Pages

Saturday, April 17, 2010

అబ్బే లాభం లేదు ...మార్చాల్సిందే

***  శ్రీ రామ  ***


అబ్బే లాభం లేదు మార్చాల్సిందే .. ఏంటా అనుకుంటున్నారా .. అదే నా బ్లాగ్ టైటిల్ మరియూ నా బ్లాగ్ పేరు .. మొదట్లో ఏదో అనాలోచితం గా పెట్టిన పేరు (ఆ రోజే చూసా ఆ సినిమా) .. కేవలం కామెంట్లకే కదా  అని అంత పట్టించుకోలేదు .. కొన్నాళ్ళక్రితం ఎవరో "మీ బ్లాగ్ నేమ్ నచ్చక మీ కామెంట్స్ చదవను" ఆంటే.. నా బ్లాగ్ నేమ్ కి ఏమొచ్చింది బానే వుంది కదా అనుకున్నా.. ఆ చెప్పినాయన/చెప్పినావిడ ఎందుకు నచ్చలేదో చెప్పి వుండాల్సింది.. సరే.. ఈ మద్య ఎవరో ఈ బ్లాగ్ పేరుకి ఆయనకి తోచిన అర్ధం చెప్పారు .. అదే కరెక్ట్ మీనింగ్ ఏమో అని అనుమానం వచ్చాక.. నా బ్లాగ్ పేరు నాకు అస్సలు నచ్చడం లేదు..

సర్లే మార్చేద్దాం అని నిర్ణయించుకొని.. ఏ పేరు పెట్టాలా  అని గత రెండు వారాలుగా ఎంత మోచిప్పలు బద్దలుకొట్టుకుంటున్నా  సరైన పేరు తట్టడం లేదు.. సింపుల్ వుండే 'నేస్తం ' ,' భావన' ఇలాంటి పేర్లు పెడదామంటే వున్నవన్ని ఇప్పటికే వాళ్ళు పెట్టేసుకున్నారనిపిస్తుంది.. 'వాలు కొబ్బరిచెట్టు' , ' ఏటి గట్టు ' లాంటి అందమయిన పేర్లు పెట్టాలంటే కాస్త టేస్ట్ తెలిసుండాలి.. ఇష్టమయిన గోదావరి పేరుతొ ఇప్పటికే బోల్డు బ్లాగులున్నాయ్.. 'మానస సంచరర ' లాంటి పదాలకి అర్ధాలే తెలియదు కాబట్టి అలాంటి కష్టమయిన పేర్ల జోలికి నేను  వెళ్ళను .. Marxist-Leninist-Feminist-Chemist-Druggist Revolutionary లాంటి కాంప్లికేటెడ్ పేరు పెడదామంటే కొందరు " @(+_*)(*@&*_(# " అని తిట్టారు. కాస్త వెరైటీ గా ఏ ' కాకినాడ దాదా' అని పెడదామంటే ..ఈ మద్య అసలే కత్తి మీదో, అతని  గ్యాంగ్ మీద ఎవరు కాస్త వ్యతిరేకం గా కామెంట్ పెట్టినా, పోస్ట్ రాసినా అది మలక్పేట్ రౌడి నే అని అనుమానిస్తున్నారు.. ఇక దాదా, రౌడి, గూండా లాంటి  పేర్లు పెడితే నేను మలక్పేట్ ఒకటే అంటారు. ఇంకా మా వూరి పేరు , ఇష్టమయినవి అన్నీ ఆలోచించా ఏది తట్టడం లేదు.. ఒక వేళ మార్చినా ఆ కొత్త పేరు నాదే అని పాత పేరుతొ చెప్పుకుంటూ వుండాలి.

సరియిన పేరు దొరికే వరకూ ఇప్పుడున్న పేరు నే సగం చేసి మొదటి సగం "మంచు" అనో రెండవ సగం 'పల్లకి' అనో వుంచేద్దామని నిర్ణయించుకున్నా.. ఎక్కువమంది పిలిచే పేరు 'మంచు' కనుక ప్రస్తుతానికి అదే.. ( 'మంచు' ఆంటే నేనేదో మోహన్ బాబు చుట్టాననుకునేరు ) .. ఏదో .... త్వరలో మంచి పేరు పెట్టేసి నిఖిత లాగా రోజుకో పది పదిహేను పోస్తులేసేయ్యాలి ...

ఎవరయినా మంచి పేరు సలహా ఇస్తే ఒక 10 కామెంట్లు ఫ్రీ :-)) .. ..

- మంచు

** తెలియని వారి కోసం:   @(+_*)(*@&*_(# ఆంటే  తెలుగు అర్ధం మార్తాండ  అని













10 comments:

కత పవన్ said...

మీరు బ్లాగుకి పేరు పేట్టడానికి ఇంత అలోచిస్తున్నారు...

మా దున్న సారి మా ప్రనా మీరు ఇప్పటి వరకు ఏన్ని బ్లాగుల్లో కామేంట్ రాసారు అన్ని కోత్త బ్లాగులు పేట్టాడు ప్రనా.

హుమ్ మీమల్ని మంచు గారనే పిలుస్తాం ..పల్లకి అంత పబ్లీష్ గా లేదు...సో మంచు గారు

ఆ.సౌమ్య said...

మంచుతో తడిసిన పల్లకీ, లేదా పల్లకిలో కురిసిన మంచు అనో పెట్టండి పాత పేరుకి కొత్తపేరుకి సమన్వయం సరిపోతుంది :D

Anonymous said...

మీ బ్లాగు పేరు బానే ఉందే.
ఎందుకు మార్చడం?
అంతగా కావాలంటే మరో బ్లాగు మొదలెట్టండి.

హరే కృష్ణ said...

మీ బ్లాగుenvironmental friendly ద్వారానే మాకందరకీ పరిచయం

మంచుపల్లకీనే చాలా బావుంది

karthik said...

వాలు జడ తోలు బెల్టు అని పెట్టుకోండి.. బావుంటుంది.. ఏమంటారు?

Sravya V said...

పేరు కోసం చాల ఆలోచిస్తున్నారు, మంచు / పల్లకి / లేదా మంచుపల్లకి కొంచం ఫెమినైన్ టచ్ ఉన్న పేర్లు లాగ ఉన్నాయ్ , కాని మీ బ్లాగ్ పేరు మాకు బాగా అలవాటైంది కదా అందుకే బ్లాగ్ టైటిల్ అదే ఉంచి మీ బ్లాగు పేరు మీ పేరే పెట్టచ్చు కదా అని నా రెండు పైసల ఉచితసలహా :)

Sravya V said...

పేరు కోసం చాల ఆలోచిస్తున్నారు, మంచు / పల్లకి / లేదా మంచుపల్లకి కొంచం ఫెమినైన్ టచ్ ఉన్న పేర్లు లాగ ఉన్నాయ్ , కాని మీ బ్లాగ్ పేరు మాకు బాగా అలవాటైంది కదా అందుకే బ్లాగ్ టైటిల్ అదే ఉంచి మీ బ్లాగు పేరు మీ పేరే పెట్టచ్చు కదా అని నా రెండు పైసల ఉచితసలహా :)

బంతి said...

మంచుపల్లకి బాగుంది కదండీ
అన్నట్టు కార్తిక్ చెప్పింది కూడా బాగుంది ఆలోచించండి ;)

మిరియప్పొడి said...

మంచుపల్లకి బావుంది కద?

మధురవాణి said...

పేరు సంగతేమో గానీ, మీ టపా బాగుంది. :-) :-D