Pages

Thursday, March 29, 2012

తిండి గొడవలు (Part 3 of 4) - ఏంటి నాన్ వెజిటేరియన్ తో సమస్య ?

*** శ్రీ రామ ***
ఈ సీరిస్ మొదటి భాగంలో పాల ఉత్పత్తి కోసం పెంచే జంతువుల మీద జరిగే హింస గురించి కొంచెం తెలుసుకున్నాం కదా. ఇంచుమించు లేక ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ హింస, క్రూరత్వం మాంసఉత్పత్తి కోసం జంతువుల్ని పెంచే పద్ధతుల్లో కూడా అనేకం ఉన్నాయి. అధిక ఉత్పత్తి కోసం అయితేనేమీ, ఎక్కువ రుచి కోసం అయితేనేమీ జంతువులను పెంచే క్రమంలో ఎన్నో అనైతికమైన, దారుణమైన విధానాలు అవలంబించడం చాలా చోట్ల జరుగుతున్నది. దురదృష్టవశాత్తూ ఈ పద్ధతులలో చాలామటుకు చట్టపరంగా అమోదయోగ్యమయినవే. ఇప్పుడు ఇలాంటి ఉదాహరణలు కొన్ని చూద్దాం.



వీల్ (Veal) అని పాశ్చాత్యదేశాల్లో ముఖ్యంగా ఇటలీలో అమితంగా ఇష్టపడే ఖరీదయిన మాంసాహారం ఒకటి ఉంటుంది. వీల్ అంటే ఆవుమాంసం. అయితే మామూలు బీఫ్ లా కాకుండా కేవలం కొన్ని నెలల వయసున్న చిన్న చిన్న లేగదూడలను చంపుతారు. అలా చంపే లేగదూడలు పాల ఉత్పత్తికి పనికిరావు అని తీసేసిన మగవి. ఇలా చేయడం చాలా దేశాల్లో చట్టబద్ధం. ప్రాణం తియ్యడం అన్నాక వయసు ఎంత అయితే ఏంటి అన్నది ఒకవైపు వాదన. వాటి జనాభా లెక్కల ప్రకారం చూస్తే నిజమేనేమో కానీ చిన్న చిన్న ఆవు దూడలను చంపడం ఎందుకో మరింత అనాగరికంగా అనిపిస్తుంది. నేను మొదటి పోస్ట్ లో ప్రస్తావించినట్టు వీటి ప్రేవులనుండే చీజ్ తయారి లో ఉపయోగించే రేన్నేట్ ఎంజైమ్ సేకరిస్తారు.




ఫొ గ్రా (Foie Gras) అన్నది బాతు లివర్ తో చేసే ఒక రకమైన ఫ్రెంచ్ వంట. అయితే ఆ లివర్ ఎంత ఎక్కువ కొవ్వుపట్టి ఉంటే అంత రుచి (అంత ఖరీదు కూడా). అందువల్ల వాటి లివర్ కి బాగా కొవ్వు పట్టడానికి ఆ బాతులకి బాగా తిండి తినిపిస్తారు. బాతులు మాత్రం వాటి పొట్ట నిండాక ఇంక తినవు కదా.. అందుకని వాటిని పట్టుకుని బలవంతంగా నోరు తెరిచి ఒక పైపు దాని పొట్టలోకి పెట్టి మెషిన్ తో ఆ ఆహారాన్ని సరాసరి కడుపులోకి పంప్ చేస్తారు. ఈ పద్ధతి ఫ్రాన్స్ లో వందల సంవత్సరాల నుండి ఉన్నదే. అమెరికాలో ఫొ గ్రా (Foie Gras) తినడం, అమ్మడం బ్యాన్ చెయ్యమని అప్పుడప్పుడూ కొంతమంది జంతు ప్రేమికులు ధర్నాలు చెయ్యడం కనిపిస్తూ ఉంటుంది.
అలాగే చికెన్లో thigh meat తో పోల్చి చూస్తే breast meat కి అమెరికాలో డిమాండ్ ఎక్కువ. అందుకోసం ఇక్కడి వాళ్ళు ఏం చేస్తారంటే వాటి జీన్స్‌ని మార్పు చేసి, కోడిలో బ్రెస్ట్ పార్ట్ మాములుకన్నా ఎక్కువ పెరిగేలా చేస్తారు. అయితే పైన ఉన్న బ్రెస్ట్ పార్ట్ బరువుకీ, కింద కాళ్ళకి ఉన్న స్టామినాకీ మ్యాచ్ అవక.. అంటే ఆ అధిక బరువుని చిన్న కాళ్ళు మొయ్యలేక అవి లేచి రెండు మూడు అడుగులు కూడా వెయ్యలేవు. ఎప్పుడు కూర్చునే ఉంటాయి.


కోళ్లలో గుడ్ల ఉత్పత్తి పెంచడానికి "forced molting " అనే పద్ధతి ఒకటి ఉంటుంది. అదేంటంటే కోళ్ళు ఒకసారి గుడ్లు పెట్టే దశ దాటాక, వాటికి తిండి పెట్టకుండా ఒక రెండు వారాలు వాటి కడుపు పూర్తిగా మాడుస్తారు. అవి ఆకలితో ఒక రెండు వారాలు అలమటించాక తరువాత వాటికి మళ్ళీ ఫుల్ గా తిండి పెడతారు. ఇలా చెయ్యడం వల్ల అవి మళ్ళీ మరోసారి గుడ్లు పెట్టడమే కాకుండా గుడ్ల నాణ్యత కూడా పెరుగుతుందట.


ఇక ఇండియాలో పంది చంపడానికి మెడ లావుగా ఉండటం వల్ల కొయ్యడం కష్టమని దాన్ని చంపడానికి బ్రతికున్న పందిని డైరెక్ట్ గా మంటల్లో వేస్తే... అమెరికా లో lobster ని బ్రతికి ఉన్నదాన్ని డైరెక్ట్ గా మరుగుతున్న నీళ్ళలో వేస్తారు.   థాయిలాండ్ లో పబ్లిక్ గా బలుట్ (సగం ఎగ్ సగం ఎంబ్రియో) తింటే బెంగళూరులో ఇంతకన్నా ఘోరమయినది కాస్త సీక్రెట్ గా తింటారు. ఇలా చెప్పుకుంటూ పొతే పబ్లిక్ గా కొన్ని , సీక్రెట్ గా కొన్ని ఇలాంటివి ఎన్నెన్నో. 


ఇలా అధిక ఉత్పత్తి కోసం, రుచి కోసం అంటే సింపుల్ గా జంతువులని పెంచే యజమానుల లాభం కోసం అనేక క్రూరమయిన పద్ధతులు చాలా సాధారణంగా చలామణీ అయిపోతూ ఉంటాయి. అయితే వీటిల్లో కొన్ని ఎప్పటినుండో మన కల్చర్ లో ఇమిడిపోయి ఉన్నవి అయితే కొన్ని కార్పోరేట్ కంపెనీలు కొత్తగా కనిపెట్టినవి. అమెరికాలోని 80 % మీట్ ఇండస్ట్రి టైసన్ లాంటి మూడు నాలుగు కంపెనీల చేతుల్లో ఉందంటే మనం ఊహించవచ్చు ఆ మూడు కార్పొరేట్లు ఎంత పలుకుబడి కలిగి ఉంటాయో... వీళ్ళు అమెరికాలోని కొన్ని university లకు ఫండింగ్ ఇచ్చి.. అక్కడ జరిగే రిసెర్చ్ లో తమకు అనుగుణం గా రిజల్స్ వచ్చేలా ప్రభావితం చేస్తారని కొందరు చెవులు కోరుక్కుంటారు.

వాటిని పెంచే విధానాల్లో అనుసరించే అనైతిక పద్ధతులు పక్కన పెడితే మన భారతదేశం లాంటి అధిక జనసాంద్రత కలిగిన దేశాలు గమనించాల్సిన అంశం ఇంకోటి ఉంది.

ఎకోలజికల్ పిరమిడ్
అసలు ఏ ప్రాణి అయినా తిండి తినడానికి కారణం... తను జీవించడానికి కావాల్సిన శక్తి కోసం. అసలు ప్రపంచంలో జరిగే ప్రతి పనికి ఎంతో కొంత శక్తి అవసరం అవుతూ ఉంటుంది. శక్తి ఖర్చు పెట్టకుండా ఏ పని జరగదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తే, ప్రకృతిలోని శక్తి ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి ఎలా చేరవేయబడుతోందో చూడొచ్చు. 
ఉదాహరణకి పక్కనున్న పిరమిడ్ బొమ్మని చూడండి.
దాంట్లో కింద వరుసలో గడ్డి ఉంది. గడ్డి పెరగడానికి కావాల్సిన శక్తి ఎక్కడ నుండి వస్తుంది? సూర్యుడు నుండి. సూర్యరశ్మి ద్వారా లభించే శక్తిని గ్రహించి ఆహారం తయారు చేసుకోవడం ద్వారా గడ్డి పెరుగుతుంది. ఇప్పుడు రెండో వరుసలో ఉన్న గొల్లభామలను చూస్తే అవి బ్రతకడానికి కావాల్సిన శక్తి అవి ఆ గడ్డిని తినడం ద్వారా పొందుతాయి.  అలా మూడో మెట్టులో ఉన్న కప్పలు ఆ గొల్లభామలను తినడం ద్వారా శక్తిని పొందితే, నాలుగో మెట్టులో ఉన్న గ్రద్ద కప్పలను తినడం ద్వారా పొందుతాయి. ఆ తరువాత ఆ గ్రద్ద చనిపోయినప్పుడు భూమిలో కలిస్తే అక్కడుండే బ్యాక్టీరియా ఆ గ్రద్ద కళేబరం తిని బ్రతుకుతాయి అనుకోండి. ఇది ప్రకృతిలో సహజంగా అమలు జరుగుతుండే ఫుడ్ చైన్. ప్రకృతిలోని ప్రతీ జంతువూ ఖచ్చితం గా ఈ ఫుడ్ చైన్ లో ఏదో ఒక స్థాయిలో భాగమై ఉంటుంది. అయితే ఇలా ఒక ప్రాణి నుండి ఒక ప్రాణి కి శక్తి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కింద మెట్టులొ మొక్కల దగ్గర ఉత్పన్నమయిన శక్తి మొత్తం పై మెట్టు లొ ఉన్న గ్రద్దవరకూ చేరదు. ఈ ఫుడ్ చైన్ లొ ఉన్న ప్రాణులన్ని కొంత శక్తి ఖర్చుపెడతాయి  కాబట్టి కొంత శక్తి మద్య లొ నస్టం పొయి కొంతే పైకి చేరుతుంది. ఒక లేయర్ నుండి ఆ పై లేయర్ చేరేటపుడల్లా కొంచెం శక్తి నస్టపొతున్నాం అనుకుంటే శక్తిని తయారు చేస్తే మొక్కలు లేక జంతువు ఉన్న లేయర్ నుండి దానికి ఉపయోగించుకునే లేయర్ ఉన్న జంతువు వరకూ మద్యలొ ఎన్ని జంతువులు (లేయర్స్) ఉంటే అంత శక్తి నస్టపొతాం అన్నమాట. 
ఇప్పుడు కొన్ని సింపుల్ లెక్కల సహాయంతో మనుష్యుల ఉదాహరణ చూద్దాం.
మొదటి వరుసలో మొక్కజొన్న, రెండో వరుసలో కోళ్ళు, మూడో వరుసలో మనుషులు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు లెక్కల ప్రకారం చూస్తే.. ఒక ఎకరం పొలంలో పండించిన మొక్కజొన్న డైరెక్ట్ గా మనుషులు తింటే అది ఒక 1000 మందికి సరిపోతుంది అనుకుంటే, అదే ఎకరం మొక్కజొన్న పంట ముందు రెండో వరుసలో ఉన్న కోళ్ళకు తినిపించి ఆ కోళ్ళను మనుషులు తింటే అది కేవలం 500 మందికి మాత్రమే సరిపోతుంది. ఎందుకంటే మొక్కలు ఉన్న లేయర్ కి మనిషి ఉన్న లేయర్ కి మద్య లో కోడి ఉన్న లేయేర్ ఉంది కాబట్టి కొంత శక్తి అక్కడ నష్టపోతున్నాం. అంటే ఆహార ధాన్యాలు పండించే వనరులు పరిమితంగా ఉన్న మనలాంటి దేశంలో ఈ పాయింట్ చాలా ముఖ్యమయినది. ఉన్న పంటపొలంలో జంతువులు తినే పశుగ్రాసం పెంచి అవి తిని పెరిగిన జంతువులను మనం తినడం కన్నా ఉన్న ఆ పంటపొలంలో నేరుగా మనం తినే వాటినే పండించడం వల్ల మనకి ఆహార ధాన్యాల కొరత రాకుండా నివారించవచ్చు. అసలే మన దేశం లో జనాభా పెరిగినంత వేగం గా ఆహారధాన్యాల ఉత్పత్తి రేటు పెరగడం లేదు. ఈ కారణం వల్లనే అధిక జనాభా ఉన్న ఇండియా, చైనా లాంటి దేశాల ప్రజలు ఎక్కువ మాంసాహారం వైపు మళ్ళితే దాని ప్రభావం మిగతా ప్రపంచం మీద తప్పనిసరిగా ఉంటుంది. 



ఇక ఆరోగ్యపరంగా శాకాహారానికి మాంసాహారంతో పోలిస్తే అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి.  కొలెస్టరాల్ వల్ల వచ్చే గుండె సంబంధిత సమస్యలు, కాన్సర్ లాంటి జబ్బులు రాకుండా నివారించడానికి మాంసాహారం కన్నా శాకాహారం తినడం మేలైనది అని అందరికీ తెల్సినదే. వేగన్స్ లా పూర్తిస్థాయి ప్లాంట్ బేస్డ్ ఆహారం తింటే కొన్ని రకాల డెఫిషియన్సీలు ఎదురయ్యే సమస్య ఉంది కానీ మన భారతీయుల శాకాహార నిర్వచనం ప్రకారం తింటే అంటే లాక్టోవెజిటేరియనిజం వల్ల ఒక గొప్ప అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే, మాంసాహారం తినకపోవడం వల్ల శాకాహారంలో లభ్యం కానీ కొన్ని పోషకాలు అంటే ప్రోటీన్లు, B12 లాంటి విటమిన్లు పాలు, పాల ఉత్పత్తుల నుండి పొందవచ్చు. అందువల్ల భారతీయ శాకాహారులగా ఉండటంవల్ల కోల్పోయే పోషకపదార్ధాలు అంటూ పెద్దగా ఏం ఉండవు.
మాంసాహార ఉత్పత్తి పరిశ్రమలు అవలంబిస్తున్న ఈ బ్యాడ్ ప్రాక్టీసస్ కి ఈ నాన్వెజిటేరియన్లు ఎంతవరకూ బాధ్యులు ? మాంసాహారం తినేవాళ్ళు ప్రత్యక్షంగా చేసే ఘోరాలు ఏం లేకపోయినా, ఆయా ఉత్పత్తులు తినడం ద్వారా పరోక్షంగా ఈ అనైతిక పద్ధతులను అవలంబించేవారిని ప్రోత్సహించినట్టే అవుతుందా ? ఎక్కువమంది మాంసాహారం వైపు మొగ్గుచూపడం వల్ల పైన ఎకొలాజికల్ పిరమిడ్ పేరాలో చెప్పినట్టు లిమిటెడ్ వనరులున్న మన లాంటి దేశంలో ఆహారకొరతకి పరోక్షంగా కారణం అవుతున్నారా?


 - మంచు

24 comments:

శేఖర్ (Sekhar) said...

Very sad facts.
Interesting article.
Liked it.

Rao S Lakkaraju said...

This is great. Explained very well.

Sravya V said...

Wow ! Claps claps !
Really Very well compiled !
Looking forward for the next part !

ఆ.సౌమ్య said...

Nicely written. I have three points to key board down...I mean pen down :))

1. మీరు చెబుతున్న పిరమిడ్ గురించి నేను కూడా ఇంతకుముందు చదివాను. అయితే ఒక సందేహం. ఇప్పుడు శక్తి అన్నది ప్రకృతిలో వివిధ రూపాలలో ఉంటుంది. మొక్కల్లోనూ ఉంటుంది. గాలిలో ఉంటుంది, నీళ్ళలో ఉంటుంది, రాళ్ళలో, రప్పల్లో ఉంటుంది. కోళ్ళలో ఉంటుంది...మనుషుల్లో ఉంటుంది కదా. ఇప్పుడు కోడి గింజలు తింటుంది. గింజల్లో ఉన్న శక్తి కోడికి చేరుతుంది. అందులో కోడి కొంత ఖర్చు పెడుతుంది అనుకుందాం. కానీ కోడికి స్వతహాగా కొంత శక్తి ఉంటుంది కదా + గింజలు తినడం ద్వారా కోడి శక్తి పుంజుకుంటుంది కదా. అంటే ఆ గిజల శక్తి + కోడి శక్తి కలిపి కోడిని తినే మానవునికి చేరే శక్తి రెట్టింపవ్వాలి. గింజల్లో శక్తి మానవునికి చేరేసరికి కొంత మైనస్ పోయినా...కోడిలో ఉన్న శక్తి మానవునికి చేరి,పోయినదాన్ని కాంపెన్సేట్ చెయ్యాలి కదా.

గింజ-కోడి-మనిషి లో మొదటి లేయర్ దాటుకుని రెండో లేయర్ కి వచ్చేసరికి గింజలో శక్తి సగమే మానవునికి అందుతుంది అంటే కోడికి zero శక్తి ఉందన్నమాట. ఆ గింజ తిన్నాకే కోడికి శక్తి వచ్చిందన్నమాట. ఇది సమంజసంగా అనిపించడం లేదు నాకు. డైరెక్ట్ గా శాకాహారం తింటే ఎక్కువ శక్తి మనకి చేరుతుంది అన్నది లాజికల్ గా అనిపించడం లేదు.

2. జంతువులు తినే పశుగ్రాసం వేరేగా పెంచుతారా? ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగిలినవో, మనకి పనికిరానివో మాత్రమే పశుగ్రాసంగా వేస్తారని అనుకుంటున్నాను.

3. అధిక జనాభా గల మన దేసంలో అందరూ శాకాహారులైపోతే తగినంత ఉత్పత్తి చేసుకునే సామర్థాలు మనకి ఉన్నాయా? పొనీ కొంత గడువు పెట్టుకున్నా ఎన్ని దశాబ్దాల గడువు కావాలి? మనం లెక్కించి చెప్పగలమా? పోనీ పంటలు వేసి , వృక్షాలు నాటి ఆ ఫలాలు ఆరగించగలిగేటంత భూభాగం మనకి ఉందా?? భూభాగం ఉన్నా అంత పంటకు ఆమోదయోగ్తమైన వాతావరణం, వనరులు మనకి ఉన్నాయా? ఆర్థిక స్థోమత ఉందా? దీనే zoom చేసి ప్రపంచపటం కోణంలో చూసి ఇవే ప్రశ్నలువేసుకుంటే ఏం సమాధానాలు చెప్పగలం?

ఇవి ఇప్పటికి నా సందేహాలు. మీ సీరీస్ మొత్తం అయ్యాక నా కోణం - చర్చ చేస్తాను.

శ్రీనివాస్ పప్పు said...

సూపరంతే

మధురవాణి said...

@ మంచు గారూ..
గట్టిగా చప్పట్లండీ మీకు.. ఇంజనీరు గారు ఏవో కరంటు గురించీ, కార్ల గురించీ అయితే చక్కటి పాఠాలు చెప్తారనుకున్నాను గానీ బయాలజీ పాఠాలు కూడా ఇంత బ్రహ్మాండంగా చెప్తారనుకోలేదు సుమీ.. :)) ఎకో పిరమిడ్ గురించి, ఫుడ్ చైన్ గురించి అందరికీ తేలిగ్గా అర్థమయ్యేలా భలే చెప్పారు.

ఇకపోతే మీట్ కోసం జంతువుల్ని పెంచే చోట చాలా ఘోరమైన పద్ధతుల్ని అవలంబిస్తుంటారనే మాట తెలుసు గానీ మీరు చెప్పినంత వివరంగా ఉదాహరణలతో సహా తెలీదు.. వినటానికి చాలా కష్టంగా ఉన్నా ఇలాంటివన్నీ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలని నా అభిప్రాయం. నాలాంటి చాలామందిని ఎడ్యుకేట్ చేస్తాయి ఇలాంటి టపాలు. Thanks for that! :)

ఇలాంటి ముఖ్యమైన, అవసరమైన అంశాలని ఎంచుకుని ఇంత శ్రద్ధగా, ఓపిగ్గా, చదివేవారికి ఆసక్తి కలిగించేలా బ్లాగు పోస్టులు రాసే విషయంలో నేను మీ బ్లాగు చూసిన ప్రతీసారీ చాలా అబ్బురపడిపోతుంటానండీ.. నేనే కాదు.. మీ బ్లాగులో రాసేవన్నీ రెగ్యులర్ గా చదువుతూ ఉండేవారెవరైనా నా మాటతో ఏకీభవిస్తారని నా నమ్మకం. :)

మరీ ఎక్కువ మెచ్చుకుంటే మీ బ్లాగుకి దిష్టి తగులుతుందో ఏవిటోనండీ బ్లాగు లెజెండ్ గారూ.. ఇప్పటికి స్వస్తి.. అన్నట్టు, చూసారా.. ఇప్పటికైనా మీరు బ్లాగు లెజెండేనని ఒప్పుకోక తప్పేలా లేదు నాకు.. :)))

Jokes apart, it's been really an interesting write up so far, and I'm eagerly waiting to see how you are going to conclude this series! ;)

మధురవాణి said...

అన్నట్టు.. ఇప్పుడే ఇంకో విషయం గుర్తొచ్చింది.

<<ఈ కారణం వల్లనే అధిక జనాభా ఉన్న ఇండియా, చైనా లాంటి దేశాల ప్రజలు ఎక్కువ మాంసాహారం వైపు మళ్ళితే దాని ప్రభావం మిగతా ప్రపంచం మీద తప్పనిసరిగా ఉంటుంది.

మొన్న మొదటి భాగంలో 'world food situation' ని దృష్టిలో పెట్టుకుని మనం మన ఆహారపు అలవాట్లని ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నామా.. అని ఒక విషయాన్ని ప్రస్తావించాను కదా.. ఇప్పుడు పైన మీరు కోట్ చేసింది కూడా దానికి సంబంధించిందే.. ప్రపంచం మొత్తానికి ఆహారం సరిపడేలా చూడాలని మనం అనుకున్నా అది అమలులో పెట్టేప్పుడు ఇలాంటివే చాలా అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. వాటిల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు చెయ్యాల్సిన పనేంటి, అభివృద్ధి చెందిన దేశాలు చేయ్యగలిగింది ఏంటి, చెయ్యాలా అక్కరలేదా.. లాంటి రకరకాల కోణాలు ఉంటాయి. May be, నాకు కొద్ది అవగాహన ఉన్న ఇలాంటి చిన్న చిన్న విషయాలతో నేనొక పోస్టు రాసే ప్రయత్నం చేస్తాను. Now you are inspiring me to write it. :)

పద్మవల్లి said...

Wow. Very Informative. I don't even know lot of facts you have mentioned in this part. THANK YOU.

Radhika said...

Hi,
I am a veterinary doctor from India, doing PhD in Poultry Science in the US. I will try to answer some of your questions.
I agree that the issues you raised are true. But when you see the other side of coin, there are so many practical issues we need to overcome to meet the growing food needs of the world population. It is estimated that by 2050, total world population will be doubled. There would be no increase in the natural resources (land, water etc), yet we need to assure about food security. The only way left was to increase the food production. Researchers are working on this and trying to improve the productive performance of animals and plants.
So, some chicken breeds were genetically improved to produce either meat (Broilers) or eggs (layers). Let me tell you some scientific breakthroughs. Before the development of these breeds, a hen in the backyard used to lay only 70 to 80 eggs per year and those eggs can be hatched to chicks. All the hens you see in commercial farms these days lay 300 to 320 eggs per year and these eggs are unfertilized eggs. Even if you hatch these eggs, nothing will come out except the eggs would be rotten.
Initially, broilers (meat birds) were developed such a way that they can reach marketable weight in 8 weeks. But, now they can be marketed in less than 6 weeks. Every year researchers are trying to improve the feed conversion ratio (that is a measure of animal efficiency to convert feed mass into body mass). Broilers are fat birds genetically and not as active as layers.
There are established guidelines (to ensure animal welfare) by different Govt organizations (USDA, FAO, WHO etc) for livestock production. Animal producers must follow these set of rules and meet the recommendations. Animal producers cannot oversee the welfare of the animals. In every meat processing plant in the US, there will always be one representative from the USDA and he/she make sure that the meat coming out of the plant is safe for human consumption.
To answer the bleeding of animals before slaughtering, blood serves as good medium for microbial growth. So, any animal must be stunned (brain dead) and bled first. There are also guidelines for humane slaughter. http://www.fao.org/DOCREP/003/X6909E/x6909e09.htm
I worked with some of the corporate companies and they never influenced the research results. I don’t know if some companies do it. Before publishing any results we are concerned about the reproducibility of the trail and we do repeat them 3 times. But, I know that these corporate companies influence Govt policy making.
I am typing this in hurry and if you need any further information, I will be happy to provide you.
Thanks
Radhika

Ennela said...

suuper saaruu meeru, manchi article andachesaaru

kosuru said...

Response to Dr Radhika,

All said and done, it is true that only part of energy contained in food consumed by animals will be available to humans. So it is always economical and energy intensive to be at the lowest level than at the higher levels of the pyramid

మంచు said...

శేఖర్ గారు, లక్కరాజు గారు, Ellieshilton, శ్రావ్యగారు, సౌమ్య గారు, పప్పుగారు, మధురగారు, పద్మవల్లి గారు, రాధిక గారు, ఎన్నెల గారు, కొసురు గారు

అందరికి ధన్యవాదాలు.

మంచు said...

సౌమ్య గారు:
1. కొడి పుట్టినప్పుడు దానిలొ ఉండే శక్తి చాలా తక్కువ. అది మనుషులు తినే పరిమాణం కి పెరిగే సరికి దానిలొ మీరు చెప్పినట్టు బొల్డంత శక్తి ఉందనుకొందాం. మరి ఈ శక్తి ఎక్కడనుండి వచ్చింది. కేవలం అది తినే తిండి నుండే కదా... అది చిన్నప్పటినుండి తిన్న గింజల శక్తి అంతా అది తిన్న మనుష్యులకి అందాలి. అయితే అది జీవించినంత కాలం అటూ ఇటూ తిరుగుతూ, అరుస్తూ , పనులు చేస్తూ కొంత శక్తి ఖర్చుపెడుతుంది కాబట్టి అది తినే గింజల శక్తి అంతా మనకి చేరదు అన్నమాట. ఈ శక్తి ఖర్చు తగ్గించి మనం పెట్టే అహారం లొ ఎక్కువ బాగం వాటి మాంస దిగుబడి లొ రావాలని వాటిని ఎక్కువ తిరగనివ్వకుండా వాటికి ఫార్మ్ లొ ఇరుకు గదుల్లొ ఉంచేది.
అయినా ఈ ఎకొలాజికల్ పిరమిడ్, ఎనర్జి ట్రాన్స్ఫర్ అన్నది శకాహారులు ఈమద్య ప్రతిపాదించిన కొత్త సిద్దాంతం కాదు. ఎప్పటినుండొ అందరూ అంగీకరించిన సిద్దంతమే.

2. జంతువులు తినే పశుగ్రాసం ఇండియాలొ అయితే ప్రత్యేకం గా పెంచడం అన్నది కొంచెం ఆశ్చర్యమే కానీ ప్రపంచవ్యాప్తం గా అయితే అంత ఆశ్చర్యం ఎమీ లేదు. చాలా దేశాల్లొ ఫారాల్లొ పెంచే జంతువులు అన్నీ తినేవి మొక్కజొన్నే. అన్నీ అంటే.. కొళ్ళు, పందులు, ఆవులు అన్నీ .... అదే మొక్కజొన్న మనం తింటాం. ఇండియాలొ మొక్కజొన్న ప్రస్తుతానికి కొళ్ళకి పందులకి మాత్రమే పరిమితమయి ఉంది.

3. మీ మూడొ ప్రశ్న చాలా విలువయినది :-) ఈ విషయం చర్చించడానికి మరొ పొస్ట్ రాయాల్సి వస్తుందేమో... ఈ సమాధానం ఎక్స్పెర్ట్ కి పాస్ చేస్తున్నా :-)

Anonymous said...

2 points:

1)India is not facing any foodshortage nor it does have limited resources when compared to other countries

2)Agricultural growth rate in terms of volumes is more than population growth rate in India


We need to worry more about governments subsidizing bio fuel and corn and cane being used to produce this bio fuel

We should not forget the subsidies are funded from the taxes we are paying.

మంచు said...

రాధిక గారు:
థాంక్యూ . మీరు ప్రస్తావించిన పాయింట్లు కొన్ని చదివాను అందువల్ల కొంచెం అవగాహన ఉంది. మీరు ఇచ్చిన లింక్ ద్వారా ఇంకా తెలుసుకొవాల్సినది ఇంకా ఉంది.
ఇక కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వాన్ని, పాలసీ మేకర్స్ ని ఇంఫ్లుయెన్స్ చేస్తారన్నది అమెరికాలొ అల్మొస్ట్ పబ్లిక్ సీక్రెట్ అనిపిస్తుంది. అఫ్కొర్స్ నాకు తెలిసినది కొన్ని డాక్యుమెంటరీలు, మీడియా వల్లే .. అందువల్ల నిజంగా ప్రభావితం చేస్తాయా లేదా అన్నది నేను ప్రశ్నార్ధకం లొనే ఉంచేసాను.
ఈ సీరీస్ లొ ఉన్న నాలుగు పొస్ట్లు చదివి మీ విలువయిన అభిప్రాయం తెలుపుతారని ఆశిస్తున్నాను.

మంచు said...

Anonymous :
I see...

Anonymous said...

/మాంసాహారం తినకపోవడం వల్ల శాకాహారంలో లభ్యం కానీ కొన్ని పోషకాలు అంటే ప్రోటీన్లు/

మంచు గారు, మాంసాహారంఅ తినకపోవడం వల్ల ప్రోటీన్లు, పోషకాలు, మరేవేవో కోల్పోతారంటారు కదా, చాలాకాలంగా వేధిస్తున్న ఓ సందేహం. మరి శాఖాహార జంతువుల్లోకి ఈ పోషకాలు ఎలా చేరుతున్నాయంటారు? మనిషి తినే జంతువుల్లో చాలా మటుకు శాఖాహార జంతువులే కదా? పైగా కండబలం కల జంతువులు ఏనుగు, రైనో, నీటిఏనుగు(?), గుర్రం, ఎద్దు ...శాఖాహారులే కదా?

కోడికి మాత్రం మాంసాహారం ఎవరు పెట్టి పెంచుతున్నారని? అవి అప్పుడప్పుడు పురుగులు తినడమే గాని స్టాపుల్ ఫుడ్ గింజలే కదా?

మధురవాణి said...

సౌమ్యా,
మీరు అడిగిన పాయింట్స్ కి నాకు తెలిసిన సమాధానాలు రాసే ప్రయత్నం చేస్తాను. :)

1. ప్రతీ జీవి ప్రాణం పోసుకోడం దగ్గర నుంచీ, అది జీవించి ఉన్నంత కాల దానిలో జరిగే రకరకాల జీవక్రియలకి బోలెడు శక్తి అవసరం అవుతుంది. మొక్కలు 'కిరణజన్య సంయోగ క్రియ' ద్వారా సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించి పిండి పదార్థాలు తయారు చేసుకుంటాయి. ఆ పిండి పదార్థాలు 'ఆక్సిజన్' presence లో వినియోగించబడి అన్నీ జీవక్రియలకి సరిపడే శక్తి లభిస్తుంది. ఆ శక్తి (ATP) ఉత్పత్తి కాబడే చర్యనే మనం respiration అంటాము. అయితే, కేవలం మొక్కలు మాత్రమే ఇలా సూర్యరశ్మిని ఉపయోగించుకోగల నైపుణ్యాన్ని కలిగి ఉన్నాయి. మిగతా జంతువులు, మనుషులు మొక్కలపైనే ఆధారపడతాము. ఉదాహరణకి కోడి మొక్కల నుంచి వచ్చే గింజల్ని ఆహారంగా తీసుకుని, జీర్ణం చేసుకుని ఆయా పిండి పదార్థాల (కార్బో హైడ్రేట్స్) నుంచి ఆక్సిజన్ వినిమయం ద్వారా దాని జీవ ప్రక్రియలకి సంబంధించిన శక్తిని పొందుతుంది. కాబట్టి, ఇక్కడ కోడి జీవిత చక్రం పూర్తి చేసుకోడానికి చాలా శక్తి వినియోగించబడుతుంది కనుక.. ఎకో పిరమిడ్ లో పై మెట్టుకి వెళ్ళే కొద్దీ ట్రాన్స్ఫర్ అయ్యే శక్తి తగ్గిపోతుంటుంది. ఈ కారణం చేతనే, పైన రాధిక గారు చెప్పినట్టు తక్కువ టైములో, తక్కువ ఆహారం తిని ఎక్కువ మాంసం ఉత్పత్తి చేసే జంతువులని పెంచడానికీ, అలాగే తక్కువ టైములో ఎక్కువ పంట దిగుబడిని ఇచ్చే ఆహార ధాన్యాల ఉత్పత్తికి ఎంతగానో పరిశోధన జరుగుతోంది.
ఇదే కారణం చేత మంచు గారు మన ఆహారంలో శాకాహారం ఎక్కువ పాళ్ళు ఉంటూ, ఎకో పిరమిడ్ లో క్రింది మెట్టులో ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుందనే పాయింట్ చెప్పారు (నాలుగో భాగంలో చెప్పినట్టున్నారు ఈ పాయింట్).

2. పూర్వ కాలంలో ఇళ్ళల్లో వ్యవసాయంతో పాటుగా కొన్ని పెంపుడు జంతువులను పెంచుకునే రోజుల్లో మీరన్నట్టు పొలంలో పెరిగే కలుపు గడ్డిని, పంట తరువాత మిగిలే ఎండుగడ్డిని పశుగ్రాసంగా వాడేవారు. అయితే అప్పటికీ చొప్ప, పిల్లిపెసర లాంటివి కేవలం పశుగ్రాసం కోసమనే చేలల్లో కొన్ని మడుల్లోనైనా సరే పెంచేవారు. ఇప్పటికీ ఈ పద్ధతి ఉందనుకుంటాను. అయితే ఎప్పుడైతే కోళ్ళు, పందులు, ఆవులు.. మొదలైన జంతువులన్నీటినీ ఆహార వినియోగం కోసమని large scale లో animal farming మొదలు పెట్టామో, అప్పటి నుంచీ animal fodder (పశుగ్రాసం) ప్రత్యేకంగా పెద్ద పెద్ద మొత్తాల్లో పండించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో సాధ్యమైనంత తక్కువ ఖర్చులో పశుగ్రాసం సరఫరా చేసుకోవాలనే ఆలోచన కూడా మొదలయింది. మంచు గారు చెప్పినట్టు మొక్కజొన్న ఇవాళ్టి రోజున చాలా ముఖ్యమైన forage crop గా మారింది. అలాగే బార్లీ, సోయా లాంటి పంటలు కూడా కూడా జంతువుల ఆహారం నిమిత్తం పెద్ద మొత్తాలలోనే సాగు చేస్తున్నారు. మొక్కజొన్న అయితే మొత్తం పండించే దాంట్లో మనుషులు తినడానికి ఉపయోగించేది చాలా చాలా తక్కువ శాతం (almost negligible). ఎక్కువ జంతువుల కోసం ఇంకా బయో ఫ్యూయెల్ ప్రొడక్షన్ కోసమే వినియోగిస్తున్నారు.

3. మంచు గారన్నట్టు ఇది చాలా చాలా పెద్ద చర్చకి ఆస్కారం ఉన్న పాయింట్ సౌమ్యా.. పెద్ద పోస్టు రాయాలి అసలైతే.. :))
ఇప్పటికిప్పుడు మనందరం శాకాహారులైపోతే వెంటనే సమస్య తీరిపోతుందా అంటే.. లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ రకరకాల అంశాలు పరిగణలోకి వస్తాయి. ఎలాగంటే, ఉదాహరణకి వరి కన్నా మొక్కజొన్న పండించడం ఎక్కువ సులువైన పని అనుకోండి..అంటే, నీరు, పంటకి అనుకూలమైన భూమి ఇలాంటి వాటి పరంగా మొక్కజొన్న పండించడం సులువనుకుంటే.. కోళ్ళు, పందులు, ఆవుల్ని మనం జీవితాంతం రోజూ ముప్పూటలా మొక్కజొన్న మాత్రం తినిపించి పెంచగలం. కానీ, అదే పని మనుషులతో చెయ్యలేం కదా.. అలా కాకుండా, మనుషులకి కావాల్సిన పంటలు (staple crops) వరి, పొటాటో లాంటివే అందరికీ సరిపడినంత ఉత్పత్తి చెయ్యగలమా అంటే అది ప్రశ్నార్థకమే... పెరుగుతున్న జనాభాకి, ఉన్న వనరుల్ని వినియోగించుకుంటూ అందరికీ సరిపడే ఆహారాన్ని ఉత్పత్తి చెయ్యగలగడం అన్నది ఇవాళ మానవ ప్రపంచం ముందున్న అతి పెద్ద సవాల్.. అలాగే ఎలాగోలా ఉత్పత్తి చెయ్యడం కాకుండా, పర్యావరణ పరంగా కూడా అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతుల్లో ఆహారోత్పత్తి చెయ్యగలగడం అనేది ఇంకో పెద్ద సవాల్.. ఈ సమస్యని అడ్రస్ చేస్తూ రకరకాల పరిశోధనలు, ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీలైతే ఈ విషయం మీద వివరంగా నేనొక పోస్ట్ రాయడానికి ప్రయత్నిస్తాను. :)

@ మంచు గారూ,
కనీసం పాస్ మార్కులు అయినా వేస్తారాండీ నేను రాసిన సమాధానానికి.. ;)
ఇంత చక్కటి చర్చలో నాక్కూడా కొంచెం భాగస్వామ్యం కలిపించినందుకు ధన్యవాదాలు. :)

మధురవాణి said...

@ సౌమ్యా,
మీ మొదటి ప్రశ్నకి ఇంకా సులువుగా అర్థమయ్యేలా సమాధానం చెప్పాలంటే.. ఉదాహరణకి ఒక కోడిని పెంచి పెద్ద చేసే లోపు ఒక పది కేజీల తిండి గింజలు ఖర్చు పెట్టామనుకోండి.. ఆ కోడి బాగా ఎదిగాక దాని మాంసం బరువు మహా అయితే ఓ రెండు కేజీలు ఉంటుందేమో.. ఆ లెక్కన ఈ రెండు కేజీల మాంసం మనకి ఒక్క రోజుకే సరిపోతుంది. అదే మనం నేరుగా కోడిని తినే బదులు పది కేజీల ధాన్యమే తినే పని అయితే మనకి వారం రోజుల ఆహారానికి సరిపోతుంది కదా.. ఇదే లెక్క పందులు, ఆవుల పెంపకంతో పోల్చి చూస్తే ఇంకా పెద్ద తేడానే కనపడుతుంది కదా.. అదీ లాజిక్..
అందువల్ల శాకాహారం తింటే ఆహారపు డిమాండ్ ని చేరుకోగలగడం comparative గా easy అని చెప్పడం అన్నమాట.. :)

నిషిగంధ said...

ఇందులో ప్రస్తావించిన విషయాల్లో సగం పైనే నాకు తెలీదు!! ఫొ గ్రా గురించి విన్నా కానే అసలు లివర్ ఫాట్ పెంచే ప్రోసెస్ చదివాక కాసేపు ఏమీ చేయబుద్ది కాలేదు :(((

ఈ పార్ట్ కి అసలు హైలైట్, సౌమ్య ప్రశ్నలూ - మధుర సమాధానాలు :-)

Anonymous said...

*శాకాహారం తింటే ఆహారపు డిమాండ్ ని చేరుకోగలగడం comparative గా easy అని చెప్పడం అన్నమాట*

మంచు గారు చాలా బాగా రాశారు. ఈ విషయం పైన ఎన్నో పుస్తకాలు చదివాను. జంతువులను స్లాటర్ హౌస్ ల లో ఏ విధంగా చంపుతారో వీడియోలు చూసాను. వాటిని చూసి తట్టుకోవటం కొంచెం కష్ట్టమే. ఎన్ని వ్యాసాలు చదివినా, శాఖాహారులుగా మారటం కష్ట్టమనిపిస్తుంది.

ఒకప్పుడు మనేకా గాంధి రాసిన ఈ వ్యాసం చాలా పాపులర్ Why you need to be Vegetarian ? తెలుగు లో చదవాలంటే ఆంధ్రజ్యొతి పాత పేపర్లలో దొరుకుతుంది.
http://www.peopleforanimalsindia.org/articles-by-maneka-gandhi/101-why-you-need-to-be-vegetarian-.html

The Truth About Milk
http://www.peopleforanimalsindia.org/articles-by-maneka-gandhi/86--the-truth-about-milk.html

http://www.peopleforanimalsindia.org/articles-by-maneka-gandhi.html


SriRam

శివరంజని said...

భగవద్గీతలో ఉంటుంది ఒక మనిషిని బ్రతికించడం కోసం అబద్దం చెప్పిన పర్వాలేదు అని ...

అలాగే న్యాయశాస్త్రం లో కూడా కొన్ని మినహాయింపులు కనిపిస్తూ ఉంటాయి ...

అదే సూత్రాన్ని ఫుడ్ విషయం లో అప్ప్లై చేసుకుంటే అది శాకాహారం అయినా మాంసాహారం అయినా మీరు చెప్పిన ఫుడ్ చైన్ ఆధారం గా చెప్పాలి అంటే మనిషి బ్రతకడం కోసం తినడం తప్పు కాదు...... అనేది ఎంత నిజమో ..............అయితే ఈ సీరిస్ చదువుతుంటే నాకు అనిపించింది ఏమిటంటే తినడం కోసమే బ్రతుకుతున్నట్టు అన్నట్టుగా రుచి కోసం మరీ అంతా క్రూరంగా ఘోరంగా జంతువులని హింసించి చంపడం అన్నది చాలా తప్పు అనిపిస్తుంది

ఏమిటో తినడానికి పావు గంట.... అరగడానికి మూడు గంటలు పట్టే ఫుడ్ కోసం వాటిని టార్చర్ పెట్టి నరకం చూపించి చంపడం మాత్రం ఉహు నచ్చలేదు

Anonymous said...

/భగవద్గీతలో ఉంటుంది ఒక మనిషిని బ్రతికించడం కోసం అబద్దం చెప్పిన పర్వాలేదు అని .../

అవునా?!! ఎంత టక్కరోడు కృష్ణపరమాత్మ! అపద్దం చెప్పి ముసలి బ్రాహ్మణుడైన ద్రోణున్ని చంపించిన కృష్ణుడు ఇలా కూడా చెప్పాడా! ఏదీ ... హరిహరాదులడ్డొచ్చినా పరవాలేదు, ఆ శ్లోకం వేసేయండి. :)

శివరంజని said...

హహహహ SNKR గారు అంటే ఈ పాయింట్ పెద్దవాళ్ళు విని చెబితే నేర్చుకున్నది అన్నమాట నాకు పెద్ద అవగాహన లేదండి ఆ శ్లోఖం ఏ అధ్యాయంలో ఉందో నాకు తెలియదు మరి ...

అంటే ఇప్పుడు మన బ్లాగర్ మంచుగారు చెప్పినట్టు మతపరమైన ఫుడ్ విషయంలో ఎలాగయితే సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయో అలాగే కృష్ణుడు కూడా "సివిక్స్" కి అవసరమైనా చోట్ల లా ని కూడా మిక్స్ చేసి ఫాలో అయి ఉంటాడు అని పెద్దలు చెబుతూ ఉంటారు కదా అదేనేమో ఇది కూడా ......