Pages

Tuesday, September 11, 2012

అంతరిక్షంలో నువ్వూ నేనూ (Part 2/4): ఎందుకీ పరిశోధనలు?

*** శ్రీ రామ***


ఇంతింత డబ్బులు ఖర్చు పెట్టి ఈ అంతరిక్ష పరిశోధనల వల్ల మనం సాధించేది ఏమిటి? వేరే గ్రహాల మీద ఏమి ఉంటే మనకేంటి, లేకపోతే మనకేంటి.. అదే డబ్బుతో బోలెడన్ని మంచి అభివృద్ధి పనులు ఇక్కడే చెయ్యవచ్చు కదా.. ఆ రీసెర్చ్ ఏదో భూమి మీద చేస్తే దాని ఫలితాలు ప్రజలకు వెంటనే అందుతాయి కదా.. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది.


హ్మం... ప్రపంచవ్యాప్తంగా చాలామంది అడిగే ప్రశ్న ఇది.. నేను అనుకోవడం సహజంగా మనిషికున్న తెలివితేటలూ, ఆలోచనా పరిజ్ఞానం, మేధస్సు అతనిలో ఎప్పటికప్పుడు తన చుట్టూ ఉన్న ప్రకృతిని, విశ్వాన్ని శోధించాలనే ఆసక్తిని రగిలిస్తూ ఉంటుంది. ఆ లక్షణమే మనిషిని మిగతా జీవులన్నీటి కంటే ఉన్నతంగా నిలబెట్టింది. దాని వల్లే మానవ నాగరికత, సాంకేతికత మొదలైనవన్నీ మరింతగా అభివృద్ధి చెందుతూ మానవ మనుగడ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఆ సముద్రానికి ఆవల ఏముందో తెలుసుకోవడానికి కొలంబస్ లాంటి వాళ్ళు ప్రయత్నించినట్టే ఇప్పుడు ఇంకొంచెం పరిధి పెరిగి భూమికి ఆవల ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు మనిషి.


అది నిజమే కానీ.. నేననేదేంటంటే భూమి మీద ఏ మూల ఏముందో తెల్సుకుంటే మనకి ఏదో ఒక రకంగా ఉపయోగం ఉండొచ్చు. ఆఖరికి సముద్రగర్భంలో అయినా సరే ఫలానా చోట చమురు నిల్వలు ఉన్నాయంటే వెలికి తీసి ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏ మార్స్ మీదో, చంద్రుడి మీదో లేక ఇంకేదో గ్రహం మీదో నీరో, బోల్డంత ఇంధననిల్వలో లేక అంతులేని ఖనిజసంపదో  ఉన్నాయని కనిపెట్టాం అనుకుందాం.. దాని వల్ల మనకేంటి ఉపయోగం?


అక్కడ ఏదయినా విలువైన ఖనిజసంపదో, ఇంధనంగా ఉపయోగించదగిన రసాయన మూలకాలో ఉన్నాయని తెలుసుకుంటే, తరువాతి దశలో అవతార్ సినిమాలో చూపించినట్టు మనం వెళ్ళి అవన్నీ తెచ్చుకోవడమే... 


అంత దూరం నుండి మనం తెచ్చుకోవడం వీలవుతుందా.. అసలు అది సాధ్యమయ్యే పనేనంటావా?


టైటాన్ మీద మీథేన్ సరస్సుల ఊహచిత్రం 
ఒక శతాబ్దం క్రితం ఇలా 5 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని ఎనిమిది నెలల్లో ప్రయాణించగలమని ఎవరైనా ఊహించారా? మనిషి నిరంతర కృషి, పట్టుదలతోనే కదా ఈ రోజు అది సాధ్యమయింది. అలా ఈ గత యాభై సంవత్సరాలలో టెక్నాలజీ అభివృద్ధి చెందిన క్రమాన్ని బట్టి చూస్తే అది అసాధ్యమేం కాకపోవచ్చు కదా.. అసలు అక్కడ దొరికే ప్రకృతి వనరులను భూమి మీదకు తెచ్చుకోవడమే కాదు, ఇక్కడ మనం రోజూ ఉత్పత్తి చేస్తున్న హానికరమైన చెత్తని ఇక్కడే పడేసి భూమిని విషతుల్యం చేసేకన్నా అక్కడకి తీసుకెళ్ళి పారేయొచ్చు కూడా..

హ్మ్.. అయితే ఇంకేం మరి.. మనకి దగ్గరలో ఉన్న చంద్రుడి మీద ఉన్న హీలియం-3 దగ్గర నుండి అక్కడెక్కడో శని గ్రహానికి ఉపగ్రహం అయిన టైటాన్ మీద కురిసే మీథేన్ వర్షాల వరకు అన్నీ మనం తెచ్చేసుకుంటే మనకి ఇక ఇంధనకొరత అన్నదే ఉండదేమో.. చంద్రుడి మీద ఉన్న హీలియం-3 కాలుష్యం విడుదల చెయ్యని క్లీన్ ఎనర్జీ ఇంధనమట కూడా. అయినా అలా దోచుకొచ్చేవన్నీ ఒక్క అమెరికాకేనా.. మిగతా వారికి ఏం లేవా పాపం.. :-)



ఎవరు ముందు వెళ్ళి తెచ్చుకుంటే వారిదే .. ఎందుకంటే మరి ఇప్పుడు ఇంత  డబ్బు ఖర్చు పెట్టేది, రిస్క్ తీసుకునేది వారే కాబట్టి.. ఉదాహరణకి మన దృవప్రాంతాలే తీసుకో. నార్త్‌పోల్‌లొ ఇంధన మరియు కొన్ని అరుదైన ఖనిజవనరులు  దొరుకుతాయి అని తెలీగానే ఆ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం అమెరికా, రష్యా, కెనడా, నార్వే వగైరా దేశాలు ఎంత ప్రయత్నిస్తున్నాయో చూస్తున్నాం కదా. అయినా ఈ స్పేస్‌రేస్‌లొ ఇండియా, చైనా, రష్యాలు కూడా ఏమీ తీసిపోలేదు. మన ఇండియా సంగతే చూడూ... ఇప్పటికిప్పుడు మార్స్ మీదకి రాకెట్ పంపుతాం అని ఎందుకు ప్రకటించింది అనుకుంటున్నావ్.. అధిక జనాభా, పేదరికం లాంటి అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా చంద్రుడి మీదకి వెళ్ళడానికి ఎందుకు అంత ఖర్చుపెడుతున్నారు అనుకున్నావ్.. ఇవన్నీ కూడా ఇంకో ముప్పై నలభై సంవత్సరాల తరువాత, అంటే ఇప్పుడున్న ప్రకృతి వనరులన్నీ అడుగంటిపోయాక భవిష్యత్తులో ఇంధనం కోసం జరగబోయే యుధ్ధాల్లో పైచేయి సాధించడానికి అన్నమాట..

ఇంతకీ ఈ రేస్‌లొ మనవాళ్ళ పొజిషన్ ఏంటో కాస్త వివరంగా చెప్పు. 

ఈ అంతరిక్ష పరిశోధనల రేసులో మన ఇండియా మంచి పొజిషన్ లోనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మిగతా దేశాలతో పోల్చి చూస్తే మనవాళ్ళు సాధించిన విజయాలను కొంచెం స్పెషల్ గా మెచ్చుకోవాలి.

ఎందుకలా?

ఎందుకంటే.. సైన్సు, మ్యాథ్స్ విషయంలో మన వాళ్ళకి స్వతహాగా ఉన్న టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే పరిమిత బడ్జెట్, అణుబాంబు బూచి చూపి కొన్ని సాంకేతిక పరికరాల మీద అమెరికా వాళ్ళు విధించే ఆంక్షలు, అంతర్గతంగా కొన్ని రాజకీయపరమైన ఇబ్బందులు ఇలా ఇంకా ఎన్నెన్నో అడ్డంకులు, అవరోధాలు దాటుకుని మన శాస్త్రజ్ఞులు సాధించే విజయాల యొక్క పరిధి కొంచెం ఎక్కువే అని చెప్పుకోవాలి. అంతెందుకు మొన్న ఆగస్ట్ పదిహేనున మనవాళ్ళు మార్స్ మీదకు రాకెట్ పంపుతాం అని ప్రకటించగానే కొన్ని పశ్చిమ దేశాల్లో నిరసన వ్యక్తమైంది. కొంతమంది బ్రిటన్ ఎంపిలు అయితే మార్స్ మీదకి రాకెట్ పంపే స్థోమత ఉన్న భారతదేశానికి పేదరిక నిర్మూలన ఫండ్ పేరుతో బ్రిటన్ ఇచ్చే ధనసహాయాన్ని నిలిపివేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.


పరిమిత బడ్జెట్ అంటే ఎంత ఉంటుందేంటి? అమెరికా లాంటి దేశాలతో పోల్చి చూస్తే చాలా తక్కువే ఉంటుందేమో కదా.. 

నువ్వు ఊహించినట్టుగానే ఈ స్పేస్ రీసెర్చ్‌కి ఎక్కువ ఖర్చు పెట్టేది అమెరికానే. ఆ దేశం ఇంచుమించు సంవత్సరానికి 90 వేల కోట్లు ఖర్చు పెడుతుంది. ఇక స్పేస్ రీసెర్చ్‌కి ఇండియా, చైనా వార్షిక బడ్జెట్ దాదాపు ఆరువేల కోట్లు ఉంటుంది. కొన్ని యూరోప్ దేశాలు మన కన్నా ఎక్కువ ఖర్చు పెట్టినా సరే భవిష్యత్తులో అమెరికాకి సరైన పోటీ ఇండియా, చైనా, రష్యాల నుండే..

ఏంటీ.. నమ్మలేకుండా ఉన్నా... మన దేశం ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం స్పేస్ రీసెర్చ్ మీద ఖర్చు పెడుతుందా? చాలా ఎక్కువ కదా..


కమాన్.. మన దేశంలో జనాలు మందు మీద ఖర్చు పెట్టే మొత్తం సంవత్సరానికి సుమారు 35 వేల కోట్లు. కేవలం ఈ మద్యం మీద ఒక 20 శాతం పన్ను వేసినా చాలు ఈ ఆరు వేలు కోట్లు రాబట్టడానికి. అందులోనూ ఈమధ్య ఇస్రో వేరే దేశాల శాటిలైట్లని మన రాకెట్ల సహాయంతో కక్ష్యలో ప్రవేశపెట్టడం ద్వారా బాగానే సంపాదిస్తున్నారులే..

హహహా.. అంతేనంటావా.. :-) అయినా మన దేశం డబ్బు పరంగా పేద దేశం అయ్యిండొచ్చేమో కానీ మేధస్సుపరంగా కాదు అని నా నమ్మకం. అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి మర్చిపోయాం.నాకయితే అసలు అదొక్కటే చాలు అనిపిస్తుంది. అదేంటంటే.. ఈ రోదసి యాత్రలు, అంతరిక్షపరిశోధనలు, స్పేస్ స్టేషన్లు వీటన్నిటితో మనం అంతరిక్షంలో సాధించే విజయాల సంగతెలా ఉన్నా ఆ పరిశోధనలలో భాగంగా కనిపెట్టే వివిధ రకాల టెక్నాలజీలు బయట వేరే వాటిల్లో ఎంత ఉపయోగపడుతున్నాయో కదా..

నిజమే.. చాలా ముఖ్యమైన కోణం ఇది.. అసలు పర్యావరణం మీద జరిగే పరిశోధనలు, వాతావరణం మీద అధ్యయనం చేసి భవిష్యత్తులో రాబోయే విపత్తుల గురించి మనకి అందించే ముందస్తు హెచ్చరికలు, శాటిలైట్ టీవీలు, GPS లు, సెల్ ఫోన్లు, తేలికైన మరియు ధృఢమైన కార్బన్ ఫైబర్ లాంటి లోహమిశ్రమాలు, రకరకాల ప్లాస్టిక్‌లు, ఎక్కువ కాలం నిలువ ఉండే ఆహార పదార్థాలు, విమానయాన పరిశ్రమలో ఉపయోగించే టెక్నాలజీలు, క్రీడాపరికరాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకి అసలు అంతే లేదు.

స్పేస్ మెడిసిన్ రీసెర్చ్‌లో కూడా ఇలాంటివి చాలానే ఉన్నాయి. క్లిష్టమయిన శస్త్రచికిత్సలలో ఉపయోగించే ఎన్నో వైవిధ్యమైన మరియు అత్యాధునిక టూల్స్ మొదట ఈ రోదసియాత్రల కోసం అభివృద్ధి పరిచినవే ఆ తరువాత అవి మనకి బయట కూడా ఉపయోగపడుతున్నాయి. ఇంకా చంద్రుడి మీద మొక్కలు పెంచే ఉద్దేశ్యంలో రూపొందించబడ్డ కృతిమమట్టి అక్కడ ఉపయోగించకపోయినా ఆ తరువాత భూమి మీద ఎరువులరంగంలొ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అసలు నాసా లెక్క ప్రకారం వాళ్ళు మిగతా ఇండస్ట్రీలతో పాలుపంచుకున్న దాదాపు రెండు వేల టెక్నాలజీలు ఇప్పుడు ఇంచుమించు ముప్పై వేల  సెకండరీ అప్లికేషన్స్‌లలో వాడుతున్నారట. అలా ఈ అంతరిక్ష పరిశోధనల వల్ల ఉత్పన్నమైన ఉపఉత్పత్తులు మనకి ఇప్పుడు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఏదేమైనా మానవ మేధస్సుతో ఇలాంటి విజయాలు సాధించినప్పుడు చాలా గర్వంగానూ, వాళ్ళు రూపొందించిన అత్యంత క్లిష్టమయిన టెక్నాలజీలను చూసినప్పుడు చాలా ఇన్స్పైరింగ్ గానూ ఉంటుంది కదా..

అవును.. నేను చెప్పాలనుకున్న ఇంకో పాయింట్ అదే.. మన ఇండియాలో ఏ కారణాల వల్ల అయితేనేమీ టెన్త్ స్టాండర్డ్ అవగానే ఇంజనీరింగ్ లేక మెడిసిన్ అంటూ ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సుల్లోనో, లేక ఇతరత్రా సైన్స్‌కి సంబంధించిన కోర్సుల్లోనో చేరడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. అదే అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో ఇలాంటి జాబ్ గ్యారంటీ కోర్సులకన్నా, వాళ్ళకి నచ్చింది, సులభంగా అనిపించిందే చదవడానికి స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి సైన్స్, మ్యాథ్స్‌కి సంబంధించిన కోర్సులు చదివేవాళ్ళు తక్కువైపోతున్నారట. ఇలాంటి పరిశోధనలు, అంతరిక్షంలో నాసా సాధించే విజయాలు అక్కడి యువతలో సాంకేతిక కోర్సుల వైపు మొగ్గు చూపడానికి ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది అని ఒక అంచనా.

అవున్లే పాపం.. భవిష్యత్తులో అమెరికా వాళ్ళు టెక్నాలజీ డెవెలప్మెంట్ విషయంలో చైనా, ఇండియా, కొరియాలతో పోటీ పడాలంటే చాలా కష్టం. ఇప్పటికే పశ్చిమ దేశాలు చాలా వెనుకపడ్డట్టు కనిపిస్తున్నారు.


:-) ఇక ఈ పరిశోధనల్లో అందరూ ఆసక్తిగా ఎదురు చూసే ఇంకో ప్రధానమైన అంశం అక్కడ నీరు లేక జీవం జాడేమైనా ఉందా అని.. దాని గురించి నీకే బాగా తెల్సు...

ఊ.. నీరు ఉందా లేదా అన్నది ముఖ్యంగా అక్కడ జీవం ఉందా లేదా అని తెలుసుకోవడానికే. అంటే నీరు ఉన్నంత మాత్రాన జీవం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పలేం కానీ... అసలు భూమి మీద మొదట జీవం ఉద్భవించింది నీటిలోనే, నీరు ఏర్పడ్డాకే జీవం ఏర్పడటానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయని జీవపరిణామ శాస్త్రజ్ఞులు చెప్తారు కదా.. కాబట్టి, ఎక్కడైనా నీరు అంటూ ఉంటే జీవం ఏర్పడి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జీవం అంటే గుర్తొచ్చింది.. ఎప్పటినుండో నన్ను వేధిస్తున్న ఒక ఇంటెరెస్టింగ్ ప్రశ్న అడగనా..

ఏంటది ?

ఇంగ్లీష్ సినిమాల్లో చూపించినట్టు ఈ ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) అనేవాళ్ళు నిజంగా ఉన్నారంటావా? ఉంటే ఎక్కడ ఉండి ఉండొచ్చు? వాళ్ళు చూడటానికి ఎలా ఉండొచ్చు? సినిమాల్లో చూపించినట్టు భయంకరంగా పిశాచాల్లా ఉంటారా? వాళ్ళ శరీరాలు దేనితో తయారై ఉండొచ్చు? మనలా రక్తమాంసాలతోనే ఉంటారా? ఉంటే గింటే వాళ్ళు ఈ ఏలియన్స్ సినిమాల్లో చూపించినట్టు అంత ఇంటెలిజెంట్సా.. మనకన్నా సాంకేతికపరంగా అడ్వాన్స్‌డా? ఒకవేళ ఏలియన్స్‌ని మనం కలిస్తే దానివల్ల మనకి లాభమా నష్టమా?




(ఇంకా ఉంది) 
మంచు & మధుర  

DISCLAIMER:
All content provided on this blog is for informational purposes only. The owner of this blog and authors of this post make no representations as to the accuracy or completeness of any information on this site or found by following any link on this site.  Photo courtesy by various websites on internet.

17 comments:

..nagarjuna.. said...

one word.. just one word for the post "BRILLIANT"... చిన్నప్పుడు రేడియోలోనో, దూరదర్శన్ లోనో చూసిన/విన్న ప్రోగ్రామ్స్ గుర్తొస్తున్నాయి.... kudos !

>>నీరు ఏర్పడ్డాకే జీవం ఏర్పడటానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయని జీవపరిణామ శాస్త్రజ్ఞులు చెప్తారు కదా.. కాబట్టి, ఎక్కడైనా నీరు అంటూ ఉంటే జీవం ఏర్పడి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి...<<

another point is భూమి పై కార్బన్ ఆధారిత జీవం ఏర్పడింది...'జీవం' గురించి శాస్త్రజ్ఞులు చేసే పరిశోధన ఎక్కువగా కార్బన్ ఆధారిత రసాయనిక చర్యలేమైనా జరుగుతున్నాయా అని. అలా కాకుండా non-carbon life forms మీద ఏమైనా పరిశోధనలు జరుగుతున్నాయా ?

eagerly awaiting for next part... bring it soon folks :)

శివరంజని said...

డిస్కవరి చానల్ లో మార్స్ గురించి డాక్యుమెంటరీ చూసాను .. అందులో వచ్చిన డౌట్స్ ఇందులో క్లారిఫై అయిపోతాయి మిగతా పార్ట్స్ చదివేసరికి ... ఎక్సలెంట్ నేరేషన్:)

Anonymous said...

Nice write up...!! Will be waiting for the next two parts...!!!
--Siva Kumar.K

Sravya V said...
This comment has been removed by the author.
Raj said...

blue fontలో మాట్లాడుతున్నది మీరు, black fontలో మాట్లాడుతున్నది మధుర గారా?? or vice versa?? :D

superb narration

rajachandra said...

super post andi.. thank you

Anonymous said...

చాలాబావుంది.. మొదట భారతదేశానికి ఐరోపావాళ్లు నౌకామార్గం కనుక్కున్నారు. కనుక్కోవాలని ఇంకా చాన్నాళ్ల ముందు నుంచి ఆరాటపడ్డారు కనుక మనదేశం దాస్యంలోకి జారిపోయింది. అదే మనమే అక్కడికి ముందు వెళ్లి మన ఉత్పత్తులు ముందు అమ్మి ఉంటే మరోలా ఉండేదేమో.
అది చరిత్ర.
ఇక భవిష్యత్తులోనైనా ఎవరో సాంకేతికంగా అభివృద్ధి చెంది స్పేస్ పైన ఆధిపత్యం వహించేదాకా ఆగడం మూర్ఖత్వం అవుతుంది. మనవాళ్లు ఇప్పటికైనా ముందడుగు వేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

సుభ/subha said...

క్యూరియాసిటీ కంటే కూడా క్యూరియాసిటీగా ఉందండీ మీ టపా. నిజంగా అద్భుతం. ముందుగా ఇంత విజ్ఞానదాయకమైన పనికి పూనుకొన్నందుకు మధుర గారూ,మంచు గారూ మీ ఇద్దరికీ ప్రత్యేక అభినందన సుమ మాలలు. ఈ భాగంలో ఎక్కడ అపాలో అక్కడ ఆపేసి ఈ రాత్రికి నిద్ర పట్టకుండా చేసేసారు..అన్యాయం మధుర గారూ.. దయచేసి తరువాతి భాగం త్వరగా పెట్టేయండేం.. మరీ ఎక్కువ ఆలస్యం చేయకుండా...

Rao S Lakkaraju said...

అందరికీ సామాన్యంగా వచ్చే ప్రశ్నలకు సమాధానాలు బాగున్నాయి.

oddula ravisekhar said...

మంచి బ్లాగు మీ మంచు పల్లకి .విజ్ఞానశాస్త్ర విషయాలు అద్భుతంగా చెబుతున్నారు.చాలా ఆసక్తికరంగా వున్నాయి.ఇంకా మంచి సమాచారం కొరకు చూస్తుంటాం.

Anonymous said...

*మన దేశంలో జనాలు మందు మీద ఖర్చు పెట్టే మొత్తం సంవత్సరానికి సుమారు 35 వేల కోట్లు. కేవలం ఈ మద్యం మీద ఒక 20 శాతం పన్ను వేసినా చాలు ఈ ఆరు వేలు కోట్లు రాబట్టడానికి.*

మద్యం తాగే వారు చేసిన పాపమేమిటి, ప్రతి ఒక్కరు వారి నెత్తిన మీద పడి డబ్బులు పన్నుల రూపం లో గుంజుతూంటారు. ఇటువంటి ప్రయోగాలతో మానవజాతికి ఎమీ ప్రయోజనం లేదు. ప్రభుత్వం దగ్గర డబ్బులు గుంజుకొవటంలో సైంటిస్ట్లు కాలక్రమేణ ఆరితేరారు. వారికి సమాజంతో సంబంధం అనేది ఇప్పుడు పెద్దగా ఎమీ లేదు. పుట్టినప్పటి నుంచి దండగ మారిన చదువులు చదువుకొని, సమాజంతో సంబందం లేకుండా వారొక ఊహాలోకంలో గొప్ప వారమనుకొని విహరిస్తూంటారు. ఈ దండగ మారిన ప్రయోగాలకు అంతగా డబ్బులు కావలనుకొంటే, మనదేశంలో జరిగిన స్కాంల్ను (2జి, కోల్ గేట్) త్వరగా పరిశీలించి, కేసులను ముగింపు దశకు తీసుకొని వచ్చేటందుకు శాస్రవేతలు ఎమైనా పరిశోధనలు చేస్తే చాలా ఉపయోగం ఉంట్టుంది. అప్పుడు ఈ కేసుల పరిష్కారానికి సహకరించిన శాస్రవేతలు అందరు ,స్కాం అమౌంట్ లో 10శాతం వారి ప్రయోగాలాకు తీసుకొంటే సరి. ఆరు వేల కోట్లేమి 30,000 కోట్లకు పైన వారికి నిదులు చేకూరుతాయి.

Sri

Anonymous said...

ఆ పని కూడా దండగమాలిన చదువులు చదివిన శాస్త్రవేత్తలే చేసి పెట్టాలా?! గొప్ప చదువులు చదివిన(సామాజిక శాస్త్రవేత్తలు, అడ్మినిస్ట్రేటర్లు, వూహాలోకాల్లో విహరించే కవులు) చేసుకోలేరా?! అంతకన్నా గొప్ప పనులు ఏమిచేసేస్తున్నట్టో!? వాళ్ళే ఇంటర్నెట్ కనిపెట్ట వుండకపోతే, మీకు ఈ కామెంట్ పెట్టే శ్రమ తప్పి వుండేదేమో. :P :))

/కేసులను ముగింపు దశకు తీసుకొని వచ్చేటందుకు శాస్రవేతలు ఎమైనా పరిశోధనలు చేస్తే చాలా ఉపయోగం ఉంట్టుంది/
పరిష్కారం వుందిగా... అదే.. ఆటం బాంబు వేస్తే సరి అన్నీ సర్దుకు పోతాయ్. గొప్ప చదువులోళ్ళు ఆర్డర్ ఇస్తే... కానిచ్చేద్దాం. ;)

Ramakrishna said...

Chala baga rastunnarandi, enno vishayalu telisai

ఇందు said...

మధు,మంచు పోస్ట్ చాలా బాగుంది. ఆ మధ్య నాసా తర్వాత లాస్ ఏంగెలీస్లో ప్లానిటోరియం సందర్సన... ఇంకా 'స్టీఫెన్ హాకింగ్స్ ' డాక్యుమెంటరీస్ చూడటం వల్లా నా స్పేస్ నాలెడ్జీ కొంచెం మెరుగు పడిందనే చెప్పొచ్చు ;)

ఈ సిరీస్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది :) ముఖ్యంగా ఈ రెండవ భాగం.

కాని మనవాళ్ళు వేరే గ్రహాల మీద పరిసోధన కేవలం మన చెత్త చెదారం అక్కడికి చేరవేయడం/ అక్కడి వనరులు ఇక్కడికి తేవడం అన్న కాన్సెప్ట్ కాదేమో..దానికి చాలా పెద్ద పెద్ద రీజన్స్ ఉన్నయేమో అనిపిస్తోంది.

నాకు తెలిసి.... మన రోదసి పరిసోధన అంతా.... ఒక్క ప్రస్న మీదే...' మనం ఎవరం? ఎక్కడినించి వచ్చాం? మనలాంటి వాళ్ళు ఉన్నారా?[భూమి లాంటి గ్రహం ఉందా?] ఉంటే... మన భూగ్రహాన్ని పూర్తిగా భ్రస్టు పట్టించాక ఇక్కడనించి వలస వెళ్ళడానికి అనువైన ప్రదేసం ఈ విశాల విశ్వంలో ఉందా? మనకి ఆస్రయం ఇచ్చేవారు.../మనం ఆక్రమించుకోవడానికి అనువైన గ్రహం ఉందా?' అన్నది ప్రధానమైన లక్ష్యం అని నా అభిప్రాయం[చాలా ఆర్టికల్స్/డాక్యుమెంటరీస్ చదివి/ చూసాక వచ్చిన అవగాహన]

ఇక జీవం విషయం. జీవం మనం అనుకున్నట్టు నీటిలోనే పుట్టాలని రూల్ లేదు కదా? అది మన భూగ్రహానికి అనువైన వాతావరణం కాబట్టి నీటిలో పుట్టి ఉండొచ్చు. తెల్సా? వాయుగోళాలైన బ్రుహస్పతి[జుపిటర్], శని [సాటర్న్] గ్రహాల్లో... ఆ వాయువుల్లోనే మనుగడ సాగించేలా వాయురూపంలో ఉండే ఏలియన్స్[జీవం] ఉండొచ్చు అని ఒక అంచనా. అలాగె.... ఇతర గ్రహాల్లో ఆ గ్రహ పరిస్థితులకి తగ్గట్టు జీవం ఉండొచ్చని శాస్తవేత్తల అభిప్రాయం.

మన భూమి మీద జీవం సంగతే తీసుకుంటే... ఏకకణ జీవుల దగ్గరనించి.... సంక్లిష్టమైన మానవుల వరకు...జీవం పరిస్థితులకి/వాతావరణానికి తగ్గట్టుగా ఎన్నో మార్పులు చెందింది. అలాగే ఏం తెలుసు... నీటిలోనే కాకుండా... ఆక్సిజన్ అవసరం లేని.... నీరు అవసరమ లేని.... అసలు మనలాంటి శరీరాలు కాకుండా ఆ గ్రహస్థితికి అనువైన శరీరాలతో ఉండే ఏలియన్స్ ఉన్నరేమో!! :)

మార్స్ మీద ప్రయోగాలు అన్నది...ఈ అనంత విశ్వంలో మన పక్కనే ఉండి ఊరుస్తున్న ఒక గ్రహం మీద చేస్తున్న పరిసోధనలు మాత్రమె! ఇదే ఇతర గ్రహాల మీద అధ్యయనానికి/వాటిని చేరుకోవడానికి వాటిమీద ఒక అవగాహన రావడానికి ఉపయోగపడే థీసిస్ :)

మార్స్ ఇదివరకు నీటితో కొండలతో/లోయలతో, సముద్రాలతో కళకళలాడేదనీ... కానీ మన భూగ్రహంలాగే ఇది ఒక స్టేజికి వచ్చేసరికి మొత్తం బీడువారిపోయి జీవనికి అనువుగా లేకుండా పోయిందని కూడా ఒక అభిప్రాయం. ఈ మార్స్ మన ఎర్త్ ఫ్యుచర్ ఏమో అని కూడా అనుమానాలున్నాయ్! అసలు ఏ పరిస్థితుల్లో మార్స్ ఇలా మారిపోయింది... ఎందుకు కొడగట్టుకుపోయింది ... ఇవే పరిస్థితులు భూమి రాకుండా నివారణ చర్యలు ఏం తీసుకోవాలి అన్నది కూడా మార్స్ మీద జరిపే పరిసోధనలకు ముఖ్య కారణం. అలా అయినా మన భూమిని కాపాడుకోవచ్చు అని ఆశ!! :)


[ఆవేశంలో తెగ రాసేసా లెంగ్త్ ఎక్కువైతే తిట్టుకోకండీ ;) ]

మంచు said...

నాగార్జున , రంజని, శివ కుమార్ గారు, శ్రావ్య గారు, రాజ్రేంద్ర, రాజా చంద్ర, పక్కింటి అబ్బాయి. శుభ గారు, లక్కరాజు గారు, రవిశేఖర్ గారు, శ్రీ గారు, శంకర్ గారు, రామక్రిష్ణ గారు, ఇందూ :
అందరికీ ధన్యవాదాలు.

నాగార్జున : అకర్భన జీవులు గురించి జరుగుతున్న పరిశొధనల గురించి మూడో పార్ట్లొ సమాధానం దొరికింది అనుకుంటున్నా.. అవును జరుగుతున్నాయి.
రాజేంద్ర : బ్లూ బ్లాక్ అనేమీ లేదు. మేము ఇద్దరం మొత్తం పొస్ట్ రాసేసి ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా మార్చాం అంతే. ఆ ఇద్దరూ ఎవరయినా అవ్వొచ్చు :-)

పక్కింటబ్బాయి: మీరు అన్నది కరెక్టే:-) కొలంబస్ అమెరికాని కనిపెట్టడం యూరోప్ కి మంచిదయ్యిందెమో కానీ అక్కడున్నా నేటివ్ ఇండియన్స్ కి మాత్రం చాలా చెడు చేసింది. వారి జాతే అంతరించిపొయే అంత :-)
శుభ గారు : థాంక్యూ

మంచు said...

శ్రీ గారు: మద్యం తాగేవారు పాపం చేసారని ఎవరన్నారండి. మద్యం, సిగెరెట్ల లాంటి వాటి మీద కాస్త ఎక్కువ పన్నులు వెయ్యడానికి అనేక కారణాలు ఉంటాయి. మీకు ఇంకేమయినా సందేహాలు ఉంటే నేను తరువాత రాసే సీరీస్/పొస్ట్ లొ మీకు సమాధానం దొరుకుతుందని ఆశిస్తాను. ఇక టాపిక్ వేరే వాటి మీదకు వెళ్ళడం ఇస్టం లేదు.

శంకర్ గారు: -)

మంచు said...

ఇందూ:

మేము రాయక ముందే చాలా మంచి పాయింట్లు నువ్వు రాయడం బట్టి చూస్తే ఈ సబ్జెక్ట్ లో నీకు చాలా నాలెడ్జ్ ఉంది తెలుస్తుంది :-) స్పేస్ సైన్స్, ఎకోలజీ సంబందిత ఏరియాలలో మాకున్న పాషన్ లాంటిదే ఉన్న ఇంకొకరిని చూస్తే చాలా సంతోషంగా ఉంది.

అంతరిక్ష పరిశొధనలు ఎందుకు అన్నదాని మీద నువ్వు రాసిన మిగతా పాయింట్లు అన్నీ మిగతా భాగాల్లొ కవర్ చేసాం అనుకుంటున్నాను. ఇక నేను రాసిన పాయింట్ "అక్కడ నుండి తెచ్చుకునే ఖనిజ సంపద" మరియు ఇక్కడ నుండి తీసుకెళ్ళి అక్కడ డంప్ చేసే విషతుల్య రసాయనాల గురించి... వివరణ ఇక్కడ ఇస్తున్నాను.
--------------

1) "మనం ఎవరం? ఎక్కడినించి వచ్చాం, భూమి మీద కాకుండా వేరే ఎక్కడయినా జీవం ఉందా, లేదా, మన భూమి పరిస్తితి మార్స్ లా అవుతుందా " ఇటువంటి ప్రశ్నలకు సమాధానం కోసం చేసే పరిశోధనలు సాధారణంగా నాసా, ఇస్రొ లాంటి ప్రభుత్వ అధ్వర్యంలొ, ప్రజల డబ్బుతొ నడిచే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు చేసేవి.
2) ఇప్పుడు ఇదే అంతరిక్ష పరిశోధనలో ప్రైవేట్ సంస్తలు దిగితే .. అంత డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఎవరన్నా రెడీ అయితే .. వారి మొదటి లక్ష్యం తక్షణం లాభాలు సంపాధించడం. ప్రస్తుతం గూగుల్ కంపెనీ బోర్డ్ మెంబర్లు, అవతార్ డైరెక్టర్ జేంస్ కామరూన్ తదితరులు ప్రైవేట్ రంగం ద్వారా రొదసి పరిశొధనలు దిగుతున్నారు. ముందు కేవలం సర్వే చెయ్యడానికి కొన్ని ఉపగ్రహాలు పంపించి.. 2022 నాటికల్లా స్పేస్ మైనింగ్ ద్వారా అంతరిక్షం నుండి భూమి మీదకి అరుదయిన ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టే ఖనిజ సంపద తీసుకురావాలని వారి లక్ష్యం. గూగుల్ లో కొడితే చాలా న్యూస్ ఉంటుంది దీని మీద.
3) ఇప్పుడు భూమి మీద ఎలక్ట్రానిక్ చెత్త సంవత్సరం సంవత్సరానికి ప్రమాదకర స్థాయిలో పెరుగుతుంది. ఉదాహరణకి మన ఆఫీసుల్లొ పనిచేసే ప్రతీ ల్యాప్టాప్ కనీసం మూడు నాలుగు సంవత్సరాలకి స్క్రాప్ చేస్తారు. డిజిటల్ టివిలు వచ్చిన వెంటనే కొట్లాను కొట్ల ఎనలాగ్ టీవిలు స్క్రాప్ కి వెళ్ళాయి. కొట్ల కొద్ది సెల్ ఫోన్లు ప్రతి సంవత్సరం చెత్తలొకి విసిరెయ్యబడుతున్నాయి. ఈ ఎలెక్ట్రానిక్ విప్లవం వల్ల పెరిగిపొయిన వస్తువులతొ అవి స్క్రాప్ చేసినప్పుడు వాటిలొ ఉన్న విషతుల్య రసాయనాలు ఎక్కడ పారేయ్యలన్నది ఇప్పుడు ప్రపంచం ముందు ఉన్న పెద్ద సమస్య. ధనిక దేశాలు ఇవన్నీ తీసుకెళ్ళి కొన్ని పేద దేశాల్లొ సీక్రెట్ గా డంప్ చేస్తున్నారని కొన్ని అందొళనలు కూడా మనం చూస్తుంటాం. ఇంకొ పది పదిహేను సంవత్సరాలలో ఎంత ఖర్చు అయినా పర్లేదు ఇవి డంప్ చేసే ప్రదేశం దొరికితే చాలు అన్నంత పరిస్తితి రాబోతుంది. అందువల్ల ఇది తీసుకెళ్ళి మానవాళికి చెడు చెయ్యని ప్రదేశం లొ పారేయడం మంచి బిజినెస్. కాలిఫొర్నియాలొ ప్రతీ లాప్టాప్ కి 8 డాలర్లు రీ సైక్లింగ్ ఫీజు గా వసూల్ చేస్తారు. అంటే చూడు ఇది ఎంత పెద్ద బిజినేస్సో. అందువల్ల ఈ స్పేస్ మైనింగ్ చేసేవారికి ఇది రెండు రకాలుగా ఉపోయోగం. ఇరువైపుల ప్రయాణానికి డబ్బులు సంపాదించొచ్చు.
ఇక్కడ ఐరనీ ఏంటంటే.. అవతార్ మనవాళ్ళు వేరే గ్రహం మీదకు వెళ్లి అక్కడనుండి బలవంతంగా అక్కడి సంపద కొల్లగొడుతున్నారు ఆన్న సెంటిమెంట్ మనకి చూపించి బిలియన్ల కొద్ది డాలర్లు సంపాదించిన జేమ్స్ కేమరాన్ ఇప్పుడు ఈ స్పేస్ మైనింగ్ కి సృష్టి కర్త. అయితే అతను ఇదే కాన్సెప్ట్ ఒక పాతిక సంవత్సరాల క్రితం ఒక సినిమాలో చూపించాడు.

4) ప్రస్తుతం ప్రపంచంలొ ఎక్కువ యుద్దాలు, ఉద్రిక్తతలు ఎక్కువ ఇంధనం, శక్తి వనరుల గురించే. ఎందుకంటే కొన్నాళ్ళకి పెట్రొల్, బొగ్గు లాంటి ప్రకృతి సిద్దమయిన ఇంధన వనరులు అడుగంటి పొతే అప్పుడు పరిస్తితి ఏంటి అన్నది పెద్ద ప్రశ్న. అందుకొసం ప్రత్యామ్నాయం గురించి అందరూ ఆలోచిస్తున్నారు. అందువల్ల ఇంటర్నల్ గా ఎన్ని సమస్యలున్నా ఇండియా కూడా మనకున్న సాంకేతిక నైపుణ్యం ఉపయోగించుకుని చంద్రుడి మీద నుండి హీలియం -3 తెచ్చుకొవాలనే చూస్తుంది.

5) ప్రభుత్వ సంస్తలయిన ఇస్రొ, నాసా లంటి సంస్థలకి కూడా ముందు ప్రయారిటి తక్షణ లాభాలు తెచ్చే స్పేస్ మైనింగ్ , తరువాతే మిగతా రీసెర్చ్ లు అన్నీ :-) ఎందుకంటే ఏమీ లాభాలు చూపించకుండా ఫండ్స్ రావడం కష్టమే వారికి. అయితే ఇందులొ తప్పేం లేదు అని నా అభిప్రాయం. ఇది మనవాళికి అవసరం.. ఇప్పుడు కాకపోయినా.. కొన్నేళ్ళకి

6) ఇవి కాక మరొక ముఖ్యమయిన కారణం ఎంటంటే.. స్పేస్ ని ఎప్పుడు వాచ్ చేస్తూ మన భూమి వైపు యే ఆస్టరాయిడ్ దూసుకొస్తుందా అని ఒక కంట కనిపెట్టడం. ఒకవేళ ఎదయినా వస్తే ఆర్మగెడ్డాన్ సినిమాలొ ఆ ఆస్టరాయిడ్ ని పేల్చడానికి బ్రూస్ విల్లీస్ ని పంపినట్టు ఎవర్నన్నా పంపుతారేమో మరి :-)

Please feel free to add your comments on this .