Pages

Thursday, October 21, 2010

నా అభిమాన శాస్త్రజ్ఞులు - 2/4


 *** శ్రీ  రామ ***

చాన్నాళ్ళకి మళ్ళీ ....  పార్ట్ -1కి పార్ట్-2 కి చాలా గ్యాప్ వచ్చింది. సారీ.. వీలుంటే పార్ట్-1 ఒకసారి చదువుతే కంటిన్యుషన్ బావుంటుంది :-))


PART-2

టెస్లా, ఎడిసన్.... ఈ మహాశాస్త్రజ్ఞులు ఇద్దరూ పరిశోధనలు చేసింది ఇంచుమించు ఒకే రంగం లో అయినా, వారు అవలంబించిన మార్గాలలో మాత్రం ఇద్దరికీ చాలా  వ్యత్యాసం వుంది.  టెస్లా ఏ సమస్యకయినా మొదట గణితసంబంధమయిన విశ్లేషణలు చెయ్యడానికే ఎక్కువ మొగ్గు చూపితే , ఎడిసన్ మాత్రం తను చేసిన ప్రయోగాల తాలూకు పరీక్షాఫలితాలమీదే ఎక్కువ ఆధారపడేవాడు. పరిశోధనా పద్దతులగురించి వారి అభిప్రాయాలు వాళ్ళ మాటల్లోనే ....

ఎడిసన్ తరచూ చెప్పేది  "I accept almost nothing dealing with electricity without thoroughly testing it first "

టెస్లా అభిప్రాయం ...." I do not rush into actual work. When I get an idea, I start at once building it up in my imagination. I change the construction, make improvements and operate the device in my mind. It is absolutely immaterial to me whether I run my turbine in thought or test it in my shop. The carrying out into practice of a crude idea as is nothing but a waste of energy, money, and time."


అసలు వారిద్దరూ ఆయా మార్గాలు ఎందుకు ఎంచుకున్నారో తెలుసుకునేందుకు వాళ్ళ కుటుంబనేపధ్యం , బాల్యం ఒకసారి పరిశీలిద్దాం. 

పార్ట్ -1: బాల్యం

ఎడిసన్ 

1847 ఫిబ్రవరి 11న , అమెరికా లోని ఒహాయో  రాష్ట్రం లో వున్న మిలన్ అనే గ్రామంలో 'శామ్యూల్ ఒగ్డెన్ ఎడిసన్' మరియూ 'నాన్సీ మేథ్యుస్ ఇలియట్' అనే మధ్యతరగతి దంపతులకు ఏడవ సంతానంగా జన్మించాడు 'థామస్ ఆల్వా ఎడిసన్'. 1854లో అతని కుటుంబం మిలన్ నుండి మిషిగన్ లోని  పోర్ట్ హ్యురోన్ అనే పట్టణానికి మకాం మార్చారు.  అతనికి ఏడేళ్ళ వయసొచ్చేసరికి స్కూల్లో చేరాడు. తోటి పిల్లలతో పోల్చి చూస్తే అతని నుదురు అసాధారణంమైన వెడల్పుతో  ఉన్నట్టే  లోపలున్న బుర్ర కూడా చాలా పెద్దదే. బళ్ళో చేరిన మూడు నెలల్లోనే ఈ బుల్లి ఎడిసన్ సందేహాలకి, నిరంతరంగా అడిగే ప్రశ్నలకి విసుగొచ్చిన వాళ్ళ టీచర్ ఎడిసన్ ని  "తలతిక్క పిల్లోడు" అని పిలవడం మొదలు పెట్టింది. స్కూల్లో ఎడిసన్ ప్రవర్తన , అతని టీచర్ సహనం కోల్పోయి ఎదోవోకటి అనడం చూసి ఇక ఈ చదువు సాగేట్టులేదని తల్లి నాన్సీ ఎడిసన్ ని స్కూల్ మాన్పించేయ్యాల్సి వచ్చింది. అయితే ఏ విషయాన్నయినా ఎడిసన్ అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించే తెలివితేటలు, ప్రశ్నించే తీరు చూసి తన కొడుకు మంచిమేధావి అవుతాడనే బాగా నమ్మకం ఉండేదట ఆ తల్లికి . ఎడిసన్ స్కూల్ చదువు అధికారికంగా అక్కడితో ఆగిపోవడంతో నాన్సీ చదువుచెప్పే బాధ్యత తీసుకుని కొడుకుకి ఇంట్లోనే చదువు చెప్పడం ఆరంభించిది . ఎడిసన్ పెద్దయ్యాక ఒక సందర్భం లో తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పాడట...

"My mother was the making of me.  She was so true, so sure of me; and I felt I had something to live for, someone I must not disappoint ."

చిన్నప్పుడు అతనికి ప్రపంచచరిత్ర , ఇంగ్లిష్ సాహిత్యం సబ్జేక్ట్లంటే మక్కువ. ఒకానొక సమయంలో షేక్స్పియర్ నాటకాలు/రూపకాలుచే విశేషంగా ఆకర్షింపబడి నటుడవ్వాలని నిశ్చయించుకున్నాడట. కానీ అతనికి జనాలముందు మాట్లాడటానికి చాలా మొహమాటం అవడం వల్ల నటుడవ్వాలన్న కోరిక అక్కడే ఆగిపోయింది. అతనికి పదకొండు సంవత్సరాలు వయస్సు వచ్చేసరికి అతనిలోని జ్ఞానపిపాసని సంతృప్తి పరచడానికి అతని తల్లితండ్రులు స్థానిక గ్రంధాలయంలో వున్న వనరుల్ని ఏలా ఉపయోగించుకోవాలో ఎడిసన్ కి నేర్పించారు. అంతే గ్రంధాలయం లో కనిపించిన ప్రతిపుస్తకం చదవడం మొదలు పెట్టాడుట .. అందులో ఎక్కువగా సైన్సు పుస్తకాలు. అతను ఎక్కువ చదివే కొద్ది అతని సందేహాలు తీర్చడం అతని  తల్లితండ్రులకి మరింత కష్టంగా మారింది. ఆ  సైన్సు పుస్తకాలలో వున్న క్లిష్టమయిన బాష, గణితసమీకరణాలు అర్ధం కాక....ఎందుకిలా  సామాన్యమానవుడికి అర్ధంకాని బాషలో ఈ పుస్తకాలు రాసారని ఎడిసన్ ఎప్పుడూ అనుకునేవాడట.. క్రమంగా అతనికి ఈ క్లిష్టమయిన సాంకేతిక బాష అన్నా, సమీకరణాలు అన్నా అయిష్టం కలగసాగింది. అలా అని కాన్సెప్ట్ ని వదిలెయ్యలేదు. అవే విషయాలు తనదైన శైలిలో  విశ్లేషించుకుంటూ , అర్ధం చేసుకోవడానికి రకరకాల సొంత ప్రయోగాలు చెయ్యడం మొదలు పెట్టాడు. అతను అనాలసిస్ కన్నా ప్రయోగాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అప్పటినుండి మొదలయ్యింది. ఎడిసన్ కి వున్న ఇంకో సమస్య  ఏమిటంటే ..అతని వినికిడి సమస్య. ఈ వినికిడి సమస్య , మూడునెలల అతి తక్కువ స్కూలింగ్ అతనికి పై చదువులు చదవడానికి అడ్డంకిగా మారినా, ఎడిసన్ మాత్రం సొంతంగా చదవడం కొనసాగించాడు. ఎవరూ వివరంగా చెప్పేవారు లేకపోవడం తో అన్ని తనకు తానుగా నేర్చుకుంటూ, అర్ధం చేసుకోవడానికి అవసరమయిన ప్రయోగాలు చేస్తూ వుండటం వల్ల క్రమంగా అతనికి ఎంతో ఓర్పు సహనం, శ్రమించేతత్త్వం బాగా అలవాటు అయ్యింది.  అతని ఏకాగ్రత, తెలివితేటలు, ఆలోచించే విధానంలో వైవిధ్యత , నైపుణ్యం , అద్భుతమయిన జ్ఞాపకశక్తి, అంతులేని సహనం ఇవన్నీ అతను ఒక  గొప్ప సైంటిస్ట్ గా రూపొందడం లో తోడ్పడ్డాయి. 

అతనికి పన్నెండు సంవత్సరాల వయస్సు వచ్చేసరికే కుటుంబాన్ని పోషించడానికి ట్రైన్ లో న్యూస్ పేపర్లు, తినుబండారాలు అమ్ముతూ సంపాదించడం మొదలుపెట్టాడు. అతనికి పద్నాలుగో ఏడు వచ్చేసరికి ౩౦౦ మంది సర్క్యులేషన్ గల ఒక చిన్న పత్రికను ప్రచురించే స్థాయికి చేరుకున్నాడు.  అతని పత్రిక వల్ల కొంత ఆదాయం మిగులుతుండడంతో ఎడిసన్ మనసు మళ్లీ సైన్సు మీదకి మళ్ళింది... ఆ మిగులు ఆదాయంతో కొన్ని పరికరాలు కొని ఒక చిన్న రసాయన ప్రయోగశాల ఆరంభించాడు. మొదట్లో ఈ ప్రయోగశాల ఇంట్లోనే మొదలు పెట్టినా తరువాత తను పేపర్లు అమ్మే రైలు లో తనకున్న చిన్న లాకర్ రూం కి మార్చాడు. అయితే కొన్నాళ్ళకి ఆ రైలు లో అగ్ని ప్రమాదం జరగడం తో , ఈ రసాయనాల వల్లే ఆ అగ్ని ప్రమాదం జరిగిందని అనుమానించిన ఆ ట్రైన్ కండక్టర్ ఎడిసన్ ని చాచి పెట్టి గూబ మీద కొట్టాడుట. అంతకు ముందు తనకు చెవిటితనం లేదని .. అప్పుడు కండక్టర్ కొట్టడం ... తక్కువ ఎత్తులోఉండే ప్లాట్ఫాం నుండి ట్రైన్ లోకి చెవులు పట్టుకు లాగడం వల్లే తనకి వినికిడి సమస్య వచ్చింది అని ఆ తరువాత ఎడిసన్ ఒక సమయం లో చెప్పారట.  తనకు వినికిడి శక్తి కోల్పోయినందుకు ఎడిసన్ ఎప్పుడూ అంత ఫీల్ అవ్వలేదు కానీ ఒకానొక సమయం లో పక్షుల పాటలు వినడం మిస్ అవుతున్నా అనుకునేవారట. (పక్షులంటే ఎడిసన్ కి చాలా ఇష్టం) .  మొత్తం మీద ఆ అగ్నిప్రమాదం వల్ల ఎడిసన్ ని మళ్లీ ట్రైన్ ఎక్కనివ్వలేదట ... 


అలా వుండగా ఒక రోజు... ఆ  స్టేషన్ మాస్టర్ కొడుకు ఎదురుగా వస్తున్న రైలుని గమనించకుండా రైలుపట్టాలమీద ఆడుకుంటూ ఉండగా ఎడిసన్ చూసి వెంటనే హీరోలా రంగం లోకి దిగి ఆ కుర్రాడిని కాపాడాడు. దానికి ఎంతో సంతోషపడిన ఆ స్టేషన్ మాస్టారు ... తన కొడుకుని కాపాడినందుకు బహుమతిగా ఏమి కావాలో కోరుకోమంటే , అప్పుడు ఎడిసన్ అప్పట్లో  రైల్వే కమ్యూనికేషన్ లో వాడే "మోర్స్ కోడ్ "ని నేర్పమని అడిగాడట.  అతని కోరికను మన్నించి ఆ స్టేషన్ మాస్టారు పద్నాలుగేళ్ళ ఎడిసన్ కి ఆ "మోర్స్ కోడ్" నేర్పడమే అతని జీవితం లో పెద్ద మలుపు.

టెస్లా 

1856, జూలై 10న, ఇప్పటి క్రొయేషియా లోని Smiljan అనే గ్రామం లో సెర్బియన్ మతగురువు ఆయిన Milutin Tesla మరియు Djuka Mandic దంపతులకు  నాలుగవ సంతానంగా జన్మించాడు టెస్లా. టెస్లా కి ముగ్గురు అక్క చెల్లెళ్ళు , ఒక ఆన్న ... కానీ  టెస్లా చిన్నతనంలోనే అతని  ఆన్న ఒక ప్రమాదంలో మరణించాడు (తన అన్న కూడా తనలాగే చాలా తెలివైనవాడు అని టెస్లా చెప్పేవాడట.. అదే నిజమయితే మనం ఒక గొప్ప శాస్త్రజ్నుడిని కోల్పోయినట్టే) .   ఎడిసన్ లానే టెస్లా మీద తన తల్లి ప్రభావం చాలా ఎక్కువ. అతని తల్లి కూడా ఒక చిన్నపాటి  శాస్త్రవేత్తే. ఆవిడ గృహ, వ్యవసాయ సంబంధమయిన అవసరాలకి  కావలసిన కొత్త కొత్త పనిముట్లు కనిపెట్టేదట . ఆవిడ టెస్లా యొక్క అసాధారణ తెలివితేటలు గ్రహించి , అతన్ని శాస్త్రవేత్తగా తీర్చిదిద్దడానికి చిన్నప్పటినుండే శిక్షణ ఇవ్వడం ప్రారంభించినది. ఆ శిక్షణలో ఎక్కువగా లెక్కలను , పజిల్స్ లను మనస్సులోనే సాధించి సమాధానం చెప్పడం, పెద్ద పెద్ద వ్యాక్యాలను గుర్తువుంచుకొని మళ్లీ అప్పచెప్పడం, ఎదుటివాళ్ళ ఆలోచనలను గెస్ చెయ్యడం లాంటివి ఉండేవి. అలాంటి మహాతల్లి శిక్షణ లో రాటుదేలినందువల్లే , తన కెరీర్ లో ఎన్నో క్లిష్టమయిన సాంకేతిక సమస్యలను తన ఊహలలోనే సాధించగలిగే సామర్ధ్యం తనకు వచ్చిందని టెస్లా బలంగా నమ్మేవాడు. దానికి తోడూ అతనిది అద్భుతమయిన జ్ఞాపకశక్తి. అయితే అతనికి చిన్నప్పుడు కళ్ళుమూసుకుంటే ఎక్కువ కాంతి మెరుపులు (ఫ్లాష్ ) తో కూడిన కొన్ని వస్తువుల ఆకారాలు కనిపించి నిద్రలేకుండా చేసేవట. వాటిని తప్పించుకోవడానికి అతను తనకు తెలిసిన, చూసిన వస్తువులు ఊహించుకోవడం మొదలుపెట్టగానే ఆ కాంతి.. మెరుపులు మాయం అయ్యేవి. ప్రతిరోజూ రాత్రి ఈ మెరుపులు తప్పించుకోవడానికి, తనకు తెలిసిన విషయాలు , వస్తువులు ఊహించుకుంటూ, వాటిగురించి ఆలోచిస్తూ గడపడం కూడా అతని విశేషమయిన ఊహా శక్తి కి కారణమయింది. 

టెస్లా ఇష్టాఇష్టాలు కొంచం బిన్నంగా ఉండేవి. ఎడిసన్ కి పక్షులంటే ఇష్టం వున్నట్టు టెస్లా కి మౌంటైన్స్, అక్కడ వీచే స్వచ్చమయిన గాలి ఆంటే ఇష్టం. ( కొలరాడో స్ప్రింగ్స్ లో తన ల్యాబ్ పెట్టుకోవడానికి అది కూడా ఒక కారణం అయ్యి వుండొచ్చు). ముత్యాల ఆభరణాలు చూసినా,  ఆడవాళ్ళ చెవిరింగులు చూసినా విపరీతమయిన అయిష్టం. పీచ్ పండుని చూస్తే అలర్జీ. ఎవరిదయినా జుట్టు ముట్టుకోవాలంటే అసలు ఇష్టం వుండేది కాదు. అలాగే ఒకానొక టైం లో విపరీతంగా సిగేరెట్లు తాగడం వల్ల  అతని ఆరోగ్యం దెబ్బతినడం తో ఇక మళ్లీ ఎప్పుడూ సిగరెట్ తాగకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు .దానితోపాటు కాఫీ , టీ లాంటివి కూడా మానేసి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్దగా ఉండేవాడు.  ఇలాంటి చెడు అలవాట్లు (??) మానేసినందు వల్లే వృద్దాప్యం లో కూడా తన బ్రెయిన్ చాలా చురుకుగా పనిచేసేదని చెప్పేవాడట. ముందు టపాలో చెప్పినట్టు అతను 30 సంవత్సరాలు పాటు అతని బరువు ఖచ్చితంగా 69 కేజీలు వుండేలా మైంటైన్ చేసాడట.  (ఒకసారి టెస్లా, ఎడిసన్,  మిగతా ఫ్రెండ్స్ తో వుండగా... బరువు విషయమై ఏదో డిస్కషన్ వచ్చి , ఎడిసన్ టెస్లా బరువు 69 కేజీలు ఉండొచ్చని ఊహించి చెప్పాడట... ఎడిసన్ అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడో టెస్లా కి చాలా ఆశ్చర్యం వేసిందట).

1862 టెస్లా కుటుంబం గాస్పిక్ కి మకాం మారాక అక్కడే హైస్కూల్ చదువు ముగించాడు. ఆ తరువాత 1875 లో Graz లోని ఎలెక్త్రికల్ ఇంజినీరింగ్ చదివాడు. ఆ తరువాత 1878 లో తన కుటుంబాన్ని వదిలేసి చిన్న చితక ఉద్యోగాలు చేసి 1880 నాటికి బుడాపెస్ట్ చేరుకొని అక్కడి నేషనల్ టెలిగ్రాఫ్ కంపెనీలో ఎలెక్త్రికల్ ఇంజినీర్ గా చేరాడు.
.............
అలా అందరిలా పాఠశాలకెళ్ళి చదువు కోలేకపోయినా, వినికిడి శక్తి కోల్పోవడం వల్ల ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నా, తను చదివే సైన్సు విషయాలు అర్ధం అయ్యేలా చెప్పేవారు ఎవరూ లేకపోయినా.... కన్నతల్లి ప్రోత్సాహం, అంతులేని జ్ఞాన పిపాస, ఎంతో ఓర్పు సహనం వల్ల ఎడిసన్ మహా శాస్త్రజ్ఞుడి గా ఎదిగితే ...

దేవుడిచ్చిన అపారమయిన జ్ఞాపకశక్తి మరియు తెలివితేటలకు ... అమ్మ ఇచ్చిన కఠొరశిక్షణ కూడా తోడవడం తో టెస్లా మహామేధావి గా రూపుదిద్దుకున్నాడు ...

ఇక వాళ్ల ఉద్యోగాలు తరువాతి టపాలోను  , దాంట్లో ఇద్దరి మధ్య గొడవలు, కరెంటు యుద్దాలు గురించి ఆ పై టపాలో  .....

-మంచు 


23 comments:

3g said...

great post. నావరకు ఎడిసన్ లా ప్రయోగాలు చెయ్యటాన్నే ఎక్కువ సమర్దిస్తాను. ఊహల్లోనే కాన్సెప్ట్ నిర్మించుకోవటం గొప్పవిషయమే కాని ప్రపంచంలో చాలా విషయాలు వేరే వాటికోసం ప్రయోగాలు చేస్తుండగా యాదృశ్చికంగా కనిపెట్టబడ్డాయ్, ఉదాహరణకు రేడియో ధార్మికత లాంటివి. ఎడిసన్ కూడా అందుకే ఎక్కువ విషయాలకి ఆవిష్కర్త గా అయ్యాడు కావచ్చు.

Anonymous said...

నా మటుకు, బండగా ప్రయోగాలు చేస్తూ, చాన్స్ మీద ఆవిష్కరణలు చేయడం కన్నా, ఆలోచించి, వూహించగలగటం గొప్ప అని భావిస్తాను.

To know something is greate, to imagine is even greater. :)

శివరంజని said...

...నా అభిమాన శాస్త్రజ్ఞులు లో ఎడిసన్ ఒకరు.. నేను ఎడిసన్ గురించి చాలా ఇంఫర్మేషన్ సేకరించి పెట్టుకున్నా ...ఎడిసన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది ..ఇకపోతే టెస్లా గురించి మీ పోస్ట్ చదివాకా తెలిసింది... మంచి పోస్ట్

mmd said...

challaa baagundi. oka chinna "typo error" tesla puttindi 1856 not 1956.

చదువరి said...

విపులంగా, బాగుంది.

"ఎడిసన్ మాత్రం తను చేసిన ప్రయోగాల తాలూకు పరీక్షాఫలితాలమీదే ఎక్కువ ఆధారపడేవాడు." - అపజయాలు వెరవకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలని చెబుతూ ఎడిసన్ గురించి ఒక సంగతి చెబుతారు. ఎలక్ట్రిక్ లైట్ బల్బ్ కనిపెట్టే ప్రయత్నంలో ఎడిసన్ 2000 సార్లు విఫలమయ్యాడు. "అవి వైఫల్యాలు కాదు, బల్బు కనిపెట్టేందుకు 2000 స్టెప్పులున్నాయ"ని అన్నాడంట. ఆ సంఖ్య ఎంతవరకు నిజమో తెలీదు గానీ, చాలానే ప్రయోగాలు చేసాడని అనుకోవచ్చు. బహుశా ప్రయోగాల మీద ఎక్కువ ఆధారపడడమే అందుకు కారణమమో!

మనసు పలికే said...

మంచు గారు, చాలా మంచి పోస్ట్..:) ఇంత మంచి విషయాల్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు..

హరి said...

చదువరి గారు,

ఎడిసన్ అన్నది, "I have not failed. I've just found 10,000 ways that won't work",

ఇక్కడ

చూడ వచ్చు.

తిరు said...

పోస్ట్ బావుందండీ.

చదువరి said...

హరి: నెనరులు సార్!

నేస్తం said...

హ్మ్మ్ చాలా తెలియని విషయాలు చెప్పారు సార్ ..థేంక్యూ..అన్నట్లు టెంప్లెట్ చాలా బాగుంది

Sravya Vattikuti said...

బాగుందండి చాల బాగా రాసారు . నేను ఎడిసన్ లా ప్రయోగాలు చెయ్యటాన్నే ఎక్కువ సమర్దిస్తాను. :)

..nagarjuna.. said...

బావుంది మంచుగారు....
కొన్నివారాల క్రితం GE కంపెని PPT కోసం వచ్చింది...కంపెనీ గురించి చెప్తూ...ఎడిసన్ ప్రయోగశాలే ఇప్పటి సంస్థ ప్రధాన కార్యాలయం అని, అక్కడ ఇప్పటికి ఎడిసన్ పనిచెసిన desk ఉందనీ చెప్పాడు..
it might really be awesome experince to work in such environment..

@3g గారు: ఊహలోంచి పుట్టినవికూడా తక్కువేమీ కాదులెండి. బెంజిన్ molecule నిర్మాణాన్ని ప్రయోగాల ద్వారా కాకుండా కలలో కనిపెట్టారంట. ఓపట్టాన సులువుగా అర్దంకాని ఐస్టిన్ సాపేక్ష సిద్దాంతాన్ని ఎలా అర్దం చేసుకోవాలీ అని ఆయన్నే ఓసారి అడిగితే " నా సిద్దాంతం పిల్లలకు బాగా అర్దమౌతుందీ, వాళ్ళకు ఊహాశక్తి చాలా ఎక్కువ" అన్నాడట

హరే కృష్ణ said...

చాలా బాగా రాసారు
Excellent
టెస్లా కి అభిమానిని చేసారు
imagination ని ఒక రూపం లోనికి తీసుకు రావడం నిజంగా గ్రేట్

హరే కృష్ణ said...

ఒక imagination కి రూపం ఇవ్వడానికి
christopher నోలన్ కి తొమ్మిది సంవత్సరాలు పట్టింది

hats off to Tesla

Jaabili said...

Chaala bagundi andi. Very good information.

మంచు said...

ధన్యవాదాలు. క్రింద కొంతమంది బ్లాగర్లు అభిప్రాయపడినట్టు రెండిటికి కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి... ముందు బాగాల్లొ ఇవి ఎడిసన్ , టెస్లా కి అలా అఫెక్ట్ అయిందొ చెప్తాను ..
అనానిమస్ గారు : ధన్యవాదాలు. మీతొ ఎకీభవిస్తాను :-)

మంచు said...

శివరంజని : థాంక్యూ... >> నేను ఎడిసన్ గురించి చాలా ఇంఫర్మేషన్ సేకరించి పెట్టుకున్నా>> ఇంకా తెలియాల్సింది కొంత ఉంది అని నా అభిప్రాయం :-) నాల్గవ భాగం అయిపొయాక చెప్పు :-)
mmd: మీకు స్పెషల్ థాంక్స్... తప్పు చూపించినందుకు... సరిచేసాను ...

మంచు said...

చదువరి గారు, హరి గారు, తిరు , అప్పు... థాంక్స్... మిగతా రెండు పొస్ట్లు ఇంకా ఇంటరెస్టింగా రాయడానికి ప్రయత్నిస్తా

మంచు said...

శ్రావ్యగారు : థాంక్స్ .. అవును.... ఎడిసన్ ఒపిక మెచ్చుకుని తీరాల్సిందే... ఆఖరు భాగం అయ్యాక మళ్ళీ మట్లాడుకుందాం... :-)
నేస్తం గారు : థాంక్యూ.. థాంక్యూ
హరే : హ్మ్మ్... అయితే నువ్వు మిగతా రెండు పార్ట్లు చదవాలి :-)) థాంక్స్

మంచు said...

నాగార్జున : కొన్నేళ్ళ క్రితం అదే కాలేజి... అదే హాలు .. అదే జిఈ కంపెనీ .. కానీ అప్పుడు నీ ప్లేస్ లొ నేను :-) నీలాగె ఇంప్రెస్స్ అయిపొయి... ఆరొజే జాబ్ సంపాదించి.....వాళ్ళు చెప్పిన సంస్థ ప్రధాన ఆర్ & డి లొ పనిచేసే అవకాసం సంపాదించాను... అవును అతను పని చేసిన ఆ డెస్క్ ఉంటుంది అక్కడ... కనిపెట్టిన బల్బ్ తొ పాటు...

జాబిల్లి గారు... నా బ్లాగుకి స్వాగతం ... ధన్యవాదాలు ...

3g said...

Nagarjuna...u r right agreed.కాని నా ఉద్దేశ్యం imagination ని తక్కువ చెయ్యటం కాదు , ఆలోచించిన విషయాన్ని వాస్తవ పరిస్థితుల్లో పరీక్షిస్తున్నపుడు అది మరింత మెరుగవ్వచ్చు లేదా దానికంటే మెరుగైంది అనుభవంలోకి రావచ్చు. అఫ్ కోర్స్ అన్నిటికి కాదనుకో.

వేణూ శ్రీకాంత్ said...

బాగుందండీ మంచి విషయాలు తెలియచేశారు.

మధురవాణి said...

చాలా బాగుందండీ వీళ్ళిద్దరి గురించి తెలుసుకోవడం! Really a very good post! :)