*** శ్రీ రామ ***
అసలు ఈ రెసిపి మన హరేకృష్ణ కోసం రాసింది... విజయనగరం కుర్మాలు తిని తినీ బోర్ కొట్టిందన్నాడు అని టిఫిన్ కోసం రాసిచ్చా... ఈ రోజు ఇందు గారు పోస్ట్ మరియు కామెంట్స్ చూసాక అందరికోసం పోస్ట్ చెయ్యాలనిపించింది.
బ్రెడ్ తో బోల్డు రెసిపిలు ఉన్నాయి కానీ సింపిల్ గా పదినిముషాలలో అయిపోయే బ్రేక్ఫాస్ట్ కాబట్టి ముందు ఇది ....
బ్రెడ్ తో బోల్డు రెసిపిలు ఉన్నాయి కానీ సింపిల్ గా పదినిముషాలలో అయిపోయే బ్రేక్ఫాస్ట్ కాబట్టి ముందు ఇది ....
స్టెప్ -1
- ఉల్లిపాయ , పచ్చిమిర్చి, కాప్సికం, టమోటా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకొండి (నా అంత పర్ఫెక్ట్ గా మీరు కోయ్యలేక పొతే మీకు చేతనయినట్టు ఎగుడుదిగుడుగానే కోసుకు పెట్టుకోండి
)
- మోజరిల్లా చీజ్ కోరుగా తీసి పెట్టుకోండి.
- సాల్ట్ , పెప్పర్ పక్కన పెట్టుకోండి (ఉంటే కాస్త oregano కూడా)
- కొత్తిమీర కొన్ని ఆకులు
- బ్రెడ్ (నేను ఇక్కడ వాడింది బ్రౌన్ బ్రెడ్.... కానీ దీనికి ఇటాలియన్ బ్రెడ్ గానీ సౌర్(sour) బ్రెడ్ గానీ అయితే బావుంటుంది )
స్టెప్-2
ఒక పాన్ లో బ్రెడ్ స్లైస్ బటర్ తో కానీ ఆయిల్ తో కానీ రెండు వైపులా కొంచం వేపించండి.... లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక దానిపై ముందు కోసుకుపెట్టుకున్న ఉల్లి, కాప్సికం, టమోటా, పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్ అండ్ పెప్పేర్ వేసి ఆ పైన చీజ్ తురుము వెయ్యాలి.. (ఉంటే కాస్త oregano కూడా పైన చల్లాలి) ... ఏది ఎంత వెయ్యాలి అని కొలత ఏమీ లేదు ... మన ఇష్టం... ఆ పైన కాస్త కొత్తిమీర ఆకులు వెయ్యాలి.
అన్ని వేసాక దానిమీద మూత పెట్టి ఒక ఐదు నిముషాలు అలానే స్టవ్ మీద తక్కువ వేడి లో ఉంచాలి (ఎక్కువ వేడి పెడితే బ్రెడ్ కింద మాడిపోవచ్చు..చూస్తూ ఉండండి).......
చీజ్ మొత్తం కరిగిపోతే ...తినడానికి బ్రేక్ ఫాస్ట్ రెడీ అయిపోయినట్టే....కొంచెం క్రిస్పీగా, చీజీగా భలే ఉంటుంది.
స్టెప్-3
ఇక టమోటో సాస్ వేసుకుని లాగించడమే..... కొద్ది కారంగా కావాలనుకుంటే రెండు స్పూన్స్ టొమాటో సాస్ మరియు ఒక స్పూన్ టొబాస్కో సాస్ కలిపితే...హాట్ అండ్ స్వీట్ సాస్ రెడీ....
- మంచు
- మంచు