Pages

Saturday, December 5, 2009

తిరామిసు - Heaven in your mouth



ఇటాలియన్ రెస్టారెంట్ కి వెళ్లి తిరామిసు తినకుండా వచ్చేవాళ్ళు చాలా అరుదు. ఒక్కసారి తిన్నవాళ్ళు Heaven in your mouth అని ఒప్పుకుని తీరాల్సిందే.  దీనిని తయ్యారు చెయ్యడం చాలా కష్టం అన్నారని .. దీని సంగతేంటో చూద్దామని , Youtube ని ఆశ్రయించి , కొన్ని experiments చేసి చివరకి  ఈ రెసిపి ఫైనల్ చేసాను..  


కావాల్సిన పదార్దాలు (Ingredients)


           క్రీం లేయర్స్ కి (For Creamlayers) :

         1. మస్కార్పోని చీస్ (Mascarponi Cheese) : 450 grams (1 lb) 
           egg yolks (పచ్చ సోన మాత్రమె ): 5
         2. పంచదార (Sugar) : 1/3 cup
         3. Whipped cream : 450 grams (1 lb)
         4. marsala whine : 1/3 cup ( ఇది ఇష్టం లేకపోతె వదిలెయ్యండి)


          స్పాంజ్ లేయర్స్ కి (For Sponge Layers):


         5. లేడీ ఫింగెర్స్ (Lady Fingers..ఫోటో లో చూడండి) - ఇవి దొరకపోతే
           స్పాంజ్ కేకు వాడొచ్చు - ఇంచుమించు  15-24 కావాల్సి వుంటుంది ..

        6. Strong Espresso Coffee : 1 1/4 cups ( అంటే కాఫీ డికాక్షన్
          అన్నమాట ) (1.25 cups)
        7. పంచదార : 4 tea spoons
        8. Marsala whine : 1/2 cup ( ఇది ఇష్టం లేకపోతె వదిలెయ్యండి)
        9. Kahlua : 2 table spoons ( ఇది coffee liquor - ఇష్టం లేకపోతె
          వదిలెయ్యండి - దీనితో మాంచి కాకితోక (కాక్టెయిల్) చెయ్యొచ్చు 
          ..అది మరోసారి )
       10. Cocoa powder 2 tablespoons 



అన్ని పదార్దాలు ఫోటో లో వున్నాయి. ముఖ్యంగా లేడీఫింగెర్స్ ని ఒకసారి చూడండి ..
(All the Ingredients are shown in below picture.)


(Note: 1 cup = 16 table spoons; 1 tablespoon = 3 tea spoons)





తయారుచేసే విధానం (Directions) 
 
1. Eggs నుండి పచ్చసోన విడదీయండి. (Separate yolks from eggs) .



2. దాంట్లో 1/3 cup పంచదార వేసి బీటర్ తో పంచదార కరిగేవరకూ బాగా గిలకోట్టండి.
  (Combine 1/3 cup sugar and beat well with egg beater). 



3. తరువాత స్టవ్ మీద డబల్ బాయిలర్ పెట్టండి. (డబల్ బాయిలర్ అంటే కింద ఒక గిన్నె లో నీళ్లు వేసి దాని మీద ఇంకో గిన్నె పెట్టి పైగిన్నె లో మనం వండేది పెట్టాలి . మనం పైన పెట్టిన పాత్ర అడుగు కింద వాటర్ కి తగలకూడదు. అప్పుడు పై గిన్నె లో వున్న పదార్దం కింద గిన్నె లోనుండి వచ్చే ఆవిరి వల్ల వుడుకుతుంది. క్రింది ఫోటో చూడండి.  )
 (Keep this sugar - egg yolk mixture on double boiler as shown in below picture. (Google for double boiler directions))





4. ఇప్పుడు egg + పంచదార మిశ్రమం పైన గిన్నె లో వేసి తిప్పుతూ వుండాలి. ఒక నిముషం అయ్యాక ఒక 1/3 cup marsala wine వేసి మళ్లీ తిప్పాలి. అలా ఒక కింద ఫోటో లో చూపించిన చిక్కదనం వచ్చేవరకు తిప్పుతూ ఉడికించి దింపాలి. ఉజ్జాయింపుగా ఒక పది నిముషాలు పడుతుంది. ఆ పదినిముషాలు తిప్పుతూనే వుండండి..
(Continuously stir the egg yolk + Sugar mixture while cooking on double boiler. After one minute add 1/3 cup marsala wine. Cook till the mix reaches the consistency shown in below picture. This takes approximately 8 - 10 minutes on high heat. Continuously stir for whole cook time. )



5. తరువాత ఒక గిన్నె లో మస్కార్పోని చీస్ తీసుకుని బాగా మెత్తగా అయ్యేలా గరిటెతో వత్తండి .. ఒక గంట ముందు ఫ్రిజ్లో నుండి తీసి బయట పెట్టుకుంటే మెత్తగా చెయ్యడం ఈజీ అన్నమాట.. అది బాగా మెత్తగా వచ్చేవరకు కలిపాక , దాంట్లో వుడికించిన egg + పంచదార మిశ్రమాన్ని దాంట్లో వేసి కలపండి .
(Take Mascarponi cheese in a bowl and mash till it becomes soft. (Keep the mascarponi cheese at room temperature for an hour for easy mashing). Add cooked egg + Sugar mixture in mascarponi cheese and mix well. ) 



6. ఇప్పుడు మస్కార్పోనే మరియు egg మిశ్రమం బాగా మిక్స్ చెయ్యండి.


7. దాంట్లో ఇప్పుడు whipped cream వేసి ఫోల్డ్ చెయ్యండి. (మిక్స్ చెయ్యడం , ఫోల్డ్ చెయ్యడం ఒకటి కాదు). ఫోల్డ్ చెయ్యడం అంటే గరిటతో నెమ్మదిగా కిందనుండి పైకి మిశ్రమాన్ని ఫోల్డ్ చెయ్యడం. ఫాస్ట్ గా కలిపెయ్యొద్దు . texture మారిపోతుంది.
 Add whipped cream to the mixture and fold it (Don't mix fast.. It should be folded as shown in below picture.) 






8. క్రీం లేయర్ కి కావాల్సిన క్రీం రెడీ అయ్యింది కదా.. దాన్ని పక్కన పెట్టి  ఇప్పుడు స్పాంజ్ లేయర్ కి వెళదాం.
( Set the above cream mixture aside and start the sponge layer).


9. మొదటగా స్పాంజ్ లేయర్ కి కావాల్సిన కషాయం తయారు చేద్దాం (అది నిజం గా కషాయం లాగానే వుంటుంది )
  ( Prepare the liquid for sponge layer)


10. ఒక లోతయిన గిన్నె లో 1 1/4  కప్పుల Strong espresso(1.25 cups),   4 tea spoons పంచదార , 1 /2 కప్పు marsala wine , 2 table spoons Kahlua వేసి ఒకసారి కలపండి.
(Mix  1 1/4 cups Strong espresso, 2 tablespoons sugar , 1/2 cup marsala wine, 2 tablespoons Kahlua).








11.  ఇప్పుడు లేడీ ఫింగెర్స్ ని తీసుకుని ఆ కాఫీ మిశ్రమం లో ముంచి మీరు ప్రెజంట్ చెయ్యాలనుకునే గ్లాస్ పళ్ళెం లో ఒక లేయర్ గా పరచాలి. ఇక్కడే మీ స్కిల్ చూపించాలి.. ముంచిన వెంటనే తీసేయ్యాలి.. నాలా ఫోటోలోకి ఫోజులిస్తే అది ఈలోపు బాగా కాఫీ మిశ్రమం పీల్చేసుకుని పేస్టు అయిపోతుంది.. చాలా క్విక్ గా లయెర్ పూర్తీ చెయ్యాలి.
( Dip lady finger and remove quickly and make a layer with these coffee dipped/soaked ladyfingers in a glass bowl. Warning : remove the lady fingers as quickly as possible from coffee mixture)  



12. ఇప్పుడు ఆ స్పాంజ్ లేయర్ (లేడీ ఫింగెర్ లేయర్) మీద సెకండ్ లేయర్ గా mascarponi cheese మిశ్రమం పరచాలి .  మీరు తీసుకున్నగిన్నె ని బట్టి ఈ క్రీం రెండవ లేయర్ కి వస్తుందా లేదా అన్నది తెలుస్తుంది.
( Take mascorponi cheese mixture and spread as a layer on lady finger layer as shown in below picture).





12. మళ్ళి ఒక లేడీ ఫింగెర్ లేయర్ సర్దండి
( Make another layer of coffee dipped ladyfingers on top of the cream layer as 3rd layer).



13. ఆపైన మిగిలిన క్రీం (mascorponi) మిశ్రమం వేసే సమంగా సర్దండి..
( Spread remaining mascorponi cream mixture as fourth layer).


14.  ఆ తరువాత కింద ఒక దళసరి గుడ్డ (kichen Towel) వేసి ఆ గిన్నె ని కొద్ది ఎత్తునుండి జాగ్రత్తగా పట్టుకుని దానిమీద వదలండి. దీనివల్ల లేడీ ఫింగెర్ లేయర్ లో కాళీల మధ్యకి క్రీం వెళుతుంది. మరీ పైనుండి పాడేసి మళ్ళి నేనే చెప్పాను అనకండి.. ఫోటో చూపించినట్టు ఒక అంగుళం ఎత్తు అయితే చాలు.. అలా రెండు మూడుసార్లు పడేయండి..
( Drop the bowl on to a kichen towel from one inch height few times so that the cream will get adjusted in the space between ladyfingers in ladyfinger layer).



15.ఒక కాఫీ డికాక్షన్ వడకట్టుకునే దాంట్లో cocoa powder వేసి ఆ పైన చల్లండి. కాఫీ డికాక్షన్ వడకట్టుకునే దాన్ని స్పూన్ తో నేమ్మెదిగా తడుతూ వుంటే దాంట్లోంచి cocoa పౌడర్ ఒక సన్నని లేయర్ లా పడుతుంది..
( Dust the cocoa powder on top with a coffee strainer as shown in below picture).



15. దానిమీద ఒక అలుమినియం ఫాయిల్ ఒకటి మూత పెట్టి fridge  లో మినిమం 24 గంటలు ఉంచాలి.
(Cover with an aluminum foil and refrigerate for minimum 24 హౌర్స్.. your patience will be rewarded)





16. జాగ్రత్తగా కింద ఫోటో లో చూపించినట్టు ముక్కలు కోసి వడ్డించండి. కావాలంటే దానిమీద మళ్ళి cocoa పౌడర్ జల్లుకోవచ్చు..
(Serve Cold .. You can dust the cocoa powder on serving plate just before serving).





అదండీ తిరామిసు తయారి విదానం.. పండగ చేసుకోండి..


 - మంచుపల్లకీ

5 comments:

నేను said...

ఇంత వివరంగా ఫోటోలతో సహా రాసారు, మీరు చేసుకుని పండగ చేసేస్కున్నారా ;)

వేణూశ్రీకాంత్ said...

నిజమే ఇటాలియన్ రెస్టారెంట్లో డిజర్ట్ అంటే తిరామిసు నే ముందు గుర్తొస్తుంది నాకు. రెసిపి ఇచ్చినందుకు థ్యాంక్స్.

Kalpana Rentala said...

అసలు మీ బ్లాగ్ లోకి రాగానే ఆ శ్రీరామ ఎందుకు పెట్టారో తెలియక ఎడిసన్ గురించి చదవకుండా కొంచెం పాత పోస్త్ల్లోకి వెళ్ళాను. తీరామిసు amte ఏదో తిరకాసు అనుకోని చూసాను. ఆ బొమ్మలు చూస్తూ కిందకు రావటానికే ఇంత సమయం పట్టింది. ఇక ఇలాంటివి చేయటానికి ఎంత సమయం పడుతుందో...మనకు ఈ రెసెపీల పొడనే గిట్టదు కాబట్టి బై బై...

రాజేష్ జి said...

@అసలు మీ బ్లాగ్ లోకి రాగానే ఆ శ్రీరామ ఎందుకు పెట్టారో తెలియక...

కల్పన గారు, మనం ఎదైనా చేసేముందు మంఛి జరగాలని ఎలా కోరుకు౦టమో అలానే చాల మంది రాసేతప్ప్డుడు ఇష్టమైన దేవుడి పేరు రాసి తర్వాత మొదలు పెడతారు.. మా అమ్మమ అయితే "ఓం ప్రధమం" అని రాసి మొదలెట్టేది.. అంటే సృష్టి ఓంకారం తో మొదలయిందని

నేను కూడా అంతే ఒక్కప్ప్డడు.. కాని కాగితాన్ని కంప్యూటర్ రిప్లేస్ చేసిన తర్వాత మరిచా ఆ మంచి అలవాటు.. దాన్ని కొనసాగిస్తున్న మంచు గారు అభినందనీయులు..

కొత్త పాళీ said...

WOW!!