Pages

Monday, May 23, 2011

సూపర్ ఆనంద్

*** శ్రీ రామ ***


ఫొటొలొ ఉన్న వ్యక్తిని చూసారు కదా. అతి సాధారణ దుస్తుల్లొ , ఇద్దరు ముగ్గురు బాడీగార్డ్ లతొ బీహార్ రాజధాని పాట్నాలొ నివసించే ఇతను మీలొ చాలా మందికి ఇప్పటికే తెలిసి ఉండొచ్చు అనుకోండి. 


1973 జనవరి ఒకటవ తారీఖున పాట్నా నగరం లొని ఒక సాధారణ కుటుంబం లొ జన్మించాడు అనంద్ కుమార్. అతని తండ్రి పొస్ట్ ఆఫీసులొ పనిచేసే ఒక క్లర్క్.  అతని కుటుంబానికి ప్రైవేట్ స్కూల్ లొ చదివించేటంత స్తొమత లేకపొవడం తొ అతని చదువు ప్రభుత్వ పాఠశాలలొ హింది మీడియం లొనే సాగింది. చిన్నప్పటినుండి మన ఆనంద్ కి గణిత శాస్త్రం అంటే అమితమయిన ఆసక్తి. డిగ్రీ చదువుతున్నప్పుడు "నెంబర్ థీయరి" మీద అతను రాసిన పేపర్లు ఇంగ్లాండు లోని Mathematical Spectrum and The Mathematical Gazette సంస్థల జర్నల్స్ లో ప్రచురితమయ్యేవి. గణిత శాస్త్రంలొ ఇతను చూపిస్తున్న ప్రతిభ కి మెచ్చిన ఎంతొమంది గణిత శాస్త్ర అధ్యాపకులు అతనికి ప్రొత్రాహం అందించేవారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే అతని గురువు దేవి ప్రసాద్ వర్మ సహకారం తొ పాట్నాలొ ఒక మేథమెటిక్స్ క్లబ్ ని నెలకొల్పాడు. గణితశాస్తం పై ఆసక్తి ఉన్నవారు ఎవరయినా అందులొ చేరవచ్చు అన్నమాట. అయితే అతని ప్రతిభకి తగ్గ అవకాశం 1994 లొ కేంబ్రిడ్జి యూనివర్సిటీ రూపం లొ వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలొ పై చదువులు చదివే అవకాశం దక్కినా , అదే సమయానికి అతని తండ్రి మరణించడం, కుటుంబం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలొ ఉండటం తొ అతను ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొలేకపొయాడు. అతని చదువుకి ఆర్ధిక సహాయం అందించే దాతకొసం ఇంచుమించు సంవత్సరం పాటు ఎదురుచూసినా ఫలితం దక్కలేదు. ఆఖరికి ప్రముఖ దిన పత్రిక ద హిందు అతని ప్రతిభ గురించి, అతనికి కావాల్సిన ఆర్ధిక సహాయం గురించి ఒక ఆర్టికల్ రాసినా అతనికి సహాయం అందించడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలా అతని పై చదువుల కల అక్కడితో ఆగిపొయింది. 

అతనికి గణిత శాస్త్రం మీద ఎంత మక్కువంటే అప్పట్లొ పాట్నా గ్రంధాలయం  లొ అంతర్జాతీయ జర్నల్స్ లభ్యమవకపొవడంతొ, అవి చదవడానికి వారాంతం లొ ఆరుగంటలు రైలు ప్రయాణం చేసి వారణాసి వెళ్ళేవాడు. అక్కడ అతని తమ్ముడి హాస్టల్ రూం లో ఉంటూ శని, ఆదివారాలు బెనారస్ హిందూ యూనివర్సిటి లొని సెంట్రల్ లైబ్రరి లొ గడిపి సొమవారం పాట్నా వచ్చేవాడు. మిగతా రోజుల్లొ ఉదయంపూట గణిత శాస్త్రం మీద పని చేస్తూనే కుటుంబాన్ని పొషించడానికి సాయింత్రం పూట తన తల్లి తొ కలసి రోడ్డు మీద అప్పడాలు అమ్మేవాడు.   

అలా కస్టపడి చదువుకుని, ఒక మంచి ఉద్యొగం సంపాదించి, జీవితంలొ బాగా స్థిరపడితే చాలు అనుకుని ఉంటే అతను చాలామందిలా ఒక సామాన్య ఉద్యోగస్తుడిగా మిగిలిపొయేవాడేమో. అయితే మన ఆనంద్ అలొచనలు అక్కడితో ఆగిపొలేదు. పేదరికం వల్ల చిన్నప్పటి నుండి తనకు అందకుండా పొయిన ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను తనకు వీలయినంతలో కొందరు పేదవారికయినా అందించాలని అనుకున్నాడు. అప్పుడు పుట్టిందే " రామనుజం స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్". ఇందులొ వివిధ కాంపిటిటివ్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న పేద విధ్యార్దులకి ఉచితం గా శిక్షణ ఇచ్చేవాడు. కొన్నాళ్ళకి ఇదే అలొచనను ఇంకా సీరియస్ గా తీసుకుని పాట్నా వచ్చి ఉండటానికి భోజనం , హాస్టల్ ఖర్చులు కూడా భరించలేని కఠినమయిన పేదరికం లొ ఉన్న వారిని ఆదుకొవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ముంబై లొ నివసిస్తున్న అతని బ్రదర్ ప్రవీణ్ కుమార్ ని పిలిపించి విన్నూతనమయిన అతని అలొచన వినిపించి అతనికి సహాయంగా పాట్నాలొనే ఉండమన్నాడు. అప్పుడు పుట్టిన ఐడియానే ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన " సూపర్ 30 ". 

ఈ సూపర్ 30 ప్రొగ్రాంలొ అత్యంత కఠిన పేదరికం లొ మగ్గుతున్న కుటుంబాలలొనుండి 30 మంది అత్యంత ప్రతిభావంతులని ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేసి వాళ్ళకి ఒక సంవత్సరం పాటు ఐఐటి ప్రవేశపరిక్షకి ఉన్నత ప్రమాణాలు కలిగిన శిక్షణ ఇస్తారు. అయితే ఆ ముప్పయ్ మందికి చదువు చెప్పడం తొనే ఆగిపొలేదు. వారి కుటుంబాలు కనీసం ఈ పిల్లలని పాట్నా పంపించి చదివించే స్తొమత లేని కుటుంబాల నుండి ఎంపిక చేసిన వారు కావడం తొ వాళ్ళు ఉండటానికి ఉచిత వసతి , భోజనం కూడా ఏర్పాటు చేయ్యాలి. ఈ ఏర్పాట్లు చెయ్యడం లొ అతనికి తన కుటుంబం అతనికి  ఎంతొ సహకారం అందిస్తుంది. ఈ సూపర్ 30 ప్రొగ్రాం కి కావలసిన ఫండ్స్ కొసం ఆనంద్ వేరే కాలేజీల్లొ కూడా పని చేస్తుంటే... అతని తల్లి ఈ ముప్పయ్ మందికి స్వయంగా వండి పెడుతుంది.

ఈ సూపర్30 లొ సీటు పొందిన విద్యార్దులకి ఉచిత వసతి, ఉచిత భొజనం అన్నీ ఆనంద్ కుటుంబం సమకూరుస్తుంటే ఇక వారికి మిగిలిన అలొచన ఒక్కటే ... చదువు... చదువు... చదువు... 2003 లొ స్తాపించిన ఈ సూపర్ 30 సంస్థ మొదటి సంవత్సరం లొనే 30 లో 18 మందికి  ఐఐటిల్లొ సీట్ సంపాదించిపెట్టడం అతనికి చాలా సంతృప్తి మిగల్చడం తొ పాటు మరింత అంకితభావంతో పనిచెయ్యడానికి మంచి ఉత్సాహాన్ని నింపింది.  అలాగే 2004 లొ 30 కి 22, 2005 లొ 30 కి 26, 2006 మరియూ 2007 లొ 30 కి 28 మంది సీట్లు సంపాదించగా... అతను ఎదురుచూస్తున్న మేజిక్ ఫిగర్ 2008 లొ వచ్చింది. అదే 30 కి 30. అతను కొచింగ్ ఇచ్చిన 30 మందికి ఐఐటి లొ ప్రవేశం దక్కింది. అదే మేజిక్ ఫిగర్ 2009 , 2010 లొ కూడా సాధించి హ్యాట్రిక్ సాధించారు ఆ సూపర్ 30 సంస్థ సూపర్ విద్యార్ధులు.


ఇతని అద్భుతమయిన వర్క్ కి 2009 సం || నుండి అంతర్జాతీయ గుర్తింపు రావడం మొదలయ్యింది. 2009 సం || లొ డిస్కవరి చానల్ లొ,  కెనడియన్ టీవి సీరీస్ విట్నెస్స్ లొ అతని సూపర్ గురించి ప్రొగ్రాం రావడం, 2010 సం|| లొ ప్రఖ్యాత టైం మేగజైన్ అతని స్కూల్ ని ఆసియాలొని బెస్ట్ స్కూల్స్ లొ ఒకటిగా గుర్తించడం, న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇతని గురించి అరపేజీ పైగా కేటాయించి రాయడం, బిబిసి లో ఇతని గురించి  వచ్చిన ప్రొగ్రాం, ఒక ప్రఖ్యాత జపాన్ చానల్ ఇతనిపై డాక్యూమెంటరి తియ్యడం.... ఇవన్నీఆనంద్ కుమార్ ప్రతిభని ప్రపంచ నలుమూలలా చాటాయి.. లేటెస్ట్ గా న్యూస్ వీక్ మేగజైన్ ఇతని స్కూల్ ని ప్రపంచంలొని నాలుగు మోస్ట్ ఇన్నొవేటివ్ స్కూల్స్ లొ ఒకటిగా పేర్కొంటే, ఫొకస్ అనే యూరొపియన్ పత్రిక ఇతని అకాశానికి ఎత్తేసింది. ఒబామా దూతగా ఇండియాలొ పర్యటించిన రషీద్ హుస్సేన్ సూపర్ 30 ని ఇండియాలొనే ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ గా అభివర్ణించారు. బీహార్ ప్రభుత్వం మౌలానా అబుల్ కలాం అజాద్ పురస్కారం తొ గౌరవించింది.  మరికొన్ని ఇక్కడ చూడండి.

ఈ సూపర్ 30 సూపర్ సక్సస్ సాధించడం తొ ఎన్నారైలు మరియూ ప్రబుత్వం దగ్గరనుండి ఆర్ధిక సహకారం,  అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు వచ్చినా అతను వాటిని సున్నితంగా తిరస్కరించాడు. అయితే అది బీహార్...... అక్కడ ఆఫర్లు తిరస్కరిస్తే అంత సులభంగా వదిలెయ్యరు. మన అమీర్పేట్ లొ లాగ పాట్నా కూడా అనేక జాతీయ ప్రవేశ పరీక్షలకు ఇచ్చే కోచింగ్ సెంటర్లకి ప్రసిద్ది చెందింది. ఐఐటి కోచింగ్ నుండి ఐయేఎస్ వరకూ అన్ని కోచింగ్ సెంటర్లూ అక్కడ ఉంటాయి. అలానే కోచింగ్ సెంటర్ మాఫియా కూడా. ఇతన్ని వాళ్ళ కోచింగ్ సెంటర్స్ లొకి చేర్చుకొవడానికి అనేక వత్తిళ్ళు తీసుకొచ్చినా , ఆఖరికి అతని సూపర్ 30 ఉద్యోగి ఒకరు ఈ మాఫియా చేతిలొ హత్యకు గురైనా ఆనంద్ చలించలేదు. అఖరికి ముఖ్యమంత్రి నితీష్ కూమార్ కల్పించుకుని ప్రబుత్వం తరపున ఆనంద్ కుమార్ కి భద్రతగా బాడీ గార్డ్ లు నియమించిది. అయితే ఈ మాఫియా అక్కడి తొ ఆగలేదు. ప్లాన్ బి దిగి అనేక ఫేక్ సూపర్ సంస్థలు స్తాపించాయి. "రాజా సూపర్ 30″, “నకిలీ సూపర్ 30″, “ గయా సూపర్ 30″ ఆఖరికి  “ఒరిజినల్ సూపర్ 30″ అని కూడా. అయితే  ఈ ఒత్తిళ్లకు ఆనంద్ లొంగలేదు కానీ 2008 సం || లొ ఆనంద్ కుమార్ సూపర్ 30 లొ శిక్షణ పొంది ఐఐటి లొ సీట్లు సాధించిన ముగ్గురు విద్యార్ధులను ఈ మాఫియా డబ్బులు ఆశచూపి తమ సంస్థలలొ శిక్షణ పొందినట్టుగా ప్రచారం చెయ్యడం తో  తీవ్రం గా మనస్తాపం చెందిన ఆనద్ కుమార్ ఇక ఈ సూపర్ 30 సంస్తను పూర్తిగా మూసివెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ ముగ్గురు విద్యార్ధులు చివరకు ఆనంద్
కుమార్ కి క్షమాపణ చెప్పి నిజం బయట పెట్టడం తొ ఆ వివాదం సర్దుమణిగింది. అలాగే 2008 వరకూ అతని తొ పాటు నడిచిన అభయంకర్ అనే ఐపిఎస్ ఆఫీసర్ అనేక రాజకీయ వొత్తిళ్ళకి లొంగి ఆనంద్ నుండి విడిపోయి 30 మంది పేద ముస్లిం విధ్యార్ధులకి శిక్షణ ఇచ్చే వేరే సూపర్ 30 స్థాపించాడు .

ఇప్పుడు అతని ఆశయం సూపర్ 30 లాగానే పేదవారికి ఒక స్కూల్ ఏర్పాటు చెయ్యడం. అతని స్టుడెంట్లలో ఎవరయినా ఎప్పటికయినా నొబెల్ సాదిచాలని అతని ఆశ అట. 

మన ఆనంద్ కుమార్ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకొవాలని,  ఎంతొమందికి భవిష్యత్ ఆనంద్ కుమార్ లకి ఇన్స్పిరేషన్ గా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ... 


- మంచు 
మరికొన్ని వివరాల కోసం సూపర్౩౦

11 comments:

Sravya Vattikuti said...

I read about him few months back , if I am not wrong that was in eenadu sunday special, very inspirational . Especially I loved his Courageous attitude !

బులుసు సుబ్రహ్మణ్యం said...

చాలా అరుదుగా ఉంటారు అటువంటి వాళ్ళు. ఇతని గురించి ఇప్పటిదాకా నాకు తెలియదు. (ఇది నేను సిగ్గు పడాల్సిన విషయం.)

మరెన్నో విజయాలు అతను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఆ.సౌమ్య said...

Very inspiring....నాకు ఇంతవరకు ఇతని గురించి తెలియదు...మంచి విషయం తెలియజేసారు. ఎంత ఆత్మ విశ్వాసం, చదువు పట్ల ప్రేమ, పట్టుదల ఉంటే ఇవన్నీ సాధించగలరు! ఇలాంటివాళ్లందరినీ చూస్తే మనం సాధించినది చీమతలకాయంత కూడా లేదు అనిపిస్తుంది నాకు. hats off to him!

శివరంజని said...

ఇలాంటి వ్యక్తీ ఒకరు ఉన్నారని నాకు తెలియదు ..ఇప్పటివరకు నేను చదవనేలేదు ఆనంద్ కుమార్ గురించి .... నాకు తెలియని ఒక మంచి విషయాన్ని నాకు అందించినందుకు మీకు ధన్యవాదములు ................మన ఆనంద్ కుమార్ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకొవాలని, ఎంతొమందికి భవిష్యత్ ఆనంద్ కుమార్ లకి ఇన్స్పిరేషన్ గా నిలవాలని నేను కూడా మనస్పూర్తిగా కోరుకుంటూన్నాను

Krishna Chaitanya said...

very inspirational person. Such dedication and hard work, he z the real hero.

KGK SARMA said...

బదుగు బలహిన వర్గాల వారికి అనందాన్ని పంచే వాడు అనంద్ కుమార్ అటువంటి విధ్యా దానము చేసిన అనంద్ గారికి నా జోహర్లు

శివరామప్రసాదు కప్పగంతు said...

GREAT

Anonymous said...

Very inspiring. Thanks for sharing.

Anonymous said...

నేను ఆనంద్ గారి గురించి నాలుగైదు సంవత్సరాల క్రితం చదివాను. పేపర్లో. ఎక్కువ ఏది మాట్లాడితే అవతలివాడు దాన్ని గ్రహించి తనని ఎక్కడ దాటి పోతాడో అని విద్యార్థులు, ఉద్యోగస్తులూ కూడా తమ (అ)జ్ఞానాన్నిదాచుకుంటున్న ఈ రోజులలో దాన్ని నలుగురికీ పంచుతున్న ఆయన నిజంగా మహానుభావుడు. విద్యా దానం చేస్తున్న ఆయనకి జోహ్హారులు. మీకు నా ధన్యవాదాలు.

Anonymous said...

మీరు చాలమంచి పోస్ట్లు రాస్తారు ,ఈ ఆనంద్ గారెవరో ఇంతకు ముందు తెలియదు
>>>అలానే కోచింగ్ సెంటర్ మాఫియా కూడా. ఇతన్ని వాళ్ళ కోచింగ్ సెంటర్స్ లొకి చేర్చుకొవడానికి అనేక వత్తిళ్ళు తీసుకొచ్చినా , ఆఖరికి అతని సూపర్ 30 ఉద్యోగి ఒకరు ఈ మాఫియా చేతిలొ హత్యకు గురైనా ఆనంద్ చలించలేదు
మంచి పనికి కూడా ఇన్నికష్టాలు ఉంటాయా?
>>>ఎంతొమందికి భవిష్యత్ ఆనంద్ కుమార్ లకి ఇన్స్పిరేషన్ గా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...
నాదీ మీమాటే

మంచు said...

శ్రావ్యగారు, బులుసు గారు, సౌమ్య గారు, రంజని, కృష్ణ చైతన్య గారు, శర్మ గారు, శివప్రసాద్ గారు, తొలకరి గారు. అనానిమస్ గారు... అందరికి ధన్యవాదాలు.