Pages

Friday, February 25, 2011

అలిగితివా .. ప్రియసఖీ ... అలకమానవా...

*** శ్రీ రామ ***



అలిగితివా ప్రియసఖీ ... అలకమానవా... సారీ గీరీ అన్నా ... కాళ్ళా వేళ్ళా   పడ్డా... కుయ్యోమొర్రో అన్నా కరుణించవే చెలీ ...


ఇప్పుడు నీ అలక తీర్చేదేలా.... నా దారికి తెచ్చుకునేదేలా..  


గడ్డం పుచ్చుకుని బ్రతిమిలాడో
బుగ్గన మిఠాయి పెట్టో
ఐమాక్స్ సినిమాకి తీసుకేళ్లో
నీకు నచ్చనివాళ్ళేవారయినా వుంటే వాళ్ళని కసిదీరా తిట్టో
నీకు తెలీకుండా సెల్ ఫోన్ లో నీకు నచ్చిన సాంగ్ లు ఎక్కించో  :-)
వేడి వేడి అన్నం లో పప్పు నెయ్యి ఆవకాయ కలిపి తినిపించో
నువ్వు లేచేసరికి ఒక వందో రెండొందలు గులాబీలు నీ మంచం పక్కనే పెట్టి నిన్ను సర్ప్రైజ్ చేసో
నీకు నచ్చిన సీన్ ఏకపాత్రాభినయం చేసో
నీకు నచ్చిన పాట పాడకుండా ఆపుకునో
నీ పుట్టిన రోజుకి బుడబుక్కలోడి వేషంలో వచ్చి విషెస్ చెప్పో 
నిద్రపోయేముందు చందమామ కధలు చదివి వినిపించో
బంకమట్టి తో స్వయంగా ఒక కుండిచేసి నీకిష్టమయిన గులాబీ మొక్కలేసో
ఎగ్జిబిషన్ లో ఏనుగు ఎక్కించో

వర్షం నీటిలో ఆడుకోవడానికి కాగితం పడవలు చేసిచ్చో
నిన్ను పొగుడుతూ నాకే అర్ధంకాని కవిత రాసో
దొంగచాటుగా పక్కింట్లోంచి ఎత్తుకొచ్చిన జామకాయలకి ఉప్పు కారం అద్దిచ్చో 
ఘల్లుఘల్లుమనే పట్టీలు గిఫ్ట్ గా ఇచ్చో
ఎండలో నడుచుకోస్తుంటే  బైక్ మీద ఇంటిదగ్గర డ్రాప్ చేసో
మన ఊరి చెరువులో చేపలు పట్టడం నేర్పించో
చెరువుగట్టుమీద మామిడిచేట్టుమీద కోతికొమ్మచ్చి , గోల్కొండలో దొంగ పోలీస్ ఆడించో
బీచ్ లో బర్త్ డే కేకు కట్ చేయించో
వర్షంలో బైక్  మీద తీసుకెళ్ళి జొన్న పొత్తులు తినిపించో 
చేతులకి గోరింటాకు పెట్టో
కొత్తిమీర పచ్చడి చేసిపెట్టో


ఏంటి ఇన్ని చేస్తానన్నా కూడా మాట వినవా... అలకమాని పలకరించవా ... అయితే.....


నీ చెయ్యి వెనక్కి మడత పెట్టో
నీ జడ మంచానికి కట్టేసో

తలుపెనకాల  దాక్కుని  భయపెట్టో 
నేను పాటపాడి వినిపించో
నీకు
రాత్రంతా ఒక వెయ్యి మిస్సేడ్ కాల్స్ ఇచ్చో  


ఏదో ఒకటి చేసి మాట వినేలా చేస్తా... పెంకి పిల్లా...




నోట్: జస్ట్ ఫర్ చేంజ్, అంతే :-)


- మంచు

56 comments:

Anonymous said...

చాలా బాగా రాసారు . ఏమిటీ కొత్తగా?

శివరంజని said...

మంచు సార్ కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.......కేక ... మీ ప్రియురాలి గురించి బాగా రాసారు ..

అయ్య బాబోయ్ నిజంగా మీ ప్రియసఖి ఇలా బ్రతిమాలాకా ఇంకా ఎందుకు అలుగుతుంది చెప్పండి

అందరు కవితాలు తెగ రాసేస్తున్నారు .. నాకే రావడం లేదు

శివరంజని said...

నాదే ఫస్ట్ కామెంట్ పెట్టండి ప్లీజ్ ...అంతకముందు ఎవరైనా పెట్టినా డిలీట్ చేసేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ... చాలా చాలా బాగుంది మీ కవిత .. ప్రతీ లైన్ నచ్చింది

శ్రీనివాస్ said...

మంచు గారికి కవిత్వం వచ్చు అని నాకు తెలీకుండా ఉండడానికి పవన్ జాగ్రత్త పడ్డాడు

Anonymous said...

chalaa baagaa brathimilaadukuntunnaaru,she is lucky.

చెప్పాలంటే...... said...

చాలా చాలా బాగుంది

Unknown said...

ఇదిగో కామెంట్లు రాసేవాళ్ళు మీకో విషయం అర్ధం కావడం లేదు .. మంచు గారు అంతలగా బతిమాలడానికి ఆవిడని ఎంత హార్ట్ చేసారో పాపం .. నేను అయితే పాపం ఆవిడ అంటా

నాగప్రసాద్ said...

వార్నీ, ప్రియురాలు అలిగితే ఇంత కష్టపడాలా? కుర్చీకి కట్టేసి టీవీలోనో ల్యాప్ టాప్‌లోనో పరమ వీర చక్ర లేదా పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలు ప్లే చేస్తే సరి. ఇక జీవితంలో అలగదు. :-)

రాధిక(నాని ) said...

నిన్ను పొగుడుతూ నాకే అర్ధంకాని కవిత రాసో :))
బాగుందండి:).

Anonymous said...

"నీకు నచ్చిన పాట పాడకుండా ఆపుకునో" .....
నచ్చని పాట అని ఉండాలేమో

ఆ.సౌమ్య said...

ఒకటి మరచిపోయారు...చాక్లేట్లు ఇవ్వరా?
ఇన్ని చేసే బదులు ప్రియురాలు ఏది కోరిందో, ఎందుకు అలిగిందో అది చేసేస్తే పోలే.

పరిమళం said...

:) :)

శిశిర said...

:) బాగుంది. కొందరు తెలుగు సినీ గేయ రచయితల కన్నా ఏ మాత్రం తీసిపోరండి మీరు. త్వరలో వచ్చే ఏ పేద్ద హీరో సినిమాలోనో ఇది పెట్టించే ప్రయత్నం చేయకూడదూ?

బులుసు సుబ్రహ్మణ్యం said...

హహహ ఇంత అవస్థ పడాలా. శ్రీకృష్ణుడి మార్గమే శ్రేష్టమైనది. రిజల్ట్స్ గారంటీడు.

Sai Praveen said...

మంచు సారూ.... కుమ్మెశారు :)

..nagarjuna.. said...

ఈ 'లవ్వర్' అనే సాల్తీతో ఇదే తలనొప్పి మంచుగారు..... ఎందుకు అలుగుతారో, ఎందుకు ముద్దు చేస్తారో తెలిసి చావదు. నాలా ఏక్‌నిరంజన్ లాగో, నాగా టైపులో నయనానందం చేస్తూనో ఉండండి..... ఆళ్ళె దారికొస్తారు

మధురవాణి said...

ఇంతందంగా బుజ్జగిస్తానంటే ఏ అమ్మాయైనా రోజుకి కనీసం వంద సార్లైనా అలిగేస్తుందండీ.. జాగ్రత్త! ;)

కృష్ణప్రియ said...

:) చాలా చాలా నచ్చింది నాకీ పోస్ట్!!

Sravya V said...

చాలా బాగుంది :)

sunita said...

posT maatrame kaadu ammaayi bomma kooDaa baagundi.

ఇందు said...

మంచుగారు కెవ్వువ్వ్వ్వ్వ్! ఏమి రాసారండీ! నాకైతే ఆ స్మైలీలు భలే నచ్చేసాయ్! సిట్యుఎషన్ కి తగ్గట్టు :)) మంచిమంచి అవిడియాలు వచ్చాయే మీకు అలక తీర్చడానికి!!నేను కావ్య చెప్పిందే అంటాను....'పాపం మీ లవర్' :))

Malakpet Rowdy said...

Nice one :)

Malakpet Rowdy said...

మార్తాండ కథలు చదివించో
రోజుకొక బాలయ్య సినిమా చూపించో
బ్లాగుల్లో వంటలు తినిపించో
ఆర్కే చేత తిట్టించో ... :))

సుమలత said...

అయ్యా బాబోయ్ ఇన్ని చేస్తారా నాకు తెలియదండీ
రేపటినుంచి మొదలెడతా మా వారిని కొత్త స్టిల్ లో ....
బాగుందండీ ....

Ennela said...

ఏంది అబ్బయ్యా..ఇంత అలకల కొలికిని యెలా భరిస్తా..(వ్)ఆ అపరంజి బొమ్మ ఫోన్ నంబరు ఇటు పడెయ్యరాదా, కొంచెం పనుండాదీ!
టపా భలే రాసినవబ్బాయా...
మనలో మనమాట జస్ట్ ఫర్ చేంజీ అంటుండావే, ఏందా కతా....

పద్మ said...

Nice. :)

మంచానికి కట్టేసేంత జడలు ఇప్పుడెవరికి ఉన్నాయిలెండి. అది కుదరదు కానీ మిగతావి మటుకు కత్తి.

నాకు తెగ నచ్చేసిన లైన్స్
1. నీ పుట్టిన రోజుకి బుడబుక్కలోడి వేషంలో వచ్చి విషెస్ చెప్పో
2. ఘల్లుఘల్లుమనే పట్టీలు గిఫ్ట్ గా ఇచ్చో
3. నీకు నచ్చిన పాట పాడకుండా ఆపుకునో (ఇదైతే హైలైట్ అసలు :))))) )
4. కొత్తిమీర పచ్చడి చేసిపెట్టో
5. బీచ్ లో బర్త్ డే కేకు కట్ చేయించో
6. నీకు రాత్రంతా ఒక వెయ్యి మిస్సేడ్ కాల్స్ ఇచ్చో (ఇది ఇంకో హైలైట్)

మంచు said...

అనానిమస్ గారు: కొత్తగా అంటారా... ఊరికే డిఫెరెంట్ గా ప్రయత్నిద్దామని. బాగుంది అన్నారు కదా....బొల్డు థాంక్స్ మీకు

రంజని: అయ్యో... నీది రెండొ కామేంట్ :-) థాంక్స్ అంత నచ్చినందుకు.

శ్రీను: నాకు తెలుసు ఇదంతా పవన్ చేసాడని. తన పని చూద్దాం.

అనానిమస్ గారు: ధన్యవాదాలు. ఆ లక్కీనే... బ్రతిమలాడించుకొనే అదృస్టం ఎంతమందికి దొరుకుతుతుంది చెప్పండి. :-)

మంచు said...

మంజుగారు: థాంక్ యూ .. థాంక్ యూ :-)

కావ్య: ఆడవాళ్ళు అలగడానికి అసలు కారణం కావాలంటావా... ? ఇంకా హర్ట్ చెయ్యడం ఒకటి.

నాగా: తప్పదు బాబు తప్పదు. ఆ శ్రీ కృష్ణ భగవానుడికే తప్పలేదు. మనమెంత మానవమాత్రులం చెప్పు. నీకు త్వరలొ తెలిసి వస్తుందిలే..

రాధిక గారు: థాంక్యూ... :-)

మంచు said...

అనూ గారు: నేను పాడితే అది వినేవాళ్ళకి పనిష్మెంట్. అదీ వాళ్ళకి నచ్చిన పాట పాడితే ఇంకా పనిష్మెంట్. సొ ఆపుకుంటే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అని నా అభిప్రాయం

సౌమ్య గారు: లాస్ట్ టైం చాక్లెట్స్ ఇస్తే అదొ రకమయిన చూపు రిసీవ్ చేసుకున్నాను ..:-))
ఆ అలక ఎందుకొ తెలిస్తే ఈ తిప్పలు ఎందుకు చెప్పండి. ఒకమాట చెప్పనా... ఆడవాళ్ళు ఎందుకు అలిగారొ మగవాళ్ళకి లాస్ట్ వరకూ అర్ధం కాదు. (అర్ధం అయ్యాక...ఒస్ దీనికే ఇంత అలకా అనుకుంటారు అనుకొండి అది వేరే అవిషయం ).

పరిమళం గారు: థాంక్యూ థాంక్యూ

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

అవసరమే రాకముందే అలక మాన్పిస్తాం అంటూ ప్రాక్టీస్ చేసుకునే మగవాళ్ళని చూశారా!
అసలు ఆమ్మాయిలు అలగడం అబ్బాయిలకే అంతిష్టం అని తెలిసింది. (ఈ టపా లోని నీతి ఇదే!) హి...హి...

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

ఇంకెందుకు, అబ్బాయిలని ఇలా మురిపించటానికే!

..nagarjuna.. said...

>>ఆర్కే చేత తిట్టించో ... :))<<
అలగైతే అమ్మి తట్టుకోలేదేమో మలకూ, దానికి బదులు ఆర్కే చేత తిట్టిస్తానని బెదిరించమను చాలు దెబ్బకు దిగొస్తుంది :))

SHANKAR.S said...

ఇన్ని చేసినా అలక మానకపోతే ఎదురు అలుగుతానని బెదిరించండి...ఒక్క సారి అలిగి చూడండి :) తరవాత మీకే తెలుస్తుంది

@నాగ ప్రసాద్ గారు
"వార్నీ, ప్రియురాలు అలిగితే ఇంత కష్టపడాలా? కుర్చీకి కట్టేసి టీవీలోనో ల్యాప్ టాప్‌లోనో పరమ వీర చక్ర లేదా పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలు ప్లే చేస్తే సరి. ఇక జీవితంలో అలగదు. :-)"

ఎంత అలిగితే మాత్రం మరీ ఇంత శాడిస్టిక్ ప్రతీకారమా?. పెళ్లి కాకపోతే "హత్యా ప్రయత్నం", పెళ్ళయితే "గృహ హింస" కేసయిపోగలదు. ఇంకెప్పుడూ ఎవరికీ ఇలాంటి సున్నితమైన విషయాలలో ఇంత భయంకర, భీభత్స, హింసాత్మక సలహా ఇవ్వద్దు.

మంచు said...

శిశిర గారు: చాలా థాంక్స్. " కొందరు తెలుగు సినీ గేయ రచయితల కన్నా ఏ మాత్రం తీసిపోరండి మీరు " ఇది చూసి నన్ను తిట్టారొ పొగిడారొ అర్ధం కాలేదు ముందు :-))) కానీ మీకున్న రిప్యూటేషన్ బట్టి పొగిడారనే డిసైడ్ అయిపొయా... చాలా చాలా థాంక్స్

బులుసు గారు: హ హ హ .. శ్రీ కృష్ణుడు మార్గమా... సర్లెండి ఎదొ పెద్దవారు, అనుభవజ్ఞులు. మా గుగురువులు .... మీ మాట కాదంటే ఎలా...:-))

సాయి :-) థాంక్స్ థాంక్స్. గమనిస్తూ ఉండు ,,, ఫ్యూచర్ లొ పనికొస్తుంది.

నాగార్జున: తప్పదు బాబు తప్పదు. ఎట్టానివాళ్ళకయినా ఎప్పటికయినా తప్పదు. నాగ కి ఇచ్చిన రెప్లై చూడు , బులుసు గారి సలహా చూడబ్బాయ్ :-))

మంచు said...

మధుర గారు: ఎంటండీ కొత్త కొత్త ఐడియాలు ఇచ్చి నన్ను భయపెడుతున్నారు:-)

కృష్ణప్రియ గారు: థాంక్ యూ థాంక్ యూ :-))

శ్రావ్య : :-) థాంక్ యూ

సునీత గారు: :-) థాంక్ యూ ..

ఇందూ : పాపమా... బ్రతిమాలించుకొవడానికి కూడా కస్టం గా ఉందా పాపం :-)

మలక్ : థాంక్ యూ థాంక్ యూ

మంచు said...

మలక్: హ హ హ ... లాస్ట్ ది పిచ్చ పిచ్చ గా నచ్చేసింది. :-) అయితే నాగార్జున చెప్పినట్టు బెదిరిస్తే చాలు :-)

సుమలత గారు : :-) థాంక్యూ ... ఇక మొదలుపెట్టండి మరి :-)

ఎన్నెల గారు: :-) మొత్తం బ్లాగ్ లొకం లొ నాకు ఇద్దరి బాష (యాస) బాగ నచ్చుద్ది. ఒకటి భాస్కర్ రామ రాజు , రెండు మీరు. నాకెప్పుడు కామెంట్ పెట్టినా ఇలానే పెట్టాలి మరి :-)) కథలు కాకరకాయలు ఎం లేవండీ :-) నిజంగా జస్ట్ ఫర్ చేంజ్ అంతే

పద్మ గారు: మీరన్నది నిజమే... ఎవరొ కొద్ది మంది తప్ప మిగతావరందరివీ కొత్తిమీర కట్టలే :-) థాంక్యూ మీకు నచ్చినందుకు.

మంచు said...

మందాకిని గారు: అలక తీర్చడం మాకు అంత సరదా అనుకుంటున్నారా... తప్పు తప్పు.... కొంచెం సరదా అంతే :-) థాంక్ యూ

శంకర్ : ఎప్పుడూ అఖరికి జరిగేదే మీరు చెప్పిందే... ఎదురు అలగడం... :-))
అబ్బే నాగా ఇలా కబుర్లు చెప్తాడు కానీ అసలు విషయం వేరే... మీకు తర్వాత వివరంగా చెప్తాను మీకు :-)

Anonymous said...

పాపం ఆ అమ్మాయి మూతెందుకు అలా నల్లవారి మూతిలా వాచిపోయుంది? అలక మానకుంటే చిర్రెత్తి మూతిమీద ఒక్కటిచ్చారా ఏంటి?!

మీప్రొఫైల్లో ఏదో రీయూజ్, రీసైకిల్ అనివుంది, వాటి మీద ఏమన్నా ఆసక్తికరమైన విషయాలు రాయబోతున్నారా? నోరెళ్ళబెట్టుకుని వినాలని వుంది.

మంచు said...

SNKR : -)

ఇక పొతే మీరు అన్న ప్రొఫైల్ పిక్చర్ కి సంభందించినది మొదట్లొ ఇక్కడ రాసాను. పొస్ట్ ' చాలా ' పెద్దది అవడం తొ పాటు అప్పట్లొ అనుభవం లేకపొవడం వల్లొ ఎందుకొ అంత ఆసక్తికరం గా రాయలేకపొయాను అనిపించింది. మళ్ళీ ఆ టాపిక్ కెలికే అలొచన వుంది. అయితే ఈసారి మరీ అలా క్లాస్ పీకుతున్నట్టుగా కాకుండా కాస్త డిఫెరెంటు గా . చూద్దాం. ప్రయత్నం ఈ సారి ఎంతవరకు ఫలిస్తుందొ. మరీ నొరెళ్ళబెట్టుకుని చదవాల్సిన చేజింగ్ సీన్లు ఉండవు కానీ చదువరుల చేత కనీసం ఒక 30 సెకండ్స్ అలొచింపగలగచెస్తే నా ప్రయత్నం ఫలించినట్లే. :-))

http://manchupallakee.blogspot.com/2010/01/blog-post.html

said...

నేను మా ఆవిడకి ఈ కంటెంట్ అంత పంపించి impression కొట్టేసనుగా !!!

శిశిర said...

"మీకున్న రిప్యూటేషన్ బట్టి పొగిడారనే డిసైడ్ అయిపొయా"
రిప్యూటేషన్ బట్టి డిసైడ్ అయ్యారా? ఇంకా నయం. నిజనిర్ధారణ కమిటీ వేశారు కాదు. :) నిజ్జంగానే పొగిడానండి. మీమీద ఒట్టు. :) బాగా రాశారు.

హరే కృష్ణ said...

:D :D

Pavani said...

చెక్కిలి మీదా చెయ్యెట్టొ.
ముద్దు మోమునా ముద్దెట్టో..
నడుము మడతపై మెలిపెట్టొ..

నోట్లో కాస్త పెసరట్టో..
మెళ్ళో కాసిని నగలెట్టో..

అయినా అలకమానకపోతే..

నీ చెల్లికి లైనేసో
ఆ ఫానుకి నా తల ఉరివేసో..
ఇంకో కవిత రాసేసో..

ప్రవీణ said...

ఎంత చక్కగా చెప్పారండి..మీ కవితను TV9 వాళ్ళకు పంపి ప్రసారం చేపించాలి...ఇంక తెలుగు అమ్మాయిలు అందరు అలిగి కూర్చుటారు

Anonymous said...

తెలుగు అమ్మాయిలు అందరు అలిగి కూర్చుంటే ఇంక మంచు గారి పని కొత్తిమీర పచ్చడి చేసుకోవడమతోటే సరిపోతుందేమో

మంచు said...

సాధారణ పౌరుడు : కంగ్రాచులేషన్స్.... ఇంప్రెషన్ కొట్టేసినందుకు :-) మొత్తానికి మీకూ ఉపయొగపడిందంటారు :-)
శిశిరగారు: అయితే మరొక్కసారి మీరు ధన్యవాదాలు తెలియజేస్కుంటూన్నా:-)
పావని: :-) థాంక్యూ
ప్రవీణగారు : థాంక్స్ అండీ.... టి వి 9 మాత్రం వద్దు వద్దు :-)))
అనానిమస్ గారు: హి హి హి... అంతే అంటారా :D:D

sneha said...

మీకు చాలా ఒపిక అండి .ఈ రొజుల్లొ అమ్మయి అలిగితే ఇంత శ్రద్దగా అలకను తీర్చెవాళ్లను మిమ్మల్నే చూసాను.గ్రేట్ పొస్ట్

David said...

కాల్లు పట్టుకుంటే పోలే...

మంచు said...

స్నేహ గారు... చాల థాంక్స్ అండీ...
డేవిడ్ గారు: పైన బులుసు గారు చెప్పింది ఇదే :-))

Anonymous said...

మంచు గారూ ఇది http://pakkintabbayi.blogspot.com/
నా కొత్త బ్లాగు కూడలి లో ఇంకా లిస్ట్ చేయలేదు.ఈ లోగా మీరోసారి చూడాలని నా కోరిక(అసందర్భ ప్రసంగానికి క్షమాపణలతో)
--పవన్ సంతోష్ సూరంపూడి

Unknown said...

Manchu garu baga rasaru.Alaka ante inta andam ga untundi ani telisela.

మంచు said...

శైలుగారు: థాంక్యూ థాంక్యూ:-))

ఛాయ said...

మంచు గారు.. కూడలి లో ఓ కామెంట్ చదివి ఇటు వచ్హాను...అందరు చెప్పినట్టు చాలా బాగుంది... అలకలో "చెదిరిన కాటుక" సరిచెయ్యండి , ఎదురుగా నుంచునే సుమా ! ఆతరువాత అలక కలలాగా చెదిరి పోతుంది...:)

రసజ్ఞ said...

నిన్ను పొగుడుతూ నాకే అర్ధంకాని కవిత రాసో!!! హహహ చాలా బాగుందండీ ప్రతీ లైన్ చక్కగా ఉంది! ఇంత చక్కగా అలక తీరుస్తానంటే ఏ అమ్మాయి మాత్రం కావాలనైనా అలగకుండా ఉంటుంది చెప్పండి!

Anonymous said...

>>"ఇంత చక్కగా అలక తీరుస్తానంటే ఏ అమ్మాయి మాత్రం కావాలనైనా అలగకుండా ఉంటుంది చెప్పండి!"

అమ్మయిలకి ఇదేం పోయెకాలం !! ??

అబ్బాయిలకి ఎంతకీ అర్థం కాని విషయం ఇది :)))))

జ్యోతిర్మయి said...

ఏమండోయ్ మంచు గారూ మీ కవిత లేటెస్ట్ గా మావారికి చూపెట్టి ఎంచక్కా అలిగేశా..రిసల్ట్ ఏంటి అంటున్నారా? ఆ వేళనగా ఫ్లైట్ ఎక్కారు, ఇంతవరకూ రాలా. దీనికి త్వరగా విరుగుడు చెప్పి పుణ్యం కట్టుకోండి బాబూ లేకపోతే నేను మధురక్షణాల బదులుగా ఏ నిరాశా నిస్పృహలో రాయాల్సుంటుంది. చాలా బావుంది ధన్యవాదములు.