Pages

Thursday, March 29, 2012

తిండి గొడవలు (Part 2 of 4) - మతం చెప్పిందే వేదమా ?

*** శ్రీ రామ ***
ఒకసారి నా కొలీగ్ ఒకడు భారతీయ హిందువుల్లో అధిక శాతం శాకాహారులే ఎందుకు ఉంటారు, మాంసాహారం తినే కొద్దిమంది హిందువులు కూడా బీఫ్ (ఆవు)ని ఎందుకు తినరు అని అడిగాడు. అతను అన్నట్టు హిందువుల్లో మెజారిటీ శాకాహారులు అన్నది తప్పేమో కానీ మాంసాహారం తినేవాళ్ళలో మాత్రం చాలామంది బీఫ్ తినడానికి ఇష్టపడరనేది నిజమే కదా.

అసలు ఒక మనిషి శాకాహారిగా లేక మాంసాహారిగా బ్రతకాలని ఎప్పుడు ఎవరు నిర్ణయిస్తారు అన్నది ఒకసారి చూస్తే, 99 శాతం కేసుల్లో అది వారు పుట్టిన కుటుంబ నేపథ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆ మనిషి శాకాహారుల ఇంట్లో పుడితే శాకాహారి, లేకపోతే మాంసాహారి అవుతాడు. అంతే కానీ తనకు తాను ఇష్టపడి కోరి తన ఆహారపు అలవాట్లు మార్చుకున్న సందర్భాలు తక్కువే ఉంటాయి. కొంతమంది మాంసాహారులు ఆరోగ్యపరమయిన కారణాల వల్ల అయితేనేమి, వేగన్స్ లా మిగతా జంతుజాలం పట్ల ఉన్న కన్సర్న్ వల్ల అయితేనేమి , లేక జీవిత భాగస్వామి వెజ్ అవడం వల్ల లేక సింపుల్ గా తినడం సహించక శాకాహారులుగా మారడం ఈ మధ్య కొంచెం తరచుగానే చూస్తున్నాం కానీ చిన్నప్పటినుండి శాకాహారుల ఇంట్లో పుట్టి పెరిగి కాలేజికి వెళ్ళాకో లేక పరాయి దేశం వెళ్ళాకో లేక నాన్ వెజ్ జీవిత భాగస్వామి వల్లొ మాంసాహారులగా మారడం మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవాలి.

మనిషి ఆహారపు అలవాట్ల మీద తను నమ్మే మతం యొక్క ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి హిందువుల్లో అధికశాతం శాకాహారులుగా జీవించడానికి మతం (కొన్ని కులాల వారికే అనుకోండి) ముఖ్య కారణం ఇంకా చెప్పాలంటే ఏకైక కారణం. అలాగే మాంసాహారం తినే హిందువుల్లో కూడా చాలామంది బీఫ్ తినకపోవడానికి కూడా "ఆవు మనకి చాలా పవిత్రమయిన జంతువు, గోహత్య మహాపాతకం " అన్న మతపరమయిన నమ్మకం కూడా ఒక కారణం. హిందువుల్లో కూడా ఒకానొక సమయంలో మాంసాహారం  (ఆవుమాంసంతో) సహా తినేవారు అని చాలా మంది వినేవుంటారు. అలాగే చాలా తెగలలో లానే జంతు బలులు కు  హిందూమతం వ్యతిరేకం కాదు. పూర్వాకాలంలో యజ్ఞయాగాదులు నిర్వహించినప్పుడు చివర్లో జంతువులని బలి ఇచ్చి ఆ మాంసాన్ని పంక్తి లో అందరితో కలసి భుజించేవారని కూడా వినే ఉంటారు. మరి అలాంటిది ఎప్పుడు కొంతమంది హిందువులు ఇలా పూర్తి స్థాయి శాకాహారానికి మారిపోయారు అన్న ప్రశ్న రావచ్చు. అలాగే సడన్ గా "గోహత్య మహాపాతకం" అన్న కాన్సెప్ట్ ఎందుకు పుట్టింది అని. 

ఆహారపుటలవాట్లకి సంబంధించిన విషయాల్లో ఉండే ప్రతీ మతపరమయిన ఆంక్షల వెనుక సమాజానికి మంచి చేసే (కనీసం అప్పటి పరిస్థితులకి సరి అయినది) అంశం ఉంటుంది అని నా నమ్మకం. అసలు ఆహారపు అలవాట్లనే కాదు మతపరమయిన ఏ నియమనిభందనల వెనుకయినా సాంఘీక సంక్షేమమో , ప్రకృతి రక్షణొ లేక బలమైన వర్గాలకి చెందినవారికి లాభం కలిగించే స్వార్ధపరమయిన కుట్రొ .... ఇలాంటి కారణం ఏదో ఒకటి ఖచ్చితం గా ఉంటుంది కానీ కేవలం దేవుడికి ఇది ఇష్టం ఉంటుంది అని ర్యాండం గా ఊహించి అయితే మాత్రం ఉండదు అని నా అభిప్రాయం.

ఇంకో రకంగా చెప్పాలంటే సమాజంలో ఎక్కువమంది దేవుడిని నమ్మేవారు ఉంటారు కాబట్టి ఏదయినా ఒక నియమం అందరూ పాటించేలా చెయ్యాలంటే దానికి మతపరమయిన లంకె ఒకటి అటాచ్ చేస్తే బాగా వర్కవుట్ అవుతుంది అన్నమాట. హిందూ మతమనే కాదు ప్రతీ మతంలో తాము తినే ఆహారానికి సంబంధించి కొన్ని నియమనిబంధనలు ఉంటాయి.

ఉదాహరణకి కొంతమంది క్రైస్తవులు శుక్రవారం కేవలం చేపలు మాత్రమే తింటారు. పూర్వాకాలంలో ఒకానొకప్పుడు ప్రజలందరూ రెడ్ మీట్ (బీఫ్ లాంటివి) తినడానికి బాగా అలవాటు పడి చేపలు తినడం బాగా తగ్గించేసారట. అదే జీవనాధారంగా బ్రతుకుతున్న మత్స్యకారుల సంపాదన తగ్గి జీవనం కష్టం అవడంతో వాళ్ళు వెళ్ళి అప్పటి మతాధికారులకి మొరపెట్టుకున్నారట. వీళ్ళను ఆదుకోవాలంటే ప్రజల చేత కనీసం అప్పుడప్పుడు అయినా చేపలు తినేలా చెయ్యాలి. మరి రుచికరమయిన రెడ్ మీట్ వదిలేసి చేపలు తినమని చెప్తే ఎవరు తింటారు. అప్పుడు పుట్టిందే ఈ శుక్రవారం చేపల రూల్ అన్నమాట. వారంలో మనం చేసే పాపాలు తొలగిపోయి పరిశుద్ధంగా ఉండాలి అంటే వారంలో ఒక రోజు ఉపవాసం చెయ్యాలని, జీసస్ చనిపోయింది శుక్రవారం కాబట్టి ఆ రోజు ఉపవాసం చెయ్యడానికి సరైన రోజు అని మతాధికారులు కొత్త సంగతి చెప్పారన్నమాట. వాళ్ళకి చేపలు మాంసాహారం క్రిందకి రాదు కాబట్టి చేపలు తినడం వారికి ఉపవాసం క్రిందే లెక్క.
పైన చెప్పుకున్నది సంఘంలో ఒక వర్గానికి చెందిన ప్రజలను ఆదుకోవడం కోసం పుట్టిన మతపరమయిన నిబంధన. అలాగే ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆహారపుటలవాట్లలో ఆంక్షలు విధిస్తూ పుట్టిన మతపరమయిన నియమాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ముస్లింల హలాల్ పద్ధతి.
ముస్లింలలో వాళ్ళు తినబోయే జంతువులను ఎంచుకోవడానికి, వాటిని చంపే విధానానికి సంభందించి కొన్ని ఖచ్చితమయిన నిబంధనలున్నాయి. ఈ నిబంధల ప్రకారం చంపినవే తినడానికి అర్హత పొందుతాయి (హలాల్) లేకపోతే అవి తినడానికి అనర్హం (హరాం) అన్నమాట. ఈ నియమాలు కొన్ని విశ్లేషిస్తే మనకి వాటి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ కూడా కనిపిస్తాయి. ఉదాహరణకి 



  • చంపబోయే జంతువుని (చేప తప్ప) జాగ్రత్తగా పట్టుకుని పక్కకు పడుకోబెట్టి పదునయిన చాకు తీసుకుని దాని jugular veins మాత్రం జాగ్రత్తగా కోసి రక్తం అంతా పోయేవరకు ఉంచి అప్పుడు మిగతా భాగాలు కొయ్యాలి. పైన "జాగ్రత్తగా" పట్టుకుని అని రాసింది వెటకారం కాదు. నిజంగానే చాలా సున్నితంగా హేండిల్ చేస్తారు. రక్తంలో యూరిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి రక్తం ఉన్నమాంసం తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆ నిబంధ పెట్టి ఉంటారు అని కొంతమంది నమ్మకం.
  • అలాగే పంది మరియు మాంసాహారం తినే పక్షులు (గ్రద్ద) లాంటివి తినకూడదు అని ఇంకో నిబంధ ఉంది. దీనికి రెండు కారణాలు వాడుక లో ఉన్నాయి. ఒకటి... పైన చెప్పినట్టు ఆ jugular veins మాత్రమే కొయ్యడం పంది యొక్క శరీరాకృతితో కుదరదు (మెడ లావుగా ఉండటం వల్ల). అందువల్ల ముస్లింలలో కొందరు ఏమంటారంటే... "ఈ జంతువు తినొచ్చు అని దేవుడు అనుకుంటే దాని మెడ కూడా మేక, కోడిలా సన్నగా పెట్టకుండా ఇలా లావుగా పెట్టి jugular veins కొయ్యడం కుదరకుండా చెయ్యడు కదా... అందువల్ల మనం తినకూడదు" అని. రెండో కారణం అయితే పంది అపరిశుభ్రమయిన ప్రదేశాల్లో ఎక్కువ నివసిస్తుంది కాబట్టి, పంది మీద చాలా పేరాసైట్స్ నివాసం ఉంటాయి. అందువల్ల పందిని తింటే ఆ పేరాసైట్స్ మనుషులకి రోగకారణం అవుతాయి కాబట్టి పందిని తినకూడదు అని. నాకు కాస్త ప్రాక్టికల్ అనిపించేది రెండో కారణమే.
  • అలాగే ఆల్రెడీ చనిపోయిన జంతువులు తినకూడదు అన్న ఇంకో నియమం ఉంది.  దానికి    "ఆ చనిపోయిన జంతువు ఏ జబ్బుతో చనిపోయిందో తెలీదు కాబట్టి తెలీకుండా తింటే ఆ జబ్బు మనుషులకి అంటుకుంటుంది" అన్న లాజిక్ కనిపిస్తుంది.
  • వేరే జంతువులు వేటాడి కొంచెం తిని వదిలేసిన మాంసం మనం తినకూడదు అన్న ఇంకో నియమం "ఆ వేటాడి తిన్న జంతువుల నోటిలో రేబిస్ లాంటి వైరస్ ఉండి అది తరువాత ఆ మిగులు మాంసం తిన్నవారికి సోకవచ్చు" అన్న కారణంతోనూ, ఇలా హలాల్ లో ప్రతీ నిబంధనకి అనేక రకాల కారణాలు వెతకొచ్చు. 
వాటిలో కొన్ని ఇప్పటి పరిస్థితులకి వర్తించకపోవచ్చు, అసమంజసంగా అనిపించవచ్చు. అన్నీ ఆంక్షలకి సవరణలు ఉన్నట్టు హలాల్ కి కూడా ఒక మినహాయింపు ఉంటుంది. హలాల్ మీట్ దొరక్కపోతే నాన్ హలాల్ మీట్ తినొచ్చు అని ఖురాన్ లోనే రాసి ఉంది. ఇంచుమించు ఇవే కారణాలతో యూదులు పంది, షెల్ ఫిష్ (రొయ్యలు, lobster , పీతలు) లాంటివి తినరు. యూదుల కోషర్ ఫుడ్ మరిన్నిరూల్స్ తో నిండిఉంటుంది.
ఇవన్నీ చూసి నాకేమనిపిస్తుంది అంటే... మన హిందూమతం లో కూడా పూర్వకాలంలో బీఫ్ తిన్నా కూడా తరువాతి కాలంలో ఆవు యొక్క ఉపయోగాలు (పాలు మరియూ పాల ఉత్పత్తులు) దృష్టిలో పెట్టుకుని ఆవుల జాతి అంతరించిపోకుండా కాపాడటానికి, మాంసం కోసం ఆవుల్ని చంపడాన్ని అదుపులో ఉంచడం కోసం మతం పేరుతో ఒక నిభందన పెట్టి ఉంటారు. గోవుకి మన పురాణాల్లో కామధేనువనే స్థానం ఎలాగూ ఉంది కాబట్టి అది ఉపయోగించుకుని రెండూ కలసి వచ్చేలా పెట్టి ఉంటారు. గోహత్య మహాపాతకం, జంతుబలులు , చంపి దేవుడి కి ఆఫర్ చేస్తే తప్పులేదు, అహింస ఇవన్ని అసలు ఎందుకో అతికినట్టు అనిపించవు.



పైన చెప్పుకున్న ఉదాహరణలు అన్నీ చూసాక ఏ మతం పెట్టిన నియమనిభందనలు అయినా అవి  అప్పటి ప్రజల ఆరోగ్యాన్ని, సాంఘీకసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్టినట్టు అనిపిస్తుంది కాబట్టి ఆహారపు అలవాట్ల విషయంలో మతం చెప్పిందే వేదం అనుకోవచ్చు. కానీ వాటిలో చాలామటుకు అప్పటి అంటే ఆ రూల్స్ పెట్టే సమయానికి ఉన్న పరిస్తితులకి అనుగుణం గా ఏర్పడినవి. అయితే అవన్నీ ఇప్పుటి పరిస్తితులకి వర్తించాలని లేదు. కొన్ని ఆచార వ్యవహారాలు, నమ్మకాలు మారుతున్నకాలంతో పాటు అనేక సవరణలు దిద్దుబాట్ల తో మారుతూ వస్తున్నాయ్, కొన్ని కనుమరుగైపొయాయ్ కూడా . ఈ నమ్మకాలలో కొన్ని ఈనాటి పరిస్థితులకి వర్తించవు అనిపించినప్పుడు ఆయా నిబంధనలను సవరించడం కూడా తప్పు కాదు. ఎందుకంటే, మానవ మనుగడలో 'మార్పు' అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియే. అలా సవరణలు చెయ్యాల్సిన, చేసుకోవాల్సిన అవసరం బాధ్యత అందరిమీదా ఉంటుంది. మన మతంలో ప్రస్తావించారన్న ఏకైక కారణం తో ప్రతీవిషయంలో విచక్షణ లేకుండా గుడ్డిగా అనుసరించాలని లేదు. మతం లో ఉన్న ఏ నియమం అయినా ఒక్కసారి దాని వెనుకున్న లాజికల్ రీజన్ అర్ధం చేసుకుంటే , ఇప్పటి పరిస్తితులలో అది అనుసరించాలో అక్కరలేదో మన కామన్‌సెన్స్ చెప్తుంది. 

- మంచు

19 comments:

శ్రీనివాస్ పప్పు said...

మంచి విశ్లేషణ మంచుగారూ

WitReal said...

what a paradoxical title! :)
then what else is vedam?

didnt understand the purpose of the rest of the text. so no comments.

but halal reference should have come after kosher (thats how they evolved). that will give you more understanding.

there is another angle in halal (as I read somewhere). the animan shud die in the name of god. its a slow process & the _sufferrer_ will know the end... and thus it also prays god.

so, in the series, will you cover the excesses of meat lovers.. like foie gras?

Sravya V said...

అదేంటి హలాల్ ఆంటే మంచి పదునైన ఆయుధం తో వెంటనే ప్రాణం పోయేట్లు గా (అంటే దానికి బాధ తెలియకుండా ) కట్ చేస్తారు అని విన్నాను నేను .

మన మతంలో ప్రస్తావించారన్న ఏకైక కారణం తో ప్రతీవిషయంలో విచక్షణ లేకుండా గుడ్డిగా అనుసరించాలని లేదు. మతం లో ఉన్న ఏ నియమం అయినా ఒక్కసారి దాని వెనుకున్న లాజికల్ రీజన్ అర్ధం చేసుకుంటే , ఇప్పటి పరిస్తితులలో అది అనుసరించాలో అక్కరలేదో మన కామన్‌సెన్స్ చెప్తుంది.
---
well said


బావుందండి ఈ పార్ట్ కూడా , వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పార్ట్ :)))

Sri Kanth said...

బావుంది. కాకపోతే నాదో సందేహం. నిజంగానే మన ఆచారలన్నీ (కనీసం అధిక భాగం) కొద్దో గొప్పో శాస్త్రీయతను దృష్టిలో ఉంచుకుని చేసినవా? అన్నది.

మొదట భూమి బల్ల పరుపుగా ఉందనుకుని, బైబిలులో అలానే రాసుకున్నారు. కాదన్న వారికి మరణశిక్షలు వేశారని విన్నా. తరువాత భూమి గుండ్రంగా ఉందని తెలిసింది. దానితో బైబిలులో కూడా గుండ్రముగానే ఉంది అని రాసుకొన్నారు.

చలావరకూ మతాలలో ఉన్నవి అప్పటి నమ్మకాలు మాత్రమే అనిపిస్తుంది. వారి నమ్మకాలను హేతువాదులు ఛాలెంజులు చేయడం మొదలు పెట్టిన తరువాత, తమ నమ్మకాలలో ఉన్న కొన్ని శాస్త్రీయమైన వాటిని చూపి మిగిలినవి కూడా అలా శాస్త్రీయమైనవే అనే భావాన్ని కలగ జేయడానికి ప్రయత్నించ జూశారేమో అనిపిస్తుంది.

హలాల్ గురించి కొన్ని దేశాలలో పెద్ద దూమారమే రేగుతోంది ప్రస్తుతం. హలాల్ అనేది జీవ హింస కిందకి వస్తుంది అని కొన్ని దేశాలలో నిశేదించారని / కనీసం ఆ యోచనలో ఉన్నారని చదివా.

ఇక, ఆవు వలన చాలా లాభాలున్నాయి కాబట్టి దాన్ని పవిత్ర జంతువుగా చూడమని చెప్పుంటారన్న దాన్ని కూడా నేనేకీభవించలేను. ఆవులానే పాలివ్వగల జంతువులు చాలా దేశాలలో ఉన్నాయి. కానీ, వాటన్నింటినీ అందరూ పవిత్రంగా చూడడం జరగదు.

Anonymous said...

bavundi. kakapote poorva kaalam lo yaagam lO gurraannO marokaTo balichchevaru gani, avuni kadu. Ofcourse videshalu vellina kontamandi hindus kooda beef tintaaru. Its up to the personal opinion. I tried to avoid red meat as they all are mammals. I dont have issue with birds and fish.

Rao S Lakkaraju said...

నాకు నచ్చిన వాక్యాలు:

ఇంకో రకంగా చెప్పాలంటే సమాజంలో ఎక్కువమంది దేవుడిని నమ్మేవారు ఉంటారు కాబట్టి ఏదయినా ఒక నియమం అందరూ పాటించేలా చెయ్యాలంటే దానికి మతపరమయిన లంకె ఒకటి అటాచ్ చేస్తే బాగా వర్కవుట్ అవుతుంది అన్నమాట.

ఆహారపుటలవాట్లకి సంబంధించిన విషయాల్లో ఉండే ప్రతీ మతపరమయిన ఆంక్షల వెనుక సమాజానికి మంచి చేసే (కనీసం అప్పటి పరిస్థితులకి సరి అయినది) అంశం ఉంటుంది అని నా నమ్మకం. 

పోస్ట్ చాలా బాగుంది.

PALERU said...

NICE POST NICE ANALYSIS...:)))

పద్మవల్లి said...

Good one again. Though I use halal meats, I learnt lot of things that I didn't know before.

"ఇంకో రకంగా చెప్పాలంటే సమాజంలో ఎక్కువమంది దేవుడిని నమ్మేవారు ఉంటారు కాబట్టి ఏదయినా ఒక నియమం అందరూ పాటించేలా చెయ్యాలంటే దానికి మతపరమయిన లంకె ఒకటి అటాచ్ చేస్తే బాగా వర్కవుట్ అవుతుంది అన్నమాట."

TRUE.

Anonymous said...

మీ లాగే నేను ఆహరపు అలవాట్లు గురించి తెలుసుకోవటానికి, చాలా పుస్తకాలు చదివాను. అందులో ఈ క్రింది ఆర్టికల్ ను రెండు సంవత్సరాల క్రితం చదివాను. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే చదివేది. ఇది ఇంగ్లాండ్ దేశస్తుడైన పాల్ బ్రంటన్ (Author of book : A Search in Secret India) రాశాడు.

Diet

http://paulbrunton.org/notebooks/5/3


SriRam

మంచు said...

పప్పు గారు: థాంక్యూ.
విట్ రియల్ : :-) కొషర్ గురించి ఎక్కువ రాస్తే జనానికి అంత ఎక్కదేమో. మీరు విన్న మరొక్క కొణం గురించి నేను విన్నాను కానీ.. అది నాకు సరి అయినది అనిపించలేదు. కారణం నేను పొస్ట్లొ రాసినట్టు.. ఏ విధమయిన సొషల్ ఎలిమెంట్ లేకుండా ఈ నిభందన ఉండదని నేను నమ్ముతాను.

మంచు said...

శ్రావ్య : హలాల్ అన్నది సెట్ ఆఫ్ రూల్స్. ఎది తినొచ్చు. ఎది తినకూడదు.. .. తినడానికి ఎదయినా జంతువుని చంపాల్సి వస్తె ఎలా చెయ్యాలి.. ఇలాంటివన్నీ కవర్ చెసే సెట్ ఆఫ్ రూల్స్ ... అందులొ మీరు చెప్పింది ఒకటి.

శ్రీకాంత్ గారు:
అన్ని విషయాలకు సైంటిఫిక్ రీజన్ వారికి తెలిసి ఉండకపొవచ్చు. ఉదాహరణకి హలాల్ లొ పంది విషయం తీస్కుంటే, దాని మీద ఉండేవి రొగకారకమయిన పారాసైట్స్ అని వారికి తెలిసే అవకాసం లెదు... కానీ అది తిన్నవారు తరుచూ అనారొగ్యానికి గురి అవుతూ ఉంటే .. దాంట్లొ ఎదొ తేడా ఉంది అని కనీస రెండు మూడు తరాలకయినా ఒక కంక్లూజన్ కి వచ్చి నిషేదించే అవకాశం లేకపొలేదు. ఇక మీరు చెప్పినట్టు లేని శాస్త్రీయత అంటగట్టడం లొ నేను కామెంట్ చెయ్యలేను కానీ .. బట్ సైంటిఫిక్ గా నిరూపించకపొయినా అనేకమయినవి కనీసం అవుట్ ఆద్ ద బాక్స్ ఊహించగలిగారని మాత్రం నమ్ముతాను.

హలాల్ గురించి రేగే దుమారం లొ రాజకీయాల పాళ్ళు చాలా ఎక్కువ. మీట్ ఎక్కువ తినే మతాల్లొ ముస్లిం మతం ఒకటి . వారి మార్కెట్ కాప్చర్ చెయ్యలంటే.. హలాల్ అయితేనే కానీ కుదరదు. హలాల్ మీట్ ఉత్పత్తి చెయ్యాలంటే ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం. అమెరికా యురొప్ లాంటి దేశాల్లొ మాన్ పవర్ ఎంత కాస్ట్లీనొ తెల్సు కదా.. అందుకే ఈ హలాల్ నిషేదిస్తే.. ఆ మార్కెట్ కాప్చర్ చెయ్యొచ్చు అని. ఈ మీట్ కార్పొరేట్ పెద్ద మాఫియా టైప్.
అయితే వీరు హలాల్ జీవ హింస గా పరిగణించేలా చెయ్యడానికి ఒక బలమయిన కారణం ఉంది. అది నేను లాస్ట్ పార్ట్ లొ చెప్తాను.

ఇక ఆవు గురించి... నా ప్లస్ లొ జీవని గారి కామెంట్ చూసే ఉంటారు. అయినా నా హైపొథసిస్ ని అందరూ వెంటనే అంగీకరించాలని నేను భావించను.

మంచు said...

అనానిమస్ గారు: నేను ఆవుని తినేవారట అని రాసాను. యజ్ఞం అప్పుడు జంతువులని బలి ఇచ్చారని రాసాను. కానీ రెండూ మిక్స్ చెయ్యలేదు. అంటే యజ్ఞాలలొ ఆవుని బలి ఇచ్చేవారు అని రాయలేదు. రెడ్ మీట్ అమెరికన్స్ కే పిచ్చి ఎక్కువండి.. మనవాళ్ళు కాస్త తక్కువే.

లక్కరాజు గారు: థాంక్యూ. మిమ్మల్ని అప్పట్లొ అడిగిన ప్రశ్న ఒకటి మీకు గుర్తు వచ్చే ఉండాలి.

మంచు said...

raf raafsun gaaru: Thank you

పద్మ గారు: థాంక్యూ అండి.

శ్రీ రాం గారు: థాంక్యూ ఫర్ ద లింక్. చదవడానికి ట్రై చేస్తాను.

మధురవాణి said...

Very interesting write-up మంచు గారూ..
హలాల్ గురించి గానీ, కేథలిక్స్ ఫిష్ తినడం గురించి గానీ.. ఇవన్నీ నాకసలు తెలీదు. ఇంత వివరంగా తెలుసుకోవడం బాగుంది. చాలా balanced గా రాసారు. Liked it! :)

మధురవాణి said...

ఇప్పుడే లంచ్ నుంచి వచ్చాను. మీకో విషయం చెప్దామని ఇలా వచ్చా.. :)
మా యూనివర్సిటీ కేఫెటీరియాలో ప్రతీ రోజూ మెయిన్ కోర్స్ లో ఒక వేగన్, ఒక వెజ్, ఒక నాన్ వెజ్ డిష్ ఉంటాయి. ఒకో రోజు వెజ్ బదులు ఏ చికెనో కూడా పెడుతూ ఉంటార్లెండి.. మీకు తెలుసు కదా సాధారణంగా నాన్ వెజ్ అంటే రెడ్ మీటే కదా ఇక్కడ. అయితే, ప్రతీ శుక్రవారం రెడ్ మీట్ మానేసి ఫిష్ పెడతారు. ఫ్రైడే అంటే ఫిష్ కంపల్సరీ అన్నమాట. ఇన్నేళ్ళ నుంచీ ఈ విషయం ఇక్కడ చూస్తున్నా గానీ ఎందుకలా ప్రత్యేకంగా చేస్తారన్నది మాత్రం నాకు తెలీలేదు. ఇప్పుడు మీ పోస్ట్ చదివాకే తెల్సింది.
ఈ రోజు ఫ్రైడే కదా ఇందాక లంచ్ లో ఫిష్ చూసినప్పుడు నాకు వెలిగిందన్నమాట.. ఒక పెద్ద పజిల్ సాల్వ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. మా ఇంటబ్బాయ్ కి గొప్పగా చెప్పాను కూడా.. నాకు తెలిసిపోయిందోచ్ ఫ్రైడే కి ఫిష్ కి ఉన్న లింక్ ఏంటీ అని.. హిహ్హిహ్హీ... :)))

Vasu said...

కర్మ సిద్ధాంతం మీద నమ్మకం లేని వాళ్ళు ఈ కామెంట్ని ఒగ్గేయచ్చు ..


యజ్న యాగాదులలో ఇచ్చే బలులు ఇప్పటి దృష్టి తో చూడకూడదు .. అప్పటి ఋషులు ..చనిపోయిన వాటిని బతికించ గల తప్పస్సంపంనులు అని నమ్మాలి .

అలాగే ఇచ్చే బలి కి చాలా కారణాలు , ఆ బలి ఇచ్చే వాటికి ఉత్తమ గతులు కలగడం లాటివి ఉన్నాయి .
కాకపోతే అవి పక్కదారి పట్టి బలులు ఎక్కువైపోయి , విశృంఖలం అయిపోయినప్పుడు మళ్ళీ దారిలో పెట్టడానికి , ఈ కారణంగా వేరే మతాల వైపు ముఖ్యంగా బౌద్ధ మతం వైపు వెళ్ళిన వారిని మళ్ళీ వెనక్కి తీసుకి రావడానికి (అంటే అసలు వదిలేసి కొసరు పట్టుకుని ద్వేషించే వాళ్ళకి అసలు ఏంటో తెలియ చెప్పి) ఇలాటివి పెట్టి ఉండవచ్చు .

కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చంపే వాటి కర్మ మనకి అంటు కుంటుందిట.. బలి ఇచ్చే వారికి అది ప్రతి కూలం కాకుండా అనుకూల ఫలం ఇచ్చే విధంగా ఆ యాజ్ఞికులు , ఋషులు చేసే వారుట ..

ఏది ఏమైనా అది నాకు తప్పు గానే తోస్తుంది ..అవి అంతరించి పోవడం శుభ పరిణామమే ..అప్పటి పరిస్థితులను ఇప్పటి దృష్టి తో చూస్తె మూడొంతులు తప్పులే కనిపిస్తాయి మరి (బీఫ్ తినడం లాటివి ) .

ఇక మీరడిగిన తామస ఆహారం గురించి బోలెడు ఉంది గూగిలిస్తే ..మీరు చూసే ఉంటారు నేను చెప్పేదేముంది ..

మంచు said...

మధురగారు: థాంక్యూ :-))))
వాసు గారు: హ్మ్మ్.. మీరు అభిప్రాయం నాకు సబబుగానే తొస్తుంది ... థాంక్యూ

Anonymous said...

శాఖాహారులు మాంసం తినకపోవడం వల్ల కొన్ని ప్రోటీనునులు విటమిన్లు నష్టపోతున్నారని చెప్పారు. శాఖాహారులు మాంసాహారులుగా మారడం ఆరోగ్యరీత్యా మంచిది అంటారా?

శివరంజని said...

అవును మతం లాగే కొన్ని మూడ నమ్మకాల వెనక కూడా కొన్ని సైతిఫిక్ రీజన్స్ ఉండడం వల్లనే అలా పెట్టారు అని అవి కాస్త బాగా స్ట్రాంగ్ అయ్యి మూడ నమ్మకాలుగా మారాయని మా తెలుగు మాష్టారు చెప్పేవారు ... మీ తో ఏకీభవిస్తున్నా ... ఇకపోతే ఫిష్ కిష్టం లేని రోజు ఏంటి అంటే ఫ్రైడే అని ఓ కొంటె ప్రసన ఉండేది నేను చదువుకున్నప్పుడు కాని దాని వెంక ఈ కారణం మాత్రం నాకు ఇప్పుడే తెలిసిందండి Very interesting