*** శ్రీ రామ ***
"అలా మంచు గారు బ్లాగుల్లో ఫేమస్
అయిపోయి అంతర్జాతీయ తెలుగు బ్లాగ్ legend
అవార్డ్ తెచ్చేసుకుంటారు. ఇంకప్పుడు ఆయన బడాయి భరించలేక చావాలి అందరూ.. ఈ
బ్లాగ్లోకం భవిష్యత్తు అంధకారం అయిపోతుంది "
ఆ కామెంట్ ఇక్కడ వ్రాయబడింది ... ఈ కామెంట్ చూడగానే మీకో ప్రసంగం గుర్తొచ్చుండాలి. ఇంకా గుర్తురాకపోతే ఇవి చూడండి: పార్ట్ -1 , పార్ట్ -2 . అలాంటి చారిత్రాత్మక అవమానం ఇప్పుడు నాకూ జరిగింది.
అందుకే నా ప్రసంగం వినండి.
--------------------------------
మొన్న
మధురవాణి గారు రాసిన బజ్ పోస్ట్ చదివి పప్పు శ్రీనివాసరావు గారడిగారు. నీ
బ్లాగ్ వయసెంతా అని. ఇరవై నెలలు అన్నాను. ఆవేశం .... బ్లాగర్లకి,
బజ్జర్లకి నమస్కారం. నాలుగు సంవత్సరాల ఆన్లైన్ జీవితం. ఒక సంవత్సరంన్నర
పాటు బ్లాగర్ గా, అర్ధసంవత్సరం పాటు బజ్జర్ గా. అంటే ఎనిమిది సంవత్సరాల
బ్లాగర్.కాం ప్రయాణం లో రెండు సంవత్సరాల బ్లాగు జీవితం నాది. అసలు నేను ఎవరూ,
ఎక్కడ వాడిని, ఎలా వచ్చానో చెప్పాలి. ఎన్నో ఆటుపోట్లు. బ్లాగు మూసుకునే దశ
వరకూ వచ్చి వెళ్ళిన సంధర్భాలూ ఉన్నాయి. క్లుప్తంగా ఒక్కమాటలో చెప్పాలంటే
సాధ్యం కాదు ఎందుకంటే this is the stage to tell who I am, what am I.
కూడలి మరియూ జల్లెడ అగ్రిగేటర్లలో ఒక
చిన్న లింక్. అక్కడ క్లిక్ చేసి వెళితే "నా ప్రపంచం" అన్న బ్లాగు, కామెంట్ల సెక్షన్ నిండా బోల్డు కామెంట్లు... మధ్యలో చిన్న కామెంట్ నాది. అప్పటికే నా ఫ్రెండ్ ఒకడు కూడలిలో
కొన్ని బ్లాగులు రాసుకుంటూ ఉండేవారు. నేను తెలుగు బ్లాగులు చదవడం
మొదలెట్టిన రోజుల్లో మా ఫ్రెండన్నాడు... రేయ్ నువ్వు కూడా
ఒక బ్లాగ్ పెట్టుకోరా ఇద్దరం కలిసి రాసుకోవచ్చని.... నేను వినలేదు.
సరే మిగతా కొంత మంది స్నేహితుల ప్రోద్బలంతో బ్లాగు పెట్టడం, కొన్ని కామెంట్లు రావడంతో కూడలిలొ, జల్లెడలో చేరటం జరిగింది. అక్కడే కార్తీక్ ఇంద్రకంటి గారు
పరిచయం అవ్వడం. నాగప్రసాద్ గారు
పరిచయం అవ్వడం. మన కత పవన్ గారు పరిచయం అవ్వడం జరిగింది. అక్కడే నాకు
బ్లాగర్ గా జన్మను ప్రసాదించిన నేస్తం గారు పరిచయం అయ్యారు. నేను రాస్తున్న బ్లాగ్ కి శ్రావ్య గారు రెగ్యులర్ విజిటర్. మనం అనుకుంటాం....
మన బ్లాగ్ టెంప్లేట్ కి ఏ HTML కోడూ అక్కరలేదూ
అననుకుంటాం. కనీసం బ్లాగర్‌కి లేఖిని సహాయం అన్నాకావాలి తప్పుల్లేకుండా రాసుకోవడానికి. కామెంట్ బాక్స్ లో వర్డ్ వెరిఫికేషన్ తీసేయ్యమన్నా, డార్క్ బ్యాక్గ్రవుండ్ మీద లైట్ అక్షరాలూ కళ్ళనొప్పి తెప్పిస్తున్నాయ్ తీసెయ్ అన్నా, కామెంట్ మోడరేషన్ పెట్టుకోమన్నా... అంతా ఈ స్నేహితులే.
ఆరు మాసాలు రాసాక
చూసుకుంటే పది పోస్ట్లకి మొత్తం కామెంట్లు 30 ఉన్నాయి... అదేంటి మరీ
ఆరునెలలకి 30 కామెంట్లేనా అన్నా..... ఏం ? రోజూ డజన్ల కొద్ది పక్కోళ్ళ బ్లాగులు
చదువుతావ్ ? వాళ్ళ బ్లాగుల్లో నువ్వెన్ని సార్లు కామెంట్లు పెట్టావు.
పక్కోళ్ళ బ్లాగులో కామెంట్లు పెట్టకపోతే స్టార్ బ్లాగర్ కి కూడా అన్ని
కామెంట్లు రావు అన్నారు. నువ్వేమన్నా కెలుకుడు రాతలు రాస్తున్నావా? అని అడిగారు...
నా బ్లాగులో రాయడం లేదు సార్ అన్నా... కనీసం అమ్మాయి పేరుతో రాస్తున్నావా.... లేదు సార్ అన్నా.. అందుకే ముప్పై కామెంట్లే వచ్చాయ్ అన్నారు.
అలా ప్రారంభమైంది
నా బ్లాగు జీవితం. బ్లాగు తెరిచానని తెలిసి మలక్పేట్ రౌడి గారు
కలవమన్నారని కబురు చేశారు.
సరే అని జిటాక్ లో పింగ్ చేసాను. ఆయిన ఆన్లైన్ లో లేరు. టెస్ట్ చేసారు..
పాసయ్యాను. అక్కడ శరత్ గారు ఆ కుర్రవాడెవడో మంచి కత్తి కెలుక్ లా ఉన్నాడు
.. రాత కూడా పదునుగా ఉంది .. కామెంట్లకి పనికొస్తాడేమో అని
నన్ను రికమండ్ చెయ్యటం, నన్ను మలక్పేట్ గారు వాళ్ళ క్లేబాస లోకి
తీసుకోవటం
జరిగిపోయింది. ఆ శరత్ నాకు తెలియదు, నేనెవరో
ఆ శరత్ కి తెలియదు. ఎన్ని కామెంట్లు రాసి తీర్చుకోవాలి ఆ శరత్ రుణం. మొదట్లో నా పేరు
అనామకుడు.... తెలుగు బ్లాగుల్లో మొదటి కామెంట్ అనానిమస్ గా
పెట్టానని ఆ పేరు పెట్టారు. అంతే తిన్నగా బ్లాగర్. కాం కి వెళ్లాను. ఇక
నుండి నాపేరు 'మంచు' అని చెప్పి ప్రొఫైల్ మార్చి నా బ్లాగ్ జీవితం మొదలు
పెట్టాను.
ఆ రోజు నుండి ఒక కామెంటర్ గా,
ఒక బ్లాగర్ గా, ఒక బజ్జర్ గా, ఒక అనానిమస్ గా, ఒక అగ్రిగేటర్ టీం మెంబర్ గా ... క్లేబాసలో కామెంట్లు ఎలా రాయాలో నన్నే కెలికి మరీ రాయించాడు నా గురువు మలక్పేట్ ....ఈ రోజు ద గ్రేట్
భాస్కర్ రామరాజు గారు తరువాత బజ్లో అన్ని పోస్ట్లు రాయగలుగుతున్నానంటే
that credit goes to the great man, the greatest
man, the legend, legendary, greatest man in world , బ్లాగర్ అన్న పదానికే
అర్ధం తీసుకొచ్చిన మనిషి , ప్రపంచ బ్లాగ్ చరిత్రలో గ్రేట్ మాన్ మలక్పేట్
చలవే.... నా మంచికీ చెడ్డకూ.....
చివరిగా, మొన్న ఆలమూరు సౌమ్య గారన్నారు. ఈ మద్య మీ పోస్ట్లో కామెంట్లు ఎందుకు రావడం లేదు అని. ఎందుకంటే you are not a బ్లాగ్ లెజెండ్, నువ్వు బ్లాగుల్లో లెజెండ్ వి కాదు. నువ్వో సెలెబ్రిటివీ అన్నారు. ఈ బ్లాగు ముఖంగా నేను అందరినీ అడగాలనుకుంది ఏంటంటే .... అసలు బ్లాగు లెజెండ్ అంటే ఏంటి ? బ్లాగు సెలెబ్రిటి అంటే ఏంటి ? అని .... ఒక పోస్ట్ వేసి 'బ్లాగ్ లెజండరీ అంటే బ్లాగ్ మొదలెట్టిన ఇన్నాళ్ళకు మీకు ఇన్ని ఫిక్సెడ్ కామెంట్లోస్తాయని, బ్లాగ్ సెలెబ్రిటి అయితే ఇన్నోస్తాయి' అని రాయండి....

నేననుకున్నాను మన తెలుగు బ్లాగుల్లో ఆక్టివ్ గా రాసేవాళ్ళలో అనానిమస్ల నుండి కూడా
అప్రిషియేషన్ కామెంట్స్ వచ్చేది నాకే, అది లెజెండ్రికాదా ?
సరదాగా రాసిన పోస్ట్ కే యాబై కామెంట్స్ వచ్చాయి అది లెజెండ్రీ కాదా?
ప్రాంతాలకతీతం గా, సబ్జెక్ట్ ఏదయినా రోజుకి కనీసం పది కామెంట్స్ పెడతా అది లెజెండ్రీ కాదా ?
బజ్జులో పోస్ట్ వేస్తే మినిమం పది లైకులు వస్తాయి... అది లెజెండ్రీ కాదా ?
బ్లాగులో పాతిక మంది, బజ్జులో నూట పాతిక ఫాలోవర్స్ సంపాదించా అది లెజెండ్రీ కాదా ?
సంచిలో మంచు, మంచు చెప్తే వినాలి అంటూ బజ్జులో మంచు ని తలచుకోని రోజు ఉన్నాదండీ ?.... అది లెజెండరీ కాదా?
వేణు శ్రీకాంత్
గారు, లెజెండ్రి కాదా ?
చెప్పండీ ? వేణు శ్రీకాంత్ గారు లెజెండ్రి కాదా ? వేణు శ్రీకాంత్ గారి
బ్లాగ్ విజిట్ చేసారు... ఓ నాలుగూ కామెంట్లు మాత్రమే రాసారు. పుట్టిన రోజు
శుభాకాంక్షలు చెప్పారు. ఫేస్ బుక్ లో కొన్ని వందల కామెంట్లు వస్తాయి వేణు శ్రీకాంత్ గారికి. మరి ఇది న్యాయమా ?
మరి కృష్ణ ప్రియ గారు.... మనందరి అభిమాన బ్లాగర్ ..... నా అక్క కృష్ణ ప్రియ గారు ... ఆవిడ బ్లాగ్ లో ఒక మంచి పోస్ట్ వేస్తే ... ఆ బ్లాగ్ పోస్ట్ కి లింక్ బజ్జ్ లో ఇవ్వడానికీ ఆలోచిస్తారటండీ ? ఆవిడ బజ్ పోస్ట్ రీషేర్ చేద్దామా వద్దా అని అలోచిస్తారటండీ.... Yes I will ask all these questions because blogger.com is not for one body. ఒక్కరిది కాదు ఈ గూగిల్ బజ్. ఎంతో మంది పోస్ట్లు వేస్తేనే మాలిక వృద్ది చెందుతుంది.
మన ఒంగోల్ శీను గారు ఫేమస్ బ్రాహ్మీ ఫ్యాన్, బ్రాహ్మీ మీద ఒక పోస్ట్ వేస్తే మూడు వందల మంది రీషేర్ చేసారు ... ఆయనకిచ్చారండి లెజెండ్ స్టేటస్ ? మన ప్రవీణ్ శర్మ గారు... తెల్లవారుజామున మూడు గంటలకి లేచి పోస్ట్లు రాస్తారు...... తలతోక లేకుండా రోజుకి వంద కామెంట్లు రాస్తారు... ఆయనా లెజెండరీ కాదు... వాడిక్కడే ఎక్కడో ఉన్నాడు రాజ్ కుమార్ గాడు.... వాడొక ఫోటోగ్రాఫ్ బ్లాగర్ గా హిట్టూ, పంచ్ బ్లాగర్ గా హిట్టూ, కామెడి బజ్జర్ గా హిట్టూ వాడికీ ఇవ్వలేదు కనీసం సెలబ్రిటి స్టాటస్...
ఇలా ఎంతో మందిని చూసి నా బ్లాగ్ లో కామెంట్లు రాలేదని అడుగుతామా ? రీడర్ల ఆశీస్సులుండాలి, బ్లాగ్ కి మంచి పేరు రావాలి, పదిమందికి ఉపయోగపడాలి.. ఈ కామెంట్లు నాకు అక్కరలేదూ అనుకున్నాను. బ్లాగామ తల్లి సేవే చాలనుకున్నా....

మై డియర్
ఫ్రండ్స్, భగవంతుడు
ఉన్నాడు. మళ్ళీ మాలిక నెక్స్ట్ రిలీజ్ కి ఉంటామొ లేదో తెలియదు. నిత్యం
సన్నిహితో బ్లాగ్ క్రాష్ కర్తవ్యో ధర్మ సంగ్రహ: అన్నారు పెద్దలు. ప్రతీ
క్షణం గూగిల్ సర్వర్ ఓవర్ లోడ్ అవుతూ ఉంటుంది .. ఎప్పుడు బ్లాగర్.కాం క్రాష్ అయ్యి మన పోస్ట్లన్నీ పోతాయో
తెలీదు.
నేను బ్లాగ్ లెజెండ్ ని కాదా ? మీరే చెప్పండి...
- మంచు
ఈ పోస్ట్ కేవలం సరదాగా రాసింది. ఈ పోస్ట్ లో ఉదహరించిన బ్లాగర్లు అందరూ నాకు మంచి స్నేహితులు కాబట్టి వాళ్ళ పేర్లు డైరెక్ట్ గా రాయడం జరిగింది.