** శ్రీరామ **
ఒక చిన్న సంఘటన ఊహించుకోండి. మీ కుటుంబ సభ్యులో లేక స్నేహితులో లేక ఆత్మీయులో అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయరనుకోండి, అప్పుడు మీరు ఎలా స్పందిస్తారు ? మీరు చేసే మొదటి పని ఏమిటి ? మొహం మీద నీళ్ళు కొడతారా, ఫ్యాన్ గాలి తగిలే చోట పడుకోబెడతారా , అంబులన్స్ కోసం కాల్ చేస్తారా, ఏదయినా ప్రధమ చికిత్స చేస్తారా ? ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరిగేవి కనుక మనకి పూర్వానుభవం కూడా వుండదు కాబట్టి ఆ పరిస్తితులలో ఏం చెయ్యాలో , ఏం చెయ్యకూడదో (Do's and Don'ts ) మనకి ఎలా తెలుస్తాయి ? మనకి తెలిసిన కొన్ని విషయాలు, పెద్దలనుండి నేర్చుకున్న విషయాలు అన్నీ కరెక్ట్ కాకపోవచ్చు. కొన్ని కామన్ సెన్స్ అనిపించినవి కూడా తప్పు ఉండొచ్చు. అలాగే మనం నేర్చుకోవాల్సిన /తెలుసుకోవాల్సిన మరో విషయం... ప్రమాదాలు (రోడ్ ప్రమాదాలు , అగ్ని ప్రమాదాలు , ఆత్మహత్య ప్రయత్నాలు, గుండెపోటు, కుక్క కాటు , పాము కాటు వంటివి ) జరిగినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అలానే మన చుట్టుపక్కల వాళ్ళని ఎలా కాపాడాలి అని. ఈ విషయాలపై (ప్రధమచికిత్స పద్దతులు (first -aid techniques) అత్యవసర/విపత్కర పరిస్తితులను ఎలా ఎదుర్కోవాలి (emergency preparedness) ) నాకు తెలిసిన కొంత పరిజ్ఞానం ఇక్కడ మీతోపంచుకుందామని ఈ చిన్ని ప్రయత్నం.
మీకు తెల్సే వుంటుంది .. ఏదయినా ప్రమాదం జరిగినప్పుడు, ప్రమాదానికి గురిఅయిన వ్యక్తిని కాపాడటానికి మనం చేసే ప్రధమచికిత్స కి 75 % ఆవకాశం వుంటే వైద్యులు చేసే అసలు చికిత్స కి కేవలం 25 % . ఆంటే ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడటానికి ప్రధమచికిత్స చేసే మనకు అసలు చికిత్స చేసే వైద్యులు కన్నా మూడు రెట్లు ఎక్కువ బాధ్యత వుంది అన్నమాట.
అసలు విషయం లోకి వెళ్లేముందు కొన్నేళ్ళ క్రితం బెంగళూరు
లో జరిగిన చిన్న సంఘటన చూద్దాం. ఒకరోజు ఉన్నట్టుండి అకస్మాత్తుగా
కళ్ళుతిరిగి పడిపోయిన తన భర్తను ఒకావిడ హాస్పిటల్ కి తీసుకువచ్చిందట.
వెంటనే డాక్టర్స్ స్పృహ లేకుండా పడివున్న అతన్ని డైయగ్నోస్ చేసి ,
ఆవిడని 'మీ అయన కళ్ళుతిరిగి పడిపోయాక మీరు ఏం చేసారు' అని అడిగారట.
దానికి ఆవిడ "మొహం మీద కాస్త నీళ్ళు చల్లాను.. ఇంకాలేవక
పోయేసరికి కొన్ని నీళ్ళు తాగించాను" అని చెప్పిందట. డాక్టర్స్ 'అప్పుడు మీ
అయనకి స్పృహ లేదుకదానీళ్ళెలా తాగాడు' అని అడిగితే .. దానికావిడ "అతను తాగలేదు.. నేనే
నోరు తెరిచి పోసాను అని చెప్పిందట" ( బహుశా మన పెద్దోళ్ళు ఆఖరిప్రయత్నంగా
వాడే తులసి తీర్ధం నుండి ఆవిడకి ఆ ఐడియా తట్టి వుండవచ్చు) .ఆలా స్పృహ లేకుండా వున్నప్పుడు పోసిన నీళ్ళే అతని
ఊపిరితిత్తులలోకి చేరి అతని మరణానికి కారణం అయ్యింది అని డాక్టర్స్
చెప్పారట. పాపం కదా ..ఎలాగయినా కాపాడదామన్న ఆవిడ ప్రయత్నమే అతని
ప్రాణాల్ని తీసింది.
అదేంటి మనం మాములుగా
వున్నప్పుడు నీళ్ళు తాగితే అదితిన్నగా పొట్టలోకి వెళుతుంది, అప్పుడెందుకు
ఊపిరితిత్తులలోకి వెళ్ళింది అని వెంటనే మనకి సందేహం రావడం సహజం. సరే నాకు
తెలుసున్న వివరణ నేను ఇస్తాను. (బేసిక్ గా నేను డాక్టర్ ని కాదు కనుక సరైన
టెక్నికల్ డిటైల్స్ ఇవ్వలేను కానీ సామాన్యుడి (లేమాన్) బాష లో చెప్పడానికి
ప్రయత్నిస్తా).
మన పీల్చే గాలి , తీసుకునే ఆహరం చేరవెయ్యడానికి పనిచేసే దారులను మనం పైపులనుకుంటే , అందులో గాలి పైపు చేసేపని ముక్కునుండి పీల్చే గాలిని ఊపిరితిత్తులకి చేర్చడం, తిండి పైపు చేసేపని నోటినుండి తీసుకునే ఆహారం పొట్టకి చేర్చడం. అయితే ఈ పైపులు నోటి దగ్గర , ముక్కు దగ్గర వేరే వేరే గా స్టార్ట్ అయ్యి ఒక జంక్షన్ లో కలిసి (ఆ జంక్షన్ గొంతులో వుంటుంది ) మళ్ళి అక్కడినుండి పొట్టలోకి , ఊపిరితిత్తుల లోకి విడి విడిగా పోతాయి (పక్కన నేను చెక్కిన సూపర్ బొమ్మ చూడండి :-) ).
ఏ
సమయం లో ఆయినా 'మనం పీల్చే గాలి', 'నోటితో తీసుకునే ఆహారం' లలో ఏదో ఒకటే మాత్రమే ఆ
జంక్షన్ లో నుండి పోగలదన్నమాట . అందువల్ల అది కంట్రోల్ చెయ్యడానికి అక్కడో
ట్రాఫ్ఫిక్ పోలీసు వుంటాడు. వాడి పని ఏమిటంటే మన దేహానికి ఆక్సిజన్
కావలసినప్పుడు పొట్టలోకి వెళ్ళే తిండి పైపు తాత్కాలికం గా మూసి, పీల్చిన
గాలిని ఆ జంక్షన్ లోనుండి ఊపిరితిత్తుల లోకి పంపిస్తాడు. అలాగే మనం తిన్న
ఆహరం మింగినప్పుడు గాలి పైపు తాత్కాలికం గా మూసి ఆ జంక్షన్ లోకి ఆహారాన్ని అలౌ
చేస్తాడు. మనలో వుండే ట్రాఫిక్ పోలీసు సాధారణం గా ఈ కంట్రోల్ అంతా
బాగానే చేస్తాడు.. ఎప్పుడయినా ఈ ట్రాఫిక్ పోలీసు కన్ఫ్యూజ్ అయి ఆ పైపు
ఓపెన్ చెయ్యల్సినప్పుడు ఇది , ఇది చెయ్యల్సినప్పుడు అది ఓపెన్ చేస్తే
మాత్రం కష్టం అన్నమాట .
మీ చిన్నప్పుడు మీ ఇంట్లో పెద్దవాళ్ళు భోజనం
చేస్తున్నప్పుడు నవ్వొద్దు, గట్టిగా మాట్లాడొద్దు అని చెప్పేవుంటారు. మీలో
కొంతమంది మీ పిల్లలకి కూడా చెబుతూనే వుంటారు. ఆ జాగ్రత్త కి కారణం ఇదే..
గట్టిగా నవ్వితే ఆ ట్రాఫిక్ పోలీసు కన్ఫ్యూజ్ అయ్యి మనం తింటున్న ఆహారం
ఎక్కడ ఊపిరితిత్తులలోకి పంపుతాడో లేక మనం తింటున్న ఆహారం ఈ జంక్షన్ లో
ఇరుక్కుపోయే ఊపిరి అందదో అని ముందు జాగ్రత్త.. కాబట్టి పైన చెప్పిన 'జరిగిన
సంఘటన' లో ఆ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయి శ్వాస తీసుకోవడం మానేసినప్పుడు,
ఆయన వంట్లో వున్న ట్రాఫిక్ పోలీసు శరీరానికి కావలసిన ఆక్సిజన్ అందడం
లేదని గ్రహించి మరింత గాలి కోసం జంక్షన్ తెరిచి చూస్తున్నాడు.. ఆ సమయం లో
అవిడ నీళ్ళు పట్టించడం తో ఆ నీరు తిన్నగా ఊపిరితిత్తుల లోకి వెళ్ళింది.
అంతే కాదు ఎవరయినా నీళ్ళలో మునిగి చనిపోయినప్పుడు 'ఊపిరితిత్తులలోకి
నీళ్ళు చేరడం వల్ల చనిపోయాడు' అని వింటువుంటాం.. అప్పుడుజరిగేది అదే..
మునిగిన వ్యక్తి నోటితో నీళ్ళు తాగినా, ఆ టైం లో ఊపిరి తీసుకోవడానికి గాలి
అందదు కనుక ఆ ట్రాఫిక్ పోలీసు కేవలం ఊపిరితిత్తులలోకి వెళ్ళే పైపునే ఓపెన్
చేసి...నోట్లోనుండి వచ్చినా అది ఊపిరితిత్తుల లోకే పంపుతాడు.
ఇది చదివిన మీకొక బ్రహ్మాండమయిన సందేహం రావచ్చు (నాకు
వచ్చినట్టు). దేవుడు ఎందుకు ఆ పార్ట్ అలా తప్పు డిజైన్ చేసాడు.. దేనికి
దానికి సేపెరేట్ పైపులు పెడితే ఈ గొడవ వుండదు కదాని. (http://scienceblogs.com/denialism/2007/11/ask_a_scienceblogger_which_par.php )
. దేవుడు అలా ఎందుకు డిజైన్ చేసాడో చూద్దాం. మనకి జలుబు చేసి ముక్కు అంతా
దిబ్బడేసి ముక్కుతో గాలి పీల్చడం కష్టమయినప్పుడు ఆ గాలి నోటితోనే కదా
పీలుస్తుంటాం. అదే సేపెరేట్ పైపులు వుండి వుంటే మనకా ఛాన్స్ వుండేది కాదు.
అందువల్ల ఈ రెండు పైపులు మరియూ ఒక జంక్షన్ అన్నది redundancy కోసం
అన్నమాట. (బ్యాక్ అప్ ) . బ్రహ్మదేవుడి డిజైన్ కి మనం పేర్లు పెట్టగలమా :-)
సో ఎవరయినా స్పృహ తప్పి పడిపోతే చెయ్యాల్సింది వరుస క్రమం లో
1. స్పృహ తప్పి పడిపోతే ముందు చూడాల్సింది ఆ వ్యక్తి శ్వాస తీసుకుంటున్నాడా లేదా అని
2. శ్వాస తీసుకుంటుంటే పెద్ద అపాయం ఏమి లేనట్టే .. తాయితీగా హాస్పిటల్ కి తీసుకెళ్ళోచ్చు.
3. ఒక వేళ శ్వాస తీసుకోవడం లేదు ఆంటే చాలా ప్రమాదం లో
వున్నట్టు , అప్పుడు నీళ్ళు తాగించడం లాంటివి చెయ్యకుండా వీలయినంత త్వరగా అంబులన్స్ సహాయం కోసం ఫోన్ చెయ్యాలి .
4. అంబులెన్స్ వచ్చే లోపు ఆ వ్యక్తి శ్వాసని పునరుద్దరించేలా ప్రదమ చికిత్స చెయ్యాలి . ఈ ప్రదమ చికిత్స ని CPR (Cardiopulmonary
resuscitation) అని ABC (Airway, Breathing and Circulation) అని ఇంకా ఏవో
పేర్లు తో పిలుస్తారు. పేరు ఏదయినా చికిత్స ఒక్కటే ..వీలయినంత త్వరగా
శ్వాస పునరుద్దరించడం.
ఇది కాక ఎప్పుడయినా మనం తింటున్నది గొంతులో అడ్డపడితే
(Chocking అంటారు) , అప్పుడు గాలి పీల్చు కోవడం కష్టం అవుతుంది . ఎందుకంటే
ఆ ఆహారం ఆ జంక్షన్ లో ఇరుక్కుపోయి అది శ్వాస తీసుకోవడానికి
అడ్డుపడుతుంది.ఇది చిన్న పిల్లల్లో ఎక్కువ ఎందుకంటే వాళ్ళు పాకే వయస్సులో
ఏది కనిపించినా వెంటనే నోట్లో పెట్టుకుంటారు. (మీరు ఈ వార్నింగ్ చూసే
వుంటారు..Chocking Caution: This pack contains small objects..not
suitable for childeren under 3 years అని ).
అదన్నమాట .. తరువాతి టపాలో , శ్వాస పునరుద్దరించే పద్దతులు (CPR ) మరియూ chocking కేసుల్లో ఎలా ప్రధమ చికిత్స చెయ్యాలో వివరిస్తా..
సశేషం
మంచుపల్లకీ & UVR
DISCLAIMER: