Pages

Thursday, April 1, 2010

నా ఉద్యమం, కొన్ని సూచనలు - 3 - CPR (Updated )*** శ్రీ రామ ***

ఇంతకు ముందు టపా లో చెప్పుకున్నది మళ్లీ ఒక్కసారి గుర్తుచేసుకుని తరువాత అసలు టపాలోకి వెళదాం. 'ఎవరయినా స్పృహ తప్పి పడిపోతే ముందు చూడాల్సింది  ఆ వ్యక్తి శ్వాస తీసుకుంటున్నాడా  లేదా అని. ఒకవేళ ఆ వ్యక్తి  శ్వాస తీసుకోవడం లేదు అనిపిస్తే అప్పుడు మనం చేయవలసిన ప్రధమ చికిత్స చాలా చాలా ముఖ్యమైనది (critical). శ్వాస తీసుకుంటుంటే అప్పుడు మనం అంత కంగారు పడక్కర్లేదు'. స్పృహ తప్పడానికి కార్డియాక్ అరెస్ట్, విద్యుత్ ఘాతం (కరెంట్ షాక్), నీళ్ళలో మునిగిపోవడం(drowning) , తలకి గట్టి దెబ్బ తగలడం (head injury),  కొన్ని రకాల మందులు (నిద్ర మాత్రలు వంటివి) అతిగా వాడటం  లాంటి రకరకాల కారణాలు ఉండొచ్చు..కారణం ఏదయినా ప్రధమ చికిత్స ఇంచుమించు ఒక్కటే. ఈ ప్రధమ చికిత్స యొక్క ముఖ్య ఉద్దేశ్యం కృత్రిమ శ్వాస అందించడం. ఈ కృత్రిమ శ్వాస అందించే ప్రక్రియనే CPR (cardiopulmonary resuscitation) అంటారు. దీన్నే కొంత మంది ABC (Airway - Breathing -Circulation) అని కూడా వ్యవహరిస్తూ  వుంటారు. ABC అన్నది గుర్తుపెట్టుకోవడం సులువని నేను ఇదే వాడుతుంటా.

ఈ ప్రధమ చికిత్స చేసే పద్దతి శిశువులకు (infant ఏడాది లోపు పిల్లలు ) , పిల్లలకు ( children1- 8 years ) , పెద్దలకు ( 8 ఏళ్ళు మరియూ అ పైన ) వేరు వేరు గా వుంటుంది. ఆ మూడు పద్దతులూ ఇక్కడ చూద్దాం . 

పెద్దలకు (8 ఏళ్ళు పైన ) :  
1.  ముందు అచేతనంగా పడివున్న ఆ వ్యక్తి స్పృహలో వున్నాడా లేదా అని తెలుసుకోవడం: " స్పృహ లో వున్నవా"  అని అరుస్తూ,  ఆ వ్యక్తి భుజాలు పట్టుకుని బాగా కుదపాలి. కనీసం మూడు సార్లు అడగాలి. (ఎక్కువ సమయం వృదా చెయ్యకూడదు, మూడు సార్లకి మహా అయితే 10 సెకండ్లు పడుతుంది). 

2. అప్పటికి లేవకపొతే వెంటనే సహాయం కోసం అరవండి /ఫోన్ చెయ్యండి . ఎవరయినా సహాయం చెయ్యడానికి అందుబాటులో వుంటే వారికి అంబులన్స్ పిలిచే పని అప్పచెప్పండి. ఎవరూ అందుబాటులో లేకపోతె ప్రధమ చికిత్స చేసేముందు మీరే అంబులెన్స్ సహాయం కోసం కాల్ చెయ్యండి.మనం అంబులన్స్ కోసం కాల్ చెయ్యాల్సి వచ్చేది అత్యవసర సమయాల్లో మాత్రమే అందుచేత గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమయిన సూచనలు తరువాతి టపాలో.
ఆ తరువాత కృత్రిమ శ్వాస అందించే ప్రధమ చికిత్స చెయ్యాలి. ఈ కింద ఇచ్చిన స్టెప్స్ CPR or ABC ఎలా చెయ్యాలో వివరించేవి.

3 Airway : ఈ కృత్రిమ శ్వాస అందించే ప్రక్రియ లో ముందు చూడాల్సింది 'ఆ స్పృహ తప్పిన వ్యక్తి గాలి పీల్చుకోవడానికి ఏమయినా అడ్డుపడుతుందా (ఏదయినా బ్లాక్ చేస్తుందా అని )'. ఎక్కువ సందర్బాలలో ఆ స్పృహ తప్పిన వ్యక్తి నాలుకే లోపలకి (గొంతులోకి) మడత పడి శ్వాసకి అడ్డుపడుతుంది . అందువల్ల ముందు ఈ పక్క బొమ్మ లో చూపించినట్టు ఆ వ్యక్తి నుదురు కిందకి నొక్కుతూ గెడ్డం పట్టుకుని  పైకి లేపాలి (దీన్నే " head tilt-chin lift " టెక్నిక్ అంటారు). దీనివల్ల నాలుక పైకి జరిగి , శ్వాస కు అడ్డుపడకుండా వుంటుంది. మెడ , వెన్నుముకల మీద ఎక్కువ స్త్రెస్స్ పడకుండా జాగ్రత్తగా పైకి లేపాలి. 

గమనిక: ఇలా లేపేముందు మెడకు ఏదయినా గాయమయ్యే ఆవకాశం వుందా అన్నది చూడాలి. మెడ ఎముక కి గాయం అయ్యివుంటే ఇలా పైకి లేపడం వల్ల ఆ గాయం పెద్దది చేసే ప్రమాదం వుంది.  
కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తి చేసుకున్న వాంతి కూడా శ్వాసకు అడ్డంపడి ఉండొచ్చు. తెలీని వ్యక్తి వాంతి క్లీన్ చెయ్యాలంటే కొద్ది చిరాకే గానీ ఆ వ్యక్తి ప్రాణాల ముందు మన చిరాకు చాలా చిన్నది కదా. ఈ స్టెప్ యొక్క లక్షం శ్వాసకి ఏదయినా అడ్డుపడుతుందేమో అని చూసి ఆ అడ్డు తొలగించడమే. 
గమనిక: ఏదయినా అడ్డుపడిన వస్తువు/పదార్ధం తియ్యాలి అనుకున్నప్పుడు చూసి తియ్యాలి.. చూడకుండా వేలుపెట్టి బయటకు లాగడానికి , కేలకడానికి ప్రయత్నించొద్దు. (క్లే బా స క్షమించాలి :-) ).
4 . Breathing
ఈ స్టెప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆ వ్యక్తి శ్వాస ని  పరీక్షించడం. శ్వాస తీసుకుంటున్నాడా లేదా అన్నది పరీక్షించడానికి మనం LLF (Look , Listen & Feel) పద్దతి ని ఉపయోగించాలి. పక్క ఫోటో లో చూపించినట్టు ఒక చేత్తో గడ్డం పైకి లేపి పట్టుకుని, ఇంకో చేత్తో నుదురు మీద కిందకి నొక్కుతూ , మన చెవి ఆ వ్యక్తి ముక్కుకి దగ్గరగా చేర్చి అతని గుండె ని గమనిస్తూ వుండాలి. ఇందులో Look ఆంటే శ్వాస తీసుకుంటున్నప్పుడు గుండె పైకి కిందకి కదులుతుంది కదా అది Look (చూపుతో) తో గమనించాలి. మన చెవి ప్రమాదం లో వున్న వ్యక్తి ముక్కు దగ్గర వుంటుంది కాబట్టి మనం ఆ ఉచ్వాస నిచ్వాసాలను  వినవచ్చు (Listen). అలాగే ఒకవేళ ఆ వ్యక్తి శ్వాస తీసుకుంటూ వుంటే బయటకు వచ్చే వేడి శ్వాస మనకి చెంపలకి తగులుతూ  వుంటుంది కనుక  మనం ఆ శ్వాసని ఫీల్ (Feel)  అవుతాం అన్నమాట. అ విధంగా  పైన  చెప్పిన  పోసిషన్  తో ఒకేసారి ఈ మూడు పనులు చెయ్యవచ్చు. అప్పుడు మన సమయం చాలా క్రిటికల్ కనుక ఈ శ్వాస పరిక్షకి కేవలం 5 సెకండ్లు మాత్రమే మనం వెచ్చించాలి. ఒక వేళ శ్వాస ఆడటం  లేదు అనుకుంటే వెంటనే తరువాతి  స్టెప్ (Circulation) కి వెళ్ళాలి. 
5. Circulation: ఈ స్టెప్ లో ఆగిపోయిన గుండెని/శ్వాసని మనమే కొట్టుకునేలా చెయ్యాలి.
5.1. ఒక చేత్తో ఆ వ్యక్తి ముక్కు మూసి - ఆ వ్యక్తి నోటిని మన నోటితో పూర్తిగా కవర్ చేస్తూ రెండుసార్లు గట్టిగా  ఆవ్యక్తి  నోటిలోకి గాలి వదలాలి. మనం పంప్  చేసే శ్వాస కనీసం 1.5 - 2 సెకండ్లు వుండాలి. అలాగే మనం ఆ వ్యక్తి  నోటిద్వారా పంప్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఛాతి పైకి లేస్తున్నట్టు గమనించాలి (నిద్రపోతూ ఊపిరి తీసుకుతున్నప్పుడు ఛాతి ఎలా పైకి కిందకి కదులుతుందో అలా )
* మనం గాలి పంప్ చేస్తున్నా ఛాతి పైకి రైజ్ అవ్వడం లేదు ఆంటే నోటిలో ఏదో అడ్డు పడినట్టు అన్నమాట.. (పైన చెప్పుకున్నట్టు వెంటనే ఆ అడ్డు తొలగించాలి)
** ముక్కు ముయ్యడం, మన నోటితో ఆ వ్యక్తి నోటిని పూర్తిగా కవర్ చెయ్యడం లాంటి జాగ్రత్తలు -మనం  పంప్ చేసే  గాలి పక్కకు లీక్ అవకుండా తిన్నగా లోపలకు చేరుకునేలా చెయ్యడానికే.
*** నోటిలో నోరు పెట్టి ఊపిరి అందివ్వడ్డం అందరికి ఇష్టం వుండకపోవచ్చు. అప్పుడు మన చేతి రుమాలు ఆ వ్యక్తి నోటి మీద వేసి ఆపై మన నోరు పెట్టి అందివచ్చు (ఫస్ట్ ఎయిడ్ లో మన ఖర్చిఫ్ చాలా చాలా ఉపయోగపడుతుంది, మరిన్ని వివరాలు తరువాతి టపాల్లో). 
 
5.2
మన ఎడమ చెయ్యిని పక్క ఫోటో లో చూపించినట్టు  కుడి చెయ్యి మీద పెట్టి వెళ్ళు మడిచి , ఆ వ్యక్తి గుండె పై పెట్టి అదమాలి. కరెక్ట్ ప్లేస్ ఆంటే మనిషి రెండు నిపిల్స్ కి సరిగ్గా మద్య (పక్క ఫోటో చూడండి.)  ఇలా  అదమడాన్నే  'Chest compressions ' అంటారు. ఈ 'Chest compressions ' యొక్క specifications  చూద్దాం 


హెచ్చరిక: గుండె ఎడమవైపు వుంటుంది కదా అని మరీ పక్కకు నొక్కితే
చేస్ట్ రిబ్స్ విరిగే ప్రమాదం వుంది.
 
ఎంత లోతుకి నొక్కాలి : కనీసం ఒక అంగుళం నుండి ఒకటిన్నర అంగుళం లోతుకు నొక్కాలి. మనం అనుకున్నదానికన్నా ఎక్కువ బలమే ఉపయోగించాల్సి వస్తుంది.
ఎన్ని సార్లు : పట్టుకు 30 సార్లు 
ఎంత వేగం తో : కనీసం నిముషానికి 100 సార్లు వచ్చేలా .. ఆంటే 30 సార్లకి ఇంచుమించు 20 సెకండ్స్ పడుతుంది. ఈ chest compressions ఇచ్చేటపుడు నొక్కుతూ 1 , 2, 3, 4,5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 అని పైకి లెక్క పెట్టాలి.

5 .3 మళ్లీ రెండు సార్లు నోటి ద్వారా గాలి పంప్ చేసి మళ్లీ 30 సార్లు 'Chest compressions ' ఇవ్వాలి. 
6 .  ఆ తరువాత ఆ వ్యక్తి శ్వాస పైన చెప్పినట్టు మరలా ఒకసారి LLF పద్దతిలో పరీక్షించి, అప్పటికి శ్వాస పునరిద్దరించ బడక పొతే మళ్లీ నోటితో శ్వాస , chest compressions  ఇవ్వాలి. ఈ  ప్రక్రియ వరస క్రమం మళ్లీ చూద్దాం .
-------------------------------------------------------------------------------------- 
వైద్య సహాయం (అంబులన్స్)  కోసం పిలవండి 
ఊపిరి పరిక్ష (5s ) ; రెండు నోటి శ్వాసలు   (4 s ) ; 30 సార్లు గుండె నొక్కడం (20 s )
రెండు నోటి శ్వాసలు   (4 s ) ; 30 సార్లు గుండె నొక్కడం (20 s )
ఊపిరి పరిక్ష (2s ); రెండు నోటి శ్వాసలు   (4 s ) ;30 సార్లు గుండె నొక్కడం (20 s )
రెండు నోటి శ్వాసలు   (4 s ) ;30 సార్లు గుండె నొక్కడం (20 s )
ఊపిరి పరిక్ష (2s ) ; రెండు నోటి శ్వాసలు   (4 s ) ; 30 సార్లు గుండె నొక్కడం (20 s )
రెండు నోటి శ్వాసలు   (4 s ) ;30 సార్లు గుండె నొక్కడం (20 s ) ......................
---------------------------------------------------------------------------------------
*పైన బ్రాకెట్ లో వున్నది సమయం సెకండ్స్ లో 

ఇలా ఆ వ్యక్తి శ్వాస పునరుద్దరణ జరిగేవరకు వరకూ లేక సహాయం వచ్చేవరకూ చేస్తూనే వుండాలి.  కొద్దిగా శ్వాస పీల్చుకుంటున్నట్టు అనిపిస్తే .. కేవలం నోటితో ఊపిరి అందిస్తే చాలు.. ఈ ప్రక్రియ మద్యలో ఆ వ్యక్తి వాంతి చేసుకుంటే నోటిని పక్కకు తిప్పి శుబ్రం చేసి మళ్లీ CPR ప్రయత్నించాలి.

హెచ్చరిక: ఒక వేళ ఆ ప్రమాదానికి గురి ఆయిన వ్యక్తి కి HIV వుంటే - ఈ CPR వల్ల ఆ వ్యక్తి నుండి ప్రధమ చికిత్స చేసే వ్యక్తికి HIV  సంక్రమించదు  అని ఎక్కడ ప్రూవ్ అవ్వలేదట (?) ..  సో జాగ్రత్త ..ఈ విషయం లో మీదే లాస్ట్ కాల్ ..
ఈ మద్య అమెరికా కొత్త CPR rules ప్రకారం mouth to mouth అవసరం లేదు.. కేవలం చేస్ట్ compressions చాలు అని వుందట. http://www.msnbc.msn.com/id/23884566


పిల్లలకు ( 1 to 8 years):
పిల్లలకు చేసేటపుడు ముందు ఒకసారి నోటి శ్వాస , chest compressions  ట్రై చేసాక అప్పుడు అంబులన్స్ ని పిలవచ్చు. అలాగే chest compressions ఇచ్చేటపుడు  పెద్దలకు చేసినట్టు రెండు చేతులు వాడకుండా కేవలం ఒక చేతినే వాడాలి. ఇవి రెండు తప్ప మిగతావన్నీ పెద్దలకు పిల్లలకు ఒకేటే పద్దతి. పిల్లల CPR ప్రధమ చికిత్స వరుస క్రమం మరొక్కసారి.
1. తడుతూ , అరుస్తూ లేపడానికి ప్రయత్నించాలి. పిల్లవాని నుండి ఏవిధమయిన స్పందన లేకపొతే , పై చిత్రం లో చూపించినట్టు వెల్లికిలా పడుకోపెట్టాలి. 
2. శ్వాస తీసుకుంటుందో లేదో పైన ఫోటో(1) లో  చూపించినట్టు పరీక్ష చెయ్యాలి. చిన్ పైకి లేపుతూ , శ్వాసకి ఎమన్నా అడ్డుపడుతుందేమో చూసి సరి చెయ్యాలి. 
3. శ్వాస తీసుకోవట్లేదు అనిపిస్తే  పై ఫోటో(2) లో చూపించినట్టు మన నోటితో ఆ పిల్లవాని  నోరు  కవర్ చేస్తూ, ఒక చేత్తో ముక్కు మూస్తూ  రెండు సార్లు కృతిమ శ్వాస అందించండి (గాలి పంప్ చెయ్యాలి).(మనం గాలి పంప్ చేస్తున్నప్పుడు ఆ పిల్లవాని గుండె రైజ్ అవడం గమనించాలి).
4. తరువాత మన అర చెయ్యి తో రెండు నిపిల్స్ మద్య ఒక 30 చేస్ట్ compressions ఇవ్వాలి. మనం నొక్కినప్పుడు కనీసం చేస్ట్ హైట్ లో మూడోవంతు (1/3 rd of chest height) లోపలకి నొక్కాలి.  ( పైన  చెప్పినట్టు chest compressions యొక్క వేగం నిముషానికి 100  చూసుకుంటే ౩౦ compressions కు సుమారు 20 సెకండ్స్ పడుతుంది) 
5 . మళ్లీ నోటితో రెండు శ్వాసలు  , 30 chest compressions ఇవ్వాలి. 
6 . అప్పుడు మళ్లీ శ్వాస పరీక్ష చేసి , అప్పటికీ శ్వాస లేకపోతె వైద్య సహాయం కోసం పిలవాలి. 
7 . వైద్య సహాయం వచ్చేవరకూ లేక శ్వాస పునరుద్దరణ జరిగేవరకు పైన చెప్పిన నోటి శ్వాస, chest compressions ఇస్తూనే వుండాలి  . ఆ వరుస క్రమం ఒకసారి చూద్దాం 

--------------------------------------------------------------------------------------
ఊపిరి పరిక్ష (5s ) ; రెండు నోటి శ్వాసలు   (4 s ) ; 30 సార్లు గుండె నొక్కడం (20 s )
రెండు నోటి శ్వాసలు   (4 s ) ; 30 సార్లు గుండె నొక్కడం (20 s )
వైద్య సహాయం (అంబులన్స్)  కోసం పిలవండి  
ఊపిరి పరిక్ష (2s ); రెండు నోటి శ్వాసలు   (4 s ) ;30 సార్లు గుండె నొక్కడం (20 s )
రెండు నోటి శ్వాసలు   (4 s ) ;30 సార్లు గుండె నొక్కడం (20 s )
ఊపిరి పరిక్ష (2s ) ; రెండు నోటి శ్వాసలు   (4 s ) ; 30 సార్లు గుండె నొక్కడం (20 s )
రెండు నోటి శ్వాసలు   (4 s ) ;30 సార్లు గుండె నొక్కడం (20 s ) ......................
---------------------------------------------------------------------------------------
 

శిశువులకు  (<1 year) :
శిశువులకు , పిల్లలకు CPR అందించే పద్దతి లో రెండే  తేడాలు . ఒకటి chest compressions  అరచేతితో కాకుండా కేవలం రెండు వేళ్ళతో ఇవ్వాలి. రెండు ముక్కు చేతితో కాకుండా మన నోటితోనే కవర్ చెయ్యాలి . మిగతావన్నీ పిల్లలకు చేసే పద్ధతినే ఫాలో అయిపోవాలి. 
1. తడుతూ, అరుస్తూ లేపడానికి ప్రయత్నించాలి. పిల్లవాని నుండి ఏవిధమయిన స్పందన లేకపొతే  పై చిత్రం లో చూపించినట్టు వెల్లికిలా పడుకోపెట్టాలి. 
2. శ్వాస తీసుకుంటుందో లేదో పైన ఫోటో(1) లో  చూపించినట్టు పరీక్ష చెయ్యండి. చిన్ పైకి లేపుతూ , శ్వాసకి ఎమన్నా అడ్డుపడుతుందేమో చూసి సరి చెయ్యాలి.  
3.శ్వాస తీసుకోవట్లేదు అనిపిస్తే  పై ఫోటో(2) లో చూపించినట్టు నోటితో శిశువు నోరు మరియూ ముక్కు కవర్ చేస్తూ  రెండు కృతిమ శ్వాసలు అందించండి. శిశువు మొహం చిన్నది కనుక ముక్కు చేత్తో ముయ్యక్కేర్లేకుండా ,  ఆ శిశువు ముక్కు మరియూ నోరు మన నోటితోనే  కవర్ చెయ్యొచ్చు.
4. తరువాత మన చేతి వేళ్ళతో రెండు నిపిల్స్ మద్య ఒక 30 చేస్ట్ compressions ఇవ్వాలి. మనం నొక్కినప్పుడు కనీసం కనీసం చేస్ట్ హైట్ లో మూడోవంతు (1/3 rd of chest height) లోపలకి నొక్కాలి.  (chest compressions యొక్క వేగం నిముషానికి 100  చూసుకుంటే ౩౦ compressions కు సుమారు 20 సెకండ్స్ పడుతుంది) .
5. మళ్లీ నోటితో రెండు శ్వాసలు  , 30 chest compressions ఇవ్వాలి.
6 . అప్పుడు మళ్లీ శ్వాస పరీక్ష చేసి , అప్పటికీ శ్వాస లేకపోతె వైద్య సహాయం కోసం పిలవాలి. 
7 . వైద్య సహాయం వచ్చేవరకూ లేక శ్వాస పునరుద్దరణ జరిగేవరకు పైన చెప్పిన నోటి శ్వాస, chest compressions ఇస్తూనే వుండాలి  . ఆ వరుస క్రమం పైన పిల్లలకు చెప్పుకున్నట్టె. 

ఈ టపా కేవలం కనీస పరిజ్ఞానం అందించడానికి  మాత్రమే; మరింత సమాచారం కొరకు యూట్యూబ్ వీడియో లు చూడవచ్చు. కొన్ని లింక్లు ఇక్కడ (Thanks to వేణు  శ్రీకాంత్  )
Infant CPR: http://www.youtube.com/watch?v=rC80SMhbIa0 ;
Adult CPR:  http://www.youtube.com/watch?v=fHMOswPk3ug&feature=related  &
http://www.youtube.com/watch?v=5r7haVfZXek&feature=fvw 
ఇంగ్లీష్ సినిమాల్లోఈ CPR ప్రధమ చికిత్స చాలా కరెక్ట్ గా చూపిస్తారు. నాకు జురాసిక్ పార్క్ లో పిల్లవాడికి ఎలెక్ట్రిక్ షాక్ కొట్టినప్పుడు అతని తండ్రి చేసే ప్రధమ చికిత్స (CPR) గుర్తువుంది.  మన ఇండియన్ సినిమాల్లో ఎలా చూపిస్తారో సరిగ్గా తెలీదు కానీ , ఎప్పుడూ ఇలాంటి ప్రధమ చికిత్స హీరో మాత్రమే చేస్తాడు :-)) అది కూడా మోస్ట్ అఫ్ ది టైమ్స్ వీరోయిన్ కే (మరి ఆ తరువాత సాంగ్ వేసుకోవాలి కదా). రియల్ లైఫ్ లో ఆ హీరో / హీరోయిన్స్  రారు  కనుక మనమే మనవాళ్ళని రక్షించుకోవాలి.  

 ఈ టపాల్లో విషయాలు  'సగం చదివి బోర్ కొట్టి వదిలేయచ్చు'- పూర్తిగా చదివి 'ఆ ...అప్పుడు చూసుకొవచ్చులే' అని  వదిలేయచ్చు;  మన అత్మీయులకి  ప్రమాదం జరిగినప్పుడు మన పరిస్తితి ఒక సారి ఊహించుకుని కాస్త సీరియస్ గా తీసుకుని మీరు , మీతో పాటు ఇంకొంత మందికి అవగాహన కల్పించవచ్చు (మీకు ప్రమాదం జరిగినప్పుడు మీకు ఈ ప్రధమ చికిత్స చేసి మిమ్మల్ని కాపాడాల్సింది మీరు అవగాహన కల్పించిన మీ కుటుంబ సభ్యులే. నా కుటుంబ సభ్యులని , తోటి పౌరులను ప్రమాదాలు జరిగినప్పుడు కాపాడటం, తెలియనివారికి కొంత అవగాహన కల్పించడం నా బాధ్యత అని నేను అనుకున్నట్టే  మరికొంత మంది ఈ బాద్యత ను షేర్ చేసుకుంటారని ఆశిస్తూ...

సశేషం  
మంచుపల్లకీ &UVR
 
DISCLAIMER:
The information contained in this blog is intended to provide helpful information for the viewers and general public. It is made available with the understanding that the authors are not engaged in rendering medical, health, psychological, or any other kind of personal professional services on this site. The information should not be considered complete and does not cover all physical conditions or their treatment. It should not be used in place of a call or visit to a medical, health or other competent professional, who should be consulted before adopting any of the suggestions in this blog or drawing inferences from it. The information about drugs contained on this blog is general in nature. It does not cover all possible uses, actions, precautions, side effects, or interactions of the medicines mentioned, nor is the information intended as medical advice for individual problems or for making an evaluation as to the risks and benefits of taking a particular drug. The authors of this blog, specifically disclaim all responsibility for any liability, loss or risk, personal or otherwise, which is incurred as a consequence, directly or indirectly, of the use and application of any of the material on this blog.

11 comments:

వేణూశ్రీకాంత్ said...

చాలా విపులంగా రాస్తున్నారు మంచుపల్లకీ గారు, వివరాలు మంచి అవగాహన కల్పించేవిగా ఉన్నాయి. ఇటువంటి ఉపయోగపడే వివరాలను మీ బ్లాగ్ ద్వారా అందిస్తున్నందుకు ధన్యవాదాలు.

మీకు కుదిరితే యూట్యూబ్ లింక్ లు కూడా ఇక్కడే ఇవ్వగలరా.. అంటే ఎవరైనా వెతకవచ్చు కానీ మీరిన్ని వివరాలు ఇక్కడ పొందుపరిచారు కదా ఆ లింక్ కూడా ఇస్తే మరింత సమగ్రంగా ఉంటుందని అడుగుతున్నాను.

మీరు అన్నట్లే తప్పకుండా షేర్ చేసుకుని ఎక్కువమందికి ఈ సమాచారాన్ని చేరవేయడానికి ప్రయత్నిస్తాను.

3g said...

C.P.R గురించి ఇంతకుముందు నాకు తెలుసనుకున్నాను కాని మీ పోస్టు చదివాక నాకు ఎంత తెలీదో తెలిసింది............... చాలా వివరంగా రాసారు. thanks.

స్వర్ణమల్లిక said...

మంచు పల్లకి గారు,

చాలా బాగా రాసారు. ప్రతి అయిదుగురిలో ఒక్కరికి తెలిసి ఉండాల్సిన విధానం. మీరు వైద్య వృత్తిలో ఉన్నారా ....?

Ajit Kumar said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

శిశివులకి కూడా ఇలా ప్రామాదం జరగవచ్చన్న ఆలోచనకే భయమేస్తోంది...చాలా అవసరమైన సమాచారాన్ని అందించారు, ధన్యవాదాలు

Sravya V said...

ఉపయోగపడే వివరాలను చాలా బాగా రాస్తున్నారు మంచుపల్లకీ గారు ధన్యవాదాలు!

హరే కృష్ణ said...

మంచుపల్లకి గారు
చాలా బాగా రాసారు
ధన్యవాదాలు

శేఖర్ పెద్దగోపు said...

తెలుగులో వీటి గురించి ఇంత వివరంగా డేటా ఇస్తున్నది బహుశా మీ బ్లాగేనేమో...చాలా మంచి వివరాలు రాస్తున్నారండీ...టైటిల్ కొంచెం మిస్ లీడ్ చేసేవిధంగా ఉందండి..కేవలం టైటిల్ వల్ల కొద్ది మందైనా ఇంత మంచి టపాలను మిస్సవుతారేమో!!

నేస్తం said...

చాలా విషయాలు విపులంగా చెప్పారండీ .. థేంక్యూ

నేస్తం said...

చాలా విషయాలు విపులంగా చెప్పారండీ .. థేంక్యూ

శ్రీవాసుకి said...

బాగుంది. మంచి విపులంగా వ్రాసారు. మీరన్నట్టు దీనిని ఎప్పటికి గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు కదా. మీ విషయ సేకరణ బాగుంది.