Pages

Monday, June 21, 2010

నాదెండ్ల తో ఒకరోజు...... ఇదో దిక్కుమాలిన రియాల్టి షో* * * శ్రీ రామ * * * 


ముందు ఒక చిన్న మాట   :  ఈ పోస్ట్ అందరికీ అర్ధం కాకపోవచ్చు .. అందువల్ల ఇది చదివాక మీ తెలివితేటల్ని మీరే సందేహించకండి  :-) (నా గురించి అసలొద్దు) ...  అడగగానే తన దినచర్య గురించి రాసుకోవడానికి అంగీకరించిన డా. నాదెండ్ల ( జూ. సర్జన్ , లండన్) గారి పెద్ద మనస్సుకి అభినందనలు ..   తోటి గుంటనక్కలకి ఓ చిన్న బహుమతి గా ...


3:30 AM


"మ్యావ్ మ్యావ్ మ్యావ్" .. సెల్ ఫోన్ లో అలారం మోగుతుంది.. బద్ధకంగా వళ్ళు విరుచుకుంటూ.. కళ్ళు నులుముకుంటూ లేచాడు నాదెండ్ల. అప్పటివరకూ నాదెండ్ల ని అడ్మైరింగా చూస్తున్న తన పెంపుడు నల్లపిల్లి కిటికీ దూకి పారిపోయింది.. పక్కనున్న స్మశానంలో కష్టసుఖాలు మాట్లాడుకుంటున్న రెండు కొరివిదెయ్యాలు కిటికీలోనుండి నాదెండ్ల లేవడం చూసి ఇక పడుకునే వేళయింది అని పక్కలేసుకుంటున్నాయ్.. 


ఈ రోజే కదా OFP టీవీ వారు వస్తానన్నారు..తలచుకున్నకొద్దీ నాదెండ్ల కి మాంచి ఎగ్జయిటింగా వుంది.. 


3 :45  AM

టక్ టక్ టక్ ..
నాదెండ్ల తలుపు తీసాడు.. ఎదురుగా  'OFP' టీవీ వాళ్ళు .. రండి రండి అంటూ ఉత్సాహంగా లోపలకి ఆహ్వానించాడు.. 
"చాలా పెద్ద గాంగే వచ్చిందే.. వచ్చే వరకూ సస్పెన్స్ అన్నారు .. ఇంతకీ  ప్రోగ్రాం ఏమిటి  "  అడిగాడు నాదెండ్ల ..
"నమస్తే అండి .. మేము OFP TV లో "నాదెండ్ల తో ఒక రోజు" అని ఒక ప్రోగ్రాం ప్లాన్ చేసాం.. ఆంటే మేమంతా ఒక రోజు మీతో గడుపుతామన్న మాట.. మీరు ఎక్కడికెళితే అక్కడికి వస్తాం.. మీరు ఏం తింటే అది తింటాం.. మీరు ఏం ..."   ..... వివరిస్తున్నాడు.. వాళ్ళ టీం లీడర్ ..గార్తిగ్ ( ఉరఫ్ గార్తిగేయాన్ )..
" అర్ధం అయింది.. అర్ధం అయింది " ఉత్సాహంగా అన్నాడు నాదెండ్ల ...
" ముందుగా మా టీంని పరిచయం చేస్తాను .... ఇతను ఈ  ప్రోగ్రాం ఆర్కిటెక్ట్  "భౌ" ... ఆ పక్కన వున్నతను ఈ ప్రోగ్రాం కి టైటిల్ సాంగ్ రాసిన ..మా సీనియర్ సాంగ్ రైటర్ "కప్పు గారు" .. ఆ పక్కన వున్న అమ్మాయ్ డైలాగ్ రైటర్ "బిర్యాణి".. ఇక ఈ ప్రోగ్రాం ఏంకర్ " భజ్ కుమార్" ..  ఆ పక్కనున్న బక్కమ్మాయ్ మా మార్కెటింగ్ హెడ్ " కూజా" , ఆ గళ్ళచొక్కా అతను ఈవెంట్ మేనేజర్ "చామంతి".. ఈ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నతను , మా డిటెక్టివ్ రిపోర్టర్ "బూర".. ఇక ఇతను "పర్వత్ " పెద్ద పనేమీ చెయ్యడు కానీ టీం లో వుండాలి అంతే..  అతను అసిస్టంట్ డైరెక్టర్  "సందేహం పగ "...ఇతను మా కెమెరా మెన్..."  అని ఫుల్ ఫ్లో లో వెళ్ళిపోతున్న గార్తిగ్ ని కట్ చేస్తూ ....
"పరిచయాలు చాలు .. ఇంత పెద్ద గ్యాంగ్ మొత్తం పరిచయం చేసుకోవాలంటే ఒక రోజు సరి పోదు.. అది సరే కానీ అసలు నాగురించి మీకెలా తెలిసింది .. " 
"అదా .. మీ చెల్లి సేమ్యా మా కంపెనీ లో సెగెట్రీ గా పనిచేస్తుంది..  తనే చెప్పింది మీ గురించి .. "  అన్నాడు గార్తిగ్ 
చెల్లి సేమ్యా వైపు ఆరాధనగా చూసాడు నాదెండ్ల .. తనూ మరింత ఆరాధనగా చూసింది.. వీళ్ళిద్దరి  చూపుల్ని  మిగతావాళ్ళు చిరాగ్గా చూసారు ..
4 :30  AM
"సరే.. సరే నేను బాత్రూం కి వెళ్తున్నా" లేచాడు నాదెండ్ల .. 
" పదండి వెళ్దాం" పర్వత్ కూడా  లేచాడు.. 
" ప్రోగ్రాం లో నాదెండ్ల చేసినవన్నీ మనమూ చెయ్యాలి.. కరెక్టే .. కానీ కొన్ని మరీ ఆయనతో కలసి చెయ్యక్కర్లేదు ..కూర్చో " అంటూ కసిరాడు ..గార్తిగ్ ..  
" మా ఆన్న వచ్చేలోపు  మీకు మా ఆన్న ఇల్లు చూపిస్తా  పదండి " అంటూ లోపలి దారి చూపించింది సేమ్యా.. తనకి ఈ రోజు పిచ్చ  పిచ్చ సంతోషం గా వుంది.. కానీ ఎందుకో బయటపడటం లేదు .. 
" సరే " అని బయలు దేరారు అందరూ 

4 :45 AM :
" ఇది వోల్ శ్రీకాకుళం లోనే పోష్ ఇల్లు "  కళ్ళు తిప్పుతూ గొప్పగా చెప్పింది సేమ్యా.. 
" అవునండి ఆ ఆర్ట్ ..మోడరన్ పెయింటింగ్స్ చూస్తేనే తెలుస్తుంది.. " ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు చామంతి.. 
" అబ్బే అవి మోడరన్ ఆర్ట్ కాదు.. మా ఆన్న జలపాతం లోకి జారి పడిపోకుండా తీసినా ఫోటోలు " 
" నిజమా.. ఈ ఆఖరుది అయితే అద్బుతం.. అసలా కెమరా ఏంగిల్ ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదు " ఆ ఫోటోల ప్రతిభకి అబ్బురపడుతూ అడిగాడు 'భౌ' ..
" ఓ అదా.. అది మాత్రం జలపాతం లోకి జారి పడిపోతుండగా తీసినా ఫోటో ...."  

ఇంతలో బాత్రూం తలుపు శబ్దం అయింది.. స్నానం అయిపోయినట్టు వుంది వెళ్దాం అని అందరూ పోలోమని బెడ్ రూం వైపు వెళ్ళారు..అందరికన్నా ముందు పర్వత్ ...

5 :00  AM

వీళ్ళు వెళ్ళే సరికి .. పసుపు పచ్చ చొక్కా - నీలం పేంటు వేసుకుని .. పౌడర్ అద్దుకుంటున్నాడు నాదెండ్ల .. 
అదేంటి.. మీరు ఎప్పుడూ ఎర్ర బట్టలే వేసుకుంటారనుకున్నం. ఇదేంటి ఈ బట్టలు వేసుకున్నారు అని అడిగారు కప్పుగారు.. 
అదా. .లోపలేప్పుడు అవే కదా.. అని షర్టు లో నుండి బనీను.. ఇంకేవో చూపించపోతుండగా.. 
మాకు అర్ధం అయ్యింది.. ఇక బయట వైట్ చేస్తాం .. అని బయటకు పరిగెత్తుకు వచ్చారు.. 

6 : 00 AM :
అందరూ టిఫిన్ చెయ్యడానికి కూర్చున్నారు.. 
" అందరూ సాధారణంగా ఆరింటికి నిద్రలేస్తారు కదా  మీరెందుకు రోజూ మూడున్నరకే నిద్ర లేస్తారు ? " అడిగాడు సందేహం పగ ..  (పగ కి సందేహాలు ఎక్కువ )
" నేను ఆరింటికే లేస్తాను.. కానీ చైనా లో ఆరు అయినప్పుడు ... " చెప్పాడు నాదెండ్ల 
" ఈ రోజు టిఫిన్ ఏమిటో" అని పొట్ట నిమురుకుంటూ చూస్తున్నారు సీనియర్ రైటర్ కప్పు గారు 
" ఈ రోజు గ్రహణం కాబట్టి మా ఇంట్లో వెజ్  బిరియాని స్పెషల్ " 
" చెల్లి సేమ్యాగారు.... కాస్త అందరికి వడ్డిస్తారా " 
వెంటనే సేమ్యా లేచి అందరికీ టిఫిన్ వడ్డిస్తుండగా .. 
" అవునూ.. ఆవిడేమో అన్నయ్య అంటూ ఏకవచనం తో పిలుస్తుంది మీరేమో చెల్లి గారు అంటూ బహువచనం లో పిలుస్తున్నారు.. " మళ్ళీ "సందేహం పగ" కి సందేహం 
" అదా .. నేను ఇస్త్రీ వాదిని కదా .. ఇస్త్రీల నేవరినయినా అలాగే గౌరవంగానే పిలుస్తా.. చేల్లిగారయినా.. వదినయినా "
" ఇస్త్రీ నా .. అదేంటి .." మళ్లీ సందేహం పగ
" అదా .. ఇస్త్రీ ఆంటే ఇస్త్రీ ..ఇస్త్రీ.. అని.. మేము చిన్నప్పుడు కరీంనగర్ లో వున్నప్పుడు  ఆడాళ్ళని అలానే ఇస్త్రీలానే అనేవారు..
" మరేమో .." అంటూ సందేహం పగ మళ్ళీ ఏదో అడగపోతుంటే... ఈ లోపు 
" ఎన్నియల్లో ... ఎన్నియల్లో .. ఎర్రజండా ఎన్నియల్లో " అంటూ పెద్దగా పాట మొదలయ్యింది.. సడన్ గా అంత సౌండ్ వచ్చేసరికి పాపం బక్కమ్మాయ్ కూజ కంగారుపడింది.. 
" నా సెల్ ఫోన్ " అని సిగ్గుపడుతూ జేబులోంచి ఫోన్ తీసాడు.. 
 " హలో.. నేను నాదెండ్ల ని మాట్లాడుతున్నా.. మీరు.."
" ............."
" ఎవడ్రా నువ్వు.. దమ్ముంటే ఇక్కడకి వచ్చి మాట్లాడు.. నీకు పని పాటా లేదా.. "
"............." 
" అయితే మాత్రం నీతో మాట్లాడాలా... _)@*_*@_*
".............."
" _)_#)*@)*+@( "
" ............"
" @#(@+(+@+_@((@$)(@+_#+@_)#+@"
" ............."

")(@(#(**********............" అని ఫోన్ పెట్టేసి ఇటు తిరిగే సరికి.. టీం లీడర్ గార్తిగేయాన్ .. పక్కన పడిపోయివున్న కూజకి ఏదో ఇంజెక్షన్ చేస్తున్నాడు.. 
" ఏమయింది " ... ఆశ్చర్యం గా అడిగాడు మార్తాండ ...
" ఏం లేదు మీ బూతులు విని కళ్ళు తిరిగి పడిపోయింది " అందుకే అన్నాడు కార్తీక్
సిగ్గు పడ్డాడు మార్తాండ.. 
" ఇంతకీ ఎవర్ని ఫోన్ లో అలా తిడుతున్నారు "
" వాడా.. ..వాడి పేరు గగన్.. ఎప్పుడూ ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటాడు.. "

8 :00 AM


"ఓకే .. నేను మెయిల్స్ చెక్ చేసుకోవాలి,  కామెంట్లు రాయాలి " అంటూ లేచాడు నాదెండ్ల..

"పదండి పదండి మేము వస్తాం.. మేము చూస్తాం.. " అంటూ అందరూ ఉత్సాహంగా వెళ్ళారు.. 

" సరే మీరు ఆ కంప్యూటర్ రూం లో వెయిట్ చెయ్యండి .. నేను ఇప్పుడే వస్తాను " అని నాదెండ్ల లోపలి వెళ్ళాడు..


లోపలకి వెళ్ళిన గ్యాంగ్ కి ఎంతవెతికినా కంప్యూటర్ ఎక్కడుందో కనబడలేదు.. ఎక్కడా చూసినా యూ పి ఎస్ లే ఉన్నాయ్.. సర్లే ఎక్కడుందో అడుగుదామని గార్తిక్ బయటకు వస్తుండగా.. అంతలో "అదిగో అక్కడుండి" అని అరిచాడు చామంతి..   

అందరూ గ్రీన్ కలర్ బ్యాక్ గ్రవుండ్ మీద ఆకుపచ్చ ఫ్లోరోసెంట్ అక్షారాలతో కనిపించే విచిత్రమయిన స్క్రీన్ వంక చూస్తున్నారు.. 


ఇంతలో లోపలకి వచ్చిన సేమ్యా " ఏంటి ఎలా వుంది మా ఆన్న కంప్యూటర్.. ఈ 186 కంప్యూటర్ శ్రీకాకుళం జిల్లాలో మా అన్నే మొదట కొన్నాడు తెలుసా " చేతులు తిప్పుతూ గర్వంగా చెప్పింది.. 

ఇంతలో నాదెండ్ల లోపలి వచ్చాడు .. చేతులో ఒక చిన్న బుట్ట ..అందులో కొన్ని చిట్టీలు వున్నాయ్..
"ఇప్పుడు చిట్టీలు ఆటేంటి వీడి మొహం మండా " ...
అందరూ బిర్యాణి  వంక చూసారు.. 
"ఓ పైకే అనేసానా" అని నాలిక కరుచుకుంది బిర్యాణి
"అయినా ఈ గది నిండా ఈ యూ పి ఎస్ లు ఏంటి నాదెండ్ల గారు" అంటూ మళ్లీ సందేహం వెలిబుచ్చాడు .. "పగ "
ఓ అదా.. ఆ UPS మానిటర్ కి.. ఈ UPS హార్డ్ డిస్క్ కి.. ఇది సి పి యూ కి.. ఇది రేమ్ కి అంటూ చెబుతున్నాడు...
"అన్నెందుకు"..
"ఆంటే ఇది కొద్ది పాతది కదా ... కూసింత కరెంటు ఎక్కువ లాగుద్ది.. అందుకే ఒక్కోపార్ట్ కి ఒక్కో UPS.. "

హు.. అందుకా బయట త్రీ ఫేస్ లైన్ డైరెక్ట్ గా ఇంట్లోకి లాగితే ఇంట్లో ఎమన్నా పెద్ద పెద్ద మెషినరీ  ఉందేమో అనుకున్నా.. ఇదా విషయం అని మనసులో గోనుక్కుంటున్నాడు గార్తిక్..  తనకంతా తిక్క తిక్కగా వుంది..

8 :30 AM


"ఇంతకీ ఆ చిట్టీలేమిటి నాదెండ్ల గారు"
" ఓ  అవా.. చెప్తా చెప్తా..  కొద్ది సేపు వెయిట్ చెయ్యండి ..."

అరగంట అయ్యింది.. అందరూ విసుగ్గా చూస్తున్నారు.. వీళ్ళ అసహనం కనిపెట్టి..  

" సారీ.. ఇది బూట్ అవ్వడానికి కొద్ది ఎక్కువ టైం పట్టుద్ది.. అప్పటికి మీరూ వచ్చేముందే ఆన్ చేశా .. కొద్ది సేపు ఒపికపడితే" అంటుండగానే DOS 1.0 లో ఫైరుఫాక్సు ఓపెన్ అయ్యింది.. వెంటనే కూడలి, హారం ఓపెన్ చేసాడు నాదెండ్ల ....

" అదేంటి మాలిక అందరూ ఫాస్ట్ అంటున్నారు.. మీరూ అది వాడరా.. "
" అదా.. దాంట్లో వాడి హాండ్ వుంది.. అందుకే వాడను.."
" వాడా.. వాడెవడు.." అని సందేహం పగ ఏది అడగబోతుండగా .. కూడలి లో వున్న మొదటి బ్లాగుమీద క్లిక్ చేసాడు.. "

" మీలో ఒకరు ఈ బుట్టలోనుండి randem గా  ఒక చిట్టి తీసి ఇవ్వండి" అని అడిగాడు నాదెండ్ల..
భౌ మంచి ఉత్సాహంగా ముందుకి ఉరికి .. ఒక చీటీ తీసి ఇచ్చాడు
నాదెండ్ల ఆ చీటీ తెరిచి దాంట్లో వున్న మేటర్ ఆ బ్లాగు కామెంట్ బాక్స్ లో టైపు చేసాడు..
"ఇప్పుడు ఇంకో చీటీ".. అంటూ కూడల్లో రెండో బ్లాగు ఓపెన్ చేసాడు...
ఇవన్నీ దేబ్యం మొహాలేసుకుని చూస్తున్నా గాంగ్ కి కూల్ గా చెప్పింది సేమ్యా..
" మా ఆన్న ఏది తోస్తే అది కామెంట్లు గా ముందు రోజు రాత్రి రాసుకుని పెట్టుకుంటాడు.. అవన్నీ చిట్టీలగా చుట్టి పెట్టి మర్నాడు బ్లాగుకి ఏ చిట్టి వస్తే ఆ కామెంట్ రాస్తాడు.. గమ్మత్తుగా వుంది కదా" అని కళ్ళు ఎగరేస్తూ చెప్పింది ...


ఈ షాక్ కి కూజ తో పాటు, చామంతి కూడా కళ్ళుతిరిగి పడిపోయాడు.. 


10:00 AM :
" హమ్మయ్య .. అన్ని బ్లాగులు అయిపోయాయి " హా అంటూ వళ్ళు విరుచుకుని లేచాడు 
" కామెంట్లు సరే రాసేసారు  .. మరి మీ బ్లాగుల్లో పోస్ట్లు  " 
" అవి రాత్రికి .. "   
" ఇప్పుడేంటి ప్రోగ్రాం .. అఫ్ఫీసుకా.." 
" అవును  మద్యలో చిన్న షాపింగ్ పని వుంది చూసుకుని వెళ్దాం" 
" అలాగలాగే " అంటూ అందరూ బయలుదేరారు.. 


10 :30 AM


అందరూ ఆ వూళ్ళో డౌన్టౌన్ లో వున్న రెల్లి వీదిలో ఎంటర్ అయ్యారు.. 

వీదిపక్కనే వున్న చెత్తకుప్ప దగ్గర తన రిక్షా పార్క్ చేసి పక్కకేళ్ళాడు నాదెండ్ల..

కాసేపటికి.. "పదండి వెళ్దాం " అని పిలుపు వినబడి .. పక్కకి చూస్తే ఒక బిచ్చగాడు నవ్వుతూ కనిపించాడు.. 

కేవ్ మని చిన్నగా అరిచి.. "ఎక్కడికి వెళ్ళేది .. నువ్వే సోలోగా అడుక్కో మేం రాం  " అంటూ చిరాగ్గా  చూస్తున్న  బిర్యాణి ముఖం లో అసహ్యం మాయం అయ్యి  ఆశ్చర్యం చోటు చేసుకుంది ..  ఎదురుగా..  విగ్గు కోద్దిగా ఎత్తి దాంట్లోంచి తింగరగా నవ్వుతున్న నాదేండ్లని చూస్తూ.. "ఇదేంటి" అని అందరూ కోరస్ గా అడిగారు.. 

అదా.. ఓ రోజు నేనో ఫ్రిజ్ కొందామని ఈ షాప్ కి  వెళ్ళా... " ఈ ఫ్రిజ్ ఎంత అని అడిగా అంతే " ఈ షాపు వాడికి  ఎమొచ్చిందో ఏంటో నన్ను పిచ్చి తిట్లు తిట్టి  "ఎవరికయినా అమ్ముతాకానీ నీకు  మాత్రం అమ్మను". అన్నాడు.. అందుకు మర్నాడు వేరే వేషం వేసుకుని వెళ్లి అడిగా.. అయినా వాడు నన్ను కనిపెట్టేసాడు .. అప్పటినుండి రోజు రకరకాల వేషాల్లో వెళుతున్నా వాడు నన్ను కనిపెట్టేసి బయటకు గెంటేస్తున్నాడు .. ఎలాగయినా ఆ ఫ్రిజ్ కొనాలన్నా పట్టుదలతో నేను రోజు వేరే వేరే వేషాలేసుకుని ప్రయత్నిస్తున్నా .. ఈ వేషం  ఎలావుంది అంటూ ... కళ్ళు ఎగరేసాడు.. 

" బిచ్చగాడి వేషం లో వెళ్లి ఫ్రిజ్ అడిగితే గుర్తుపట్టారా తింగరి వెదవా " అని అంటున్న బిర్యాణి వైపు అందరూ తిరిగి చూడగానే .." ఓ మళ్లీ పైకి అనేసానా" అని మళ్ళీ సిగ్గుపడింది బిర్యాణి

అసలెలా గుర్తుపడుతున్నాడో  చూద్దామని గార్తిక్ కూడా నాదెండ్ల వెనుకే లోపలి వెళ్ళాడు..

" ఈ ఫ్రిజ్ ఎంత అని అడుగుతున్నా " నాదెండ్ల అడుగుతుండగా అటువైపు చూసి ...అక్కడ వున్న వాషింగ్ మెషిన్  చూడగానే విషయం అర్ధం అయ్యి బయటకు వచ్చేసాడు.


11 : 30 AM 

అందరూ నాదెండ్ల ఆఫీసు (ఇంటర్నెట్ సెంటర్) కి చేరుకున్నారు.. ఆ ఇంటర్నెట్  సెంటర్ చూడగానే .. కూజ, చామంతి , కప్పుగారు, భజ్ కుమార్, పగ కళ్ళు తిరిగి పడిపోయారు..  ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో అని గార్తిగ్ భయం భయం గా వున్నాడు..


ఈలోపు నాదెండ్ల బూర ని సైలెంట్గా పక్కకి రమ్మని సైగ చేసాడు.. బూర వెళ్ళగానే.. 

" నువ్వు పెద్ద డిటెక్టివ్ రిపోర్టర్ అని మీ టీం లీడర్ గార్తిగ్ చెప్పాడు.. నాకు ఒక సహాయం చేస్తే నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను.. " అన్నాడు నాదెండ్ల 

" ఏం చెయ్యాలి.. "
" ఝలక్ అని ఒకడు వున్నాడు.. అలాగే "ఏకాంబరం" అని ఇంకోడు వున్నాడు.. వాళ్ళిద్దరూ ఒక్కరే అని నిరూపించాలి.. అలాగే ఆ ఝలక్ ఎక్కడున్నా నాకు కావాలి.. ఎక్కడున్నాడో కనిపెట్టి చెప్పగలిగితే నీకు నా ఆస్తి అంతా రాసిచ్చేస్తా." 

"ఎందుకలా.. "
" అవన్నీ నీకనవసరం.. అది నా జీవితాశయం " ఆవేశం గా పిడికిలి బింగించి చెప్పాడు.. నాదెండ్ల.. 2 : 00  PM :
అందరూ సుస్టుగా వెజ్ బిరియాని భోజనం చేసి కూర్చున్నారు.. 
ఇంతలో  సడన్ గా లేచి.."నేను బ్లాగులు రాసుకోవాలి" అని కంప్యూటర్ ఓపెన్ చేసాడు నాదెండ్ల.. 
" అదేంటి సాయింత్రం అన్నారు కదా.. " అయోమయం గా అడిగాడు గార్తిగ్..
" అదా.. ఇప్పుడు ఫుల్ గా తిన్నా కదా.. నిద్ర వస్తుంది . నేను సాధారణం గా నిద్రమత్తులోనే పోస్ట్లు రాస్తాను.. అందుకే ఇప్పుడు కూడా రాయొచ్చు  "  .. అని లేచి.. హడావుడిగా కొన్ని పాత పుస్తకాలు దుమ్ముదులిపి స్కాన్ చేస్తున్నాడు.. 

4 :00 PM :
 "సాయింత్రం అయ్యింది కదా.. ఇప్పుడు పార్క్ కి వెళ్లి మా గర్ల్ ఫ్రెండ్ కి లైన్ వేస్కోవాలి " అని ఉత్సాహం గా లేచాడు..
 అందరికి ఆ టాపిక్ మంచి ఉత్సాహం గా అనిపించి అందరూ బయలుదేరారు..  టీం లీడర్ గార్తిగ్ కి మాత్రం ఏదో కీడు సంకిస్తుంది.. ఈ సారి షాక్ తెగిలితే తన టీం జనాలు ఇక కోరుకోలేరేమో అని సందేహం పీడిస్తుంది.. 


అందరూ పార్క్ లో కూర్చుని ఎదురు చూస్తున్నారు.. 

ఈ లోపు.. యాహూ మా గర్ల్ ఫ్రెండ్ అని చిన్నగా అరిచాడు నాదెండ్ల..

" పిల్ల బామ్మ కనిపిస్తుంది కానీ.. పిల్లేది " అని కళ్ళజోడు సవరించుకుంటూ అడిగారు కప్పుగారు
" ఉహు.. ఆవిడే నా గర్ల్ ఫ్రెండ్.." 
ఈ సారి గార్తిగ్ , కెమెరా మాన్ తప్ప అందరూ పడిపోయారు....  (తను ఎంతో స్ట్రాంగ్ అని ఫీలయ్యే సేమియా కూడా )

6 :00 PM:
అందరికీ ఇంజేక్షన్స్ చెయ్యలేక ...పడిపోయిన వాళ్ళందరిని వేన్ లో వేసుకుని గార్తిగ్, కెమరా మాన్ , సేమ్యా ని తన రిక్షా లో కూర్చుపెట్టుకుని నాదెండ్ల  ఇంటి దారి పట్టారు.. 


7 : 00 PM

దూరదర్శన్ లో డైలీ సీరియల్ చూసి.. నేను వెళ్లి కాసేపు వ్యాయామం చేసుకుంటా అని లేచి లోపలి వెళ్ళాడు నాదెండ్ల..  

ఇప్పటికి మన టీం అంతా పిట్టల్లా రాలిపోయారు ..బతికుంటే బాలకృష్ణ సినిమాలు చూసుకుని అయినా బ్రతకొచ్చు .. ఈ ప్రోగ్రాం ఇక మనకొద్దు ...ఇక మనం వెల్లిపోదాం అనుకుంటూ లేచాడు  గార్తిగ్ ..  పద లోపలి వెళ్లి చెప్పి వద్దాం అని కెమెరామన్ తో లోపలివెళ్ళాడు ..

లోపల నాదెండ్ల చొక్కా విప్పి విపరీతం గా వ్యాయామం చేస్తున్నాడు.. మద్యలో " ఒరేయ్ ఝలక్ ..నీ పని చెప్తారా.. నీ అంతు చూస్తారా.. నువ్వేక్కుడున్నా నేను కనిపెడతారా"..  అని చిన్నగా అరుస్తున్నాడు ..


కెమెరా మాన్ తన కెమెరాని నాదెండ్ల వైపు ఇంకాస్త  జూమ్ చేసాడు..  జూమ్ చేసి ఒక స్టిల్ ఫోటో తీసాడు...
ఆ ఫోటో చూసాకా గార్తిగ్ కూడా పడిపోయాడు.... పడిపోయినా గార్తిగ్ ని తీసుకుని చిన్నగా నవ్వుకుంటూ వెనక్కి బయలుదేరాడు కెమరా మాన్ ఝలక్ .. - మంచు


ఈ మాత్రం దానికి నా బుర్ర ఎందుకు వాడటం అని కొన్ని ఫోటోలు , ఫోటో ఐడియాలు,  డైలాగులు   వేరే బ్లాగుల్లో నుండి కాపీ కొట్టి వాడాను.. అందరికి ధన్యవాదాలు :-)
Disclaimer: ఇందులొ కొన్ని పాత్రలు ఎవరిని ఉద్దేసించినవి కాదు  Friday, June 4, 2010

పోకా యోకే - తప్పు చెయ్యి చూద్దాం


*** శ్రీ రామ ***


" పోకా  యోకే " అంటే అదేదో కొరియన్ తిట్టో, మార్కెట్ లోకి వచ్చిన కొత్త  వీడియోగేమో, లేకపొతే మన "నేస్తం" గారు చేసిన కొత్త సింగపూరియన్ వంటకమో అనుకుంటున్నారా.. కాదు కాదు..


"పోకా యోకే (Poka Yoke )" ఆంటే జపాన్ బాషలో "mistake -proofing " అని అర్ధం . టయోట కంపెనీ కార్ల తయారి కర్మాగారంలో పనిచేసే Shigeo Shingo అనే ఇండస్ట్రియల్ ఇంజనీర్ ఒకాయన ఈ విధానాన్ని కనిపెట్టాడు .. ఈయన ఏమంటాడంటే  అవగాహనాలేమి వల్లనైతేనేమి, పరాకులో వుండిగాని, త్వరగా పూర్తి చెయ్యాలన్న కంగారులో కానీ.. కారణం ఏదయినా  మానవతప్పిదాలు అన్నవి సర్వసాధారణం. తప్పు చెయ్యొద్దు అని ఆ శ్రామికుడిని/వినియోగదారుని నియంత్రించడం కన్నా, ఆ తప్పు చెయ్యడానికి వీలులేకుండా ఒక పద్దతి వుండాలి అన్నది ఈయన ఐడియా.  ఆ కాన్సెప్ట్ పేరే 'పోకా యోకే '. అర్ధం కాలేదా .. సరే అయితే ఈ ఉదాహరణ చూద్దాం.

మన ఇంట్లో వాడే మైక్రోవేవ్ ఓవెన్ లో పదార్దాలు ఉడికించడానికి ఉపయోగించే మైక్రోవేవ్ తరంగాలు బయటకు లీక్ అయితే చాలా ప్రమాదం. అవి మనమీద పడితే మనమే ఉడికిపోతాం.   ఇప్పుడు మీరే ఆ మైక్రోవేవ్ ఓవెన్ డిజైనర్ అనుకోండి.. మీ ఆలోచనా విధానం వరస క్రమంలో ఇలా వుండవచ్చు ....

మీరు: సరే... ఆ తరంగాలు బయటకు రాకుండా చూడాలి అంతే కదా.. ఒక తలుపు పెడితే సరి ....
మీ డిజైనేర్ అంతరాత్మ: బాగానే వుంది కానీ మరి వినియోగదారుడు తలుపు ముయ్యడం మర్చిపోయి  ఓవెన్ ఆన్ చేస్తే.. లేకపోతే అది పనిచేస్తున్నప్పుడు ఓవెన్ స్విచాఫ్ చెయ్యకుండా పొరబాటున తలుపు తెరిస్తే ?
మీరు: సరే... డోర్ మీద పెద్ద పెద్ద ఎర్ర అక్షరాలతో  "డోర్ తెరిచేముందు ఓవెన్ స్విచ్ ఆఫ్ చెయ్యండి .. లేకపోతే చాలా ప్రమాదం "అని ఒక హెచ్చరిక పెడదాం..
మీ డిజైనేర్ అంతరాత్మ: బాగానే వుంది కానీ కొన్నాళ్ళకి ఆ హెచ్చరిక చిరిగిపోతే / చెరిగిపోతే , లేక అది ఉపయోగించే వారికి చదవడం రాకపోతే (కనీసం ఆ బాష చదవడం రాకపోతే) ??
మీరు: సరే... ఆ తలుపులోనే స్విచ్ పెడతా.. తలుపు మూస్తేనే ఓవెన్ స్విచ్ ఆన్ అవుతుంది.. అది పనిచేస్తున్నప్పుడు పొరబాటున డోర్ తీస్తే అది ఆటోమాటిక్ గా ఆఫ్ అయిపోతుంది.
 మీ డిజైనేర్ అంతరాత్మ: అది డిజైన్ ఆంటే .. ఒకే .. ఇంక మన బాసుని హైక్ అడగొచ్చు పద...

అదండీ .. చాలా సులభం కదా.. మన ఇళ్ళల్లో వున్న మైక్రోవేవ్ ఓవెన్స్ అన్ని ఇలా తయారయినవే.. ఇది ఇంత సింపుల్ గా వుంటే దీనికింత దృశ్యం ఎందుకు అంటారా.. మనకి తెలుసున్నది కాబట్టి వెంటనే ఆలోచన వచ్చింది.. 


ఈ పక్క ఫోటో చూడండి.. ఎడమవైపు వున్నది ఎప్పట్నుండో మనం వాడుతున్న ప్లగ్ సాకెట్.. కుడివైపు వున్నది ఈ మద్య మార్కెట్ లోకి వచ్చింది.. రెంటికి తేడా ఆ కన్నాలకి వున్న లాక్.. ఎడమవైపు దాంట్లో చిన్నపిల్లలు వేళ్ళు పెట్టే ప్రమాదం వుంది.. కుడివైపు దాంట్లో ఆ సమస్య లేదు.. మూడు పిన్నులున్న ప్లగ్ పెడితేనే ఆ లాక్ తెరుచుకుంటుంది. ఇంత చిన్న విషయం తట్టకే ఇన్నాళ్ళు ఆ ఎడమవైపు సాకెట్ వాడుతున్నాం.. 

పోకే యోకే కి ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం..

1.  డిష్ వాషర్, వాషింగ్ మెషిన్ గట్రా గట్రా  .. అవి పనిచేస్తున్నప్పుడు తలుపు తీస్తే ఆగిపోతాయి . తలుపు వేసివున్నప్పుడే పనిచేస్తాయి. అందువల్ల మనం తలపు వేయడం మరిచిపోవడం అన్నది జరగదు. 

2. కారు పార్క్ పొజిషన్ లో పెడితేనే కానీ దాని తాళం ఊడిరాదు. దానివల్ల తిరిగి స్టార్ట్ చేసినప్పుడు గేరు ఎప్పుడూ పార్క్ పొజిషన్ లోనే వుంటుంది.
3. సెల్ ఫోన్ లో సిం కార్డు ఒక డైరెక్షన్ లో  మాత్రమే పడుతుంది. తిరగేసి పెడదామన్నా పట్టదు. అందువల్ల ఎటువైపు పెట్టాలా అన్ని కన్ఫ్యూజన్ వుండదు. సెల్ ఫోన్ గురించి పెద్దగా తెలీనివారుకూడా సులభంగా ఉపయోగించవచ్చు. 
4. ఫ్రిజ్ లోపలి లైట్ ఫ్రిజ్ తలుపుకి కేనేక్ట్ అయివుంటుంది. తలుపు మూసుకోగానే లైట్ ఆగిపోతుంది. 
5. మెట్రో ట్రైన్ లలో తలుపులన్నీ మూస్తేనే ట్రైన్ కదులుతుంది.
6. కొన్ని లేటెస్ట్ ATMలలో కార్డు స్వైప్ చేసి బయటకు తీస్తేనే డబ్బులోస్తాయ్. అందువల్ల కార్డ్ అందులోమర్చిపోవడం జరగదు. 
7. అమెరికాలో కొన్ని రెండు పిన్నుల ప్లగ్గులు చూస్తే దాంట్లో ఒక పిన్ కొంచెం పెద్దది గా వుంటుంది. అది ఎందుకంటే ఆ ప్లగ్ రివెర్స్ లో పెట్టకుండా (ఫేసు న్యూట్రల్ లో న్యూట్రల్ ఫేసులో పెట్టకుండా )..
8. అమెరికాలో హైవే రోడ్డు పక్కన (లేను దిగగానే ) అక్కడ గతుకులుగా వుండే ఇనుప ప్లేట్ వుంటుంది.. మనం లేను నుండి పక్కకి పోయాం అని గుర్తుచెయ్యడానికి.. 
9. USB పెన్ డ్రైవ్ మరియూ పాత ఫ్లాపీ డిస్కులు తిరగేసి పెడితే వెళ్ళవు.. ఒక్క డైరెక్షన్ లో లోపలకి వెళతాయ్. 
10. కొన్ని హోటల్స్ లో  రూం కీచైన్ ఒక సాకెట్ లో పెడితేనే లైట్లు , ఫాన్స్ పనిచేస్తాయి.. బయటకు వెళ్లేముందు ఆ సాకెట్ నుండి తాళం తియ్యగానే అన్ని లైట్లు , ఫాన్స్  ఆటోమాటిక్ గా ఆగిపోతాయి.. మనం గుర్తు పెట్టుకుని ఆఫ్ చెయ్యాల్సిన పని లేదు .. ఇలా బోల్డు ఉదాహరణలు చెప్పుకోవచ్చు... వీటన్నిటి యొక్క ముఖ్యఉద్దేశ్యం ఏమిటంటే .. తప్పు జరగనివ్వకుండా ఏదో ఒక మెకానిజం పెట్టడం. ATM లో కార్డు మర్చిపోకుండా తిరిగి తీసుకెళ్లాలని అందరికీ తెలుసు.. కానీ బయటకు తీస్తేనే డబ్బులు వచ్చేలా పెట్టడం వల్ల .. కార్డు  మర్చిపోవడమంటూ  జరగదు .. "మర్చిపోకు మర్చిపోకు అని మనకు వెనుక నుండి మైకులో గుర్తుచెయ్యడం కాకుండా ఇలా ఆ ATM  లోనే ఆ ఫీచర్ పెడితే బెటర్ కదా".. తప్పులు చెయ్యకు అని మనిషికి చెప్పడం కాకుండా ఆ తప్పులు జరగకుండా చెయ్యడం అన్నది పోకా యోకే కాన్సెప్ట్.. ఇక్కడ మనమో  విషయం నిశితంగా గమనిస్తే ఈ ఫీచర్ అదనంగా చేర్చడానికి పెద్ద ఖర్చు పెట్టక్కర్లేదు.. కొంచెం క్రియేటివిటి వుంటే చాలు.. పోకే యోకే అన్నది తయారు చేసే వస్తువులలో పెట్టవచ్చు, ఆ తయారి విధానం లో అమలుపరచవచ్చు. టయోట కంపెని లో ఇదే ఫీచర్ కార్ల తయారి విధానం లో మొట్టమొదట ఉపయోగించారు.. కారు తయారి లో  పొరబాటున ఒక పార్ట్ బదులు ఇంకో పార్టు పెట్టకుండా ఉండటానికి, ఏదయినా నట్/బోల్ట్ బిగిన్చాల్సినది మర్చిపోయి వదిలేయకుండా ఉండటానికి.. ఇలా అన్ని స్టేజిలలోను ఈ పోకా యోకే అమలుపరచడం వల్ల అప్పటినుండి  టయోట నాణ్యత కి మారు పేరు అయ్యింది .. క్వాలిటిలో మిగతావారికి మార్గదర్శకం గా నిలిచింది. 


ఈ వీడియో చూడండి.. బాష చూసి కంగారు పడొద్దు.. కొన్ని సేకేండ్లు ఆ అమ్మాయిని చూస్తూ టైం పాస్ చేస్తే .. ఆ తరువాత మనం రోజు చూసే  కొన్ని పోకే యోకే ఉదాహరణలు వున్నాయి ...


సర్లేవోయ్.. అవన్నీ ఫ్యాక్టరీలలో డిజైన్ చేసేవారికి మనకెందుకు ఇవన్నీ అనుకుంటున్నారా.. ఉహు .. రోజువారి జీవితం లో మనకి తెలీకుండా మనం చాలా పోకా యోకే లు  ఉపయోగించేస్తుంటాం .. మరి మనకి ఆ క్రియేటివిటి ఎంత వుందో చూద్దాం..:-))


1. మనం ఇంట్లో/ఆఫీసులో వాడే పోకా యోకే లకు మన కారు/బండి తాళాలు బాగా ఉపయోగపడతాయి. బయటకు ఏదయినా ముఖ్యమయిన కాగితాలు, వస్తువులు తీసుకేళ్ళాలి అనుకుంటే , మన బండి తాళాలు తీసుకెళ్ళి దానికి తగిలిస్తే సరి.  తాళాలు లేకుండా బయటకు వెళ్ళలేము.. తాళాలు తీసుకునేటపుడు అవి  ఎలాగూ చూస్తాం.. (అవి అక్కడెందుకు వున్నాయో ఆలోచించకుండా పక్కన పెట్టి మరీ తాళాలు తీసుకెళ్ళే నాలాంటి వాళ్ళగురించి మనకిక్కడ చర్చ వద్దు). అలాగే  బయటకు వెళ్ళే ముందు ఏదయినా స్విట్చాఫ్ చెయ్యాలంటే తాళం దానికి తగిలించాలి.
  
2. సెల్ ఫోన్ మరియూ చార్జెర్ మర్చిపోకుండా తీసుకెళ్ళాలి అంటే ఇలా ఫోన్  షూ లో పెట్టి చార్జర్ తగిలించడం చూసారా.. 
 3. చిన్నప్పుడు నాకెవరో చెప్పారు. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఎవరయినా పెన్ అడిగితే కేప్ తీసి నీ దగ్గర ఉంచుకుని కేవలం పెన్ ఇవ్వు, సో వాళ్ళ పని అయిపోయాక కేప్ కోసం వెదికినప్పుడు ఆ పెన్ నీదని గుర్తువచ్చి నీకు తిరిగిచ్చి వెళతారు .. లేకపోతే మర్చిపోయి తీసుకెళ్ళిపోతారు అని ..
4. అప్పట్లో (నా చిన్నప్పుడు) చిన్నపిల్లలు అదే పనిగా నోట్లో వేళ్ళు పెట్టి చీకుతుంటే వాళ్లకి తెలీకుండా వాళ్ళ వేళ్ళకి వేపరసం రాసేవారట.
5. ఆఫీసులో కొలీగ్ కి ఏదయినా డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి వచ్చి మనం వెళ్లేసరికి అతను/ఆమె సీట్లో లేకపోతే .. తన కూర్చునే సీట్ లోనో లాప్టాప్ కీబోర్డు మీదో పెట్టి వస్తాం ..  లేకపోతే మానిటర్ కి  Post - It   అంటిస్తాం..అలా అయితే అతను/ఆమె చూడటం మిస్ అవదు అని నమ్మకం..
 6. వంటింట్లో ఫ్రిజ్ కి Post - It అంటించి, నిండుకున్న సరుకులు ఎప్పటికప్పుడు వెంటనే దానిమీద  రాసేస్తూ వుంటే , షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఆ పేపర్ తీసుకెళ్ళవచ్చు.. వెళ్లేముందు ఏమివున్నాయ్, ఏమి లేవు అని పనికట్టుకుని గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించక్కర్లేదు. (ఇది పోకే యోకే అవుతుందో లేక మామూలు చిట్కా అవుతుందో మరి .. నాకు తెలీదు:-))
7. కొంతమంది షాపింగ్ కి వెళ్ళినప్పుడు క్రెడిట్ కార్డు వదిలేసి , కొంత లిమిటెడ్ కాష్ తీసుకెళుతూ వుంటారు. అలాయితే లెక్కలేకుండా ఎక్కువ ఖర్చు చెయ్యరని .. 

ఇప్పటికి నాకు గుర్తువచ్చినవి ఇవే.. ఇలా మనం తెలీకుండా రోజు వారి జీవితం లో చాలా పోకా యోకే ఇడియాలు వాడేస్తుంటాం .. సరే మరి మీ దగ్గర వున్న పోకే యోకే  ఐడియాలు మాతో షేర్ చేసుకుంటే మేము ఫాలో అయిపోతాం మరి .. 


- మంచు 
గమనిక , హెచ్చరిక, అర్దింపు (ఛ ఛ ఏ పదం వాడాలో కూడా తెలీట్లేదు) : ఇప్పుడు బ్లాగుల్లో తెలుగు బాష మీద పెద్ద చర్చ (యుద్ధం ) జరుగుతుంది. కదా... స్పెల్లింగ్ తప్పిదాలువున్నా , ఎక్కువ అనువదించినా , తక్కువ అనువదించినా  జనాలు క్షమించకుండా కామెంట్లతో చీల్చి చెండాడుతున్నారు.. వాళ్ళు నన్ను వదిలేయండి  :-) ఇప్పటికే వాళ్ళ భయం తో ఎక్కువ తక్కువ తెలుగు పదాలు రాసి , విచిత్రమయిన వ్యాఖ్య నిర్మాణం చేసి  ఈ టపా లో కొన్ని బూతులు రాసేనేమో అని సందేహం..