*** శ్రీ రామ ***
మీకు పారిస్ ట్రిప్ కి వెళ్ళాలనుందా.. అయితే టికెట్లు కొనుక్కుని, హొటెల్స్ బుక్ చేస్కుని, వస్తున్నాం అని లవంగం గారికి ఫొన్ చేసేసి.... బొల్డు డబ్బులు, సమయం ఖర్చు పెట్టి పారిస్ వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు దానికొ షార్ట్ కట్ ఉంది. కృష్ణప్రియ గారి 'పారిస్ వెళ్ళండి కానీ..' పోస్ట్ చదివితే మీకు నిజంగా పారిస్ వెళ్ళి తిరిగేసిన అనుభూతి గ్యారెంటీ :)
ఇప్పుడు సడన్ గా కృష్ణప్రియ గారిని తలచుకుంటున్నానేంటా అని అనుకుంటున్నారా... అయితే మీకు తెలిసున్న విషయాలే అనిపించినా పొస్ట్ పూర్తిగా చదవాల్సిందే.
మన ఫ్రెండ్ ఎవరన్నా సెల్ ఫొన్ పొగొట్టుకుంటే అయ్యో అని బాధపడతాం. అదే ఈవిడ పొగొట్టుకున్నప్పుడు బొల్డు సంతొషించాం... ఎందుకంటే మరి ఆ ఫోనే పోకపోయుంటే 'చేజారిన మంత్రదండం' అనే ఒక మంచి పోస్ట్ మిస్సయ్యే వాళ్ళం కదా :D
'పెద్దయ్యాక నేను..' అంటూ మనల్ని చిటికెన వేలు పట్టుకుని ఉన్నపళంగా చిన్నప్పటి రోజుల్లోకి తీస్కెళ్ళిపోయినా, 'ఫోటోలు నిక్షిప్తపరచలేని అనుభూతి' అంటూ మన జీవితంలోని అమూల్యమైన అనుభూతుల్ని గుర్తుకొచ్చేలా చేసినా, 'పిన్ని పెళ్ళి, పిన్ని కొడుకు పెళ్ళి' అంటూ అప్పటికీ ఇప్పటికీ పెళ్ళి వేడుకలు మారిపోయిన వైనాన్ని గుర్తు చేసినా, స్కూటర్ సాహసాలైనా, 'హాయిగా హాల్లో సినిమా' చూడటం గురించి చెప్పినా, తనకి 'పాటలు రావని' చెప్పినా, 'బరువూ బాధ్యత'ని గుర్తు చేసినా... ఇలా ఏ కబుర్లైనా గానీ మనల్ని కూడా తన కూడా తిప్పుతూ చూపించినంత ఆసక్తికరంగా రాయడంలో మన కృష్ణప్రియ గారిది అందె వేసిన చేయి. :)
మీకు తెలుసో లేదో.. ఆవిడకి బోల్డు అదృష్టం కలిసొచ్చి ఒకసారి లక్కీ డ్రాలో అరకేజీ వెండి గెల్చుకున్నారు. అప్పుడు అందరికి ఇచ్చి మనకి మాత్రం పార్టీ ఇవ్వకుండా పెద్ద హ్యాండిచ్చారు.
అసలు కృష్ణ ప్రియ గారి డైరీలో మిగతా పోస్టులన్నీ ఒక ఎత్తైతే 'గేటెడ్ కమ్యూనిటీ కథలు' మాత్రం మరొక ఎత్తు.. అవన్నీ చదువుతుంటే అర్జెంటుగా మనం కూడా ఏదో ఒక గేటెడ్ కమ్యూనిటీ చూసుకుని, అసలు వీలైతే 'పెసిడెంటు గారి పెళ్ళాం' గారి రికమండేషన్ తో వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ లోనే ఒక ఇల్లు వెతుక్కుని సెటిల్ అయిపోదాం అనుకుంటారు. అసలు వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీలో జరిగే దీపావళి, చబ్బీస్ జనవరి వేడుకల కోసమైనా వెంటనే వెళ్ళిపోవాల్సిందే అనిపిస్తుంది మనకి. అలాగే మనకెప్పుడైనా 'ఓ కప్పు చక్కర' అవసరమైతేనో, మనలో దాగున్న 'సామాజిక స్పృహ'ని మేల్కొల్పడానికైనా గానీ మన కృష్ణప్రియ గారు సదా మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి మనం వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీలో చేరిపోడానికి అట్టే అలొచించనక్కర్లేదు. అప్పుడు మనం కూడా ఎంచక్కా కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు పండగ చేస్కోవచ్చు. :) ఇవన్నీ చదివాక మీరు క్రిష్ణప్రియ గారి పక్కిల్లే కావాలి అనుకునే ఉంటారు కానీ పాపం మీ బ్యాడ్‌లక్. కార్నర్ లొ ఉండే వాళ్ళ ఇంటికి పక్కనుండే ఇల్లు నేను అల్రేడీ రిజర్వ్ చేసేసుకున్నాను కాబట్టి.
'ఉప్మాయణం' గురించి గొప్పగా చేప్పేసి మనల్ని ఉప్మా ప్రియుల్ని చేసేయ్యడమే కాదు... తనే కనిపెట్టిన కొత్త రెసిపీ, మన బ్లాగ్లోకంలోనే అత్యంత రుచికరమైన పదార్ధం అయినటువంటి టల్లోస్ రుచి చూడకుండా ఆవిడ బ్లాగ్ గడప దాటి బయటికి రాలేమంటే నమ్మాలి మీరు :) మరి బ్లాగులొకం లొ అత్యంత రుచికరమైన పదార్ధం నా చుంబరస్కా అని నాకు గట్టి నమ్మకం. మరేమో అక్కడే మాకు ఈగో క్లాషేస్ వచ్చాయన్నమాట. అప్పుడు చుంబరస్కా మీద పేటెంట్ హక్కుల గురించి ఒకరి మీద ఒకరు కేసులు వేసుకుందాం అనుకున్నాం కానీ మా లాయర్ (ఇద్దరికి ఒక్కరే లాయర్) ఫీజు ఎక్కువ అడిగాడని అలిగి ఫైనల్ గా మేము ఒక అండర్స్టాండింగ్ కి వచ్చి చుంబరస్కాటల్లోస్ అనే కొత్త రెసిపి కనిపెట్టాం :-) ఈ పొస్ట్ ఆఖర్లొ చూడండి.
ఇహ కృష్ణప్రియ గారు చెప్పే ఆఫీసు కబుర్లు భలే సరదాగా ఉంటాయి.. 'సింగం, మల్లెపూలూ బార్డర్ సమస్యా' అని చెప్పినా, 'బాసూ బీరకాయ పచ్చడి' గురించి చెప్పినా, అది కేవలం 'ఊర్వశి క్రిష్ణప్రియ'లా నటించగలిగే మన కృష్ణప్రియ గారికే సాధ్యం.
ప్రతీ ఒక్కరం ఎంతో కొంత తీవ్రంగానే ఆలోచించే క్లిష్టమైన విషయాలని కృష్ణప్రియ గారు తేలికగా అర్థమయ్యేలా వివరంగా, విశ్లేషణాత్మకంగా చర్చిస్తారు.. ఉదాహరణకి 'ఇంకా సాఫ్ట్ వేర్ ఇంజనీరేనా? పాపం!!' అంటూ ఆడవాళ్ళు కెరీర్, పర్సనల్ లైఫ్ బ్యాలన్స్ చేస్కోడం గురించి రాసిన పోస్ట్, 'NRI నుండి పక్కా ఇండియన్ గా మారడం..' అంటూ అమెరికా నుంచి ఇండియాకి వెనక్కి వెళ్ళి ఉండటంలో సాధక బాధకాల్ని చెప్పడంలో, 'ప్రియ కొడుకు IIT' అనే పోస్టులో తెలిసో తెలీకుండానో మనందరం చదువుల రూపంలో పిల్లలపై పెడుతున్న అధిక ఒత్తిడి గురించి, పిల్లలని దత్తత తీస్కునే సందర్భాల్లో ఆయా వ్యక్తుల వెనక దాగుండే రకరకాల పరిస్థితులూ, ఎమోషన్స్ గురించి 'మనసా వాచా కర్మణా దత్తతకి సిద్ధం?' అనే పోస్టులో చెప్పినా.. ప్రతీసారీ విషయం ఏదైనా గానీ మనల్ని కాసేపన్నా ఆలోచనలో పడేస్తాయి కృష్ణప్రియ గారి టపాలు.
అప్పుడప్పుడూ 'అంబిగేశ్వరి-శ్రీనివాసోపాఖ్యా
కృష్ణప్రియ గారి డైరీలోకి ప్రయాణం చాలా (exciting) ఆసక్తికరంగా ఉంటుందని ఈ పాటికే మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అన్నట్టు, 'మీరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు...' అని ఆవిడ ఒక సరదా పోస్ట్ రాసారు. అలాగే, మన కృష్ణప్రియ గారి డైరీలోకి ఒకసారి తొంగి చూస్తే అప్పుడప్పుడూ తను ఒక రోజంతా ఎలా గడుపుతుంటారో కూడా తెల్సుకోవడం చాలా సరదాగా ఉంటుంది.
మొన్నామధ్య ఒకసారి కృష్ణప్రియ గారి బ్లాగు పుట్టినరోజు సందర్భంగా నిర్వోష్ఠ్య బ్లాగాయణం.. అంటూ తన బ్లాగు ప్రస్థానాన్ని ఒక సంక్లిష్టమైన సాహితీ ప్రక్రియలో అలవోకగా రాసి ఆశ్చర్యపరిచారు.
అర్జెంట్ గా అత్యుత్తమ సలహాలు కావాలా అయితే.. అత్యుత్తమమైన సలహాల కోసం సంప్రదించండి.. కృష్ణప్రియ గారి బ్లాగ్..
ఇక అసలు విషయం ...కృష్ణప్రియ గారికి అసలింత టాలెంట్ ఎలా వచ్చిందో తెల్సా .. మా గోదావరి జిల్లాలో పుట్టడం వల్లే :) :) అవిడ ఖమ్మం బిడ్డ అని చెప్పుకుంటారు కానీ.. పుట్టింది తూగొ లొ కాబట్టి కచ్చితంగా గొదావరి బిడ్డే :-) :-)
ఇక ఆంద్రుల అభిమాన బ్లాగర్ అయిన కృష్ణప్రియ గారిని ఈ రోజు ప్రత్యేకంగా తలచుకొవడానికి ఒక కారణం ఉంది. ఈ రోజు (జూలై 17) ఆవిడ పుట్టిన రొజు. శతావధానం చేసినట్టు ఇన్నేసి రకరకాల టపాలు రాసి మనల్ని అలరిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి మన కృష్ణప్రియ గారు ఇంకా బొల్డు మంచి మంచి పోస్టులు రాస్తూ మనల్ని ఇలాగే అలరిస్తారని ఆశిస్తూ..
కృష్ణప్రియ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు
కృష్ణప్రియ గారూ..
మీ పుట్టినరోజు సందర్భంగా మేం స్వయంగా దగ్గరుండి అత్యంత మధురమైన పదార్ధం చుంబరస్కా ఓ పది టన్నులు చేయించాం. అందరికీ పంచి పెట్టడంతో పాటు మీరూ తినండి వచ్చి.. :)
- మంచు
ఎంతొ విలువైన తన సమయం వెచ్చించి ఈ పొస్ట్ రాయడానికి సహకారం అందించిన మధురవాణి గారికి బొల్డు బొల్డు థాంక్స్ లు ....
44 comments:
కృష్ణప్రియగారికి హ్యాపీ హ్యాపీ బర్త్ డే..
ఇన్ని మంచి టపాలను ఒక్కచోట చేర్చిన మంచుగారికి ధన్యవాదాలు...
కృష్ణప్రియ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
Thanks to Manchu gaaru & Madhura for let us know and get a chance to wish Krishna Priya jee :))
కృష్ణప్రియ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు :) ఎప్పటికీ మీరిలాగే ఎన్నో మరెన్నో చక్కని టపాలతో మమ్మల్ని అలరిస్తూ.. నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండీ..
ఇన్ని మంచి టపాలను ఒక చోట కూర్చిన మంచుగారికీ తనకి సహకరించిన మధుర గారికి కూడా నా ధన్యవాదాలు ప్లస్ అభినందనలు..
కృష్ణప్రియ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.మీరిలాగే ఎన్నో మరెన్నో చక్కని టపాలతో మమ్మల్ని అలరిస్తూ,నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటు.
మంచు గారికీ మధురకీ ఇద్దరికీ ధన్యవాదాలు+అభినందనలు
కృష్ణప్రియగారికి జన్మదిన శుభాకాంక్షలు
జన్మదిన శుభాకాంక్షలు
కృష్ణప్రియ గారికి జన్మదిన శుభాకాంక్షలు .
" ఇక అసలు విషయం ...కృష్ణప్రియ గారికి అసలింత టాలెంట్ ఎలా వచ్చిందో తెల్సా .. మా గోదావరి జిల్లాలో పుట్టడం వల్లే .పుట్టింది తూగొ లొ కాబట్టి కచ్చితంగా గొదావరి బిడ్డే " మరి అదన్నమాట అసలు సంగతి....
HAPPY BIRTHDAY to Krishnapriya.
మనందరికీ ప్రియమైన బ్లాగర్ కృష్ణప్రియ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. :)
మంచు గారూ,
మీకూ THANKS.. ఇంత సూపర్ పోస్ట్ (అంటే ఎంతైనా మరి మన కృష్ణప్రియ గారి గురించి కదా!) రాయడంలో కొంచెం హెల్ప్ చేసే చాన్స్ నాకిచ్చినందుకు.. :)
ఇలాగే ఎప్పుడూ రకరకాల పోస్ట్ లతో మమ్మల్ని అలరించాలని కోరుకుంటూ, కృష్ణప్రియగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
HAPPY BIRTH DAY KRISHNA PRIYA GAARU. Nenu office ki vacchaka eevida gurinchi pedda comment rayali. Cell lo kudaradam ledu
Happy birthday to krishna priya gaaru. manchu gaari ee raesijim nSinchaali(goedaari buddhi poenichchukoelaedu anaalaemoe?). inta goedaavari pakshapaaatam maemantaa khanDistunnaam:)
కృష్ణప్రియ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
కృష్ణప్రియ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
కృష్ణప్రియ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
ఇలాగే ఎన్నో, మరెన్నో టపాలు వ్రాస్తూ మాకందరికి ఆనందాన్ని పంచాలని ఆమెను కోరుతున్నాను. సీరియస్ విషయాలైనా చక్కటి హాస్యంతో, చదివి ఆలోచింప చేసేటట్టు వ్రాయడం లో కృష్ణప్రియ గారిని మించిన వారు తెలుగు బ్లాగుల్లో మరొకరు లేరని నా అభిప్రాయం.
మంచు గారికి, మధుర వాణి గారికి ఇంత చక్కటి టపా వ్రాసినందుకు ధన్యవాదాలు.
కృష్ణప్రియగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణప్రియగారూ
హావ్ ఎ నైస్ డే
Happy Birthday Krishnapriya.. Have a great day..
తన పోస్ట్ లన్నీ మళ్ళీ పరిచయం చేయడం చాలా బాగుంది ..మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చు...చాలా మంచి బ్లాగర్ ...తనకి జన్మదిన శుభాకాంక్షలు
కృష్ణ ప్రియ గారికి జన్మదిన వార్షికోత్సవ శుభాకాంక్షలు
హ్యాపీ బర్త్ డే తో యు కృష్ణప్రియ హ్యాపీ బర్త్ డే తో యు
Happy returns of the day కృష్ణాజీ :)
Oh My God!
మంచు, మధురవాణి,
ఏమి చెప్పగలను? నోట మాట రావట్లేదు. కీ బోర్డ్ మీద కీస్ ఎందుకో మసక మసక గా..
మళ్లీ ఇంకోసారి జాగ్రత్త గా చదివి కామెంట్ పెడతాను.
జ్యోతి గారు, శ్రావ్య, వేణూ శ్రీకాంత్, శ్రీనివాస్ పప్పు గారు, మురళి గారు,మహేశ్ గారు, మాలా కుమార్ గారు, హరే ఫల గారు, జయ గారు, శివరంజని, సునీత గారు, లలిత గారు, శిశిర గారు, బులుసు సుబ్రహ్మణ్యం గారు, హరేకృష్ణ, లత, ప్రసీద గారు, నేస్తం,
మీరందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
You all made my day!
ధన్యవాదాలు,
కృష్ణప్రియ/
ఇక అసలు విషయం ...కృష్ణప్రియ గారికి అసలింత టాలెంట్ ఎలా వచ్చిందో తెల్సా .. మా గోదావరి జిల్లాలో పుట్టడం వల్లే
Many more happy returns of the day Krishnapriya garu..
Happybirthdaykrishnapriyagaru
మంచుగారూ...భలే రాసారు...ఆ ఇదంతా మీ గొప్పతనమే అని నేను అంటానని అస్సలు అనుకోకండీ..ఏదో మా కృష్ణ గారి గురించి రాసారు కాబట్టి ఇంత అందంగా వచ్చింది :) అందుకని ముందు మా కృష్ణగారికి ధన్యవాదాలు చెప్పండీ...ఇంకా మధుర చెయ్యి పడింది కాబట్తే...ఈ పోస్టు ఇంత మధురంగా ఉంది...కదా మధురా?
మళ్ళీ గోదావరి అనె సెంటిమెంటు ఆయింటుమెంటు మొదలుపెట్టేసారా? అబ్బ! ఎంత అభిమానమో....
కృష్ణగారూ...హాప్పిహప్పి బర్త్ డే అండీ :)
@ శ్రావ్యా, వేణూ, పప్పు గారూ, బులుసు గారూ..
మీ అందరికీ బోల్డు ధన్యవాదాలండీ.. :)
@ ఇందూ,
హహ్హహా.. అంతేనంటావా.. so sweet of you! ఎంతైనా మనం మనం ఒకటి కదా మరి.. థాంక్యూ! :)
@ కృష్ణప్రియ గారూ,
మీ బ్లాగుకి వచ్చినప్పుడల్లా మీ కబుర్లతో మాకు మీరు పంచే బోల్డన్ని అందమైన అనుభూతులతో పోలిస్తే మేము మీకు ఇచ్చింది చాలా చాలా చిన్నదండీ.. The pleasure was all ours! ఇంత ఆనందం కలిగించే పనిలో నాకూ చిన్న భాగస్వామ్యం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది..
Love you and keep rocking as always! :)
">>కీ బోర్డ్ మీద కీస్ ఎందుకో మసక మసక గా..
పాపం కృష్ణప్రియ గారూ, కళ్ళద్దాలు పెట్టుకోటాం మర్చిపోయినట్టున్నారు :)
కృష్ణప్రియ గార్కి పుట్టినరోజు శుభాభినందనలు."
Manchu gaaru, Madura gaaru , mee iddari prayatnam chala bavundi :)
Krishna Priya gaaru Wish You A Very Happy Birthday To You :)
కృష్ణ ప్రియ గారూ! జన్మదిన శుభాకాంక్షలు
క్రిష్ణప్రియ గారికి జన్మదిన శుభాకాంక్షలు
కృష్ణప్రియగారికి అసలింత టాలెంట్ ఎలా వచ్చిందో తెల్సా .. మా గోదావరి జిల్లాలో పుట్టడం వల్లే
కరస్టే , కరస్టే ..
హ్యాపీ బర్త్ డే టు యు కృష్ణప్రియగారు
&
థాంక్స్ మంచు గారు ,మధురవాణి గారు..
చాలా మంచి ప్రయత్నం చేసారు .
ఓహ్ నేను కొంచం ఆలశ్యం అయ్యాను...ఎప్పుడొచ్చామన్నది కాదన్నాయా విషెస్ చెప్పామా లేదా అన్నది పాయింట్ :)
కృష్ణప్రియ గారికి జన్మదిన శుభాకాంక్షలు!
టపా బావుంది మంచుగారూ!
అబ్బ. కృష్ణప్రియ గారి గురించి ఎంత బాగా చెప్పారో.. మీరు రాసిన ప్రతి అక్షరం నిజం మంచు గారు.
కాస్త ఆలస్యంగా కృష్ణప్రియ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంత మంచి టపా రాసినందుకు మీకు మధుర కి ధన్యవాదాలు:)
happy birth day madam..
నిన్న సెల్ ఫోన్ లో నుండి కామెంట్ పెట్టడం కుదరలేదు ..అందుకే ఈ రోజు మళ్ళీ స్పెషల్ విషెస్ ........
మొదటి సారి నా బ్లాగ్ లో కామెంట్ పెట్టినప్పుడు మీ పేరు చాలా బాగుందండి అని నేనంటే ...ఆవిడ అన్నారు ఏముంది నువ్వు శివున్ని రంజింప చేస్తే నేను కృష్ణుడికి కి ప్రియం అని చెప్పారు ....
ఆ కామెంట్ నాకు తెగ నచ్చేసి ఆవిడ బ్లాగ్ కి వెళ్లి చూసాను కదా..ఆవిడ పోస్ట్ లు చదువుతుంటే అప్పుడు అర్ధం అయింది ...అబ్బో ఈవిడ కృష్ణుడికే కాదు మొత్తం బ్లాగ్గర్స్ అందరికి ప్రియమే ....ఎంత బాగున్నాయో పోస్ట్ లు అనిపించింది .......
ఆ బ్లాగ్ అడ్రస్ గుర్తుపెట్టేసుకున్నా అందుకే పోస్ట్ వేసారో లేదో చూసినా చూడకపోయినా కొంచెం తీరికా ఉంటె బ్లాగ్ కి వెళ్లి చూస్తానా అప్పడికే చాల పోస్ట్ లు ఉంటాయి ... నాకు అనిపిస్తుంది చా నాకు ఎంత బద్దకమో అని ........
కృష్ణ ప్రియ గారు మీరు ఇలాంటి పోస్ట్ లు మరిన్ని రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ కృష్ణప్రియ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
మంచు గారు మీరు సూపర్ ........కృష్ణ ప్రియ గారి బర్త్‌డే విషెస్ చాలా స్పెషల్ గా చాల స్వీట్ గా చెప్పారు .మీ బర్త్‌డే గిఫ్ట్ చాల స్పెషల్ గా ఉంది ..అన్నిపోస్ట్ లు ఒకే చోట గుచ్చి బోకేలా అందిచ్చారు కృష్ణ ప్రియ గారి కి సింప్లీ సూపర్బ్ ........అలాగే కొత్త వాళ్లకి కూడా ఆవిడ పోస్ట్ లు తెలిసేలా ..మీకు ధన్యవాదములు ప్లస్ అభినందనలు..
అలాగే మా స్వీట్, స్వీటర్ అండ్ స్వీటెస్ట్ మధుర కి కూడా ధన్యవాదములు ప్లస్ అభినందనలు..
కృష్ణ ప్రియ గారికి కొంచెం ఆలస్యంగా జన్మ దిన శుభాకాంక్షలు. మంచు గారూ! భలే రాసారు. నాకు మీ బ్లాగ్ చూడడం ఇదే మొదటి సారి. మొదటిసారి మీ ఇంటికొచ్చాను కాబట్టి చుంబరస్కా పెట్టే పంపిస్తారులెండి. నాకు తెలుసు. నాకు తెలుసు.
@ SHANKAR.S, Rao S Lakkaraju,nagarjuna, మురళి గారు, రాధిక గారు (చాలా రోజులకి దర్శనం?) , ఇందు,
భాస్కర్ గారు (అదే మరి. వయసు ఇంకో సంవత్సరం పెరిగిందని బాధపడి చిన్న గా కనపడటానికి కళ్ళజోడు తీసేసా అన్నమాట :) ), విరిబోణి గారు, rasajnya (you look beautiful!) , బంతి, స్వామీ గారు, సౌమ్య, అపర్ణ, సతీష్ గారు, శివ రంజని (ఇంత పెద్ద కామెంట్ పొగుడుతూ పెట్టి పైగా బద్ధకం అంటారా? :) ) , కొత్తావకాయ,
అందరికీ బోల్డు ధన్యవాదాలు!
మంచు, మధురవాణి,
ఎంత శ్రమ పడి రాసారు! నాకు నిజంగా పూర్వం రాసిన టపాలు చూసి 'ఛీ.. ఇంత పిచ్చి గా రాసానా?' అనిపిస్తుంది. మీరు చాలా ఓపిగ్గా వెళ్లి చూసి ఇంత పెద్ద టపా రాయటం! నమ్మలేకపోతున్నాను. ఎప్పటికీ మర్చిపోలేను. థాంక్స్!
కానీ మీరు చెప్పిన కొన్ని విషయాలని నేను తీవ్రం గా ఖండిస్తున్నాను.
౧. పార్టీ ఇవ్వకుండా హాండ్ ఇచ్చానా? - ఎంత మందిని అడిగాను? ఎన్నోసార్లు రండి బెంగుళూరుకి? కొత్త వంటకాలు కనిపెట్టి మరీ.. మీరు రాకుండా (భయపడి).. మళ్లీ నన్నంటారా?
౨. ఉప్మా అంటే విసుగు, ఏం చేస్తాం? ఒక భారత స్త్రీ గా కుటుంబం కోసం చేసిన త్యాగాల పరంపర లో అతి పెద్ద త్యాగం గా ఉప్మా తినటం మొదలు పెట్టానని రాస్తే.. అది మిమ్మల్ని ఉప్మా ప్రియుల్ని చేసిందా? :-(((
౩. బ్లాగ్ లోకం లో అత్యంత మధురమైన పదార్ధం మంచు చుమ్బరస్కా నా? ఇంకా నయం. ఏదో మన బ్లాగు లో వారు కదా అని పేటెంట్ వేసే ముందర నా వంటకాల పేర్లు బయట పెడితే.. నా కన్నా ముందే పేటెంట్ అప్లై చేసి :-((
౪. ఖమ్మం బిడ్డని :) పట్టుకుని గోదావరి జిల్లాలో పుట్టటం వల్లే టాలెంట్ వచ్చిందని మంచు చెప్తుంటే.. మధురవాణి... ఏం చేస్తున్నారు?
మంచు,
ఇంత చక్కగా రాసారు కాబట్టి మీరు చేసిన మంచుమ్బరస్కా (yes!!! అమ్మయ్య. చుమ్బరస్కా నాది నాది నాది..) ఆనందం గా తింటాను. అడ్రస్ చెప్పేయండి వస్తున్నా..
కృష్ణప్రియ/
శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు :-)
కృష్ణప్రియ గారు మీరు ఖండించిన విషయాల్లొ ఒకటి తప్ప అన్ని అచ్చం గా నేను సొంతం గా రాసినవి :-))) ఆ ఒక్కటి గొదావరి / ఖమ్మం గురించి. మధుర గారు ప్రపొజ్ చెసింది కూడా గొదావరే. సొ ఎలాగూ ఇద్దరం ఒకే అండర్స్టాండింగ్ మీద ఉన్నాం కదా అని గొదావరి అని ఉంచేసాం :-) అయినా మీరు ఎక్కడ పుడితే అక్కడి వారే :-)
ఇక మంచుంబరస్కా. ఒరిజినల్ చుంబరస్కా రెండు నావే. మీరు మళ్ళీ పొటీకొస్తే మనం కొర్టు వరకూ వెళ్ళాలి .. ఎందుకు చెప్పండి.
మీకు నేను ప్రస్తుతం ఉండే ఊరు, ఇండియాలొ సొంతూరు రెండూ బాగా పరిచయం కాబట్టి.. సొ మీరు ఎక్కడికొచ్చినా నా పేరు చెప్తే మిమ్మల్ని దగ్గరుండి జాగ్రత్తగా మా ఇంటికి తీసొకొచ్చెస్తారు .. మీదే ఆలస్యం :-))
కొత్తావకాయ గారు: వెల్కం :-)
మంచు గారు, మా వాళ్ళందరినీ మీ గోదాట్లో కలుపుకుంటే ఎలాగండీ? ఐ అబ్జెక్ట్....
కృష్ణ ప్రియ గారూ మెనీ మెనీ హ్యాప్పీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండీ
Post a Comment