Pages

Saturday, December 5, 2009

మా ఇంటి బాల్కని లో నుండి


మా ఇంటి బాల్కని లో నుండి బయటకు చూస్తూ ఒక పెద్ద లోటాతో కాఫీ తాగడం అంటే నాకు బాగా ఇష్టం.. ఎప్పుడూ చూసేది అదే రోడ్డు , అవే చెట్లు అయినా ఒక్కో సీజన్ లో ఒక్కో అనుభూతినిస్తాయి.. కొన్ని ఫోటోలు ఇక్కడ ..


ఇది వేసవి కాలం తీసిన ఫోటో (సమ్మర్ )

ఇది వర్షాకాలం తీసిన ఫోటో
 
ఇది ఫాల్ ఫోటో ..ఇది ఫ్రీజింగ్ వర్షం వచ్చినప్పుడు.. ఉష్ణోగ్రతలు బాగా తగ్గినప్పుడు వర్షం పడితే ఇలా చెట్ల మీద వర్షం పడింది పడినట్లే ఫ్రీజ్ అయిపోతుంది.. ఇది బాగా ప్రమాదకరమయిన వర్షం ఎందుకంటే ఆ ఐస్ బరువుకి చెట్లు కూలిపోయి కరెంట్ పోతూవుంటుంది .ఆఖరిది నాకు ఇష్టమయిన చలికాలం .. మంచు పడుతూ వుంటే ఇంచక్కా ఇంట్లో కూర్చుని వేడి వేడి పకోడీలు తింటూ కాఫీ తాగుతూ వుంటే సూపర్..
ఈ ఫోటోలు  తియ్యడానికి నాకు ఒక సంవత్సరం పట్టింది.. :-))


- మంచుపల్లకీ

17 comments:

నేను said...

metamorphosis లా ఉంది
ఎన్ని సార్లు చూసినా మల్లి కొత్తగానే ఉంది
just wow అంతే

వేణూ శ్రీకాంత్ said...

సంవత్సర కాలం ఓపికగా ఇలా ఒకే వ్యూ/ఫ్రేం నుండి రకరకాల కాలాలను ఫోటోలు తీయాలన్న ఆలోచనకే హ్యాట్స్ ఆఫ్ మంచుపల్లకి గారు. ఫోటోలు సింప్లీ సూర్బ్, చాలా చాలా నచ్చేశాయి.

వేణూ శ్రీకాంత్ said...

సూపర్బ్ :-) ప మిస్ అయింది ముందు కామెంట్ లొ.

జయ said...

స్టేట్స్ లో ముఖ్యంగా వింటర్ ఫొటోస్ నాకు చాలా ఇష్టం. ఎంతో బాగున్నాయి. అసలు అంత మంచులో ఎలా ఉండగలుగుతారో. అందుకేనా మీరు మంచు లో పల్లకి ఏర్పాటు చేసుకున్నారు?

మరువం ఉష said...

ఋతువుల వైవిధ్యాన్ని బాగా చూపారు. ఇంతగా చూపలేకపోయినా మా ఇంటి చుట్టూ నేను తీసినవివి.

http://picasaweb.google.com/ushaa.raani/PDZRDL?authkey=Gv1sRgCKukhcLq8o7NEA#

చైతన్య said...

భలే ఆలోచన... బాగా తీసారు :)
నాకు ఆ స్నో పిక్ తో పాటు, ఆటమ్ కలర్స్ కూడా బాగా నచ్చాయి!

cbrao said...

మంచి ఆలోచనను చక్కగా అమలు చేస్తే ఇలాంటి అర్థవంతమైన ఛాయాచిత్రాలు అందుకోగలము. మీ సంవత్సర ప్రణాళికకు - మీకు అభినందనలు. ఇవి ఏ ప్రాంతపు చిత్రాలు?

కృష్ణప్రియ said...

చాలా బాగున్నాయి. నేనూ ఇలాగ కొన్ని సరదా పడి తీసినవి...
1) పుట్టినరోజున ఉదయం పిల్లలు లేచే వీడియో. మా పెద్దమ్మాయివి 10 వీడియోలున్నాయి..
2) 1999 సంవత్సరపు ఆఖరి పూవు (మా వాకిట్లో పూసినవి) , 2000 సంవత్సరపు మొదటి పువ్వు, నా ప్రియాతి ప్రియమైన స్నేహితులని వదిలి అమెరికా నుండి భారతానికి వచ్చేస్తున్నప్పుడు వారి వాకిళ్ళల్లోంచి కోసుకొచ్చిన పువ్వులూ, ఒక పోయెట్రీ పుస్తకం లో దాచి ఉంచాను. :)

ఆ.సౌమ్య said...

wow...beautiful!
సంవత్సరం వేచి చూసి అన్ని ఋతువులని తీయడం బాగుంది... ఆఖరుది మంచుతో నిండినది నాకు చాలా నచ్చింది...చాలా బావుంది.

Rao S Lakkaraju said...

రుతువుల మార్పిడి ఫోటోలు చాలా బాగున్నాయి. మంచుతో నిండినవి రాత్రి పూట వెన్నెలలో ఇంకా చాలా బాగుంటాయి. రాత్రి కిటికీ లోంచి చూస్తూ మా ఆవిడ "వెన్నెల ఎంత బాగుందో" అంటే మా కూతురు వచ్చి చూసి "ఎక్కడ వెన్నెల" అని అడిగితే వెన్నెల గురించి చెప్పాల్సోచ్చింది. తను ఇక్కడ పెరిగింది.ఇంతకీ చెప్పొచ్చే దేమంటే ఆ ఆనందం చలిలో వణుకుతూ కారు మీద స్నోతీసుకుని ఇంటికి బయల్దేరటం లో స్నో లా కరిగి పోతుంది.

lalithag said...

:)
నా లాంటి ఉత్సాహం / పిచ్చి ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారని తెలిసి సంతోషం వేసింది.
అందుకే తెలుగు బ్లాగులంటే నాకిష్టం.
ఇలా అనుకొని తియ్యలేదు, ఇంత వర్సగానూ కాదు కానీ, ఫోటోలు browse చేస్తుంటే ఇలాంటివి కొన్ని కనిపించాయి.
మా కిటికీలోంచి వానా, మంచూ, కొన్ని సంవత్సరాల తేడాతో,దాదాపు ఒకే angle నుంచీ.
ఆ ఉత్సాహంతో ఇక అటువంటి sequence ల వేటలో పడ్డాను, పాతవన్నీ తీసి చూసుకుంటున్నాను.

మంచు said...

కృష్ణ ప్రియగారు , సౌమ్య గారు. రావు గారు, లలితగారు : ధన్యవాదాలు
కృష్ణ ప్రియగారు : వావ్...పది సంవత్సరాలా? మరి చిన్నమ్మాయికి తియ్యలేదని గొడవ పెడుతుందేమో....
సౌమ్యగారు: " మంచు " అంటే అందరికీ నచ్చేస్తుంది :-))))
లక్కరాజు గారూ : నిజమే,,,,, రొజూ ఆఫీసుకి వెళ్ళేముందు మంచు క్లీన్ చేసేటపుడు తెలుస్తుంది :-)) అవును వెన్నెల్లొ చాలా బావుంటుంది. మీకు చికాగొ లా విండ్ ఎక్కువుంటుందా ? విండ్ ఎక్కువుంటే ఇంకా నరకం కదా
లలిత గారు: ఉన్నాం ఉన్నాం...ఒకే కేటగిరి వాళ్ళం .. మంచి మంచి ఫొటొలు పెట్టండి మరి....

Rao S Lakkaraju said...

@మంచు
మేముండే అరోరా చికాగో కి far western suburb. రాత్రి storm 6 inches స్నో పడేసింది. మా ఆవిడకి IHOP pancakes ఆశ పెట్టాను. స్నో తీసి IHOP కి వెళ్ళాలి. వస్తా. Warm Greetings.

ఇందు said...

భలే ఉన్నాయి పిక్స్ :) మంచుగారు...నేను ఈ బ్లాగ్ ని మీ ఫొటో బ్లాగ్ అనుకున్నా అండీ.. కాసేపు కంఫ్యూజ్ అయ్యా..యూఅరెల్ చూసాక అర్ధమయింది.బాగున్నయి మీ పిక్స్.వెరియేషన్ బాగా చూపించారు.నేను ఇలా ఫొటోలు తీద్దామనుకున్నా కానీ...మా ఫ్రెండ్ ఒకతను ఆల్రెడీ తీసేసాడు.మళ్ళి కాపీ కొట్టింట్టు ఉంటుందని తీయలేదు.కానీ మీరు భలే తీసారు :)

కొత్త పాళీ said...

Excellent.
ఇలా ఒక దృశ్యన్ని నాలుగు ఋతువుల్లో తీసిన బొమ్మ ఏదో నేషనల్ గేలరీలో ఉన్నదని ఒక మిత్రుడు చెప్పారు.
పూర్తి 365 రోజులు కాకపోయినా తగినన్ని రోజులు ఒకే దృశ్యాన్ని ఫొటోతీసి ఒక ఫ్లిప్ బుక్ చెయ్యాలని నా కోరిక. కొత్త సంవత్సరంలో చేస్తానేమో?

కొత్త పాళీ said...

@ జయ .. చూడ్డానికి అప్పూడే పడిన మంచు చాలా అందంగా ఉంటుంది, కానీ అది ఒక నాలుగు రోజులు పాతబడిన తరవాత ఆ రొచ్చులో నడవాల్సి వస్తే, అప్పుడు తెలుస్తుంది :)

Anonymous said...

మీకిలాంటి ఐడియాలు ఎలావస్తాయ్ :)ఇది నా ఫేవరెట్ పోస్ట్ .....చూస్తున్నకొద్ది చూడాలనిపిస్తుంది