ఈ స్టెప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆ వ్యక్తి శ్వాస ని పరీక్షించడం. శ్వాస తీసుకుంటున్నాడా లేదా అన్నది పరీక్షించడానికి మనం LLF (Look , Listen & Feel) పద్దతి ని ఉపయోగించాలి. పక్క ఫోటో లో చూపించినట్టు ఒక చేత్తో గడ్డం పైకి లేపి పట్టుకుని, ఇంకో చేత్తో నుదురు మీద కిందకి నొక్కుతూ , మన చెవి ఆ వ్యక్తి ముక్కుకి దగ్గరగా చేర్చి అతని గుండె ని గమనిస్తూ వుండాలి. ఇందులో Look ఆంటే శ్వాస తీసుకుంటున్నప్పుడు గుండె పైకి కిందకి కదులుతుంది కదా అది Look (చూపుతో) తో గమనించాలి. మన చెవి ప్రమాదం లో వున్న వ్యక్తి ముక్కు దగ్గర వుంటుంది కాబట్టి మనం ఆ ఉచ్వాస నిచ్వాసాలను వినవచ్చు (Listen). అలాగే ఒకవేళ ఆ వ్యక్తి శ్వాస తీసుకుంటూ వుంటే బయటకు వచ్చే వేడి శ్వాస మనకి చెంపలకి తగులుతూ వుంటుంది కనుక మనం ఆ శ్వాసని ఫీల్ (Feel) అవుతాం అన్నమాట. అ విధంగా పైన చెప్పిన పోసిషన్ తో ఒకేసారి ఈ మూడు పనులు చెయ్యవచ్చు. అప్పుడు మన సమయం చాలా క్రిటికల్ కనుక ఈ శ్వాస పరిక్షకి కేవలం 5 సెకండ్లు మాత్రమే మనం వెచ్చించాలి. ఒక వేళ శ్వాస ఆడటం లేదు అనుకుంటే వెంటనే తరువాతి స్టెప్ (Circulation) కి వెళ్ళాలి.
5. Circulation: ఈ స్టెప్ లో ఆగిపోయిన గుండెని/శ్వాసని మనమే కొట్టుకునేలా చెయ్యాలి.
5.1. ఒక చేత్తో ఆ వ్యక్తి ముక్కు మూసి - ఆ వ్యక్తి నోటిని మన నోటితో పూర్తిగా కవర్ చేస్తూ రెండుసార్లు గట్టిగా ఆవ్యక్తి నోటిలోకి గాలి వదలాలి. మనం పంప్ చేసే శ్వాస కనీసం 1.5 - 2 సెకండ్లు వుండాలి. అలాగే మనం ఆ వ్యక్తి నోటిద్వారా పంప్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఛాతి పైకి లేస్తున్నట్టు గమనించాలి (నిద్రపోతూ ఊపిరి తీసుకుతున్నప్పుడు ఛాతి ఎలా పైకి కిందకి కదులుతుందో అలా )
* మనం గాలి పంప్ చేస్తున్నా ఛాతి పైకి రైజ్ అవ్వడం లేదు ఆంటే నోటిలో ఏదో అడ్డు పడినట్టు అన్నమాట.. (పైన చెప్పుకున్నట్టు వెంటనే ఆ అడ్డు తొలగించాలి)
** ముక్కు ముయ్యడం, మన నోటితో ఆ వ్యక్తి నోటిని పూర్తిగా కవర్ చెయ్యడం లాంటి జాగ్రత్తలు -మనం పంప్ చేసే గాలి పక్కకు లీక్ అవకుండా తిన్నగా లోపలకు చేరుకునేలా చెయ్యడానికే.
*** నోటిలో నోరు పెట్టి ఊపిరి అందివ్వడ్డం అందరికి ఇష్టం
వుండకపోవచ్చు. అప్పుడు మన చేతి రుమాలు ఆ వ్యక్తి నోటి మీద వేసి ఆపై మన నోరు
పెట్టి అందివచ్చు (ఫస్ట్ ఎయిడ్ లో మన ఖర్చిఫ్ చాలా చాలా ఉపయోగపడుతుంది, మరిన్ని వివరాలు తరువాతి టపాల్లో).
5.2
మన ఎడమ చెయ్యిని పక్క ఫోటో లో చూపించినట్టు కుడి చెయ్యి మీద పెట్టి వెళ్ళు మడిచి , ఆ వ్యక్తి గుండె పై పెట్టి అదమాలి. కరెక్ట్ ప్లేస్ ఆంటే మనిషి రెండు నిపిల్స్ కి సరిగ్గా మద్య (పక్క ఫోటో చూడండి.) ఇలా అదమడాన్నే 'Chest compressions ' అంటారు. ఈ 'Chest compressions ' యొక్క specifications చూద్దాం
హెచ్చరిక: గుండె ఎడమవైపు వుంటుంది కదా అని మరీ పక్కకు
నొక్కితే
చేస్ట్ రిబ్స్ విరిగే
ప్రమాదం వుంది.
ఎంత లోతుకి నొక్కాలి : కనీసం ఒక అంగుళం నుండి ఒకటిన్నర అంగుళం లోతుకు నొక్కాలి. మనం అనుకున్నదానికన్నా ఎక్కువ బలమే ఉపయోగించాల్సి వస్తుంది.
ఎన్ని సార్లు : పట్టుకు 30 సార్లు
ఎంత వేగం తో : కనీసం నిముషానికి 100 సార్లు వచ్చేలా .. ఆంటే 30 సార్లకి ఇంచుమించు 20 సెకండ్స్ పడుతుంది. ఈ chest compressions ఇచ్చేటపుడు నొక్కుతూ 1 , 2, 3, 4,5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 అని పైకి లెక్క పెట్టాలి.
5 .3 మళ్లీ రెండు సార్లు నోటి ద్వారా గాలి పంప్ చేసి మళ్లీ 30 సార్లు 'Chest compressions ' ఇవ్వాలి.
6 . ఆ తరువాత ఆ వ్యక్తి శ్వాస పైన చెప్పినట్టు మరలా ఒకసారి LLF పద్దతిలో పరీక్షించి, అప్పటికి శ్వాస పునరిద్దరించ బడక పొతే మళ్లీ నోటితో శ్వాస , chest compressions ఇవ్వాలి. ఈ ప్రక్రియ వరస క్రమం మళ్లీ చూద్దాం .
--------------------------------------------------------------------------------------
వైద్య సహాయం (అంబులన్స్) కోసం పిలవండి
ఊపిరి పరిక్ష (5s ) ; రెండు నోటి శ్వాసలు (4 s ) ; 30 సార్లు గుండె నొక్కడం (20 s ) ;
రెండు నోటి శ్వాసలు
(4 s ) ; 30 సార్లు గుండె
నొక్కడం (20 s )
ఊపిరి పరిక్ష (2s ); రెండు నోటి శ్వాసలు
(4 s ) ;30 సార్లు గుండె
నొక్కడం (20 s )
రెండు నోటి శ్వాసలు
(4 s ) ;30 సార్లు గుండె
నొక్కడం (20 s )
ఊపిరి పరిక్ష (2s ) ; రెండు నోటి శ్వాసలు
(4 s ) ; 30 సార్లు గుండె
నొక్కడం (20 s )
రెండు నోటి శ్వాసలు
(4 s ) ;30 సార్లు గుండె
నొక్కడం (20 s ) ......................
---------------------------------------------------------------------------------------
*పైన బ్రాకెట్ లో వున్నది సమయం సెకండ్స్ లో
ఇలా ఆ వ్యక్తి శ్వాస
పునరుద్దరణ జరిగేవరకు వరకూ లేక సహాయం వచ్చేవరకూ చేస్తూనే వుండాలి. కొద్దిగా శ్వాస పీల్చుకుంటున్నట్టు అనిపిస్తే .. కేవలం నోటితో ఊపిరి అందిస్తే చాలు.. ఈ ప్రక్రియ మద్యలో ఆ వ్యక్తి వాంతి చేసుకుంటే నోటిని పక్కకు తిప్పి శుబ్రం చేసి మళ్లీ CPR ప్రయత్నించాలి.
హెచ్చరిక: ఒక వేళ ఆ ప్రమాదానికి గురి ఆయిన వ్యక్తి కి HIV వుంటే - ఈ CPR వల్ల ఆ వ్యక్తి నుండి ప్రధమ చికిత్స చేసే వ్యక్తికి HIV సంక్రమించదు అని ఎక్కడ ప్రూవ్ అవ్వలేదట (?) .. సో జాగ్రత్త ..ఈ విషయం లో మీదే లాస్ట్ కాల్ ..
పిల్లలకు ( 1 to 8 years):
పిల్లలకు చేసేటపుడు ముందు ఒకసారి నోటి శ్వాస , chest compressions ట్రై చేసాక అప్పుడు అంబులన్స్ ని పిలవచ్చు. అలాగే chest compressions ఇచ్చేటపుడు పెద్దలకు చేసినట్టు రెండు చేతులు వాడకుండా కేవలం ఒక చేతినే వాడాలి. ఇవి రెండు తప్ప మిగతావన్నీ పెద్దలకు పిల్లలకు ఒకేటే పద్దతి. పిల్లల CPR ప్రధమ చికిత్స వరుస క్రమం మరొక్కసారి.
1. తడుతూ , అరుస్తూ లేపడానికి ప్రయత్నించాలి. పిల్లవాని నుండి
ఏవిధమయిన స్పందన లేకపొతే , పై చిత్రం లో చూపించినట్టు వెల్లికిలా పడుకోపెట్టాలి.
2. శ్వాస తీసుకుంటుందో లేదో పైన ఫోటో(1) లో చూపించినట్టు పరీక్ష చెయ్యాలి. చిన్ పైకి లేపుతూ , శ్వాసకి ఎమన్నా అడ్డుపడుతుందేమో చూసి
సరి చెయ్యాలి.
3. శ్వాస తీసుకోవట్లేదు అనిపిస్తే పై ఫోటో(2) లో చూపించినట్టు
మన నోటితో ఆ పిల్లవాని నోరు కవర్ చేస్తూ, ఒక చేత్తో ముక్కు మూస్తూ రెండు సార్లు కృతిమ శ్వాస అందించండి (గాలి పంప్ చెయ్యాలి).(మనం గాలి పంప్ చేస్తున్నప్పుడు ఆ పిల్లవాని గుండె రైజ్ అవడం గమనించాలి).
4. తరువాత మన అర చెయ్యి తో రెండు నిపిల్స్ మద్య ఒక 30 చేస్ట్
compressions ఇవ్వాలి. మనం నొక్కినప్పుడు కనీసం చేస్ట్ హైట్ లో మూడోవంతు (1/3 rd of chest height) లోపలకి
నొక్కాలి. ( పైన చెప్పినట్టు chest compressions యొక్క వేగం నిముషానికి 100 చూసుకుంటే ౩౦
compressions కు సుమారు 20 సెకండ్స్ పడుతుంది)
5 . మళ్లీ నోటితో రెండు శ్వాసలు , 30 chest compressions ఇవ్వాలి.
6 . అప్పుడు మళ్లీ శ్వాస పరీక్ష చేసి , అప్పటికీ శ్వాస లేకపోతె వైద్య సహాయం కోసం పిలవాలి.
7 . వైద్య సహాయం వచ్చేవరకూ లేక శ్వాస పునరుద్దరణ జరిగేవరకు పైన చెప్పిన నోటి శ్వాస, chest compressions ఇస్తూనే వుండాలి . ఆ వరుస క్రమం ఒకసారి చూద్దాం
--------------------------------------------------------------------------------------
ఊపిరి పరిక్ష (5s ) ; రెండు
నోటి శ్వాసలు (4 s ) ; 30 సార్లు గుండె
నొక్కడం (20 s ) ;
రెండు నోటి శ్వాసలు
(4 s ) ; 30 సార్లు గుండె
నొక్కడం (20 s )
వైద్య సహాయం (అంబులన్స్) కోసం పిలవండి
ఊపిరి
పరిక్ష (2s ); రెండు నోటి శ్వాసలు
(4 s ) ;30 సార్లు
గుండె
నొక్కడం (20 s )
రెండు నోటి శ్వాసలు
(4 s ) ;30 సార్లు
గుండె
నొక్కడం (20 s )
ఊపిరి పరిక్ష (2s ) ; రెండు నోటి
శ్వాసలు
(4 s ) ; 30 సార్లు గుండె
నొక్కడం (20 s )
రెండు నోటి శ్వాసలు
(4 s ) ;30 సార్లు
గుండె
నొక్కడం (20 s ) ......................
---------------------------------------------------------------------------------------
శిశువులకు (<1 year) :
శిశువులకు , పిల్లలకు CPR అందించే పద్దతి లో రెండే తేడాలు . ఒకటి chest compressions అరచేతితో కాకుండా కేవలం రెండు వేళ్ళతో ఇవ్వాలి. రెండు ముక్కు చేతితో కాకుండా మన నోటితోనే కవర్ చెయ్యాలి . మిగతావన్నీ పిల్లలకు చేసే పద్ధతినే ఫాలో అయిపోవాలి.
1. తడుతూ, అరుస్తూ లేపడానికి ప్రయత్నించాలి. పిల్లవాని నుండి
ఏవిధమయిన స్పందన లేకపొతే పై చిత్రం లో చూపించినట్టు వెల్లికిలా
పడుకోపెట్టాలి.
2. శ్వాస తీసుకుంటుందో లేదో పైన ఫోటో(1) లో చూపించినట్టు
పరీక్ష చెయ్యండి. చిన్ పైకి లేపుతూ , శ్వాసకి ఎమన్నా అడ్డుపడుతుందేమో చూసి
సరి చెయ్యాలి.
3.శ్వాస తీసుకోవట్లేదు అనిపిస్తే పై ఫోటో(2) లో చూపించినట్టు నోటితో శిశువు నోరు మరియూ ముక్కు కవర్ చేస్తూ రెండు కృతిమ శ్వాసలు అందించండి. శిశువు మొహం చిన్నది కనుక ముక్కు చేత్తో ముయ్యక్కేర్లేకుండా , ఆ శిశువు ముక్కు మరియూ నోరు మన నోటితోనే కవర్ చెయ్యొచ్చు.
4. తరువాత మన చేతి వేళ్ళతో రెండు నిపిల్స్ మద్య ఒక 30 చేస్ట్ compressions ఇవ్వాలి. మనం నొక్కినప్పుడు కనీసం కనీసం చేస్ట్ హైట్ లో మూడోవంతు (1/3 rd of chest
height) లోపలకి
నొక్కాలి. (chest compressions యొక్క వేగం నిముషానికి 100 చూసుకుంటే ౩౦ compressions కు సుమారు 20 సెకండ్స్ పడుతుంది) .
5. మళ్లీ నోటితో రెండు శ్వాసలు , 30 chest compressions ఇవ్వాలి.
6 . అప్పుడు మళ్లీ శ్వాస పరీక్ష
చేసి , అప్పటికీ శ్వాస లేకపోతె వైద్య సహాయం కోసం పిలవాలి.
7 . వైద్య సహాయం వచ్చేవరకూ లేక శ్వాస
పునరుద్దరణ జరిగేవరకు పైన చెప్పిన నోటి శ్వాస, chest compressions ఇస్తూనే
వుండాలి . ఆ వరుస క్రమం పైన పిల్లలకు చెప్పుకున్నట్టె.
ఈ టపా కేవలం కనీస పరిజ్ఞానం అందించడానికి మాత్రమే; మరింత
సమాచారం కొరకు యూట్యూబ్ వీడియో లు చూడవచ్చు. కొన్ని లింక్లు ఇక్కడ (Thanks to వేణు శ్రీకాంత్ )
Infant CPR: http://www.youtube.com/watch?v=rC80SMhbIa0 ;
Adult CPR: http://www.youtube.com/watch?v=fHMOswPk3ug&feature=related &
http://www.youtube.com/watch?v=5r7haVfZXek&feature=fvw
ఇంగ్లీష్ సినిమాల్లోఈ CPR ప్రధమ చికిత్స చాలా కరెక్ట్ గా చూపిస్తారు. నాకు జురాసిక్ పార్క్ లో పిల్లవాడికి
ఎలెక్ట్రిక్ షాక్ కొట్టినప్పుడు అతని తండ్రి చేసే ప్రధమ చికిత్స (CPR) గుర్తువుంది. మన ఇండియన్ సినిమాల్లో ఎలా చూపిస్తారో సరిగ్గా తెలీదు కానీ , ఎప్పుడూ ఇలాంటి ప్రధమ చికిత్స హీరో మాత్రమే చేస్తాడు :-)) అది కూడా మోస్ట్ అఫ్ ది టైమ్స్ వీరోయిన్ కే (మరి ఆ తరువాత సాంగ్ వేసుకోవాలి కదా). రియల్ లైఫ్ లో ఆ హీరో / హీరోయిన్స్ రారు కనుక మనమే మనవాళ్ళని రక్షించుకోవాలి.
ఈ టపాల్లో విషయాలు 'సగం చదివి బోర్ కొట్టి వదిలేయచ్చు'- పూర్తిగా చదివి 'ఆ ...అప్పుడు చూసుకొవచ్చులే' అని వదిలేయచ్చు; మన అత్మీయులకి ప్రమాదం జరిగినప్పుడు మన పరిస్తితి ఒక సారి ఊహించుకుని కాస్త సీరియస్ గా తీసుకుని మీరు , మీతో పాటు ఇంకొంత మందికి అవగాహన కల్పించవచ్చు (మీకు ప్రమాదం జరిగినప్పుడు మీకు ఈ ప్రధమ చికిత్స చేసి మిమ్మల్ని కాపాడాల్సింది మీరు అవగాహన కల్పించిన మీ కుటుంబ సభ్యులే. నా కుటుంబ సభ్యులని , తోటి పౌరులను ప్రమాదాలు జరిగినప్పుడు కాపాడటం, తెలియనివారికి కొంత అవగాహన కల్పించడం నా బాధ్యత అని నేను అనుకున్నట్టే మరికొంత మంది ఈ బాద్యత ను షేర్ చేసుకుంటారని ఆశిస్తూ...