Pages

Monday, April 2, 2012

తిండి గొడవలు (Part 4 of 4) - అసలు విషయం

*** శ్రీ రామ ***



సాధారణంగా ప్రతీ మనిషికీ తను నమ్మిన సిద్ధాంతం, తనకు నచ్చిన విషయం, తను నడిచే దారి అందరికీ నచ్చాలన్న కోరిక బలంగా ఉంటుందనుకుంటా.... అందుకే నచ్చచెప్పో, బలవంతపెట్టో, ఆశపెట్టో, భయపెట్టో, ఎదుటి వాళ్ళ సిద్ధాంతంలో తప్పులు ఎత్తి చూపో, ఏదో ఒకటి చేసి తాము నడిచే దారిలో అందరూ నడిచేలా చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి బ్రెయిన్‌వాష్‌లు ప్రతీరోజూ అనేక సందర్భాలలో మనం వ్యక్తిగతంగా చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం కూడా. అయితే ఏకంగా సంస్థలు స్థాపించి  మరీ బ్రెయిన్‌వాష్‌ చేసే కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. అందులో రకరకాలయిన కారణాలు చూపిస్తూ జనాల మతం మార్చడానికి ప్రయత్నించే "మతమార్పిడి" మిషనరీల మాదిరిగానే, బలవంతంగా శాకాహారాన్ని ప్రమోట్ చెయ్యడానికి ప్రయత్నించే "శాకాహార" మిషనరీలు తక్కువైనవేం కాదనిపిస్తుంది. ఈ బ్రెయిన్‌వాష్ ప్రక్రియలో  కొందరేమో శాకాహార మాంసాహారాలను వాటి ప్రయోజనాలు, ప్రతికూలతలు అధారంగా బేరీజు వేస్తూ తమకు అనుకూలంగా చేసిన విశ్లేషణలు చూపిస్తుంటే మరికొందరు మాంసాహారులను, వారి ఆహారపు అలవాట్లను తక్కువ చేసి మాట్లాడుతూ, మాంసం తినడం లేక "కొన్ని" రకాల మాంసం తినడం అదోరకమయిన క్రూరమయిన అలవాటుగా, రాక్షసచర్యగా అభివర్ణిస్తూ ప్రచారం చేపట్టడం లాంటి చర్యలకు దిగుతారు.  

మాంసాహారం తినేవాళ్ళ వల్ల జంతువులు అనేక రకాలయిన హింసకి గురవుతున్నాయి కాబట్టి మాంసాహారం త్యజించాలన్నది ఒక ప్రధానమైన డిమాండ్. మాంసాహార ఉత్పత్తి చేసే పరిశ్రమల్లో తీసిన ఫోటోలో, వీడియోలో అటాచ్ చేసిన కొన్ని మెయిల్స్ ఎప్పుడన్నా ఫార్వార్డ్ గా మీకు వచ్చే ఉంటాయి... ఒక పక్క అమాయకంగా జాలిగా చూస్తూ ఉండే కొన్ని జంతువుల ఫోటోలు, ఇంకో పక్క కొన్ని రక్తసిక్తమయిన డిస్టర్బడ్ ఫొటోస్ అవీ పెట్టి అత్యంత దయనీయంగా, జాలి గొలిపేలా ఉండేలా బాగా జాగ్రత్త తీసుకుంటారు. అలాంటివి చూసి చాలామంది ఒకటి రెండు రోజులు నాన్వెజ్ తినడం మానేస్తారు కూడా :-). అయితే జంతువుల్ని ఒకేసారి చంపడం కన్నా అవి బ్రతికున్నంత కాలం పెట్టే హింస పెద్ద హింస కాదనుకుంటే తప్ప ఇది లాక్టోవెజిటేరియన్స్ కి కూడా సమానంగా వర్తిస్తుంది. మరి ఎంతమంది లాక్టో వెజిటేరియన్స్ తాము ఇష్టంగా తినే పాలు, పెరుగు, వెన్న, తేనె లాంటివి తినడం మానెయ్యడానికి సిద్ధపడతారు? లాక్టో వెజిటేరియన్స్ ని  ప్రకృతిలో స్వేచ్ఛగా తిరగాల్సిన జంతువులను అలా బంధించి, వాటికీ వాటి పిల్లలకి దక్కాల్సిన సంపదను, వాటి శ్రమని దోచుకోవడం తప్పు కాదా అని అడిగితే "ఒక ప్రాణం తియ్యనంత వరకు ఏం చేసినా, ఎంత దోచుకున్నా పర్లేదు" అనీ,  ప్రకృతిలో ఒక ప్రాణి మరో ప్రాణి మీద ఆధారపడటం అత్యంత సహజమనీ, మనం వాటిని బానిసలుగా ఉంచుకున్నా అవి కష్టపడకుండా తిండి పెడుతున్నాం, జబ్బులొస్తే మందులేస్తున్నాం, అని తమకు అనుకూలంగా ఉండేలా వారి అవకాశవాదాన్ని అందంగా సమర్ధించుకుంటారు. అసలు ప్రకృతి సహజంగా కొన్ని జంతువులు ఎలాగైతే తమ ఆహారం కోసం మిగతా జంతువుల మీద ఆధారపడుతున్నాయో మనిషి కూడా తన ఆహారం కోసం కొన్ని జంతువుల మీద ఆధారపడటం కూడా ప్రకృతి సిద్ధం కాదా అనేది మరొక వాదన. 

అసలయితే చంపినప్పుడే జంతువులకి నొప్పి తక్కువ ఎందుకంటే వాటిని చంపేముందు (కనీసం కొన్ని దేశాల్లో అమలుపరిచే నిబంధనల ప్రకారం) వాటికి ఒక చిన్న ఎలెక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారానో లేక అధికశాతం కార్బన్ డైయాక్సైడ్ ఇవ్వడం ద్వారానో వాటికి బ్రెయిన్ తాత్కాలికంగా పని చెయ్యకుండా చేస్తారు (stunning). తరువాత ఏం జరిగేది వాటికి తెలీదు. అందువల్ల ప్రాణం ఉన్న మొక్కలను తెంపి తినడం ఎలానో ఈ స్పృహ లేని జంతువులని చంపినా అంతే. అయితే హలాల్ విధానం ఈ స్టన్నింగ్ ప్రక్రియకి విరుద్ధంగా ఉంటుంది. చనిపోయే జంతువుకి చివరిదాకా బాధ తెలుస్తూనే ఉంటుంది. అందువల్ల హలాల్ మీట్ కావాలని డిమాండ్ చేసేవారందరూ ఒకప్పుడెప్పుడో అప్పటి సమాజ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పడ్డ ఒక నిబంధనని, కేవలం మతానికి అనుసంధానమై ఉందన్న కారణంతో ఇప్పుడూ అదే అనుసరిస్తాం అనకుండా, మానవీయకోణంలో ఆలోచించి జంతువులకి నొప్పి తెలీకుండా చంపడానికి వీలయేలా అభివృద్ధిపరిచిన స్టన్నింగ్ లాంటి టెక్నాలజీని ఆచరించవలసిన ఆవశ్యకతని గుర్తించాలని హలాల్ కి వ్యతిరేకంగా పోరాడేవారి ప్రతివాదన.

మాంసాహారంతో పోలిస్తే శాకాహారం వల్ల అనేక ఆరోగ్యపరమయిన ప్రయోజనాలు ఉన్నాయనేది ఎవరూ కాదనలేని నిజం. అయితే ఇది అవసరాన్ని బట్టి ఎవరికి వారు తీసుకునే నిర్ణయమే తప్ప ఇందులో ఇతరుల జోక్యం,  ప్రబోధనలు అనవసరమే.  

ప్రపంచంలో మొత్తం వాయుకాలుష్యంలో 18 - 20% వాటా జంతువులు, ముఖ్యంగా ఆవులు విడుదల చేసే మీథేన్ వాయువుల వల్లనట. అధిక జనాభా కలిగిన భారత్, చైనా లాంటి దేశాల్లోని ప్రజలు క్రమంగా మాంసాహారం వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్న కారణంగా ఈ వాటా 2030 కల్లా 50 - 60% కి చేరుకుంటుందని ఒక అంచనా. ఎలెక్ట్రిక్ వాహనాలు, సోలార్ విద్యుత్తూ అంటూ ఒకవైపు కాలుష్య నివారణకి అనేక కార్యక్రమాలు చేపడుతుండగా ఈ మీథేన్ కాలుష్యకారకాల మీద  ప్రజలను చైతన్య పరచడానికి మాత్రం పెద్దగా ప్రయత్నాలు ఏం జరగడం లేదు. అయితే కాలుష్య కారకాలలో సింహభాగం అయిన  కార్లు, ఏసిలు మొదలయిన విలాస వస్తువులు వదులుకోవడానికి సిద్ధంగా లేని మనిషి తన ఆహారవిషయంలో మాత్రం రాజీ పడతాడా అన్నది ప్రశ్నార్ధకమే! 

రోజురోజుకీ పెరుగుతున్న అధిక జనాభాకి తగ్గట్టు ఆహారోత్పత్తి పెంచి భావితరాలవారికి ఆహారభద్రత కల్పించడానికి కృషి చెయ్యడం మనందిరి సమిష్టి బాధ్యత. అధిక దిగుబడి ఇచ్చే ఆహారధాన్యాల వంగడాలను రూపొందించడంతో పాటు ఎక్కువ ఫలోత్పాదకశక్తి (ఎఫీషియన్సీ) కలిగిన జంతువులను (అంటే అవి తక్కువ ఆహారం తిని ఎక్కువ మాంసం దిగుబడి వచ్చేలా) కూడా అభివృద్ధి పరచవలసి ఉంది. రెండిటిలో ఉపయోగించేది జన్యుమార్పిడి లాంటి ప్రకృతి విరుద్ధమయిన పద్ధతులే! కానీ ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించకుండా భవిష్యత్ ఆహార డిమాండ్ ని అందుకోగలమా అంటే ఖచ్చితంగా కాదనే ఒప్పుకోవాలి. అలాగే ఎకొలాజికల్ పిరమిడ్లో వీలయినంతమేరకు క్రింది పొరల్లో ఉండటం కూడా కలిసొచ్చే అంశమే.


ఏ మతం, కులం, జాతి, కుటుంబ నేపథ్యంలో పుట్టి పెరిగినా, కనీసం ఒక వయస్సు వచ్చేసరికి ఆమె/అతను ... తను ఏం చెయ్యాలి, ఏం తినాలి, ఏ మతం, ఏ ఆచారాలు అనుసరించాలి, తన సంపాదన ఎలా ఖర్చుపెట్టాలి, ఎవర్ని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలి అన్న విషయాల మీద కేవలం ఆ వ్యక్తికే పూర్తి స్వేచ్ఛ, అధికారం ఉండాలి అన్నది నా దృఢమయిన అభిప్రాయం. అందులో తినే ఆహారం మరీ సున్నితమయిన విషయం. మనం తినేవాటిలో తప్పు ఒప్పులు ఎత్తిచూపడం, కించపరచడం, అవమానపరచడం, మీరు తినేదాని బదులు ఫలానాది తింటేనే మంచిది అన్న బలవంతపు సూచనలు, మార్గనిర్దేశాలు ఒక్కోసారి విసుగు పుట్టిస్తాయి. కొండొకచో కొన్ని సందర్భాలలో బాధపెడతాయి కూడా. ప్రపంచంలో ఇది చెడు ఆహారం, ఇది మంచి ఆహారం అంటూ ఏమీ ఉండవు. కేవలం మనకి నచ్చేవి, నచ్చనివి ఉంటాయంతే! మనకి చిన్నప్పటినుండి అలవాటు అయినవి మనకి ఎక్కువ నచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక మహిళ నిజానికి ఎంత బ్యాడ్ కుక్ అయినా ఆవిడ పిల్లలకి మాత్రం ఆ అమ్మ వండిన ప్రతీది అమృతమే.. అందుకే ప్రపంచంలో ఎవరికయినా బెస్ట్ కుక్ అమ్మే.


మనకి నచ్చనిదో లేక 'మన' మతాచారాలకు అనుగుణంగా లేవనో కొన్ని అభిప్రాయాలను మిగతా వారి మీద రుద్దడం చాలా అసంబద్ధమయిన పని. సిగరెట్, డ్రగ్స్ లాంటివి మంచిది కాదు అని ప్రజలకి అడ్వొకేట్ చెయ్యడం తప్పు కానప్పుడు, ఈ శాకాహారంలో ఉండే ప్రయోజనాలను చెప్తూ మాంసాహారం వల్ల కలిగే వ్యక్తిగత మరియు సాంఘీకపరమయిన సమస్యలు ప్రజలకు వివరించి చెప్పడంలో మాత్రం తప్పేముంది అనిపించవచ్చు. అలాంటి విశ్లేషణలు చెప్పినంతవరకు పర్వాలేదు కానీ మాంసాహారులను, వారి ఆహారపు అలవాట్లను క్రూరమయిన అలవాట్లగా అభివర్ణించడం, లేక వారు కొన్ని జంతువులను తినడం వల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అని ఆరోపించడం తగదు. ఎప్పుడయినా ఒక వ్యక్తి చేసే పనులని లేక అలవాట్లని అదే పనిగా హేళన చెయ్యడం మొదలుపెడితే అప్పుడు ఆ వ్యక్తులు డిఫెన్స్ లో పడతారు. ఒక్కసారి ఎవరన్నా డిఫెన్స్లో పడితే వారు ఎప్పుడూ వారి చర్యలను సమర్ధించుకోవాలని చూస్తారు తప్ప మార్పు గురించి ఆలోచించడం అన్నది సాధ్యం కానే కాదు. మన దేశంలో బీఫ్ తినడం విషయంలో జరిగే గందరగోళం, తినేవాళ్ళను వాళ్ళ అలవాట్లను విమర్శిస్తూ చేసే వ్యాఖ్యలు, దానికి డిఫెన్స్ లో తినేవారి ప్రతివ్యాఖ్యలు అన్నీ నివారించదగ్గవే. ఒకరి ఆహారపు అలవాట్లని నిర్దేశించే, విమర్శించే హక్కు ఎవరికీ లేదు. కానీ, ఇలాంటి వాటికి కొన్నిచోట్ల  ప్రభుత్వ ఆమోదం కూడా ఉండటం విచారించదగ్గ విషయం. కొన్ని కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల వ్యకిగత ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా అయినా సరే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి షార్క్ ఫిన్ సూప్ ఎంతో రుచిగా ఉంటుంది అని జనాలంతా వాటిని వేటాడి తినడం మొదలుపెట్టారు కనుక ఈ రోజు వాటి సంఖ్య కనిష్ట స్థాయికి పడిపోయి అవి అంతరించిపోయే పరిస్థితి నెలకొంది. అలాగే వదిలేస్తే కొన్నాళ్ళకి ఆ రకం షార్క్ ఒకటి ఉన్నదనే భావితరాలకి తెలియకపోవచ్చు. ఈ పరిస్థితిలో షార్క్ ని చంపడం లేక తినడం మీద ప్రభుత్వ నిషేధాలు తప్పవు. మరి మన దేశంలో అలాంటి నిషేధాలు ఏవైనా విధించే ముందు అలాంటి అత్యవసర పరిస్థితి ఏమన్నా ఉందా లేదా అన్నది సరి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మన ఆహారపు అలవాట్లు, మతాచారాలు, నమ్మకాలు మొదలయినవి మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడే మన ప్రమేయం లేకుండానే నిర్ణయించబడతాయి. కొందరు ఈ విషయాల్లో పెద్దయిన తరువాత మార్చుకున్నా ఎక్కువ శాతం మంది అదే ఫాలో అవుతుంటారు. ఒకవేళ ఎవరయినా అలా మార్చుకున్నారు అంటే ఆ కొత్త అలవాట్లలో లేక ఆచారంలో వాళ్ళకి ఆకర్షణీయమయిన అంశం ఏదో కనిపించిందన్నమాట. అది కొత్త మతం అయినా, కొత్త ఆహారపు అలవాటు అయినా, కొత్త సెక్సువల్ ఓరియెంటేషన్ అయినా అయ్యుండొచ్చు. కేవలం మనకి నచ్చదన్న కారణంతో దాన్ని అవలంబించే వారిని నిరాకరించే హక్కు గానీ, అవమానించే హక్కు గానీ ఎవరికీ లేదు.

ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఎవరెవరికి అంగీకారయోగ్యమైన ఆహారపు అలవాట్లని వారు ఆచరిస్తూ, పర్యావరణ పరిరక్షణ, భావితరాల వారికి ఆహారభద్రత అనే అంశాల్ని మాత్రం కేవలం ఆహారపుటలవాట్ల దృష్టి నుంచే కాకుండా ఒక సమిష్టి బాధ్యతగా పరిగణించి సాధ్యమైనంత మేరకు మన జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ప్రకృతి సమతుల్యతని కాపాడుకోవాల్సిన  బాధ్యత ప్రతీ ఒక్కరి పైనా ఉంటుంది.

 

I believe in Vivre et laisser vivre

- means 

"accept other people as they are, although they may have a different way of life style; and not to interfere with other people's business or preferences"


- మంచు 


21 comments:

Anuradha said...

మిగతా మూడు పార్టుల కంటే కూడా ఫోర్త్ పార్ట్ చాలా బాగుంది. :)

sunita said...

మొత్తం సిరీస్ అయ్యాక కామెంటుదామని ఆగాను.ఈ చేపలూ శుక్రవారం లింక్ ఇప్పుడు మీరు చెప్పిందాకా తెలీదు నాకు.మంచి వ్యాసం. చాలా చాలా బాగా రాసారు.Keep writing!!

Anonymous said...

"accept other people as they are, although they may have a different way of life style; and not to interfere with other people's business or preferences" - excellent

but isnt supporting ban on whale hunting by the governments condradicting your above point.

if there was no ban and if the whale is in much demand then corporations/business men might have looked at ways of raising these whales.....

no one would kill a golden goose actually govt. bans are counter productive.

సిరిసిరిమువ్వ said...

చాలా బాగుంది మీ విశ్లేషణాత్మక వ్యాసం.

"ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఎవరెవరికి అంగీకారయోగ్యమైన ఆహారపు అలవాట్లని వారు ఆచరిస్తూ, పర్యావరణ పరిరక్షణ, భావితరాల వారికి ఆహారభద్రత అనే అంశాల్ని మాత్రం కేవలం ఆహారపుటలవాట్ల దృష్టి నుంచే కాకుండా ఒక సమిష్టి బాధ్యతగా పరిగణించి సాధ్యమైనంత మేరకు మన జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ప్రకృతి సమతుల్యతని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పైనా ఉంటుంది"

మీ పై లైన్లు నాకు చాలా చాలా నచ్చేసాయి.

మీరు ఈ వ్యాసాలు వ్రాస్తున్నప్పుడే హిందూలో వేగన్సు మీద ఓ వ్యాసం చదివాను.

ప్రస్తుతం హైదరాబాదులో ఓ యూనివర్సిటీలో హాస్టల్ మెస్సు మెనూలో బీఫ్..పోర్కు కూడా పెట్టాలని ఆందోళన చేస్తున్నారు..అలా పెట్టకపోవటం దళితులని అవమానించటం అట! పెట్టమని అడగటంలో తప్పు లేదు కానీ దానికి కూడా దళిత వాదం అంటగట్టటమేంటో అర్థం కాలా!

ఇంతకీ మీరీ వ్యాసం వ్రాయటానికి ప్రేరణ ఏమైనా ఉందా...ఇంత ఓపికగా..కూలంకషంగా వ్రాసారు కదా అందుకని అడుగుతున్నా:)

నిషిగంధ said...

నాక్కూడా అన్నిటికంటే నాలుగో పార్ట్ బావుందండీ.. అంటే ముగించిన విధానం నచ్చింది.. ఏ 'హారి ' అయినా ముఖ్యంగా 'సమతుల్యత ' ఆవశ్యకతని అర్ధం చేసుకోగలిగితే చాలు!
ఇరువైపులకీ సంబంధించిన ఎన్నో విషయాలను ఉదాహరణలూ, శాస్త్రీయ/మతసంబంధిత కారణాలతో సహా చాలా చక్కగా వివరించారు.. ఈ సిరీస్ రాయడానికి మీకు కనిసం రెండు నెలలైనా పట్టి ఉండాలి!! గ్రేట్ జాబ్! :-)

అసలైతే మధుర మరో రూపం చూసి కూడా చాలా ఆశ్చర్యం వేసింది.. తన బ్లాగ్ పోస్ట్స్ కీ, ఇక్కడ ఎంతో ఓపిగ్గా వివరంగా చెప్పిన సమాధానాలకీ ఎక్కడా సంబంధమే లేదు!! మీ వ్యాసం అందించలేని కొన్ని ప్రశ్నలకి తన వివరణ చాలా బావుంది! థాంక్యూ, మధుర!
మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నా.. నువ్వు కూడా ఇలాంటివి రాస్తే చదివి పెట్టాలని ఉంది :))

ఇక పైన వరూధిని గారి సందేహమే నాది కూడా.. ఈ వ్యాసం రాయడం వెనుక ఏమైనా ప్రత్యేకమైన ప్రేరణ ఉందా? :-)

Rao S Lakkaraju said...

మాంసాహారంతో పోలిస్తే శాకాహారం వల్ల అనేక ఆరోగ్యపరమయిన ప్రయోజనాలు ఉన్నాయనేది ఎవరూ కాదనలేని నిజం.
----------
అందుకనే చాలామంది మాంసాహారులు శాఖాహారు లవుతున్నారు. ఎవరినీ కించ పరచాల్సిన అవుసరం లేదు.

ముగింపు బాగుంది.

Bhardwaj Velamakanni said...

Tell me one thing .. Did any Veggie cheeze you off? :P


Newayz, I'm a Veggie and the only Animal Products I consume is Milk and Yogurt. (Lacto-Veggie to be precise) ... I have no issues with people consuming non veg - In fact, because of my Veggie habits, I usually find myself consuming less protein.

We need like 50-60 grams every day and now a days I depend a lot on the supplements and foods like Tofu.

Again, if I take lot of Soy then it will pump Estrogen into the body and I dont want it. Most of the Whey Protein supplements have contain Sucralose - I have been told one excellent ways to mess the Kidneys up is to consume a lot of Sucralose or Aspartame :P

So, the only good sources of Protein for people like me are Organic Supplements and they taste horrible. Three scoops of diet a day is YIKES!

When I explained all this to a friend of mine, he just said "If only you could eat meat....!" :P

Anonymous said...

"ప్రస్తుతం హైదరాబాదులో ఓ యూనివర్సిటీలో హాస్టల్ మెస్సు మెనూలో బీఫ్..పోర్కు కూడా పెట్టాలని ఆందోళన చేస్తున్నారు..అలా పెట్టకపోవటం దళితులని అవమానించటం అట! పెట్టమని అడగటంలో తప్పు లేదు కానీ దానికి కూడా దళిత వాదం అంటగట్టటమేంటో అర్థం కాలా!"

VC and other students are even against conducting a beef fest in the campus....isnt it wrong

how do u feel if some north Indian university bans eating idli and rice in their campus

శ్రీనివాస్ పప్పు said...

మాంచి రసకందాయంగా ముగించారు మంచు గారు...అభినందనలు.చాలా విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు.

ప్రేరణ ఏమన్నా ఉందా అంటే ఫలానా విషయం నలుగురుకీ పనికొస్తుందని నమ్మితే అది చెయ్యడానికి/వ్రాయడానికి ప్రేరణ మాత్రమే ఉండాలంటారా?పదిమందికి ఉపయోగపడాలన్న మంచి(చు)మనసుంటే చాలేమో కదా.కాదా???

Ruth said...

Very good posts.
How about Fish? a major part of non-veg eating population consume fish. which can be produced free (but not baught free :) ). Fish/ sea food is the best source of protine and also they have less calories.
we can depend more on the end less supply of sea food than on any thing produced by land.

వేణూశ్రీకాంత్ said...

చాలా మంచి సిరీస్ మంచుగారు... ఇంత శ్రమకోర్చి ఈ సిరీస్ అందించినందుకు ధన్యవాదాలు. అనుకున్నరీతిగా చక్కగా పూర్తిచేయగలిగినందుకు అభినందనలు :)

Anonymous said...

చక్కని విశ్లేషణతో ఉందీ టపా. మనిషి బతకాలంటే మరోజీవిపై ఆధారపడాల్సిందే. అది మొక్కలైనా కావచ్చు, జంతువులైనా కావచ్చు. జరిగే జీవహింస జరక్కమానదు.

మధురవాణి said...

@ మంచు గారూ,
You are just amazing! ఎంత balanced గా, organized గా రాసారో అసలు! చక్కగా ఒక రీసెర్చ్ ఆర్టికల్ రాసినంత పద్దతిగా బ్లాగ్ పోస్ట్ రాసారు. :)
పైన అందరూ చెప్పినట్టుగా ఈ అంశానికి సంబంధించిన అన్నీ కోణాలు సృశిస్తూ సాగిన చర్చకి మీరిచ్చిన ముగింపు చాలా బావుంది. ఇలాంటి అంశాలని అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో, అదీ తెలుగులో చెప్పడం ఎంత కష్టమైన పనో నాకు తెలుసు. మీరెంత శ్రద్ధ పెట్టి, శ్రమ తీసుకుని రాసి ఉంటారో ఊహించగలను. I really appreciate your efforts in writing such useful and informative posts. ఇందు మూలంగా, పైన మన బుల్లెబ్బాయ్ గారు 'ప్రేరణ' గురించి చెప్పిన మాటలతో నేనూ ఏకీభవిస్తున్నాను. :)
On the whole, that's a very impressive article and looking forward to see more such interesting and thoughtful posts from you. Thank you sir! :)

@ నిషీ.. మై డియర్ నిషీ..
అబ్బ.. ఎంత మెచ్చుకున్నావ్ నిషీ నన్ను.. గాల్లో తేలినట్టుందే.. అని పాట పాడుకుంటున్నా అప్పటి నుంచీ.. :)))
నేనసలు ఎప్పుడూ ఎక్కువ ఇలాంటి విషయాల గురించి మాట్లాడలేదు కాబట్టి నీకంత ఆశ్చర్యంగా అనిపించింది గానీ ఇంత బయాలజీ చదువులు చదువుకుని ఉండి ఈ మాత్రం చిన్న చిన్న విషయాలు వివరించగలగడం అంత పెద్ద గొప్ప విషయమేం కాదులే నిషీ.. అయినా సరే, నేను చెప్పిన రెండు ముక్కలూ మీ అందరికీ అర్థమైనందుకు.. అంటే, మీకు అర్థమయ్యేలా నేను చెప్పగలిగినందుకు నాక్కూడా సంతోషంగా ఉంది. ఇంకా, ఇలాంటి పోస్ట్ రాయడం అంటే, మంచు గారిలాగా ఒక విషయం మీద ఇంత రీసెర్చ్ చేసి రాసేంత సీన్ నాకు లేదు గానీ, నేను చదువుకున్న నా సబ్జెక్ట్ కి సంబంధించి నాకు తెలిసున్న విషయాల గురించి అయితే ఏమన్నా రాయొచ్చు. ఆ ప్రయత్నమైతే చేస్తానని నీకు మాటిచ్చేస్తున్నా.. థాంక్యూ డియర్! :)

శివరంజని said...

ముగింపు చాలా చాలా బాగుంది ....
.అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది కాని ఇంకో నాలుగు పార్ట్లు ఉన్నా పర్వాలేదు అనిపిస్తుంది .......

ఈపోస్ట్ రాయడానికి మీకు ఎంత టైం పట్టిందో తెలియదు కాని చాలా శ్రమ కోర్చి శ్రద్దగా మీరు రాయబట్టి నాకు చాలా విషయాలు తెలిసాయి ..... ఫస్ట్ పార్ట్ చదువుతున్నప్పుడు మాకు ఇన్ని విషయాలు చెప్పబోతున్నారు అనుకోలేదు కాని అన్ని విషయాలు ఎంత క్షుణ్ణంగా వివరించారంటే excellent and mesmerizing ఇలాంటి పోస్ట్ లు ఇంకా ఇంకా కావాలి రోజు చదవాలి అన్నంతగా...........

. అఫ్కోర్స్ మీ ఖాళీ సమయంలో వీలు చూసుకుని రాస్తారని ఆశిస్తున్నా వెయిటింగ్ ఫర్ నేక్ట్ పోస్ట్

శివరంజని said...

నాకు ఇంకో డౌట్ ......... మెడిషన్స్ పాయింట్ .............. నా డౌట్ ఏమిటంటే మిగతా అందరితో పోల్చుకుంటే వేగాన్స్ అసలైన శాఖాహారులయినా కాని మరి మెడిషన్స్ విషయం లో వేగాన్స్ పరిస్థితి ఏమిటి ??? అంటే కొన్ని మందులకి ఏనిమల్స్ నే సోర్సెస్ అంటారు కదా అది ఎంత వరకు నిజం అప్పుడు వేగాన్స్ పరిస్థితి ఏమిటి .... ఎందుకో డౌట్ వచ్చి అడగాలి అనిపించింది ......ఇది లాజిక్ కాదండి కేవలం డౌట్ మాత్రమె.... (no offense plzzz)

Rao S Lakkaraju said...

మన శరీరంలో మాంసకృత్తులు తయారు కావటానికి 20 ఎమినో యాసిడ్స్ కావాలి. అందులో 11 మన శరీరం తయారు చేసుకో గలదు. మిగతా 9 ఆహారం నుండి రావాలి. వీటిని “essential amino acids.” అంటారు.
ఇవి మనము తినే శాఖాహారాల్లో క్రింద వాటిల్లో వున్నాయి.
Corn, Sun dried Tomatoes, Peas, Navy Beans, Lima Beans, Kidney Beans, Spinach, Brocolli, Potato (with skin). వగైరా. ఈ క్రింది లింక్ చదవండి.

High Protein vegetarian foods:
http://www.nomeatathlete.com/vegetarian-protein/

Anonymous said...

ఏ రకంగానైనా హింస అనివార్యం అంటారు. అమెరికాలో ఉంటే జైనులు ఏం చేయాల్సి వచ్చేదో. :)

Bhardwaj Velamakanni said...

Rao garu,

The question here is about the quantity of protein that we need and the amount of food that we need to eat to get that ...


The author himself says that

Important: This chart lists the vegetable/nut/legume sources (plus fish sources, for you pescetarians) with the highest amounts of the amino acids per a 200 calorie serving. However, this may NOT be the most practical source! For instance, 200 calories of watercress provide an abundance of essential amino acid daily requirements, but having only 4 calories per cup, 200 calories would equate to 50 cups! Or egg whites are a terrific source of essential amino acids, but 200 calories of egg whites mean you would need to eat 11 eggs! Not my way of starting the day. With that in mind, I’ve compiled a list of great, enjoyable food sources to meet the daily requirements, at the end of this page.

Rao S Lakkaraju said...

Bharadwaj garu,

At the end of the report the author gave his best list for daily serving. I do not know how it compares with the volume of meat consumption for daily serving.
Best Protein Sources for Vegetarians

I’ve compiled a list of some of the best protein sources within different food groups, comparing what could be considered a normal serving:

శివరంజని said...

మాష్టారు నాకు ఇంకో డౌట్ వచ్చేసింది .........ఎంత ప్రయత్నించినా నాకు అస్సలు డైజెస్ట్ కావడం లేదు .. అందుకే అడిగేస్తున్నా ఏమి అనుకోకండి .....

మీరు చదువుకునేటప్పుడు మీ కోసం ఎగ్జాం హాల్ కి అడిషనల్ పేపర్స్ లారీలలో వచ్చేవా అండి ???? అంటే మీరు లారీలు లారీలు ఆడిషనల్స్ తీసుకునేవారేమో అని ...... ఎందుకంటే మీరు ఏ విషయపైనా ఇంత బాగా అనలైజ్ చేసి చెబుతుంటే అడగాలి అనిపించింది .... ఈ పోస్ట్ ని ఎంత ప్రశంసించినా తక్కువే నా దృష్టిలో ఎందుకంటే ఇవన్నీ నాకు తెలియని విషయాలే ...

బుల్లబ్బాయ్ said...

ఇది సదివారా?

SundayET study has revealed that a majority of the billionaire Indians belong to the die-hard vegetarian club. And the buck just doesn't stop there. A quick dip stick survey of some of the top 30 Sensex company heads further reveals that most of the names in this list too swear by an all-vegetarian diet. And the personal networth of these vegetarians too boasts of impressive figures.

http://articles.economictimes.indiatimes.com/2008-09-28/news/27728100_1_networth-diet-anil-agarwal