*** శ్రీ రామ ***
ఈ
సీరిస్ మొదటి భాగంలో పాల ఉత్పత్తి కోసం పెంచే జంతువుల మీద జరిగే హింస
గురించి కొంచెం తెలుసుకున్నాం కదా. ఇంచుమించు లేక ఇంకా ఖచ్చితంగా
చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ హింస, క్రూరత్వం మాంసఉత్పత్తి కోసం జంతువుల్ని
పెంచే పద్ధతుల్లో కూడా
అనేకం ఉన్నాయి. అధిక ఉత్పత్తి కోసం అయితేనేమీ, ఎక్కువ రుచి కోసం అయితేనేమీ
జంతువులను పెంచే క్రమంలో ఎన్నో అనైతికమైన, దారుణమైన విధానాలు అవలంబించడం చాలా చోట్ల జరుగుతున్నది. దురదృష్టవశాత్తూ ఈ పద్ధతులలో చాలామటుకు చట్టపరంగా
అమోదయోగ్యమయినవే. ఇప్పుడు ఇలాంటి ఉదాహరణలు కొన్ని చూద్దాం.
వీల్ (Veal) అని పాశ్చాత్యదేశాల్లో ముఖ్యంగా ఇటలీలో
అమితంగా ఇష్టపడే ఖరీదయిన మాంసాహారం ఒకటి ఉంటుంది. వీల్ అంటే ఆవుమాంసం.
అయితే మామూలు బీఫ్ లా కాకుండా కేవలం కొన్ని నెలల వయసున్న చిన్న చిన్న
లేగదూడలను చంపుతారు. అలా చంపే లేగదూడలు పాల ఉత్పత్తికి పనికిరావు అని తీసేసిన
మగవి. ఇలా చేయడం చాలా దేశాల్లో చట్టబద్ధం. ప్రాణం తియ్యడం అన్నాక వయసు ఎంత అయితే ఏంటి అన్నది ఒకవైపు వాదన. వాటి జనాభా లెక్కల ప్రకారం చూస్తే నిజమేనేమో కానీ చిన్న చిన్న ఆవు దూడలను చంపడం ఎందుకో మరింత అనాగరికంగా అనిపిస్తుంది. నేను మొదటి పోస్ట్ లో ప్రస్తావించినట్టు వీటి ప్రేవులనుండే చీజ్ తయారి లో ఉపయోగించే రేన్నేట్ ఎంజైమ్ సేకరిస్తారు.
ఫొ గ్రా (Foie Gras) అన్నది బాతు లివర్ తో చేసే ఒక రకమైన ఫ్రెంచ్ వంట. అయితే ఆ లివర్ ఎంత ఎక్కువ కొవ్వుపట్టి ఉంటే అంత రుచి (అంత ఖరీదు కూడా). అందువల్ల వాటి లివర్ కి బాగా కొవ్వు పట్టడానికి ఆ బాతులకి బాగా తిండి తినిపిస్తారు. బాతులు మాత్రం వాటి పొట్ట నిండాక ఇంక తినవు కదా.. అందుకని వాటిని పట్టుకుని బలవంతంగా నోరు తెరిచి ఒక పైపు దాని పొట్టలోకి పెట్టి మెషిన్ తో ఆ ఆహారాన్ని సరాసరి కడుపులోకి పంప్ చేస్తారు. ఈ పద్ధతి ఫ్రాన్స్ లో వందల సంవత్సరాల నుండి ఉన్నదే. అమెరికాలో ఫొ గ్రా (Foie Gras) తినడం, అమ్మడం బ్యాన్ చెయ్యమని అప్పుడప్పుడూ కొంతమంది జంతు ప్రేమికులు ధర్నాలు చెయ్యడం కనిపిస్తూ ఉంటుంది.

అలాగే చికెన్‌లో thigh meat తో పోల్చి చూస్తే breast meat కి అమెరికాలో
డిమాండ్ ఎక్కువ. అందుకోసం ఇక్కడి వాళ్ళు ఏం చేస్తారంటే వాటి జీన్స్‌ని
మార్పు చేసి, కోడిలో బ్రెస్ట్ పార్ట్ మాములుకన్నా ఎక్కువ పెరిగేలా
చేస్తారు. అయితే పైన ఉన్న బ్రెస్ట్ పార్ట్ బరువుకీ, కింద కాళ్ళకి ఉన్న
స్టామినాకీ మ్యాచ్ అవక.. అంటే ఆ అధిక బరువుని చిన్న కాళ్ళు మొయ్యలేక అవి
లేచి రెండు మూడు అడుగులు కూడా వెయ్యలేవు. ఎప్పుడు కూర్చునే ఉంటాయి.
కోళ్లలో గుడ్ల ఉత్పత్తి పెంచడానికి "forced molting " అనే పద్ధతి ఒకటి ఉంటుంది. అదేంటంటే కోళ్ళు ఒకసారి గుడ్లు పెట్టే దశ దాటాక, వాటికి తిండి పెట్టకుండా ఒక రెండు వారాలు వాటి కడుపు పూర్తిగా మాడుస్తారు. అవి ఆకలితో ఒక రెండు వారాలు అలమటించాక తరువాత వాటికి మళ్ళీ ఫుల్ గా తిండి పెడతారు. ఇలా చెయ్యడం వల్ల అవి మళ్ళీ మరోసారి గుడ్లు పెట్టడమే కాకుండా గుడ్ల నాణ్యత కూడా పెరుగుతుందట.
ఇక ఇండియాలో పంది చంపడానికి మెడ లావుగా ఉండటం వల్ల కొయ్యడం కష్టమని దాన్ని చంపడానికి బ్రతికున్న పందిని డైరెక్ట్ గా మంటల్లో వేస్తే... అమెరికా లో lobster ని బ్రతికి ఉన్నదాన్ని డైరెక్ట్ గా మరుగుతున్న నీళ్ళలో వేస్తారు. థాయిలాండ్ లో పబ్లిక్ గా బలుట్ (సగం ఎగ్ సగం ఎంబ్రియో) తింటే బెంగళూరులో ఇంతకన్నా ఘోరమయినది కాస్త సీక్రెట్ గా తింటారు. ఇలా చెప్పుకుంటూ పొతే పబ్లిక్ గా కొన్ని , సీక్రెట్ గా కొన్ని ఇలాంటివి ఎన్నెన్నో.
ఇలా అధిక ఉత్పత్తి కోసం, రుచి కోసం అంటే సింపుల్ గా జంతువులని పెంచే యజమానుల లాభం కోసం అనేక క్రూరమయిన పద్ధతులు చాలా సాధారణంగా చలామణీ అయిపోతూ ఉంటాయి. అయితే వీటిల్లో కొన్ని ఎప్పటినుండో మన కల్చర్ లో ఇమిడిపోయి ఉన్నవి అయితే కొన్ని కార్పోరేట్ కంపెనీలు కొత్తగా కనిపెట్టినవి. అమెరికాలోని 80 % మీట్ ఇండస్ట్రి టైసన్ లాంటి మూడు నాలుగు కంపెనీల చేతుల్లో ఉందంటే మనం ఊహించవచ్చు ఆ మూడు కార్పొరేట్లు ఎంత పలుకుబడి కలిగి ఉంటాయో... వీళ్ళు అమెరికాలోని కొన్ని university లకు ఫండింగ్ ఇచ్చి.. అక్కడ జరిగే రిసెర్చ్ లో తమకు అనుగుణం గా రిజల్స్ వచ్చేలా ప్రభావితం చేస్తారని కొందరు చెవులు కోరుక్కుంటారు.
వాటిని పెంచే విధానాల్లో అనుసరించే అనైతిక పద్ధతులు పక్కన పెడితే మన భారతదేశం లాంటి అధిక జనసాంద్రత కలిగిన దేశాలు గమనించాల్సిన అంశం ఇంకోటి ఉంది.

ఎకోలజికల్ పిరమిడ్
అసలు ఏ
ప్రాణి అయినా తిండి తినడానికి కారణం... తను జీవించడానికి కావాల్సిన శక్తి
కోసం. అసలు ప్రపంచంలో జరిగే ప్రతి పనికి ఎంతో కొంత శక్తి అవసరం అవుతూ ఉంటుంది.
శక్తి ఖర్చు పెట్టకుండా ఏ పని జరగదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని
గమనిస్తే, ప్రకృతిలోని శక్తి ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి
ఎలా చేరవేయబడుతోందో చూడొచ్చు.
ఉదాహరణకి పక్కనున్న పిరమిడ్ బొమ్మని చూడండి.
దాంట్లో
కింద వరుసలో గడ్డి ఉంది. గడ్డి పెరగడానికి కావాల్సిన శక్తి ఎక్కడ నుండి
వస్తుంది? సూర్యుడు నుండి. సూర్యరశ్మి ద్వారా లభించే శక్తిని
గ్రహించి ఆహారం తయారు చేసుకోవడం ద్వారా గడ్డి పెరుగుతుంది. ఇప్పుడు రెండో
వరుసలో ఉన్న గొల్లభామలను చూస్తే అవి బ్రతకడానికి కావాల్సిన శక్తి అవి ఆ
గడ్డిని తినడం ద్వారా
పొందుతాయి. అలా మూడో మెట్టులో ఉన్న కప్పలు ఆ గొల్లభామలను తినడం ద్వారా
శక్తిని పొందితే, నాలుగో మెట్టులో ఉన్న గ్రద్ద కప్పలను తినడం ద్వారా
పొందుతాయి. ఆ తరువాత ఆ గ్రద్ద చనిపోయినప్పుడు భూమిలో కలిస్తే అక్కడుండే బ్యాక్టీరియా ఆ గ్రద్ద కళేబరం తిని బ్రతుకుతాయి అనుకోండి. ఇది ప్రకృతిలో సహజంగా అమలు జరుగుతుండే ఫుడ్ చైన్. ప్రకృతిలోని
ప్రతీ జంతువూ ఖచ్చితం గా ఈ ఫుడ్ చైన్ లో ఏదో ఒక స్థాయిలో
భాగమై ఉంటుంది. అయితే ఇలా ఒక ప్రాణి నుండి ఒక ప్రాణి కి శక్తి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కింద మెట్టులొ మొక్కల దగ్గర ఉత్పన్నమయిన శక్తి మొత్తం పై మెట్టు లొ ఉన్న గ్రద్దవరకూ చేరదు. ఈ ఫుడ్ చైన్ లొ ఉన్న ప్రాణులన్ని కొంత శక్తి ఖర్చుపెడతాయి కాబట్టి కొంత శక్తి మద్య లొ నస్టం పొయి కొంతే పైకి చేరుతుంది. ఒక లేయర్ నుండి ఆ పై లేయర్ చేరేటపుడల్లా కొంచెం శక్తి నస్టపొతున్నాం అనుకుంటే శక్తిని తయారు చేస్తే మొక్కలు లేక జంతువు ఉన్న లేయర్ నుండి దానికి ఉపయోగించుకునే లేయర్ ఉన్న జంతువు వరకూ మద్యలొ ఎన్ని జంతువులు (లేయర్స్) ఉంటే అంత శక్తి నస్టపొతాం అన్నమాట.
ఇప్పుడు కొన్ని సింపుల్ లెక్కల సహాయంతో మనుష్యుల ఉదాహరణ చూద్దాం.
మొదటి
వరుసలో మొక్కజొన్న, రెండో వరుసలో కోళ్ళు, మూడో వరుసలో మనుషులు ఉన్నారు
అనుకుందాం. ఇప్పుడు లెక్కల ప్రకారం చూస్తే.. ఒక ఎకరం పొలంలో పండించిన
మొక్కజొన్న డైరెక్ట్ గా మనుషులు తింటే అది ఒక 1000 మందికి సరిపోతుంది
అనుకుంటే, అదే ఎకరం మొక్కజొన్న పంట ముందు రెండో వరుసలో ఉన్న కోళ్ళకు
తినిపించి ఆ కోళ్ళను మనుషులు తింటే అది కేవలం 500 మందికి మాత్రమే
సరిపోతుంది. ఎందుకంటే మొక్కలు ఉన్న లేయర్ కి మనిషి ఉన్న లేయర్ కి మద్య లో కోడి ఉన్న లేయేర్ ఉంది కాబట్టి కొంత శక్తి అక్కడ నష్టపోతున్నాం. అంటే
ఆహార ధాన్యాలు పండించే వనరులు పరిమితంగా ఉన్న మనలాంటి దేశంలో ఈ పాయింట్ చాలా
ముఖ్యమయినది. ఉన్న పంటపొలంలో జంతువులు తినే పశుగ్రాసం పెంచి అవి తిని
పెరిగిన జంతువులను మనం తినడం కన్నా ఉన్న ఆ పంటపొలంలో నేరుగా మనం తినే వాటినే పండించడం వల్ల మనకి ఆహార ధాన్యాల కొరత రాకుండా నివారించవచ్చు.
అసలే మన దేశం లో జనాభా పెరిగినంత వేగం గా ఆహారధాన్యాల ఉత్పత్తి రేటు పెరగడం లేదు. ఈ కారణం వల్లనే అధిక జనాభా ఉన్న ఇండియా, చైనా లాంటి దేశాల ప్రజలు ఎక్కువ మాంసాహారం
వైపు మళ్ళితే దాని ప్రభావం మిగతా ప్రపంచం మీద తప్పనిసరిగా ఉంటుంది.

మాంసాహార ఉత్పత్తి పరిశ్రమలు అవలంబిస్తున్న ఈ బ్యాడ్ ప్రాక్టీసస్ కి ఈ నాన్‌వెజిటేరియన్లు ఎంతవరకూ బాధ్యులు ? మాంసాహారం తినేవాళ్ళు
ప్రత్యక్షంగా చేసే ఘోరాలు ఏం లేకపోయినా, ఆయా ఉత్పత్తులు తినడం ద్వారా పరోక్షంగా ఈ
అనైతిక పద్ధతులను అవలంబించేవారిని ప్రోత్సహించినట్టే అవుతుందా ? ఎక్కువమంది మాంసాహారం వైపు మొగ్గుచూపడం వల్ల పైన ఎకొలాజికల్ పిరమిడ్ పేరాలో చెప్పినట్టు లిమిటెడ్ వనరులున్న మన లాంటి దేశంలో ఆహారకొరతకి పరోక్షంగా కారణం అవుతున్నారా?
- మంచు