*** శ్రీరామ ***
సన్నబడతావా .. లేక ఉద్యోగం పీకమంటావా అని బాసులు హుంకరించే రోజు...
నాజూకైన నడుము వున్నవారే ఈ కంపెనీలో ఉద్యోగానికి అర్హులు అని బోర్డులు పెట్టేరోజు...
ఆఫీసులో ఒక గంట పర్మిషన్ తీసుకుని మరీ జిం కెళ్ళి కష్టపడే రోజు ...
డి.ఏ, ఎల్ .టి.ఏ లాగ తక్కువ బరువుకి కూడా ఒక అలవెన్స్ పెట్టే రోజు...
ఇలాంటి రోజులు వస్తాయంటారా ??? ... జపాన్లో అయితే కొన్ని రోజులు త్వరలోనే వచ్చే అవకాశం వున్నట్టు కనిపిస్తుంది .. కొన్ని ఇప్పటికే వచ్చేసాయ్....

జపాన్లో ఎక్కువ శాతం ప్రజలు 'పబ్లిక్ హెల్త్ కేర్' కింద బెనిఫిట్ పొందుతారు . అందువల్ల ప్రజల ఆరోగ్యావసరాలకి అక్కడ ప్రబుత్వమే ఖర్చుపెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రస్తుత ఒబెసిటి ట్రెండ్ జపాన్ కి పాకి వాళ్ళు బరువు పెంచితే, దానివల్లే ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలకి మళ్లీ ప్రబుత్వమే ఖర్చుపెట్టాలనో లేక ప్రజల మీద నిజమయిన ప్రేమతోనో కానీ మొత్తంమీద 2008 లో అక్కడి ప్రబుత్వం " 2012 కల్లా ఆ దేశం లో వున్న ఊబకాయుల సంఖ్య 10 % వరకూ తగ్గించాలని, 2020 కల్లా 25 % వరకూ తగ్గించాలని ఒక నిర్ణయం తీసుకుంది".

ఈ నిభందన 40 సంవత్సరాల పైబడిన వయస్సుగల ఉద్యోగులకే వర్తించినా, ఈ ఫైన్లు గట్రా 2012 నుండే అమలు అవుతున్నా, ఈ కంపెనీలు అప్పటివరకూ వదిలేసి అప్పటికప్పుడు సడన్ గా తమ ఉద్యోగుల బరువు, నడుము తగ్గించాలంటే అవ్వదు కాబట్టి కంపెనీలో జాయిన్ అయినప్పటినుండే "వెయిట్ వాచింగ్" మొదలు పెట్టేస్తున్నారు.
సరే ఈ రూలు నచ్చని వాళ్ళు... ప్రజల ఆరోగ్యం మీద అంత ప్రేమే వుంటే ముందు సిగరెట్ట్ నిషేదించండి అని వాదించే వాళ్ళు ఉన్నారు.. కానీ బలమయిన సిగరెట్ కంపెనీల లాబీ వున్న జపాన్ లో అది అంత ఈజీ ఏమీ కాదనుకోండి...
సరే ఇది మన దేశం లో కూడా పెట్టారు అనుకోండి .. తమ ఉద్యోగుల/సభ్యుల నడుముల వల్ల ఎక్కువ ఫైన్ కట్టే సంస్థలు ఏవో చెప్పుకోండి :-))... చట్టసభలు (పార్లమెంట్ సభలు, అసెంబ్లీలు) మరియూ పోలీసు డిపార్టుమెంటులు.
మనలో మన మాట .. మన ఆడలేడీసుని ఎవరయినా muffin top అని పిలిస్తే ఆహా muffin లా స్వీట్ గా ఉంటానేమో అని మురిసిపోకండి.. నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉన్నవారిని పిలిచే స్లాంగ్ అది :-)) . జపాన్ అమ్మాయిలను చేసుకుంటే వారికి వడ్డాణం ఈజీగా
కొనేయోచ్చు అన్నమాట :-))
సరే .. ఈ నడుము చుట్టుకొలత పెళ్ళికి ముందే కాదు.. తరువాత కూడా ఎంత ఇంపార్టెంటో చూసారు కదా.. ఇక పదండి జిం కి...
-మంచు
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
** 33 .5 /35 .4 కొలతలు ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడెరేషన్ జపాన్ కి అప్పట్లో సూచించిన కొలతలు.. అవి జెండర్ ని బట్టి, రేస్ ని బట్టి మారుతుంటాయి.. మనకు ప్రస్తుతం మగవాళ్ళకి 35.4, ఆడవాళ్ళకి 33.5 అంగుళాలు... నడుము చుట్టుకొలత వివరాలు ఈ కింద టేబుల్ లో వున్నాయి .
23 comments:
మన దేశంలో ప్రైవేట్ వెల్త్ కేర్ ఎక్కువ కాబట్టి అడ్డమైన గడ్డీ తిని అడ్డంగా బలవమని ప్రతి కంపెనీ ఊదరగొడుతోంది. ( తినేవాడి బుద్ధి గడ్డి తినిందా అని ఎవరో ఒక అఙ్ఞాత తప్పక అడుగుతారు, అఙ్ఞాత గారూ మీరు చెప్పబోయేదీ నిజమే ) లావెక్కి ఆరొగ్యం పాడైతే ఆస్పత్రులు అదరగొడతాయి.
నిజమే ఇలా నిర్బంధంగా చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు. నాజూకుగా అందంగా కనిపించాలని అందరూ అనుకుంటూనే ఉంటారు, కాకపొతే ఎప్పటికప్పుడు జిహ్వాచాపల్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారికి ఈ స్కీం చాలా బాగుంటుంది.
మంచుపల్లకి గారు మీ పోస్టు బాగుంది !
పైన ప్రసాదం గారు రాసిన కామెంట్ చదివాక నాకు కళ్ళ ముందు ఈ క్రింది సినిమా కనపడింది .
మనదేశం లో కూడా ఇలాంటి స్కీం పెడితే ఒక నెలరోజుల పాటు మనవాళ్ళకి పండగే పండగ . ఒక 20 లేదా 30 పేర్లతో నానాసంఘాలు , ఇప్పుడు లేటెస్ట్ గా ఐతే జాక్స్ (JAC ) అనుకుంటా అవి ఏర్పడతాయి. ఇక ఎవడి నోటికి వచ్చిన తిట్లు వాళ్ళు బయటి కి తీసి టీవీ మైకుల ముందుతమ ప్రతిభ ప్రదర్శించి పారేస్తారు . ఇక మన ప్రింట్ మీడియా , ఎలక్ట్రానిక్ మీడియా దొరికినవాడినల్లా పిలిచి నానా రకాల ఎనాలసిస్ లు ప్రసారం చేస్తాయి . చివరాకరికి ఏమి తేలుస్తారు అంటే అసలు లావు గా ఉండటం చాల మంచి విషయం ప్రభుత్వాన్ని నడిపే వారికి ఏమి తెలియక ఇటువంటి పని చేసారు అని. ఇక మన నాయకులకి కాళ్ళు చేతులు ఆడక యధాప్రకారం ఒక కమిటి ని వేసి చేతులు దులుపుకుంటారు . అదీ సంగతి !
ఇక రామాయణం లో పిడకలవేట లాగ 80 బరువు 40 kg గా చూపించే మిషన్లు తయారుచేసే ముఠాలు , బరువు తగ్గించి సర్టిఫికెట్లు ఇచ్చే ముఠాలు చాప క్రింద నీటి లాగ లాగ తమ పని తము చేసుకుపోతుంటారు. ఇక చివరాకరిగా మన బ్లాగుల్లో ఒక నెల రోజుల పండుగ అది నేను చెప్పనక్కర్లేదు .(ఎవరెవరు ఈ నిర్ణయాన్ని సమర్దిస్తారు / వ్యతిరేకిస్తారు అనేది కూడా నా కళ్ళ ముందు కనపడింది :)
జపాన్ ఆన్ సైట్ లకు వెళ్ళే వాళ్లకు కూడా ఈ కండిషన్లు వర్తిస్తాయా?
మ్యావో చెహోవ్ దేశాలకు ఇంకా రూల్ పెట్టలేదు కదా
మీరు చెప్పింది కర్రెక్ట్ అసెంబ్లీ పార్లమెంట్ లో ఉండే మంత్రులు ముందుంటారు ఇలాంటి విషయాల్లో ఈ చట్టం తీసుకు రాకుండా ఉండటానికి
మా అమ్మగారు నెలకు ముఫై వేలు సంపాదిస్తున్నారు కనుక నేను కావలసినంత తింటాను.
కామ్రేడ్ ప్ర.నా.
మావోలు అమ్మలు నాన్నలు సంపాదించింది తినికూర్చోకూడదుకదా.
బరువు తగ్గడం సులభమే కానీ, నడుము కొలతను తగ్గించడం కాస్తంత కష్టం. :(. శరీరాన్ని సరైన ఆకృతిలోకి తీసుకురావడం ఇంకా కష్టమేమో. ఎంతైనా జూ.ఎన్టీఆర్ను చూసి స్పూర్తి పొందాలి ఈ విషయంలో. :-)). బరువు విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను నేను ఎప్పుడో ఉల్లంఘించాను. :)
DTP చేస్తూ కోర్చోవడం వల్ల బరువు పెరుగుతాదు మా సేటు. అప్పుడప్పుడు ఇంగ్లీషు , హిందీ టైప్ చేస్తాడు. వ్యాపారం లో నష్టం వచ్చినా ఫస్ట్ క్లాసు లో ప్రయాణం చేస్తాడు.
ఎవరు చెప్పారు ఊరకే కూర్చున్నారని. అది అరగడానికి వందలు వందలు కామెంట్లు రాయడం, స్కాన్ చేయడం బ్లాగులో పెట్టడం జరుగుతూనే ఉంది కదా.
నడుము సన్నగా ఉంటే మనిషి సన్నగా ఉంటాడు. ఈ విషయాన్ని బక్యోవ్ పీచోమన్ 1790లో తన బాన కడుపు మీద రాసి ప్రపంచానికి చాటి చెప్పాడు. సామ్రాజ్య వాద దేశాల్లో తినడం ఎక్కువ అందుకే లావు అవుతారు. నేనూ చిన్నపుడు లావుగా ఉండేవాడిని. గ్రహణం రోజుల్లో వెజ్ బిర్యానీ తిని డైటింగ్ చేయడం వల్ల సన్నబడ్డాను. ఇలాగే డైటింగ్ చేసి సన్నబడమని మా వీధిలో ఆడవాళ్ళకు చెబెతే నన్ను తిట్టారు.
మా ప్రవీణు అసలే బొచ్చు పీకిన కోడిలాగా కాల్చిన తొందలాగా ఉంటాడు. ఇంకా బక్క చిక్కితే కష్టం.
బొచ్చుపీకిన కోళ్ళు ఆఫ్రికా దేశాల్లోని అడవుల్లో ఉంటాయి. వీటి బొచ్చు ఒకసారి తాకితే మనిషి నవ్వుతాడు.
ఇప్పుడు ఒరిస్సా వెళుతున్నాను తిరిగివచ్చాక మీ విమర్శలకి తగిన సమాధానం ఇస్తాను.
ఒరిస్సా నల్లగొండ అని తిరక్కుండా వ్యాపారం సరిగజేసి నష్టం రాకుండా కూసింత సంపాదించి అమ్మను మంచిగ చూస్కో ప్రవీణు. పాపం ఎంతకాలం ఆవిడ నిన్ను మేపుతారు.
నాకంటే ఓ 30 ఏళ్ళ పెద్దదైన పడచుపిల్ల దొరికితే పెళ్ళి చేసుకొని సెటిల్ అవాలని ఉంది. అప్పుడు అమ్మకు తోడుగా యోగా గుళ్ళు గోపురాలు తిరగడానికి చేదోడు వాదోడుగా వుంటుంది ( పెళ్ళాల ముందు నాస్తికత్వం, కమ్యూనిజం, మావోయిజం , జంతిక వాదాలు చెల్లవని నాకూతెలుసు. ఈ విషయాన్ని 1790లో ఇంట్లోవ్ మియావ్ రాసిన పుస్తకంలో చదివాను ) కానీ సెటిల్ అయి చావడంలేదు మరి తిరక్క చస్తానా?
తోరొంపు కటిదాన తొణకు సిగ్గులదాన,"పిడికిట బిగియాడు నెన్నడుముదాన" అని పాట.శ్రీశ్రీ రచన(బొబ్బిలియుద్ధం సినిమాలోది)
మొగవాళ్ళకి కీ ఈ నడుము గురించి చెప్పారు ఎలా ఉండాలంటేట సింహం నడుములా ఉండాలట.మరి ఇలాంటి నడుము ఉన్నవాళ్ళు ఆఫ్రికా,వెస్ట్ఇండీస్ దేశాల్లోనే కనిపిస్తారు.ఏమంటారు.
ఇందుగలదందులేడని సందేహము వలదు అన్న సర్వోపగతుండు ఏ బ్లాగులు తెరిచి చూచిన అందందే కలడు బ్లాగు మాలిక లందున్.
హ్మ్ ఇదేదో బావుంది....ఇలాంటి రూలేదో మనదేశంలో కూడా వచ్చేస్తే బాగుందును. నాలాంటి, మీలాంటి మరియు పప్పుగారిలాంటి వాళ్ళకి బాగా పనికొస్తుంది.
మనదేశం లో పబ్లిక్ హెల్త్ కేర్ అందరికి ఉంటే బాగుందును,అంత సీను మనకి లేదుగా.....అయినా ఈ జివ్హ చాపల్యం ఆపుకోవడం కష్టమబ్బా. బకాసురుల్లా తిన్నా ఒళ్ళు రాకుండా ఉన్నవాళ్లని చూస్తే నాకెంత కోపమొస్తుందో, అలాంటివాళ్లకి ఫైను వెయ్యాలి :)
నాజూకైన నడుము నారీమణులతో తో పాటుగా సింహమధ్యముల [శీనివాస్ పప్పు గారి మాటే] సంఖ్యనూ వృద్దిచేయటానికి - అవి జీవితార్హత అని మారిస్తే బావుణ్ణు. కాస్త పెంపకం వలన [వేసవిలోనూ ఐదున్నరకి లేపి పరుగులు పెట్టించి, బూడిదగుమ్మడి సూప్స్, రాగిజావ తాగించిన మా నాన్నగారికి కృతజ్ఞతగా] మరి కాస్త ఆరోగ్య+ఫిగర్ కాన్షస్ కారణంగా మా బోటివారు తగు జాగ్రత్తలు తీసుకుని, మా కారణంగా అసూయ/కుళ్ళు తోనో ;) పీర్ ప్రెషర్ కారణంగానో, స్ఫూర్తితోనో మాతో కలిసేవారి సంఖ్యని బాగానే వృద్ది చేస్తున్నాము [జిం, డాన్స్, పరుగులు ఏదో ఒక ఊదరతో ఒకరికొకరం]. కాకపోతే, పాపం మగవారికున్న తరుగేమిటంటే వాళ్ళలో ఫాట్ కాన్సంట్రేషన్ దేహమంతా ఒకటే రీతిగా ఉంటుంది కనుకా జ్ఞానోదయం అయ్యేసరికి, మేలుకునే సరికి గతజలసేతుబంధనం అన్న రీతి మాదిరవుతుంది. కనుకా, ప్రభుత్వ చట్టాలతో పనిలేకుండా మీరూ శీఘ్రంగా నివారణ కార్యక్రమాలు మొదలుపెట్టండి.
మంచుపల్లకీ గారు, చిన్ని గారి బ్లాగులో మీకు ప్రకటిమ్చిన మద్దతుని పొడిగిస్తూ ఈ సలహా అంతే..ఇక్కడ లింగవివక్ష కాదు సమస్య.. అర్థం చేసుకోగలరు.
ఊఫ్, కామెంట్ పొయిందేమో అనుకున్నాను. సేవ్ అయింది. ఆ ఇన్ఫో తో పాటుగా ఈ లింక్ కోసం వెదికి చదివితే కాస్త ఆరోగ్య సూత్రాలు దొరుకుతాయి.
WIPRO'S EMPLOYEE AND Dr. DEVI SHETTY (CHAT)
మేము కొందరం వ్యాయామం తో పాటుగా, మంచి పద్దతుల ఆహారం కూడా ప్రమోట్ చేస్తున్నాము.
ఉషగారు
మీ కామెంట్ నిన్న కనిపించింది కానీ ఈరొజు మాయం అయిందండి. కాస్త ఈ బ్లాగర్ ప్రాబ్లెం సెటిల్ అయ్యాక, అప్పుడూ కూడా కామెంట్ కనిపించకపొతే మైల్ నుండి మళ్ళీ నేను కాపీ పేస్ట్ చేస్తాను.
పల్లకి గారు
ఇస్పైన్ మ్యాచ్ కి రెడీ ఆ?
GOlden boot ఎవరికి
david villa or muller or klose ??
లైవ్ కామెంటరీ ఏ బ్లాగులోనో చెప్పండి కుమ్మేద్దాం!
ఈ పద్దతేదో బాగుందే . చాలా సమస్యలు తగ్గుతాయి .
**
ఉష has left a new comment on your post "నాజూకైన నడుము ... ఓ ఉద్యోగార్హత":
నాజూకైన నడుము నారీమణులతో తో పాటుగా సింహమధ్యముల [శీనివాస్ పప్పు గారి మాటే] సంఖ్యనూ వృద్దిచేయటానికి - అవి జీవితార్హత అని మారిస్తే బావుణ్ణు. కాస్త పెంపకం వలన [వేసవిలోనూ ఐదున్నరకి లేపి పరుగులు పెట్టించి, బూడిదగుమ్మడి సూప్స్, రాగిజావ తాగించిన మా నాన్నగారికి కృతజ్ఞతగా] మరి కాస్త ఆరోగ్య+ఫిగర్ కాన్షస్ కారణంగా మా బోటివారు తగు జాగ్రత్తలు తీసుకుని, మా కారణంగా అసూయ/కుళ్ళు తోనో ;) పీర్ ప్రెషర్ కారణంగానో, స్ఫూర్తితోనో మాతో కలిసేవారి సంఖ్యని బాగానే వృద్ది చేస్తున్నాము [జిం, డాన్స్, పరుగులు ఏదో ఒక ఊదరతో ఒకరికొకరం]. కాకపోతే, పాపం మగవారికున్న తరుగేమిటంటే వాళ్ళలో ఫాట్ కాన్సంట్రేషన్ దేహమంతా ఒకటే రీతిగా ఉంటుంది కనుకా జ్ఞానోదయం అయ్యేసరికి, మేలుకునే సరికి గతజలసేతుబంధనం అన్న రీతి మాదిరవుతుంది. కనుకా, ప్రభుత్వ చట్టాలతో పనిలేకుండా మీరూ శీఘ్రంగా నివారణ కార్యక్రమాలు మొదలుపెట్టండి.
మంచుపల్లకీ గారు, చిన్ని గారి బ్లాగులో మీకు ప్రకటిమ్చిన మద్దతుని పొడిగిస్తూ ఈ సలహా అంతే..ఇక్కడ లింగవివక్ష కాదు సమస్య.. అర్థం చేసుకోగలరు.
Posted by ఉష to మంచు . పల్లకీ at July 5, 2010 11:31 PM
Post a Comment