Pages

Monday, October 25, 2010

నా అభిమాన శాస్త్రజ్ఞులు -3/4

*** శ్రీ  రామ *** 

PART-3

ఎడిసన్:


          అప్పుడు నేర్చుకున్న మోర్స్ కోడ్  ఆ తరువాత ఎడిసన్‌కి  టెలిగ్రాఫ్ ఆపరేటర్ గా పనిచెయ్యడానికి బాగా ఉపయోగపడింది. అప్పట్లో ఒక ఉద్యోగి అమెరికన్ సివిల్‌వార్‌ లొ పాల్గొనడానికి వెళ్ళడంతో , అతని స్తానంలో పనిచెయ్యడానికి తన పదిహేనో ఏట టెలిగ్రాఫ్ ఆపరేటర్‌గా ఉద్యోగంలో చేరాడు. అక్కడ కొన్నాళ్ళు పని చేసాక,  సివిల్ వార్ అయిపోయి ఆ ఉద్యోగస్తుడు తిరిగి రావడటంతో అతను మళ్లీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇల్లువిడిచి వెళ్లి కొన్నాళ్ళు అమెరికా మధ్య రాష్ట్రాల్లో చిన్నచితక ఉద్యోగాలు చేసి 1868 లో తిరిగి తల్లితండ్రులదగ్గరకి వచ్చాడు. పెద్ద చెప్పుకోదగ్గ ఉద్యోగాలు చెయ్యకపోవడం వల్ల చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండానే తిరిగివచ్చిన ఎడిసన్, అతని కుటుంబం పేదరికం వల్ల తన తల్లి మానసికంగా క్రుంగిపోవడం చూసి ఇక ఎలాగయినా సీరియస్‌గా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయం లో అతని స్నేహితుడు బిల్లీ ఆడమ్స్  అమెరికా లో ఈస్ట్ కోస్ట్  కి వచ్చి టెలిగ్రాఫ్ ఆపరేటర్‌గా పెర్మినేంట్ ఉద్యోగం చూసుకోమని ఎడిసన్‌కి సలహా ఇచ్చాడు.  ఇప్పటి "సిలికాన్ వ్యాలీ"లా అప్పట్లో బోస్టన్ నగరం సైన్సు పరిశొధనలకి , ఉన్నత చదువులకి హబ్‌గా పేరుపొందడం వల్ల,  తన స్నేహితుని సలహా మరియూ తను చేసిన చిన్న చిన్న రిపైర్లకి రైల్వే కంపనీ ఇచ్చిన ఉచిత టికెట్ తో బోస్టన్ బయలుదేరాడు.


బోస్టన్లో ప్రఖ్యాతి గాంచిన వెస్ట్రన్ యూనియన్ కంపెనిలో టెలిగ్రాఫ్ ఆపరేటర్ గా ఉద్యోగంలో చేరాడు. ఒకవైపు ఉద్యోగ భాద్యతలు , ఇంకోవైపు అతని సొంత పరిశోధనలు తో అతని దినచర్య ఊపిరిసలపనంత పని ఒత్తిడితో వుండేది. ఉద్యోగంలో చేరిన ఆరునెలల తరువాత అతను రూపొందించిన "ఎలెక్ట్రిక్ వోటింగ్ మెషిన్" అతనికి మొదటి పేటెంట్ ను సంపాదించి పెట్టింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అలాంటి ఆటోమాటిక్ వోటింగ్ మెషిన్ని వాడటానికి అప్పటి మసాచ్యుసేట్స్ రాష్ట్ర ప్రబుత్వం నిరాకరించింది. మొదటి పేటెంట్ అమ్ముడుపడక పోవడం , తన పరిశోధనలకి బాగా డబ్బు అవసరపడటం తో ఇక నుండి జనాలు కొనడానికి ఇష్టపడని వస్తువులు కనిపెడుతూ తన సమయం వృధా చేసుకోకూడని ఒక గట్టి నిర్ణయానికి వచ్చాడు. అయితే అదే సమయంలో .. తన పరిశోధనలకే ఎక్కువ సమయం కేటాయిస్తూ తన ఉద్యోగబాధ్యతలు మీద అశ్రద్ద చూపుతున్నాడన్న కారణంతో వెస్టర్న్ యూనియన్ కంపెని ఎడిసన్‌ని ఉద్యోగం నుండి తొలగించింది. ఇక చేసేది లేక , తన స్నేహితుడు మరియూ మంచి శాస్త్రవేత్త ఆయిన బెంజిమన్ బ్రేడ్డింగ్ దగ్గర కొంత సొమ్ము అప్పు తీసుకుని న్యూయార్క్ బయలు దేరాడు.

న్యూయార్క్ లోని ఒక బ్రోకరేజ్ కంపెనీలో ఎలక్ట్రీషియన్ గా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అసలు ఆ ఉద్యోగం కూడా చాలా విచిత్రంగా వచ్చింది. ఒకరోజు ఉద్యోగం కోసం రోడ్లమ్మట తిరుగుతుండగా... ఆ బ్రోకరేజ్ కంపెని మేనేజర్ తన కంపెనీలో కరెక్ట్‌గా అవసరమయ్యే సమయానికి "స్టాక్ టిక్కెర్ " యంత్రం పాడయిపోయిందని ఆందోళన చెందుతుండగా , దారిన పోతున్న ఎడిసన్  అది చూసి దాన్ని నిముషాల మీద బాగుచేసాడట... దానికి ముగ్దుడయిన ఆ మేనేజెర్ వెంటనే ఎడిసన్ని చీఫ్ ఎలక్ట్రీషియన్ గా ఉద్యోగంలోకి తీసుకున్నాడు. ఆ క్షణాలే తన జీవితంలో అత్యంత మధురమయిన క్షణాలని ఎడిసన్ చేబుతువుండేవాడు... అలా ఒకవైపు ఉద్యోగం .. ఇంకోవైపు సమయం చిక్కినప్పుడు తన పరిశోదనల తో  తీరికలేకుండా వున్నాడు.  ఆ తరువాత మూడు సంవత్సరాలు ఎడిసన్ కి బాగా కలసి వచ్చాయి. 1874 లో కొన్ని పేటెంట్స్ హక్కులు అమ్మగా వచ్చిన డబ్బుతో న్యూ జెర్సీ లో ఒక టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ లాబ్ ని నెలకొల్పాడు.


ఎలెక్ట్రిక్ బల్బ్ :
ఎడిసన్ మరియు అలగ్జాండర్ గ్రహంబెల్  ఇద్దరూ సమాంతరంగా టెలిఫోన్ కోసం పరిశోధనలు కొనసాగించినా, ఆఖరికి మొట్టమొదటి ప్రాక్టికల్ టెలిఫోన్ రూపొందించిన ఘనత మరియు పేటెంట్ మాత్రం గ్రాహంబెల్ కి దక్కాయి. ఈ టెలిఫోన్ లో గ్రాహంబెల్ చేతిలో ఓటమికి బాగా నిరాశ చెందిన ఎడిసన్ అంతకన్నా విలువైనది కనిపెట్టాలని నిశ్చయించుకుని, అప్పటికే ఎందరో  ప్రయత్నించి విఫలమయిన లైట్ బల్బ్ ని ఎంచుకున్నాడు. అయితే చాలామంది అనుకుంటున్నట్టు లైట్ బల్బ్  కాన్సెప్ట్‌ని  ఎడిసన్ మొదటిసారి కనిపెట్టలేదు. విద్యుత్ నుండి కాంతి ఉత్పత్తి చేయవచ్చని 1800వ సంవత్సరంలో "Humphry Davy " అనే ఇంగ్లిష్ శాస్త్రవేత్త కనుగొన్నప్పటికీ, ప్రాక్టికల్‌గా ఎక్కువసేపు పనిచేసే బల్బ్‌ని తయారుచెయ్యడానికి ఇంకొక 60 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. 1860 లలో జోసెఫ్ స్వాన్ అనే ఇంగ్లిష్ శాస్త్రవేత్త తయారుచేసిన బల్బ్, అతనికి పేటెంట్ తెచ్చిపెట్టినప్పటికి , అతను డెవెలప్ చేసిన బల్బ్ జీవితకాలం చాలా తక్కువ. 1878 లో ఎడిసన్ మరియూ అతని టీం (అతను ఒంటరిగా ఈ ప్రయోగాలు చెయ్యలేదు) ఎక్కువ కాలం పనిచేసే బల్బ్ (ముఖ్యంగా దానిలోని ఫిలమింట్) కోసం తీవ్రంగా కృషి చేసి మొత్తానికి 1880 చివరలో 1500 గంటలపాటు పనిచేసి బల్బ్‌ని డెవెలప్ చేసారు. అయితే తన పేటెంట్ ని కాపీ కొట్టి , దాని ఇంప్రూవ్ చెయ్యడం వల్లే ఈ బల్బ్ తయారయ్యిందని జోసెఫ్ స్వాన్ కోర్టుకు వెళ్ళడంతో ఆ కేసులో ఓడిన ఎడిసన్ అతన్ని తన బిజినస్ పార్టనర్ గా తీసుకోవాల్సి వచ్చింది. ఎడిసన్ కనిపెట్టిన కాన్సెప్ట్ తీసుకుని దాన్ని డెవెలప్ చేసి గ్రాహంబెల్  టెలిఫోన్ కనిపెడితే.. జోసెఫ్ స్వాన్ బల్బ్ కాన్సెప్ట్ ని బాగా అభివృద్ధి చేసి ఎడిసన్ ఎలెక్ట్రిక్ బల్బ్‌ని కనిపెట్టాడు.

1887 లో  పూర్తిస్తాయి రిసెర్చ్&డెవెలప్మెంట్ లాబ్‌ని న్యూ జెర్సీ లోని వెస్ట్ఆరెంజ్ లో నెలకొల్పడం ద్వారా ఎడిసన్‌కి   ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది. 1892వ సంవత్సరంలో ఎడిసన్  యొక్క "ఎడిసన్ ఎలెక్ట్రిక్ కంపెనీ", "థామస్ - హుస్టన్ కంపెనీ"తో పూర్తిగా విలీనమయ్యి "జనరల్ ఎలెక్ట్రిక్ (GE)" కంపెనీగా అవతరించింది. "Dow Jones Industrial Index" 1896 ఒరిజినల్ ఇండెక్స్‌లొ మరియూ ఈనాటి ఇండెక్స్‌లొ లిస్టు అయివున్న ఏకైక కంపెనీ ఇదే...ఇలా ఎడిసన్ పరిశోదనలు, వ్యాపారాలు.. మూడు పేటెంట్లు ఆరు ప్రయోగాలుగా సాగుతుండగా...


టెస్లా:



1891 వ సంవత్సరం బుడాపేస్ట్ నగరం :  
                                   ఆ నగరం లో ఎలెక్ట్రికల్ ఇంజనీరుగా పనిచేస్తున్నటెస్లా తన స్నేహితుడితో కలసి సాయంకాల వ్యాహ్యాళికి సెంట్రల్ పార్క్ కి వచ్చాడు. ఇద్దరూ కలసి కబుర్లు చెప్పుకుంటూ, ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ లో జరుగుతున్న పరిశోధనల గురించి చర్చించుకుంటూ నడుస్తున్నారు. ఇంతలో ఏదో చెబుతూ నడుస్తున్న టెస్లా అఖస్మాత్తుగా ఆగిపోయాడు. ఏమయిందా కంగారుపడ్డ అతని స్నేహితుడు టెస్లాని పార్క్ బెంచ్ మీద కూర్చోపెడుతుండగా ... టెస్లా పక్కన పడివున్న పుల్ల ఒకటి తీసుకుని ..కింద వున్న ఇసుకలో ఒక బొమ్మ గీస్తూ ...స్నేహితుడికి ఆ గీసిన బొమ్మ వున్న మోడల్ ఏలా పనిచేస్తుందో వివరించాడు. అదే బొమ్మ ఆరేళ్ళ తరువాత అమెరికన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ సమావేశంలో టెస్లా చూపించిన విప్లవాత్మక ఇండక్షన్ మోటార్ (induction motor) యొక్క డిజైన్. 


1882 లో బుడాపెస్ట్ నుండి ప్యారిస్ కి చేరిన టెస్లా అక్కడ ఎడిసన్ యొక్క యూరోప్ బ్రాంచ్ "Continental Edison Company " లో ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరాడు. అక్కడ అతని పని ఏమిటంటే ... ఎడిసన్ యొక్క ఐడియాలు తీసుకుని, అతను అమెరికాలో రూపొందించిన విద్యుత్ ఉపకరణాలు యూరోప్ విపణికి అనుగుణంగా మార్చడం. అక్కడ పనిచేసే సమయంలోనే తన ఇండక్షన్ మోటార్‌ని బౌతికంగా నిర్మించి విజయవంతంగా పరీక్షించి చూసాడు. అయితే తను రూపొందించిన ఈ ఉపకరణం గురించి యూరొప్‌లొ ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో అమెరికాకి వలస వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. జేబులో కొన్ని చిల్లర నాణాలు మరియు అతని యజమాని ఇచ్చిన సిఫార్సు పత్రం తో 1884వ సంవత్సరంలో అమెరికాలో అడుగుపెట్టాడు. అతని యజమాని మరియు ఎడిసన్ యొక్క యూరోప్ వ్యాపార భాగస్వామి ఆయిన చార్లెస్ బాచిలర్,  టెస్లాని ఉద్యోగం లోకి తీసుకోమని ఎడిసన్ కి సిఫార్స్ చేస్తూ ఇలా రాసాడు ...

 "I know two great men and you are one of them; the other is this young man"

ఎడిసన్ వెంటనే టెస్లాని తన "Edison Machine Works " శాఖలో ఎలక్ట్రికల్ ఇంజనీరుగా ఉద్యోగం లోకి తీసుకున్నాడు. అలా ఒక సాధారణ ఇంజనీర్‌గా ఎడిసన్ కంపెనీలో ఉద్యోగం ప్రారంభించిన టెస్లా ఆనతి కాలం లోనే ఆ కంపెనీలో ఎప్పటినుండో వున్న కొన్ని సంక్లిస్టమయిన డిజైన్ సమస్యలను కూడా పరిష్కరించాడు.

అలా ఎక్కడో అమెరికాలోని మిడ్ వెస్ట్ లో పుట్టిన ఎడిసన్ మరియు యూరొప్ లొని మారుమూల గ్రామం లొ పుట్టిన టెస్లా న్యూయార్క్ లో కలసి పని చెయ్యడం మొదలు పెట్టారు. 

AC vs DC : Struggle starts . . .

అలా కలసి పనిచేస్తున్న వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు రావడానికి మొదటి కారణం...  ఎడిసన్ తన వినియోగదారులకి సరఫరా  చేస్తున్న డి.సి. (Direct Current) విద్యుత్ వ్యవస్థ కన్నా తను అభివృద్ధి పరిచిన ఎ.సి. (Alternating Current) విద్యుత్ వ్యవస్థ మెరుగైనది అని టెస్లా వాదించడం. ఎడిసన్ దగ్గర ఉద్యోగంలో చేరిన కొత్తలో ఒకసారి టెస్లా ఎ.సి. విద్యుత్ పని చేసే విధానం, దాని యొక్క అదనపు ప్రయోజనాలు గురించి ఏకదాటిగా వివరించాక, ఎడిసన్ "ఇదంతా వినడానికి బాగానే వుంటుంది కానీ ఆచరణయోగ్యం కాదు" అని తీసిపారేసాడట. 
ఎడిసన్‌ ఎ.సి. విద్యుత్‌ని వ్యతిరేకించడానికి ముఖ్యకారణాలు చెప్పుకోవాలంటే ...
  • తను ఎంతో కస్టపడి సంపాదించిన డి.సి. విద్యుత్‌కి సంబందించిన పేటెంట్లు ఇక పనిరాకుండా పోయే ఆవకాశం వుండటం వల్ల...
  • అప్పటికే డి.సి. విద్యుత్ సరఫరాకి సంభందించి తను సమకూర్చుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వృదా అవుతుంది అని..
  • అప్పటికే టెస్లా ఎ.సి. విద్యుత్ వ్యవస్థ రంగంలో పరిశోధనలు చేసి పేటెంట్లు కలిగివున్నాడు కాబట్టి ఎ.సి. విద్యుత్ వాడాలంటే  అతనికి రాయల్టీ చెల్లించాల్సివస్తుంది అని.. 
  • అన్నిటికన్నా ముఖ్యమయినది.... డి.సి. విద్యుత్‌తొ  పోలిస్తే  ఎ.సి. విద్యుత్‌ని అర్ధం చేసుకోవడానికి మరియు విశ్లేషించడానికి చాలా గణిత పరిజ్ఞానం కావాలి. ఉదాహరణకి ఈ కింద ఫోటోలు చూద్దాం. 
 
DC Equations AC Equations 1 AC Equations 2

మొదటి ఫోటోలో డి.సి. విద్యుత్‌కి సంబందించిన నాలుగు ప్రాధమిక విద్యుత్  సమీకరణాలు వున్నాయి (కూడికలు, గుణింతాలు లాంటివి). అవే నాలుగు ప్రాధమిక విద్యుత్  సమీకరణాలు ఎ.సి. విద్యుత్ వ్యవస్థలో ఎలా ఉంటాయో రెండు మరియు మూడవ ఫోటోలలో చూడండి. ఈ సమీకరణాలను బట్టి  డి.సి. తో పోల్చిచూస్తే ఎ.సి. ని విశ్లేషించడానికి ఎంత గణిత పరిజ్ఞానం కావాలో మనకో  ఐడియా వచ్చింది కదా. అలాగే  ఈ ప్రాధమిక సమీకరణాలే ఇలా ఉంటే ఇక అడ్వాన్స్డ్ సమీకరణాలు ఇంకెంత పెద్దగా, క్లిష్టంగా ఉంటాయో కూడా అంచనా వేయొచ్చు. అసలే గణితంలో తక్కువ పరిజ్ఞానం వున్న ఎడిసన్‌ సహజంగానే ఈ పెద్ద పెద్ద సమీకరణాలు చూసి ఎ.సి. విద్యుత్ మీద పరిశోధన చెయ్యడానికి అంత ఇష్టపడలేదు మరియు టెస్లా ఎన్నోసార్లు ఎ.సి. విద్యుత్  గురించి  చెప్పాలని ప్రయత్నించినా ఎడిసన్ పట్టించుకోలేదు. 

అయితే వారిద్దరూ విడిపోవడానికి ఇంకో బలమయిన కారణం వుంది...ఒకసారి ఎడిసన్ తన డైనమో (డి.సి. జనరేటర్)  డిజైన్ని మెరుగుపరిస్తే 50000 డాలర్లు బహుమతి ఇస్తానని టెస్లా కి ఒక ఆఫర్ ఇచ్చాడు. అప్పటి టెస్లా జీతం ప్రకారం లెక్క కడితే  ఆ మొత్తం టెస్లాకి 53 సంవత్సరాల జీతంతో సమానం. ఒక సంవత్సర కాలం పాటు కస్టపడి ఆ డిజైన్ని ఎడిసన్ చెప్పినదానికన్నా ఎక్కువ అభివృద్ధి పరిచినా, టెస్లాకి ఇస్తానన్నబహుమతి డబ్బుఇవ్వలేదు... కొన్నాళ్ళు ఎదురు చూసాక , ఇక లాభం లేదని ఒకరోజు వెళ్లి తనకిస్తానన్న డబ్బు గురించి అడిగాడట... అప్పుడు ఎడిసన్
"టెస్లా ... నీకు అమెరికన్ హాస్యం అర్ధం కాదనుకుంటా.. డబ్బులిస్తాని సరదాగా ఆంటే అదే నిజం అనుకున్నావా" అని జోకులేసి పంపెసాడట... అలా మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన ఎడిసన్ మీద టెస్లాకి కోపం వచ్చి , ఎడిసన్ దగ్గర ఉద్యోగానికి వెంటనే రాజీనామా చేసెసాడు...

అలా ఎడిసన్ నుండి విడిపోయి బయటకు వచ్చిన టెస్లా తరువాత ఏమి చేసాడు... ఎడిసన్ -టెస్లా మద్య జరిగిన కరెంటు యుద్దాలు... వాటిలో చివరకి  ఎవరు విజయం సాధించారు ......అన్నీ ఆఖరుబాగం లో ....
                                                                                                                                  (సశేషం)



- మంచు 


15 comments:

తిరు said...

మీ నెరేషన్ బావుంది.

ఎడిసన్ గణితంలో, AC voltages పైనా కృషి చేసుంటే ఎన్ని అద్భుతాలు సృష్టించేవాడో?
ఒకవేళ టెస్లాకి రాయల్టీ చెల్లించినా AC విద్యుత్ సరఫరాతో ఎడిసన్ బోల్డు లాభాలు గడించేవాడు.

వేణూశ్రీకాంత్ said...

తిరుగారు చెప్పినట్లు మీ నెరేషన్ చాలా బాగుందండి.
Very interesting read. Thanks for sharing the info.

Anonymous said...

ఆకాలనికే అమెరికన్లు నిజాయతీలేని మోసగాళ్ళు అని ఎడిసన్ ప్రాక్టికల్గా చూపించాడన్నమాట! భేష్..

శివరంజని said...

నిజమేసుమండి ..... ఎడిసన్ గురించి నాకు తెలిసినది తక్కువేనేమో అనిపించింది ... వెరీ ఇంట్రెస్టింగ్ టాఫిక్

3g said...

ఓహ్..... సైన్స్ పాఠాలు కూడా సస్పెన్స్ సినిమాలా చూపిస్తున్నారండి. చాలా ఇంటరెస్టింగా ఉంది చదవటానికి.
అయితే క్లైమాక్స్ అదే "war of currents" తరువాతి భాగంలో అన్నమాట.

Sravya V said...

బాగా రాసారండి ! ( _. .. _._. _._. _ _ _ _. .)

హరే కృష్ణ said...

కట్టి పడేసారు
చాలా బావుంది పోస్ట్
చాలా balanced గా తీసుకొచ్చారు మూడు పార్ట్స్ :)

నాలుగో పార్ట్ కోసం వెయిటింగ్
ఆఖరి పార్ట్ లో prestige సినిమా గురించి రాయాల్సిందే అని నోలన్ ఫాన్స్ గా డిమాండ్ చేస్తున్నాం

కృష్ణప్రియ said...

అవును 3 జీ గారన్నట్టు సైన్స్ కథ ని కూడా చాలా సస్పెన్స్ లో పెట్టి రాస్తున్నారు. తరువాతి భాగం కోసం ఎదురు చూస్తూ..

జేబి - JB said...

హరేకృష్ణగారి మాటే నాది కూడా - ప్రెస్టీజ్ సినిమా గురించి ఇందులో రావాల్సిందే. నేను మొదటి భాగంలోనే అడిగానండి.

మీ కథనం బాగుందండీ.

మంచు said...

తిరు , వేణు గారు : ధన్యవాదాలు...
అనానిమస్ గారు: ఒక జాతి ప్రకారం ఎవరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అన్నది ఉండదు. మీతొ నేను ఏకీభవించలేను.
శివరంజని, 3జి : థాంక్స్... ఆఖరు బాగం మరిన్ని ఆసక్తికరమయిన విషయాలు తెలుస్తాయి :-))
శ్రావ్య గారు: ధన్యవాదాలు . కానీ మీ ఎక్స్ప్రెషన్ అర్ధం కాలేదు :-(

మంచు said...

హరే , జె బి గారు : థాంక్స్ ... నోలన్ ప్రెస్టేజ్ చాలా సార్లు చూసాను.. టెస్లా బిహేవియర్ కరెక్ట్ గా చూపించాడు దాంట్లొ. ఆ సినిమాలొ చూపించింది కొలరొడొ స్ప్రింగ్స్ లాబ్... న్యూయార్క్ సిటి ఉన్న లాబ్ లొ మన టెస్లా ఒకసారి ఎదొ పరిశొధన చెసినప్పుడు దానిలొనుండి విడుదలయిన శక్తి కి చిన్న సైజు భూకంపం లాంటిది వచ్చినట్టు చుట్టుపక్కల భవనాలన్ని అల్లల్లాడితే ... అలాంటి పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్స్ సిటి లొ చెయ్యకూడదని నిషేదించారు ...అంతే కాకుండా అప్పట్లొ అతని వైర్లెస్స్ పవర్ ట్రాన్స్మిషన్ మీద పని చెసేవాడు...అందుకు జనావాసానికి దూరంగా ఆ కొండమీద లాబ్ పెట్టాల్సి వచ్చింది.

మంచు said...

కృష్ణ ప్రియగారు: స్వాగతం .. థాంక్స్ అండి...

Sravya V said...

హ హ హ ఐతే మీకు మోర్స్ కోడ్ రాదు నాకు వచ్చు :)

మధురవాణి said...

పైన అందరూ చెప్పినట్టు సూపర్ గా చెప్తున్నారు మీరు ఈ సైన్సు కథని.
ఒక చిన్న మాట..
టెస్లా గురించి రాసిన పేరాల్లో 1982, 1984 అని సంవత్సరాలు తప్పేసారనుకుంటా.. ఓసారి గమనించగలరు. :)

మంచు said...

మధురవాణి గారు: చాలా థాంక్స్. ఇప్పుడు సరి దిద్దాను