడ కాదు...
శ్రీ గారు: చాలా థాంక్స్ ... కత్తి గురించి కింద వేరే ఒక కామెంట్ రాస్తాను చూడండి.
కత్తి లాంటి కుర్రోడు : హి హి... కత్తి వెరే పదం చెప్పవొయ్... అదే వాడదాం

మంచు said...

ఇందూ గారు: చీజ్ లొ డవుట్ ఎముందండీ.... ఒక మీడియం పిజ్జా మీద వేసే చీజ్ తొ వారానికి సరిపడా బ్రేక్ ఫాస్ట్ చెయ్యొచ్చు. డిన్నర్ కి పిజ్జా తినడం మంచిది కాదు కానీ... బ్రేక్ఫాస్ట్ కి చీజ్ ఒకే... చీజ్ గురించి చాల అపొహలు ఉన్నట్టున్నాయి... నేను వివరిస్తాలెండి.

మా మేనకొడలు (యూ కే జీ చదువుతుంది) మాటీవిలొ మా ఊరి వంట చూసి చూసి ..ఒక సారి వాళ్ళమ్మా హొం వర్క్ చెసుకొవచ్చు కదా అని సతాయిస్తుంటే.. ఇది " ఉండమ్మా కావాల్సిన పదార్దాలు తీస్తున్నా" అన్నాది. ఎమిటా అని చూస్తే దానికి బుక్స్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్ హొంవర్క్ చేసుకొవడానికి కావాల్సిన పదార్దాలు అట :-))

కొసేదీ.... కొతల్స్ కాదండీ కూరల్స్ మాత్రమే .. మీకు తెలీనదేముంది... గొదావరి అబ్బాయిలు కొతల్ కొయ్యరు కదా పాపం :-)

మంచు said...

కల్పన గారు: మీ ఇంటాయనకు వెజ్ ఎమిటండీ.... మాంచి మసాల తొ కొడతాను... ఉండండీ...

జయ గారు: మీకు అవెన్ ఉంటే ... ఆ పిజ్జా బేస్ ఎలా చెయ్యలొ నేనే చెప్తా.... చాలా ఈజీ .... కానీ బ్రెడ్ కాకుండా పిజ్జా బేస్ అయితే తప్పనిసరిగా పిజ్జా సాస్ వాడాలి లేకపొతే అంత బాగొదు.

హరే...అవును అదే కత్తి బాస్... నాకు అప్పుడప్పుడూ అలా వాడాలని ఉంటుంది.... కానీ ఎవరు దొరకక అది ఎలా కూరలమీద కొళ్ళ మీద వాడాల్సి వస్తుంది. :-D

మాలా కుమార్ గారు: ఒకటేంటండీ ...సెట్టె పంపిస్తా చూడండి...

రాధిక గారు: థాంక్స్ ... ఇవన్నిటికీ మన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అద్దిన దిబ్బరొట్టే ఇన్స్పిరేషన్ కదండీ :-)

వేణూ గారు: ఆ కత్తి అక్కడ పెట్టింది.... బ్రెడ్ చేదుగా ఉంటుంది చెత్తగా ఉంటుంది అన్నవాళ్ళని బెదిరించడానికి.... అర్ధం అయింది అనుకుంటాను :-D

ఇందు said...

హ్హహ్హహ్హా! గోదావరి అబ్బాయిలు కోతలు కొయ్యరా? హ్హహ్హహ్హ..జోక్ ఆఫ్ ది ఇయర్.సరే గానీ మీరు అర్జెంట్గా పార్టీ ఆఫెసుకి అదే నా బ్లాగుకి వచ్చి అక్కడ మనల్ని సవాల్ చేస్తున్న ఇడ్లీ బాచ్ కి తగిన సమాధనం చెప్పాలి అధ్యక్షా!

మంచు said...

http://www.chicagocutlery.com/index.asp?pageId=1&catId=23&bid=78

అందరికీ ..ఈ లింక్ చూడండి... ఇందులొ
Landmark® 12-pc Block Set

అని ఉంది కదా.... అదన్నమాట... అది 199 అని ఉంది కానీ ఆఫర్ లొ 99. దాంట్లొ సుంటొకు, పంటొకు (జపనీస్ తిట్లు కాదండీ... అవి కత్తుల పేర్లు) లేవు కాబట్టి

Landmark® Partoku & Santoku Set

కొనండి...

వీటితొ సెట్ కంప్లీట్ అవుద్ది. అయితే అప్పుడే కొనకండి... నేను ఇంకా నా కమీషన్ ఎంతొ ఆ కంపెనీ వాళ్ళతొ మట్లాడుకొలేదు... అది ఫైనలైజ్ అయ్యాకా నా పేరు ఆ కంపెనీ వాళ్ళకి చెప్పి, మీరు చెప్పుకుని
మీరు విచ్చలవిడిగా మీకు, మీ బంధువులకి, పక్కింటివాళ్ళకి కూడా కొనేసుకొండి.

మంచు said...

Indian Minerva గారు

ప్లీజ్ ప్లీజ్ ... మీ " లావోరియన్ సాండ్‌విచ్ " పేరు నాకు ఇవ్వరా ? నేను దీనికి పెట్టేసుకుంటా...

geetika said...

మొత్తానికి బ్లాగుల్లో బిజినెస్ మొదలు పెట్టేశారన్నమాట.

ఏదేమైనా మీ పోస్టేకాదు కామెంట్స్ కూడా చాలా బాగున్నాయండీ మంచు గారు...

geetika said...
This comment has been removed by the author.
geetika said...

So... ఐటమ్స్ కోసమే కాదు టైటిల్స్ కోసం కూడా కొట్టేసుకుంటున్నారన్నమాట..!

just kidding...

Snkr said...

ఆఁ ఇది బ్రెడ్ పిజ్జా, అసలైన ఆంద్రశాకము గోంగూర ఎక్కడ? (వంగర-మాయాబజార్) :)
బాగుంది, మంచు. మీ చీజ్-బ్రెడ్ శాండ్విచ్ ఓ సారి ట్రై చేస్తా.

Sravya Vattikuti said...

అకట సాండ్విచ్ కొసం ఇన్ని ఇక్కట్లా :)

నేస్తం said...

మీ ప్రొఫైల్ ఏదో కుకింగ్ బ్లాగ్ ఉంది కదా
ఎప్పుడు ఏమీ రాయరేంటి ?దాంట్లో రాయకుండా మీ బ్లొగ్ లొ రాస్తున్నారు ఎమిటీ..అందులో వ్రాస్తే బాగుంటుందేమో.. ఒక సారి ఆలోచించండి

మంచు said...

గీతిక గారు థాంక్స్ అండీ... బిజినెస్ అవకాసం ఎక్కడ వచ్చినా వదలకూడదు కదండీ... :-) ఈమద్య టైటిల్స్ కే ఎక్కువ ఇంపార్టన్స్...
SNKR గారు గొంగూర తొ వెజ్ వంటాకాలు ఎమీ నచ్చవు నాకు :-))
శ్రావ్య గారు: ఇక్కట్లేంటండీ చిన్న సైజు బ్లాగు ప్రపంచం యుద్దమే జరుగుతుంటే .. ఇందూ గారి బ్లాగ్ చూడండి.
నేస్తం గారు: దానికొ పెద్ద చరిత్ర ఉంది. తీరిగ్గా చెప్తా.... :-)

శివరంజని said...

మంచు గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

జయ said...

మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.పిజ్జా బేస్ నేర్పిస్తానన్నారుగా...ఇంకెప్పుడూ.

జయ said...

మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.పిజ్జా బేస్ నేర్పిస్తానన్నారుగా...ఇంకెప్పుడూ.

బులుసు సుబ్రహ్మణ్యం said...

2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

Anonymous said...

మీ రెసిపి బాగుందండీ. ఇంచుమించు ఇలాంటిదే ఇక్కడ బెంగుళూరులో ఒక మళయాళీ షాపులో తిన్నాను.
నేను గుజరాత్ లో (బ్రహ్మచారిగా) ఉన్నప్పుడు అక్కడవాళ్ళ తీపి వంటలు తినలేక మన ఆవకాయో, మాగాయో, టమాటొ లేదా గోంగూర పచ్చడో రెండు బ్రెడ్డూ ముక్కల మధ్య పెట్టుకుని తినేవాళ్ళం. మీ అంత ఓపిక లేదు మరి.

రాధిక(నాని ) said...

నూతనసంవత్సర శుభాకాంక్షలండి .

Ennela said...

Yento! ippatike inni vantalu kanipettina indians ni tittukoni roju ledu....ippudu meeru bread tho kuda vividha rakamulu chesi choopiste naa gatemkaanu? konchem naa laanti vaalla gurinchi aalochinchi unna items to saripettuko kudadoo..artham chesukoru...
meeku, family kee nutana samvatsara subhaakaankshalandee...