Pages

Saturday, January 9, 2010

నైజీరియా To శ్రీకాకుళం

నైజీరియా మాహారాజు లేక లాండ్ లార్డ్ కుటుంబ సభ్యుల దగ్గరనుండి మీకేప్పుడయినా ఈ-మెయిల్ వచ్చిందా .. అక్కడ బ్యాంకులలో వాళ్లకి కొన్ని కోట్ల ఆస్తి  వుందని , ఇప్పుడు అక్కడ ఏర్పడిన political unrest వల్ల ప్రస్తుతం అక్కడ ఎకౌంటు  access చెయ్యలేక పోతున్నామని  , ఆ ఫండ్స్ మీ దేశం లో వున్న బ్యాంకు కి మూవ్ చెయ్యడానికి హెల్ప్ చేస్తే మీకు కొంత (కొన్ని కోట్లే ) డబ్బు ఇస్తామని.. ఇలా వుంటుంది ఆ మెయిల్ సారాంశం ..

ఇదంతా నిజం కాదు అని అనిపించినా ఇది ఎవరు రాస్తున్నారో, ఎందుకు రాస్తున్నారో , దాని వెనకున్న మతలబు ఏమిటో నాకు అర్ధం అయ్యేది కాదు. కొన్ని సార్లు టెంప్ట్ అయ్యా కూడా. ఆ తరువాత ఓ రోజు దానిగురించి బా.......గా  అర్ధం అయింది..


2007 ఆఖరులో అనుకుంటా ..ఒకరోజు పొద్దున్నే టి వి లో టెస్ట్ క్రికెట్ చూస్తూ బిజీ బిజీ గా ల్యాబ్ లో వర్క్ చేసుకుంటున్నా (అప్పట్లో ఎకానమీ బావుండి .. కాస్త వాళ్ళు బలసి .. ల్యాబ్ లో రెండు టి వి పెట్టిన్చాం లెండి  .. క్రికెట్ కోసం ) ..  నా పక్క క్యూబికల్ లో కూర్చునే బెంగాలి రాజేష్ గాడు వచ్చాడు.. ఎందుకో కాస్తా కంగారు గా వున్నాడు మనిషి .. మళ్ళి మా తిక్క బాస్ ఏమయినా అన్నాడా అని  ఎంక్వయిరీ చేస్తున్నా.. ( అలాంటి న్యూస్ లు కాస్తా ఎక్కువ ఇంటెరెస్టింగ్ గా వుంటాయి కదా :-) )


వాడు ఏడుపు మొహం వేసుకుని  ...వాడి బ్యాంకు అక్కౌంట్ లోనుండి ఎవడో వీడికి తెలీకుండా డబ్బు transfer చేసేసుకున్నాడని చెప్పాడు.  నాకేమీ అర్ధం కాలేదు..

 " ఎంత ?" అని అడిగా
" 97,000"
" ఎప్పుడు ?"
" మూడువారాల క్రితం వెయ్యి, రెండువారాల క్రితం  48 వేలు , నిన్నో 48 వేలు " అని చెప్పాడు.

అప్పటికి వాడు మా కంపనీలో జాయిన్ అయ్యి రెండునెలలు అయ్యింది. వాడు నాకు 2002 నుండి తెలుసు .మేమిద్దరం అంతకు ముందు కంపెనీలో కొలీగ్స్.. నేను ఆ కంపనీ నుండి మారినప్పుడు , వాడు IISC లో PHD కి వెళ్ళాడు.. PHD అయ్యాక వాడిని పట్టుబట్టి మా కంపనీ కి లాక్కోచ్చా ..

ముందు బ్యాంకు కి ఫోన్ చేసి విషయం చెప్పి ఎకౌంటు బ్లాక్ చెయ్యమని చెప్పాం ...ఆ తరువాత ఈ ఇంసిడెంట్ గురించి మా మేనేజర్ కి, హెచ్ ఆర్ కి మెయిల్స్ ఫోన్ చేసి చెప్పాం.. తరువాత కంపెనీ మెయిన్ హెచ్ ఆర్ మేనేజర్ ద్వారా  బ్యాంకు కి ఫోన్ చేయించాం ..వాళ్ళు మొదట మమ్మల్ని బెంగళూరు - కమర్షియల్ స్ట్రీట్ లో వున్న సైబర్ క్రైం  పోలీసు స్టేషన్ లో కంప్లైంట్  ఇవ్వమన్నారు..( ఛ.. టి వి 9 కి ఫోన్ చెయ్యాలని అప్పుడు తట్టలేదు.. )... మిగతా కొలీగ్స్ అందరూ  దైర్యం చెబుతున్నారు..

మద్యాహ్నానికి  పోలీసులు మరియు బ్యాంకు వాళ్ళు ఆఫీసు కి వచ్చి రాజేష్ ని ఏవో అడుగుతున్నారు.. ఎకౌంటు ఎప్పుడు ఓపెన్ చేసారు, మీ బ్యాంకు ఇన్ఫర్మేషన్ ( లాగిన్ , పాస్ వర్డ్  గట్రా ) ఇంకా ఎవరితో షేర్ చేసారు, మీరు ఎక్కడెక్కడ  ఈ ఎకౌంటు ఓపెన్ చేస్తారు , నెట్ సెంటర్లో ఎప్పుడయినా బ్యాంకు ఆన్ లైన్ ఎకౌంటు వెబ్సైటు ఓపెన్ చేసి చూసారా అంటూ ప్రశ్న మీద ప్రశ్నలేస్తున్నారు.. వీడు ఎకౌంటు ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలిసే అవకాసం లేదని చెబుతున్నాడు.. వాళ్ళు ఆ తరువాత 'ఆన్ లైన్ ఎకౌంటు వెబ్సైటు ఓపెన్ చేస్తున్నప్పుడు ఎవరయినా తొంగి చూసే ఆవకాశం ఉందా' అని అడిగారు.. ఆ ఆవకాశం వున్నది పక్కసీట్లో కూర్చునే నాకొక్కడికే.. పాపం ఏం చెప్పాలా అని వాడు సంశైస్తుంటే వాళ్ళే అడిగారు ఆ సీట్లో ఎవరు కూర్చుంటారు అని.. అప్పటివరకు మంచి detective సినిమా లైవ్ లో చూస్తున్న నాకు కొద్ది కంగారు పుట్టింది.. ఆ తరువాత ప్రశ్నలు నాకు మొదలయ్యాయి.. నా బాక్గ్రౌండ్ గురించి .. ఈలోపు నా బుర్ర లో 1000 వాట్స్ ఫ్లడ్ లైట్  ఒకటి వెలిగి .. " ముందసలు  మీరు ఆ ఎకౌంటు నెంబర్ ని ట్రేస్ చేయ్యోచు కదా అని అడిగా " .. పక్కన వున్న కానిస్టేబుల్ అడిగినదానికి మాత్రం సమాదానం చెప్పమని మర్యాద గా చెప్పేసరికి :(((...
ఒక గంట నన్ను తిన్నాక ( ఆ గంట లో పదిహేను నిముషాలు నన్ను ప్రశ్నలు అడిగాడు.. నలబై ఐదు నిముషాలు అన్యాయం గా పక్కన నుంచో పెట్టి ఫోన్లో మాట్లాడుకున్నాడు .. ) మనకంత టాలెంట్ లేదని వదిలేసాడు..

ఈ లోపు బాంక్ వాళ్ళు ఆ ఎకౌంటు ట్రేస్ చేసి ..అది ఢిల్లీ లో వున్న ఒక stundent ది అని కనుక్కొన్నారు.. ఆ స్టూడెంట్ ని ఢిల్లీ బ్రాంచ్ కి పిలిచి ఆరాతీస్తే , వాడు తనకేమి తెలీదని.. ఎవరో తమ డబ్బులు వేరే దేశం నుండి ట్రన్స్ఫెర్ చేస్తాం.. నువ్వు ATM లో డ్రా చేసి కాష్ ఇస్తే 10 % ఇస్తామన్నారని.. అలాగే ట్రన్స్ఫెర్ చేసిన వాళ్ళ డబ్బులు వాళ్ళకి ATM  lo draw చేసి  ఇచ్చేసానని  చెప్పాడు .. అప్పుడు బాంక్ వాళ్ళకి విషయం అర్ధం అయ్యింది.. ఆ తరువాత రాజేష్ ని అడిగారు .. తనకి బ్యాంకు నుండి ఏమయినా మెయిల్ వచ్చిందా అని.. వాడు పాత మెయిల్స్ అన్ని వెతికితే వాడి ఎకౌంటు update చెయ్యమని బ్యాంకు మెయిల్ ఒకటి దొరికింది..ఆ తరువాత మొత్తం plot గురించి వివరించి చెప్పారు..

ఈ fraud అంతా చేస్తున్నది నైజీరియా దేశ్శస్తులే .. మొదటగా  పైన చెప్పినట్టు నైజీరియా మెయిల్ పంపిస్తారు.. ముఖ్యం గా అమాయకులయిన stundents ని టార్గెట్ చేస్తారు... ఎవరిదగ్గరనుంది ఆయినా రెస్పాన్స్ వస్తే .. వాళ్లతో తరువాత ఫోన్ లో మాట్లాడతారు.. "మేమే ట్రన్స్ఫెర్ చేసుకుంటాం.. అది కాష్ చేసి ఇవ్వు చాలు" అంటారు.. ఈ బ్యాంకు ఎకౌంటు వున్న వాళ్ళకి ..దాంట్లో తప్పేమీ కనిపించదు.. వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తున్నాం కదా అని కన్విన్స్ అవుతారు.. అలా కొన్ని ఎకౌంటులు రెడీగా పెట్టుకుంటారు ..

మరో పక్క వివిధ బ్యాంకు లో ఎవరయితే కొత్తగా ఎకౌంటు ఓపెన్ చేసారో ఆరా తీసి , వాళ్ళ మెయిల్ ID లు సంపాదిస్తారు.. వాళ్ళ డేటా చూస్తే బ్యాంకు లో పనిచేసే కొంతమందికి  కూడా ఇందులో హ్యాండ్ ఉందేమో అని పిస్తుంది..ఆ తరువాత వాళ్ళు ఈ కొత్త ఎకౌంటు హోల్దేర్స్ కి ఒక మెయిల్ పంపిస్తారు.."ఫలానా తేదీన మీరు ఓపెన్ చేసిన ఆన్ లైన్  ఎకౌంటు లో ఏదో ప్రాబ్లం వుంది.. లాగిన్ అయ్యి కరెక్ట్ డేటా  update చెయ్యండి  అని  ఆ kinda ఒక లింక్ ఇస్తారు.. ఆ లింక్ లో కి వెళ్లి మీ డేట్ అఫ్ బర్త్( అలాంటివి ఏవో)  details మళ్ళి update చెయ్యమని  .. ఆ మెయిల్ బ్యాంకు నుండి వచ్చినట్టే వుంటుంది..( కరెక్ట్ బ్యాంకు xxx@icicibank .com  అనుకోండి వీళ్ళు xxx@icici .com నుండి పంపిస్తారన్నమాట )... ఆ  లింక్ క్లిక్ చేస్తే అచ్చు బ్యాంకు ఒరిజినల్ వెబ్సైటు లానే వుంటుంది కానీ అది వాళ్ళ ఫేక్  వెబ్సైటు.. మనం లాగిన్ ID , పాస్ వర్డ్ ఇచ్చాక ..వెబ్సైటు ప్రాబ్లం వుంది కాసేపాగి ట్రై చెయ్యమంటుంది.. ఇలాంటివే ఏవో కారణాలు చెబుతుంది   .. సో అలా  మనం ఆ ఫేక్ వెబ్సైటు లో ఎంటర్ చేసిన లాగిన్ పాస్ వర్డ్ వాళ్లకి తేలిపోతుంది.. దాంట్లోంచి ఆ పైన చెప్పిన స్టూడెంట్ ఎకౌంటు లోకి మొదట కొంత అమౌంట్ ట్రాన్స్ఫేర్ చేసి చూస్తారు.. మనం నోటీసు చెయ్యట్లేదు అని వాళ్ళు నమ్మాక  భారి మొత్తాలు ట్రన్స్ఫెర్ చేస్తూ వుంటారు.. అవి సాధారణం గా రౌండ్ ఫిగర్స్ కాకుండా  1000 డాలర్స్  , 2000 డాలర్స్ equivalent గా  వుంటాయి.. ఆ stundent కి ఆ డబ్బు వేరే దేశం నుండి వస్తుందని నమ్మించేందుకు.. ఇదన్న మాట వాళ్ళ   modus operandi ..

సో బ్యాంకు వాళ్ళు చల్లగా చెప్పారు.. ఆ డబ్బు స్టూడెంట్ నుండి ఆల్రెడీ నైజీరియా వాళ్ళు కల్లెక్ట్  చేసుకుని పట్టుకు పోయారు కాబట్టి ఇంకేమి చెయ్యలేము అని..  పాపం రాజేష్..

దీనికి 419 fraud అని వాడుకలో వున్న పేరు..

సో .. ఫ్రెండ్స్.. మీకు బ్యాంకు నుండి (బ్యాంకు లాంటి వాటినుండి ) ఇలా ఎకౌంటు update చెయ్యమని మెయిల్స్ ఏవయినా వస్తే జాగ్రత్త..  మీకు  genuine అనిపించినా దాంట్లో ఇచ్చిన లింక్ క్లిక్ చెయ్యొద్దు.. ఎప్పుడూ ఓపెన్ చేసే వెబ్సైటు ఓపెన్ చెయ్యండి.. మీరు లాగిన్ ఎంటర్ చేసే పేజి secure (https ) అని సరి చూసుకోండి.. బ్యాంకు నుండి ఆయినా  ఎవరయినా కాల్ చేసి ఎకౌంటు details అడిగితె చెప్పకండి..

ఈ మద్య ఇంకో fraud వచ్చిందట.. ఏవో చిన్న చిన్న క్విజ్ లు పెట్టి దానికి కరెక్ట్ సమాదానం చెబితే బోల్డు బహుమతుల్ని నమ్మబలికి ..ముందు వెబ్ లో రిజిస్ట్రేషన్ చెయ్యమంటారు.. దాంట్లో మాములుగా బ్యాంకు వాళ్ళు లేక మెయిల్ వాళ్ళు పాస్ వర్డ్ మర్చిపోతే reset చెయ్యడానికి అడిగే కామన్ ప్రశ్నలు వుంటాయి.. 'మీ మెయిల్ ఇద' 'మదర్ maiden name' 'date of బర్త్', 'place of బర్త్', 'first pet నేమ్', first teacher, spouce name, first lover name ,  మన్ను మశానం..వగయిరా డిటైల్స్ ' ఆ రిజిస్ట్రేషన్ అయ్యాక .. మీకో సింపుల్ సింపుల్ క్విజ్ ఇచ్చి.. గెలిచారని చెప్పి మీ బ్యాంకు ఎకౌంటు నెంబర్ చెప్పండి డబ్బులు ట్రన్స్ఫెర్ చేస్తామని చెబుతారు.. మీరు ఇచ్చిన బ్యాంకు మరియు పర్సనల్ డిటైల్స్ తో బ్యాంకు ఎకౌంటు పాస్ వర్డ్ reset చేసి.. మీ డబ్బు దోచుకుంటారు.. ఎవరో చెప్పినట్టు.. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పెళ్ళాం అవుతుంది.. పెళ్లి చేసుకోలేక పొతే పాస్ వర్డ్ అవుతుందని.. నాకు తెలిసి చాలామందికి లవర్ పేరే పాస్ వర్డ్ గా వుంటుంది.. ఎవడయినా నెంబర్ వుండాలి అంతే ఆ పేరు కి పక్కన '1' లేక '123 ' ..ఇంకా కసి వుంటే '143 ' నో జత చేసి పాస్ వర్డ్ కింద పెట్టేస్తుంటారు.. సో పాస్ వర్డ్ లు జాగ్రత్త.. నా ఉచిత సలహా ...గర్ల్ ఫ్రెండ్స్ పేరు కాకుండా వాళ్లకి సిస్టర్స్ ఎవరయినా వుంటే వాళ్ళ పేర్లు పెట్టుకోండి..:-)

వాళ్లకి ఈ fraud ఐడియాలు ఎలా తడతాయి అని నాకు చాలా ఆశ్చర్యం.. ఇలాంటి  ఒక్క  ఐడియా నాకు తడితే బాగుండును.. లైఫ్ సెటిల్ అయిపోతుంది.. (నాది కాక ..నాకు తెలిసిన ఇంకో బ్యాంకు ఎకౌంటు నెంబర్ ఒకటే..సో నేను ముందు అదే  ట్రై చేస్తా.. మీకు ఆ నెంబర్ కావాలా ..అయితే ఇక్కడ వెతుక్కోండి.   )

- మంచుపల్లకీ

15 comments:

కత పవన్ said...

వామ్మొ ఇంతా కద ఉందా దిని వేనుక

నేను said...

దిమ్మ తిరిగింది

చైతన్య said...

:O

కత పవన్ said...

సంక్రాంతి శుభాకాంక్షలు

వేణూశ్రీకాంత్ said...

చాలా ముఖ్యమైన విషయాలను ఓపికగా రాసినందుకు ధన్యవాదాలు మంచుపల్లకి గారు. ఎక్కువమంది స్టూడంట్స్, కొత్తగా జాల ప్రపంచానికి వచ్చే వారు మీ టపా చూడగలిగితే బాగుంటుంది.

మనలో మనమాట అక్కడక్కడ మీరు విసిరిన చణుకులు భలే బాగున్నాయ్ :-) వీలుని పట్టి తరచుగా టపాయించడానికి ప్రయత్నించండి.

Rajasekharuni Vijay Sharma said...

చాలా కథ ఉందే!

అందరూ తెలుసుకోవలసిన విషయం రాశారు. నేను ఈ టపా నా స్నేహితులందరి చేత చదివిస్తాను. ధన్యవాదాలు.

Indian Minerva said...

చివరి కటింగు సూపరు...

Sravya V said...

Useful info ! ఆ చివర వాక్యం అదిరింది , మీకు ఆలాంటి జీవితాన్ని మార్చే ఐడియా వస్తే కొద్ది గా నా చెవులో కూడా వేయండి :)

durgeswara said...

విలువైన సమాచారం ఇచ్చారు .ధన్యవాదములు

అరుణాంక్ said...

Your profile photo is interesting

మురళి said...
This comment has been removed by the author.
Vasu said...

ఏంటి టపా మళ్ళీ మొదలెట్టినట్టు చెప్పనే లేదు. ఏదో బ్లాగ్ చదువు తుంటే కనపడింది కాబట్టి సరిపోయింది. లేకపోతె ఎంత నష్ట పోయేవాడినో. దీనిని టీవీ లో ౩౦ మినిట్స్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ప్రయత్నించక పోయారా??

419 fraud. భలే ఉంది పేరు. 420 అనిపించుకోవాలంటే వాళ్ళు ఇంకెంత పెద్ద fraud చెయ్యాలో.

శ్రీనివాస్ పప్పు said...

మా బాగా చెప్పారు.నాకూ చాలా మెయిల్స్ ఇలాంటివొస్తే మా కొలీగ్సందరికి ప్రింట్లు తీసి దానం ఇచ్చేసా బేంకులో వేసుకోమని ఆ సొమ్మంతా...

మురళి said...

టపా చాలా బాగుందండీ.. ఉపయుక్తమైన సమాచారం..

మధురవాణి said...

అందరూ తెలుసుకోవాల్సిన విషయం చెప్పారు అభినందనలు. మా కజిన్, తన ఫ్రెండ్స్ కలిసి ఇలాంటి ఒక నైజీరియా గ్రూపుని పోలీసులకి పట్టించారు. వాళ్ళనే వీళ్ళు నమ్మించి పర్సనల్గా కలవమని చెప్పి ఎలాగో ఇరికించేసారంటా. Aug 15th కి వీళ్ళకేవో అవార్డులు ఇచ్చారు కూడా మెడికల్ కాలేజీ వాళ్ళు.
Password tips ;-) ;-)