*** శ్రీ రామ ***
మీకు పారిస్ ట్రిప్ కి వెళ్ళాలనుందా.. అయితే టికెట్లు కొనుక్కుని, హొటెల్స్ బుక్ చేస్కుని, వస్తున్నాం అని లవంగం గారికి ఫొన్ చేసేసి.... బొల్డు డబ్బులు, సమయం ఖర్చు పెట్టి పారిస్ వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు దానికొ షార్ట్ కట్ ఉంది. కృష్ణప్రియ గారి 'పారిస్ వెళ్ళండి కానీ..' పోస్ట్ చదివితే మీకు నిజంగా పారిస్ వెళ్ళి తిరిగేసిన అనుభూతి గ్యారెంటీ :)
ఇప్పుడు సడన్ గా కృష్ణప్రియ గారిని తలచుకుంటున్నానేంటా అని అనుకుంటున్నారా... అయితే మీకు తెలిసున్న విషయాలే అనిపించినా పొస్ట్ పూర్తిగా చదవాల్సిందే.
మన ఫ్రెండ్ ఎవరన్నా సెల్ ఫొన్ పొగొట్టుకుంటే అయ్యో అని బాధపడతాం. అదే ఈవిడ పొగొట్టుకున్నప్పుడు బొల్డు సంతొషించాం... ఎందుకంటే మరి ఆ ఫోనే పోకపోయుంటే 'చేజారిన మంత్రదండం' అనే ఒక మంచి పోస్ట్ మిస్సయ్యే వాళ్ళం కదా :D
'పెద్దయ్యాక నేను..' అంటూ మనల్ని చిటికెన వేలు పట్టుకుని ఉన్నపళంగా చిన్నప్పటి రోజుల్లోకి తీస్కెళ్ళిపోయినా, 'ఫోటోలు నిక్షిప్తపరచలేని అనుభూతి' అంటూ మన జీవితంలోని అమూల్యమైన అనుభూతుల్ని గుర్తుకొచ్చేలా చేసినా, 'పిన్ని పెళ్ళి, పిన్ని కొడుకు పెళ్ళి' అంటూ అప్పటికీ ఇప్పటికీ పెళ్ళి వేడుకలు మారిపోయిన వైనాన్ని గుర్తు చేసినా, స్కూటర్ సాహసాలైనా, 'హాయిగా హాల్లో సినిమా' చూడటం గురించి చెప్పినా, తనకి 'పాటలు రావని' చెప్పినా, 'బరువూ బాధ్యత'ని గుర్తు చేసినా... ఇలా ఏ కబుర్లైనా గానీ మనల్ని కూడా తన కూడా తిప్పుతూ చూపించినంత ఆసక్తికరంగా రాయడంలో మన కృష్ణప్రియ గారిది అందె వేసిన చేయి. :)
మీకు తెలుసో లేదో.. ఆవిడకి బోల్డు అదృష్టం కలిసొచ్చి ఒకసారి లక్కీ డ్రాలో అరకేజీ వెండి గెల్చుకున్నారు. అప్పుడు అందరికి ఇచ్చి మనకి మాత్రం పార్టీ ఇవ్వకుండా పెద్ద హ్యాండిచ్చారు.
అసలు కృష్ణ ప్రియ గారి డైరీలో మిగతా పోస్టులన్నీ ఒక ఎత్తైతే 'గేటెడ్ కమ్యూనిటీ కథలు' మాత్రం మరొక ఎత్తు.. అవన్నీ చదువుతుంటే అర్జెంటుగా మనం కూడా ఏదో ఒక గేటెడ్ కమ్యూనిటీ చూసుకుని, అసలు వీలైతే 'పెసిడెంటు గారి పెళ్ళాం' గారి రికమండేషన్ తో వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ లోనే ఒక ఇల్లు వెతుక్కుని సెటిల్ అయిపోదాం అనుకుంటారు. అసలు వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీలో జరిగే దీపావళి, చబ్బీస్ జనవరి వేడుకల కోసమైనా వెంటనే వెళ్ళిపోవాల్సిందే అనిపిస్తుంది మనకి. అలాగే మనకెప్పుడైనా 'ఓ కప్పు చక్కర' అవసరమైతేనో, మనలో దాగున్న 'సామాజిక స్పృహ'ని మేల్కొల్పడానికైనా గానీ మన కృష్ణప్రియ గారు సదా మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి మనం వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీలో చేరిపోడానికి అట్టే అలొచించనక్కర్లేదు. అప్పుడు మనం కూడా ఎంచక్కా కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు పండగ చేస్కోవచ్చు. :) ఇవన్నీ చదివాక మీరు క్రిష్ణప్రియ గారి పక్కిల్లే కావాలి అనుకునే ఉంటారు కానీ పాపం మీ బ్యాడ్‌లక్. కార్నర్ లొ ఉండే వాళ్ళ ఇంటికి పక్కనుండే ఇల్లు నేను అల్రేడీ రిజర్వ్ చేసేసుకున్నాను కాబట్టి.
'ఉప్మాయణం' గురించి గొప్పగా చేప్పేసి మనల్ని ఉప్మా ప్రియుల్ని చేసేయ్యడమే కాదు... తనే కనిపెట్టిన కొత్త రెసిపీ, మన బ్లాగ్లోకంలోనే అత్యంత రుచికరమైన పదార్ధం అయినటువంటి టల్లోస్ రుచి చూడకుండా ఆవిడ బ్లాగ్ గడప దాటి బయటికి రాలేమంటే నమ్మాలి మీరు :) మరి బ్లాగులొకం లొ అత్యంత రుచికరమైన పదార్ధం నా చుంబరస్కా అని నాకు గట్టి నమ్మకం. మరేమో అక్కడే మాకు ఈగో క్లాషేస్ వచ్చాయన్నమాట. అప్పుడు చుంబరస్కా మీద పేటెంట్ హక్కుల గురించి ఒకరి మీద ఒకరు కేసులు వేసుకుందాం అనుకున్నాం కానీ మా లాయర్ (ఇద్దరికి ఒక్కరే లాయర్) ఫీజు ఎక్కువ అడిగాడని అలిగి ఫైనల్ గా మేము ఒక అండర్స్టాండింగ్ కి వచ్చి చుంబరస్కాటల్లోస్ అనే కొత్త రెసిపి కనిపెట్టాం :-) ఈ పొస్ట్ ఆఖర్లొ చూడండి.
ఇహ కృష్ణప్రియ గారు చెప్పే ఆఫీసు కబుర్లు భలే సరదాగా ఉంటాయి.. 'సింగం, మల్లెపూలూ బార్డర్ సమస్యా' అని చెప్పినా, 'బాసూ బీరకాయ పచ్చడి' గురించి చెప్పినా, అది కేవలం 'ఊర్వశి క్రిష్ణప్రియ'లా నటించగలిగే మన కృష్ణప్రియ గారికే సాధ్యం.
ప్రతీ ఒక్కరం ఎంతో కొంత తీవ్రంగానే ఆలోచించే క్లిష్టమైన విషయాలని కృష్ణప్రియ గారు తేలికగా అర్థమయ్యేలా వివరంగా, విశ్లేషణాత్మకంగా చర్చిస్తారు.. ఉదాహరణకి 'ఇంకా సాఫ్ట్ వేర్ ఇంజనీరేనా? పాపం!!' అంటూ ఆడవాళ్ళు కెరీర్, పర్సనల్ లైఫ్ బ్యాలన్స్ చేస్కోడం గురించి రాసిన పోస్ట్, 'NRI నుండి పక్కా ఇండియన్ గా మారడం..' అంటూ అమెరికా నుంచి ఇండియాకి వెనక్కి వెళ్ళి ఉండటంలో సాధక బాధకాల్ని చెప్పడంలో, 'ప్రియ కొడుకు IIT' అనే పోస్టులో తెలిసో తెలీకుండానో మనందరం చదువుల రూపంలో పిల్లలపై పెడుతున్న అధిక ఒత్తిడి గురించి, పిల్లలని దత్తత తీస్కునే సందర్భాల్లో ఆయా వ్యక్తుల వెనక దాగుండే రకరకాల పరిస్థితులూ, ఎమోషన్స్ గురించి 'మనసా వాచా కర్మణా దత్తతకి సిద్ధం?' అనే పోస్టులో చెప్పినా.. ప్రతీసారీ విషయం ఏదైనా గానీ మనల్ని కాసేపన్నా ఆలోచనలో పడేస్తాయి కృష్ణప్రియ గారి టపాలు.
అప్పుడప్పుడూ 'అంబిగేశ్వరి-శ్రీనివాసోపాఖ్యా
కృష్ణప్రియ గారి డైరీలోకి ప్రయాణం చాలా (exciting) ఆసక్తికరంగా ఉంటుందని ఈ పాటికే మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అన్నట్టు, 'మీరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు...' అని ఆవిడ ఒక సరదా పోస్ట్ రాసారు. అలాగే, మన కృష్ణప్రియ గారి డైరీలోకి ఒకసారి తొంగి చూస్తే అప్పుడప్పుడూ తను ఒక రోజంతా ఎలా గడుపుతుంటారో కూడా తెల్సుకోవడం చాలా సరదాగా ఉంటుంది.
మొన్నామధ్య ఒకసారి కృష్ణప్రియ గారి బ్లాగు పుట్టినరోజు సందర్భంగా నిర్వోష్ఠ్య బ్లాగాయణం.. అంటూ తన బ్లాగు ప్రస్థానాన్ని ఒక సంక్లిష్టమైన సాహితీ ప్రక్రియలో అలవోకగా రాసి ఆశ్చర్యపరిచారు.
అర్జెంట్ గా అత్యుత్తమ సలహాలు కావాలా అయితే.. అత్యుత్తమమైన సలహాల కోసం సంప్రదించండి.. కృష్ణప్రియ గారి బ్లాగ్..
ఇక అసలు విషయం ...కృష్ణప్రియ గారికి అసలింత టాలెంట్ ఎలా వచ్చిందో తెల్సా .. మా గోదావరి జిల్లాలో పుట్టడం వల్లే :) :) అవిడ ఖమ్మం బిడ్డ అని చెప్పుకుంటారు కానీ.. పుట్టింది తూగొ లొ కాబట్టి కచ్చితంగా గొదావరి బిడ్డే :-) :-)
ఇక ఆంద్రుల అభిమాన బ్లాగర్ అయిన కృష్ణప్రియ గారిని ఈ రోజు ప్రత్యేకంగా తలచుకొవడానికి ఒక కారణం ఉంది. ఈ రోజు (జూలై 17) ఆవిడ పుట్టిన రొజు. శతావధానం చేసినట్టు ఇన్నేసి రకరకాల టపాలు రాసి మనల్ని అలరిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి మన కృష్ణప్రియ గారు ఇంకా బొల్డు మంచి మంచి పోస్టులు రాస్తూ మనల్ని ఇలాగే అలరిస్తారని ఆశిస్తూ..
కృష్ణప్రియ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు
కృష్ణప్రియ గారూ..
మీ పుట్టినరోజు సందర్భంగా మేం స్వయంగా దగ్గరుండి అత్యంత మధురమైన పదార్ధం చుంబరస్కా ఓ పది టన్నులు చేయించాం. అందరికీ పంచి పెట్టడంతో పాటు మీరూ తినండి వచ్చి.. :)
- మంచు
ఎంతొ విలువైన తన సమయం వెచ్చించి ఈ పొస్ట్ రాయడానికి సహకారం అందించిన మధురవాణి గారికి బొల్డు బొల్డు థాంక్స్ లు ....