Pages

Saturday, August 21, 2010

అభినందనలు.... శుభాకాంక్షలు

***  శ్రీ  రామా  *** 
పవన్ కి,


క్రిందటి వారంలో జరిగిన ఎన్నికలలో అత్యధిక మెజారిటితో గెలిచి తమ గ్రామ సర్పంచ్ గా ఎన్నికయిన మా ప్రియతమ మిత్రుడు, ఆత్మీయుడు  కత పవన్ కుమార్ నాయుడికి అభినందనలు. చిన్నవయస్సులో తనకి అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ తన గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాలన్న తన ఆశయాన్ని నెరవేరేలా ఆ భగవంతుడు పవన్ కి సంపూర్ణ ఆయురారొగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. భవిషత్తులో మరిన్ని విజయాలు సాదించి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ........................
మధురవాణి గారికి 

అలరించే టపాలు, అద్భుతమయిన  ఫోటోలు, మధురమయిన భావాలు, చిలిపి జ్ఞాపకాలు, ఆటపట్టించే కామెంట్లు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరి బ్లాగర్లకు అందించే ప్రోత్సాహం .... వెరసి మధురవాణి. 

తన రిసెర్చ్ , పాటలు, సాహిత్యం, క్రీడలు, ఫోటోగ్రఫి... అసలు తనకి తెలీని సబ్జెక్ట్ , తనకి ప్రవేశం లేని కళ ఎముంటుందా అని అప్పుడప్పుడు ఆశర్యం కలుగుతుంది.


ఎవరి బ్లాగుకి ఎక్కువమంది ఫాలోవర్స్ తో రికార్డ్ వుందో తెలీదు కానీ , ఏ బ్లాగర్ కి ఎక్కువ బ్లాగులు ఫాలో అవడంలో రికార్డ్  వుందో మాత్రం తెలుసు... అది మన మేడం గారే :-))మన మిస్ పనిమంతురాలు ఈ రోజు (ఆగస్ట్ 22) పెళ్లికూతురవుతున్న సందర్భంగా తనకి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.  భగవంతుని ఆశీస్సులతో వారి  వైవాహిక జీవితం సుఖ శాంతులతో ఆనందంగా సాగాలని మనసారా  కోరుకుంటూ .......

- మంచు
 

14 comments:

Anonymous said...

ఏమిటి పవన్ వాళ్ళ ఊరికి సర్పంచ్ గా గెలిచాడా నిన్నో మొన్నో ఇంజనీరింగ్ చేసాడు ఇంత చిన్న వయస్సు లో తనకు ఈ అవకాశం వచ్చినందుకు నా అభినందనలు .
మధురవాణి గారికి శుభాకాంక్షలు .

చిలమకూరు విజయమోహన్ said...

కత వెనకాల ఇంత కథ జరిగిందా! పవన్‍కు అభినందనలు.అయినా ఇప్పుడేంటి సర్పంచ్ ఎన్నికలు?

మధురవాణి గారికి శుభాకాంక్షలు.

శ్రీనివాస్ పప్పు said...

కత ఎనకాల ఇంత కత జరిగిందా?హ్హహ్హహ్హ గుడ్ ప్రశ్న విజయమోహన్ గారు.

మధురవాణి గారికి వివాహమహోత్సవ శుభాకాంక్షలు.పెళ్ళి చేసుకుని వచ్చాకా మా అందరికి ఓ లార్జ్ పార్టీ ఇవ్వాలి మరి లేపోతే నేనూలుకోను తెల్సా.

మంచుగారూ మిమ్మల్ని మీరు అభినందించుకోడం మర్చిపోయారేమో?(హిహిహి)

వేణూ శ్రీకాంత్ said...

సర్పంచ్ ఫవన్ గారికి అభినందనలు :)

మధురవాణి గారికి వివాహమహోత్సవ శుభాకాంక్షలు :)

durgeswara said...

ఈ రాజకీయరొంపి లో పవన్ లాంటి కుర్రవాళ్ళు ప్రస్తుతం ఏం చేయగలుగుతారు ?అని నా అనుమానం . ఏదేమైనా విజయం సాధించిన పవన్ కు శుభాకాంక్షలు .

sunita said...

ఫవన్ గారికి అభినందనలు.మధురవాణి గారికి వివాహమహోత్సవ శుభాకాంక్షలు.

శివరంజని said...

సర్పంచ్ ఫవన్ గారికి అభినందనలు :)

మధురవాణి గారికి వివాహమహోత్సవ శుభాకాంక్షలు :)

3g said...

పవన్ సర్పంచ్ గా గెలిచారా? ఈ మధ్యనే డిగ్రీ పూర్తిచేసినట్టు గుర్తు. ఇది నిజమే అయితే అతనికి నా హార్ధిక శుభాభినందనలు. ఈ వయసులో ఉండే సహజాతమైన ఆవేశాన్ని సంయమనంగా మార్చుకొని ఆదర్శమైన పాలన అందించడంద్వారా తనలాంటి మరింతమంది యువకులకు స్పూర్తిగా నిలువగలడని, తన గ్రామాన్ని ఆదర్శవంతంగా నిలుపగలడని ఆశిస్తున్నాను.

డా. మధురవాణి గారికి వివాహమహోత్సవ శుభాకాంక్షలు.

మనసు పలికే said...

అవునా.. చాలా మంచి విషయాలు పంచుకున్నారు మంచు గారు..:) పవన్ గారికి నా శుభాభినందనలు..
మన పనిమంతురాలి కి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు..:)

మాలా కుమార్ said...

పవన్ గారికి అభినందనలు .
మధురవణికి శుభాకాంక్షలు .

Anonymous said...

ఫవన్ గారికి అభినందనలు.మధురవాణి గారికి వివాహమహోత్సవ శుభాకాంక్షలు.

రాఘవ said...

మిత్రుడు పవన్ కు అభినందనలు

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్

శివరంజని said...

మంచు పల్లకీ గారికి జన్మదిన శుభాకాంక్షలు
Wishing many more returns of the day
happy happy birthday!లేట్ గా చూసాను సారీ అండి