Pages

Saturday, July 10, 2010

నా అభిమాన శాస్త్రజ్ఞులు - 1

*** శ్రీరామ  ***


జూలై 10, ఈరోజు ప్రత్యేకత పెద్దగా ఎక్కువమందికి తెలిసుండకపోవచ్చు. మన టివి మీడియాకి కూడా సినిమారంగానికి చెందిన ఏ వ్యక్తి పుట్టినరోజు కాదు కాబట్టి ఈరోజు అంత ముఖ్యమయిన రోజు అనిపించదు.  మన పేపర్ మీడియా అంతర్జాతీయ వార్తలు ఎంత వీలయితే అంత తక్కువ ప్రచురిస్తాయి. కాబట్టి మీకు తెలిసే అవకాశం లేదు .

సరే ... కరెంట్ లేని ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి. లైట్ బల్బులు , ఫ్యాక్టరీలు, లిఫ్ట్లు, క్రేన్లు, సినిమాలు, గృహవిద్యుత్ ఉపకరణాలయిన ఫ్రిజ్, టివి, మిక్సి, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు వగైరాలు ఏవీ లేని ప్రపంచం అన్నమాట. అసలు ఆ ఊహే భయంకరంగా వుంది కదా. ఈరోజు మనకి ఆ సౌకర్యాలన్నీ అందుతున్నాయంటే దానికి కారణం కొంతమంది శాస్త్రజ్ఞుల మేధస్సు, వారి కష్టం. అందులో కొంతమంది వాళ్ళ జీవితం మొత్తం శాస్త్రపరిశోధనకే వెచ్చించారు. అందులో ఒక మహానుబావుడి పుట్టినరోజు ఈరోజు. 

అతనే నికోలా టెస్లా (Nikola Tesla)


అతని మీద నాకున్న ప్రత్యేక అభిమానానికి కారణం అతను ఒక గొప్ప సైంటిస్ట్ అని మాత్రమే కాదు ...అతను అత్యంత ప్రతిభావంతుడు, అపర మేధావి ... Extraordinarily genius  అని చెప్పగలిగే అతికొద్దిమంది వ్యక్తుల్లో ఒకడు.  అతని ఊహశక్తి (imagination), జ్ఞాపకశక్తి (memory power) ఎంత గొప్పవంటే ... ఎన్నో పేటెంట్లను పెన్ను పేపర్ లేకుండా, అన్ని గణిత సమీకరణాలను తన ఊహలలోనే సాధించి, దానికి సంబంధించిన సాంకేతిక రేఖా చిత్రాలను తన ఊహలలోనే రూపొందించి, సరాసరి ఫైనల్ డిజైన్ ను రూపకల్పన చెయ్యగలిగిన అపర మేధావి. వ్యక్తిగత విషయాలకొస్తే అతని వయస్సు 30 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాలు వచ్చేవరకూ అతని బరువు ఒక్క పౌండ్ కూడా పెరగకుండా తగ్గకుండా ఖచ్చితంగా మైంటైన్ చెయ్యగలిగిన పట్టుదల గల వ్యక్తి. అయితే కొన్ని కారణాల వల్ల అతని మేధస్సుకి రావాల్సిన గుర్తింపు అంత త్వరగా రాలేదు.  

అలాగే అతని గురించి చెప్పుకునేటప్పుడు ఇంకో గొప్ప శాస్త్రజ్ఞుడి ప్రస్తావన తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. 

అతనే థామస్ ఆల్వా ఎడిసన్ ( Thomas Alva Edison )

లైట్ బల్బు కనిపెట్టిన సైంటిస్ట్‌గా మనందరికీ సుపరిచితుడయిన ఇతని గురించి తెలుస్కోవాల్సింది చాలానే వుంది. తన జీవితంలో 1093 పేటెంట్లను పొందిన ఈ మహాశాస్త్రజ్ఞుడు కేవలం 3 నెలలు మాత్రమే బడికి వెళ్ళగలిగాడు.  జీవితంలో ఎదురయిన ఎన్నో ఆటుపోట్లుని తట్టుకొని నిలబడి తను అనుకున్నది సాధించే వరకూ శ్రమించి ఎంతో మందికి ఆదర్శప్రాయమయినాడు. మధ్యతరగతి నుండి వచ్చి, చిన్నతనంలో కుటుంబాన్ని పోషించడానికి ట్రైన్ లో పేపర్లు అమ్మిన ఈ వ్యక్తి స్తాపించిన కంపెనీ "జనరల్ ఎలెక్ట్రిక్ (GE)"  ఈ రోజు ప్రపంచంలోని అత్యంత పెద్ద MNC లలో ఒకటి. (రోజు అతను పనిచేసిన టేబుల్, కుర్చీ, ఇతర పరికరాలు చూస్తూ కొన్నాళ్ళు ఆ కంపెనీ గ్లోబల్ రీసెర్చ్ సెంటర్ లో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం) .. 

వీరిద్దరిలో ఎవరూ గొప్ప ఆంటే చెప్పలేం. ఇద్దరులో ఎవరూ విద్యుత్ కనిపెట్టలేదు కానీ ఆ విద్యుత్ ని మానవాళికి ఉపయోగపడేలా చెయ్యాలని తపించారు. విద్యుత్ ని సామాన్య మానవుడి దగ్గరకు చేర్చారు. వీళ్ళిద్దరి జీవితాలగురించి, వాళ్ళ మద్య జరిగిన సైద్ధాంతిక వైరం (దీన్నే "war of currents" అంటారు) గురించి చదువుతుంటే చాలా ఆసక్తికరంగా వుంటుంది. (ఒక సినిమా స్టొరీ రాసేయోచ్చు). వీటన్నిటి గురించి తరువాతి టపాల్లో వివరంగా చెప్తాను..... అప్పటివరకూ


Happy Birthday, Nikola Tesla!


ఇంతకీ పైన వున్న వాళ్ళలో ఎడిసన్ ఎవరో , టెస్లా ఎవరో గూగుల్ సెర్చ్ చెయ్యకుండా ఊహించండి ....


(సశేషం)
-మంచు

34 comments:

శ్రీనివాస్ said...

వీరిలో ఒకరు ఎడిసన్... రెండవ వారు టెస్లా గూగుల్ సెర్చ్ లేకుండా చెప్పా:)

Sravya V said...

బాగా రాసారండి ! ఇక ఫోటోలు వికీ తరచూ గా చదువుతా కాబట్టి వీజీ :)

భావన said...

అవునా నిజమే ఎందరో శాస్త్రజ్నులు కృషి వాళ్ళ శ్రమ ఫలితాలను మనం కనీసం వాళ్లను స్మరించుకోకుండా వాడేసుకుంటూ ఆ పైన నిర్లక్ష్యం కూడా చేస్తున్నాము. చాలా సంతోషం మీరు గుర్తు పెట్టూకుని రాసేరు. యాపీ బర్త్ డే నికోలా. :-)

వెంకట్ said...

let me guess..

Left side Edison, right side pic s tesla's

మధురవాణి said...

Very interesting post! Edison on right! :-)
అయితే మీరు ఫిజిక్స్ సైంటిస్ట్ ... వావ్..Great to know :-)

Results! Why, man, I have gotten a lot of results. I know several thousand things that won't work. - Thomas Edison

..nagarjuna.. said...

I don't know much about Tesla but liked Edison much. we'll hardly find a genius who'd forget himself, i thought..

హరే కృష్ణ said...

Tesla కి జన్మదిన శుభాకాంక్షలు

sunita said...

వీరిలో first టెస్లా . రెండవ వారు ఎడిసన్సె.Nice post.

Anonymous said...

>> తన జీవితంలో 1093 పేటెంట్లను పొందిన ఈ మహాశాస్త్రజ్ఞుడు కేవలం 3 నెలలు మాత్రమే బడికి వెళ్ళగలిగాడు. >>

చదువుకొని వుంటే ఆయన కూడా మీలా తెలివి గలవారు అయ్యేవారేమొ ? ప్చ్...

3g said...

interesting.......... waiting for the "war of currents"

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Nice post. BTW, do you've any patents on your name (:-?

నేస్తం said...

బ్లాక్ అండ్ వైట్ పొటోమాత్రం ఎడిసన్//నాకు తెలిసిన అతికొద్ది సైంటిస్ట్లలో ఆయన ఒకరు :)

మంచు said...

@ శ్రీనివాస్ : అంత కరెక్టా గా ఎలా చెప్పగలిగావ్... మిగతావాళ్ళందరూ ఒక్కటే చెప్పగలిగారు...
@ శ్రావ్యగారు : ధన్యవాదాలు.
@ భావనగారు: ఈయనే మా ఇన్స్పిరేషన్... ఈయన్ని మర్చిపొతామా :-))
@ వెంకట్ గారు : ధన్యవాదాలు

మంచు said...

@ మధురవాణి గారు: ఇప్పటివరకూ నన్ను " సైన్సు మాస్టారా" అని, "డాక్టరా " అని, " ఎలెక్ట్రానిక్స్ ఇంజినీరా" అని అడిగారు ... మీరు ఫిజిక్స్ సైంటిస్ట్ అని కొత్త పేరు చెప్పారు :-)) ధన్యవాదాలు
@ నాగార్జునా... ఎమిటి టెస్లా తెలీదా... అయితే నువ్వీ సీరీస్ తప్పక చదవాల్సిందే..
@ హరేకృష్ణ: ధన్యవాదాలు
@ సునీతగారు : ధన్యవాదాలు
@ జి జి జి : ధన్యవాదాలు
@ గణేష్: నీ ఎక్స్ప్రెషన్ నాకు అర్ధం కాలేదు.. అట్టాంటివి మనం మైల్ లొ మాట్లడుకుందాం.
@ నేస్తం గా...........రు : ఎన్నాళ్ళకెన్నాళ్ళకి మా మీద దయ కలిగింది... రెండూ బ్లాక్ ఎండ్ వైటే నండి... :-) మొదటిది బ్లాక్ ఎండ్ బ్రౌన్ అంటారా.. ఒకె :-))

మంచు said...

@ అనానిమస్ గారు : థాంక్యూ థాంక్యూ... :-))

చదువరి said...

టెస్లా పరిశోధనల గురించి సుజనరంజనిలో ఒక వ్యాసం వచ్చింది, చూడండి.

మరువం ఉష said...

సిరీస్ మాదిరి రాసేట్లుగా ఉన్నారు. అన్నీ అయినాక పిడియఫ్ గా అందించమని రిక్వెస్ట్. థాంక్స్ ఇన్ అడ్వాన్స్.

Anonymous said...

[" సైన్సు మాస్టారా" అని, "డాక్టరా " అని, " ఎలెక్ట్రానిక్స్ ఇంజినీరా" అని అడిగారు ... మీరు ఫిజిక్స్ సైంటిస్ట్ అని కొత్త పేరు చెప్పారు]

గూగుల్ కట్-పేస్ట్ నిపుణుడో లేదా ఓ మోటర్ వైనిడింగ్ ఎలెక్ట్రీషియనో అని కనిపెట్టలేకపోయారు.

మంచు said...

@చదువరి గారు... ధన్యవాదాలు..
@ఉషగారు .. తప్పకుండా :-) Thanks
@అనానిమస్ గారు .. థాంక్యూ.. మీరెదొ ఫ్రస్ట్రేషన్ వున్నట్టున్నారు.. రెండువారాల్లొ సింగపూర్ వస్తున్నా... కలుద్దాం మరి :-)

Anonymous said...

ఫ్రస్త్రేషన్ అంటే మోటార్ వైండింగ్ మెకానిక్కులకి ఏం తెలుసు? ఏదో పదం బాగుంది కదా అని నోటికొచ్చిన పదం వాడేయటమే

మంచు said...

అంతే అంటారు.. అలగే కానిద్దాం మరి ...

krishna said...

పోస్టు తో నాకు పెద్ద గా సంబందం లేదు గాని, ఏమిటీ మీ సబ్జెక్ట్ ఎలెక్ట్రానిక్స్ కాదా ? అనవసరంగా నేను ఆయాస పడిపోయి మీకు మెయిల్ కొట్టా కదా! ఇట్టా మోసం చెయ్యొచ్చా ? ఆయ్ :)

మంచు said...

కృష్ణగారు ... భలేవారే ... నేను అవునని గానీ కాదని గానీ చెప్పానా...అప్పుడే మోసం అంటున్నారు ... :-))

krishna said...

ఆ ఏముంది.. ముందు గా ఒక కామెంటు , ఒక నిట్టూర్పు పడేసి వుంటే మనం లేటయ్యి పోయామని బాధ వుండదని :)
అయినా చదువుకి , తెలివి కి సంబంధం లేదని అన్న ఆజ్ఞాత ( మొదటి కామెంటు లో నాకు వ్యంగ్యం కనిపిస్తుంది మరి ) మెకానిక్కు అంటే ఏదొ చులకన భావం చూపడం ఏమిటీ ? ఇద్దరు అజ్ఞాతలు ఒకరు కాదా ? రొంబ కంఫ్యూజన్ గా వుందబ్బా !

Anonymous said...

పిల్ల కాకి కృష్ణ మీ కామెంట్ సూపరు
మీకు తక్కువేన్టండి
అసలు మీరు ఎలెక్ట్రిక్ ఇంజనీర్ గురించి మాట్లాడడం ఎలేక్ట్రికాల్ ఇంజినీర్స్ కే ఒక పొగడ్త లాంటిది
మీ ఫోటో లో బ్యాక్ గ్రౌండ్ లో నీలం రంగు నీలం అంటే ఎవరు అని అడగకు మల్లా,నీలి రంగు మధ్యలో ఒక మెరుపు తెల్లరంగు
ఫోటోషాప్ use చేసినా తెప్పించలేని రంగులను నువ్వు తెప్పించినావురా కృష్ణా

jeevani said...

మంచు గారూ,

బావుంది. ఇలాగే ఇంకా పరిచయం చేయండి.

krishna said...

@ అజ్ఞాత
శాంతి..శాంతి.. ఏదొ అనుమానం వెలిబుచ్చాను అంతే ! అసలు ఈ అజ్ఞాత కాన్సెప్ట్ నాకు కొత్త! వర్డు ప్రెస్సులో ఈ వెసలుబాటు వుండదు. ఆ అజ్ఞాత కామెంట్లు ఒకరు పెట్టినవొ, వేరు వేరు అజ్ఞాతలు పెట్టినవొ తెలియక .. నా మీద ఒకవేళ కోపం వుంటే క్షమిచెయ్యండి బాబు, దారిన పోయే దానయ్యని, తెలీక నోరు జారాను. ( అసలు మీరు నన్ను పొగిడారో తెగిడారో కూడా అర్ధం కాలేదు. )

తార said...

నాయనా సుయోధన, తెలివి వున్నవారెవ్వరూ తెలివిగలవారే, అట్టి తెలివిగలవారిలో చదువు ఉ(కు)న్నవారే (చదువు కొన్నవారు మేధావులు)శాస్త్రజ్ఞులు, అట్టి శాస్త్రజ్ఞులే ఈ మంచు పరిషత్లో ప్రస్తావించ అర్హులు.
(చదువు కొన్నవారు మేధావులు)

జేబి - JB said...

మీరు క్రిస్టోఫర్ నోలన్ (మెమెంటో, ఇన్సెప్షన్ దర్శకుడు) తీసిన 'ది ప్రెస్టీజ్ చూశారా? అందులో ఎడిసన్-టెస్లా పోటీని చక్కగా చూపిస్తారు.

ANALYSIS//అనాలిసిస్ said...

మంచు మీ ఇంటి పేరా ? ఒక వేళ ఇంటి పేరైతే పర్లేదు ... కాకపోతే మధ్యలో DOT (మంచు. పల్లకీ ) తీసేయండి ... బాలేదు. మంచు పల్లకీ అని కంటిన్యూ గా చదివితే బావుంటుంది . ఇక పోతే ఈ మద్య నేను సోలార్ పేనల్స్ గురిచి నెట్ లో సెర్చ్ చేస్తున్నాను ... ఆ సమయంలో మీరు దానికి సబంధించిన పోస్ట్ రాయాడం చాలా ఆనదంగా ఉంది ... కృతజ్ఞతలు పల్లకి గారూ.........................

amma odi said...

మంచుపల్లకీ గారు: గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళాలిసిన పనేముందండి! ఇంటర్ మీడియట్ టెక్ట్స్ బుక్ తిరగేస్తే సరి! :)

శివరంజని said...

మంచు పల్లకీ గారు... మంచి మంచి విషయాలు చెప్పి మంచి పల్లకీ అయ్యారన్నమాట.. మంచి టాపిక్ .. ఈవిధంగానైనా మన శాస్త్రజ్నులు గుర్తు చేసారు

Vasu said...

బావుంది . చాలా తెలియని విషయాలు చెప్పారు.

మరీ ౧౦౯౩ ఏ బాబోయ్. జీ ఈ ఆయన మొదలెట్టిన సంస్థ అని కూడా తెలియదు నాకు.

మీసమున్న మగాడు టెస్లా :) కరష్టే కదా.
ప్రెస్టీజ్ (నోలాన్ ) సినిమాలో చూసాను.

కొత్త పాళీ said...

ఏదో పనితోచక చేస్తున్న జాల విహరణలో ఈ కింది తీగ నాకాలికి చుట్టుకుంది. కీర్తిశేషులు నికొలా టెస్లాగారిని అభిమానించే బ్లాగ్మిత్రులు మంచు పల్లకీ ప్రభృతులకి ఇది ఆసక్తికరంగా అనిపించవచ్చని లంకె ఇస్తున్నా. లుక్కెయ్యాలనుకుంటే మాత్రం, ముందే చెబుతున్నా .. అసలే .. శృంగార టెస్లా అంట - ఆచితూచి అడుగువేయండి!!